YOUR THE ONE - 18 books and stories free download online pdf in Telugu

జతగా నాతో నిన్నే - 18












ఆ మరుసటి రోజు కాలేజీకి రాహుల్ వచ్చాడు. అప్పుడే కాలేజీకి వచ్చిన అన్వి, తనని చూసింది .


“ ఏయ్ .....రాహుల్ ” అంటూ అరుస్తూ తన దగ్గరికి వచ్చింది.


ఏంటి అన్నట్టు కళ్ళతోనే చూశాడు.


“ నిన్ను ఎందుకు నువ్వు ప్రోగ్రాంలో ఉండలేదు. అంత తొందరగా వెళ్ళిపోయావు ఏంటి? ” అంటూ ఆయాసంగా శ్వాస తీసుకుంటూ పలికింది.


“ లేదు. కొంచెం హెల్త్ బాగోలేదు. అందుకే తొందరగా వెళ్ళిపోయాను ” ఏదో చెప్పి కవర్ చేశాడు.


“ అవునా! ఇదిగో మన ప్రోగ్రాం ఫస్ట్ వచ్చింది. అందులో నీ వాటా డబ్బులు ” అంటూ చేతిలో పెట్టబోయింది.


“ పర్వాలేదు. నీకే అవసరాలు ఉంటాయి, తీసుకో!” అంటూ చెప్పి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ముందుకు వచ్చేశాడు .


“ నాకు చాలా సహాయము చేశావు. ప్లీస్ ఈ ఒక్కసారికి తీసుకో ” అంటూ అతడి ప్రమేయం లేకుండ చోక్క జేబులో పెట్టింది.


వీరి గోడవ ఇలా ఉంటే,మరోవైపు అందరు నోటిస్ బోర్డు దగ్గరకు వెళ్తున్నారు. అప్పటికి నోటీసు బోర్డు దగ్గర చాలామంది ఏదో చూస్తూ ఉన్నారు.


కాసేపు గోడవ ఆపి, ఏంటి విషయం అన్నట్టుగా పాకెట్లో చేయి పెట్టుకొని అటుగా నడిచాడు రాహుల్. తన వెనుకనే వచ్చింది అన్వి.


కొద్దిసేపటికి నోటీసు బోర్డు పైన విషయాన్ని చూడటం మొదలుపెట్టారు .



“ నిన్న జరిగిన పెస్ట్ కారణంగా ,కాలేజీ శుభ్రపరిచే విషయం దృష్ట్యా, ఈరోజు సెలవు ప్రకటిస్తున్నాము. దయచేసి విషయాన్ని గమనించగలరు. అంతేకాకుండా కాలేజ్ హాస్టల్ ఒక నెలపాటు మూసివేయాలని యాజమాన్యం నిర్ణయించింది. అందువల్ల హాస్టల్ లో ఉండే విద్యార్థులు అందరూ కొత్త రూమ్స్ చూసుకోవాల్సిందిగా మనవి ” అని అందులోని సారాంశం .


“ అయ్యో విషయం ముందే తెలిసి ఉంటే, నేను కూడా గీత దగ్గరే ఉండేదాన్నీ! . అనవసరంగా వచ్చాను ” అంటూ వాపోతూ వెనక్కి తిరిగింది అన్వి.


రాహుల్ కూడా దానికి బాధపడుతున్నట్టుగా హాస్టల్ వైపు నడిచాడు.

“ ఏంటి రాహుల్, హాస్టల్ లో ఉంటున్నాడా? మరి ఈ విషయం నాకు తెలియలేదు. ఇప్పుడు వన్ మంత్ ఎక్కడ ఉంటాడు ” అంటూ ఆలోచనలో పడింది.


తను ఆలోచిస్తూ అక్కడే నిలబడిపోయింది. లోపలికి వెళ్ళినా రాహుల్ ఒక బ్యాగ్ భుజానికి తగిలించుకొని ,బయటికి నడిచాడు.


“ రాహుల్ ! ఇప్పుడు నువ్వు రూమ్ వెతుక్కోవాలా? ” సందేహంగా అడిగింది.


అవును అన్నట్టు తల ఊపి, ముందుకు నడిచాడు .


“ ఇలా బరువు మోస్తూనే రూమ్ వెతుక్కుంటావా? నీకు అభ్యంతరం లేకపోతే మా రూమ్లో నీ లగేజ్ పెట్టుకుంటాం. నీకు రూమ్ దొరికిన తర్వాత నువ్వు వాటిని తీసుకొని వెళ్లొచ్చు కదా? ” అంటూ సలహా ఇచ్చింది .


పాపకి తెలియదు కదా ! అతను ఒక డ్రాకులా అనీ, అవసరమైతే తన వస్తువుల్ని మాయం చేసి అవసరం ఉన్నప్పుడు తీసుకోగలడు.


“ పర్వాలేదు.....” అంటూ గట్టిగా చెబుతూ, తనని ఏమాత్రం పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోయాడు.


“ పోనీ లేదు సాయం చేద్దాం అనుకుంటే, పెద్ద ఫోజ్ కొడుతున్నాడు ” అంటూ మూక్కు పుట్టలు అదిరేలా కోప్పడి ,తన రూమ్ కి వెళ్ళిపోయింది అన్వి.


కోపంతో రూం చేరిన అన్వికి వాళ్ళ ప్రెండ్స్ పడుకుని కనిపిస్తారు. గీత మిద చెయ్యి కాలు వేసుకొని పడుకొని కనిపిస్తుంది సంజన.



“ కర్మ ........కర్మ ! దీనికి అస్సలు బుద్ధి అనేదే లేదు ” అనుకుంటూ ,పక్కనే ఉన్న వాటర్ బాటిల్ ఓపెన్ చేసి సంజన మోహం మిద పోస్తుంది అన్వి.

“ అయ్యో....వర్షం... వర్షం ” అంటూ కంగారుగా నిద్ర లేస్తుంది సంజన.

ఎదురుగా అన్వి వాటర్ బాటిల్ పట్టుకొని ఉండడంతో , “ ఏంటే! మంచి డ్రీమ్ చెడగొట్టేసావు? ” అని తిట్టుకుంటూ, జరిగింది మర్చిపోయి "అబ్బా! ఏమ్ అన్నా డ్రీమ్ హ?"అంటుంది సంజన.


“ ఒసేయ్ మొద్దు ! నేను ఇక్కడ ఒక మనిషిని ఉన్నాను కనిపిస్తున్నానా ? ” అని కోపంగా అడుగుతుంది అన్వి.

“ అబ్బా! నాకేం కళ్ళు కనిపించడం మానేయలేదు గానీ సూపర్ డ్రీమ్ వచ్చిందే ! మరేమో పెద్ద హీరో మూవీ ఫంక్షన్ లో యాంకరింగ్ చేస్తున్నానే . అందరూ ఒకటే క్లాప్సు తెలుసా !. అంతా చెడగొట్టేసవు ” అని బుంగమూతి పెట్టుకుంటుంది సంజన.



“ నీ పందిమూతి తర్వాత పెడుదువుగానీ , నీకు కొంచెం ఐనా సెన్స్ ఉందానే ? అది ఎమో పేషెంట్. నువ్వేమో దాని మిద కాళ్ళు చేతులు వేసి పడుకుంటావా ? ” అని వాటర్ బాటిల్తో రెండు పీకుతోంది అన్వి.


“ అబ్బా ,కొట్టకే బాబు.ఎదో డ్రీమ్ లో ఉండి చుసుకొలే ” అంటూ వాష్ రూమ్ కి పరిగెడుతుంది సంజన.



“ దీన్ని మార్చలేం ! ”అని గీతకి సరిగ్గా బ్లాంకెట్ కప్పి, ముందురోజు తెచ్చుకున్న కాఫీ పౌడర్తో కాఫీ రెఢీ చేస్తుంది అన్వి .


*******


రూం కోసమై,వెతికే పనిలో పడ్డాడు పాపం పసివాడు అంటూ వెతూకుతుంటాడు. అలా ఒక ఇంటికి వెళతాడు .అక్కడ ఓనర్ నీ పిలిచి తన కోసం రూం అడుగుతాడు రాహుల్.


“ మా పై పోర్షన్ ఖాళీగానే ఉంటుంది బాబు. కాకపోతే నీలానే చదువుకునే అబ్బాయిలు ఐదుగురు ఉంటున్నారు.నీకు అభ్యంతరం లేకపోతే వాళ్ళతో కలిసీ ఉండొచ్చు ” అంటారు ఆయన.



ఓకే రూమ్ లో ఐదుగురు ఉంటున్నారా? నేను వెళ్తే ఆరుగురం ! . ఎలా ఇప్పుడు అనీ మనస్సులో అనుకొని వేరే హౌజ్ కి వెళ్తాడు రాహుల్.

అక్కడ కూడా అదే పరిస్థితి. ఏ ఇంటికి వెళ్ళిన, ఆల్రెడీ ఆ పోర్షన్ లో నలుగురూ.....ఐదుగురూ ... ఉంటున్నారు.వాళ్ళతోనే రూం షేర్ చేసుకోవాలి .


ఇలా అయితే కాదు అనీ , వేరే ఏదైనా ఏరియాకి వెళ్దాం అనుకుంటాడు.



అలా ఏరియా మొత్తం తిరగేస్తాడు. అన్ని చోట్ల అదే సీన్ రిపీట్ అవ్వుద్ధి.చివరకి ఒకేఒక ఇల్లు మిగులుతుంది.

అప్పుటికే చెమటతో తడిసిపోయాడు. శరీరం సత్తువ కోల్పోయి, అసహనంగా కళ్ళు మూసుకుంటున్నాయి.


అప్పుడే దేవకన్యలా ఉన్న అన్వి రూపం అతని కళ్ళలో మెదిలి ,పెదాలపై చిన్న చిరునవ్వుని తెస్తుంది .ఆ చిరునవ్వుతో ఆ చివరి ఇంటికి వెళ్తాడు రాహుల్.


*******


తన రూంలో ఒంటరిగా బెడ్ మీద పడుకొని ఫ్యాన్ నీ చూస్తూ, తన లాస్ట్ మిషన్ ని ఎలా కంప్లీట్ చెయ్యాలా? అని ఆలోచిస్తూ ఉంటాడు అభయ్.


తన ఆలోచనలకు అడ్డం వేస్తూ, తన రూం డోర్ తడతాడు ఆ ఇంటి ఓనర్.

ఆయన్ని చూస్తూనే “ నమస్తే అంకుల్ ” అని చెప్తాడు అభయ్.


“ హా... నమస్తే అభయ్ బాబు .నీకు ముందే అగ్రిమెంట్ లో చెప్పానుగా! ఇది షేరింగ్ రూం అనీ . ఇప్పుడు ఇంకో అబ్బాయి కూడా వచ్చాడు.నువ్వు ఇప్పుడు ఆ అబ్బాయితో రూమ్ షేర్ చేసుకోవాలి ” అని స్టెప్స్ వైపు చూపిస్తాడు ఒనర్.


అప్పుడే స్టెప్స్ ఎక్కుతూ వస్తుంటాడు రాహుల్. ఒక్క క్షణం వారి చూపుల మధ్య విరోధము ఏర్పడింది.



——— ***** ———


షేర్ చేయబడినవి

NEW REALESED