Featured Books
  • వైశాలి - 1

    వైశాలి అందమైన యువతి.  ఆమె ఎంత అందంగా ఉంటుందంటే ముందు ముందు న...

  • ఔను నిజం నువ్వంటే నాకిష్టం

    తెనాలి రైల్వే స్టేషన్‍       అర్ధరాత్రికి ఇంకా అయిదు నిమిషాల...

  • ఆగంతకుడు

    క్యాప్ ని ముఖంపైకి లాక్కుని చీకటిగా ఉన్న భవంతివైపు నడచాడతను....

  • అచ్చిరాని అతితెలివి

    తనను ఎవరైనా చూస్తున్నారేమోనని పరిసరాలను జాగ్రత్తగా కనిపెడుతూ...

  • ఇంటిదొంగలు

    ఎగ్జిక్యూటివ్ ఏడుకొండలు, గన్ మేన్ గఫూర్, వ్యాన్ డ్రైవర్ జోసె...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

జతగా నాతో నిన్నే - 17










గాలిలో వేగంగా ఎగురుతున్న ఒక హెలికాప్టర్ చక్కర్లు కొడుతూ ,ఒక పదాంతస్తుల భవనం పై ఏర్పాటు చేయబడిన హెలికాప్టర్ ల్యాండింగ్ పానెల్ పై ఆగింది .


దాని రెక్కల నుండి వచ్చే గాలి శబ్దం , తుమ్మెద నాదముల మారుమోగుతుంది . దాని గాలికి చుట్టుపక్కల ఉన్న దుమ్ము రేణువులంతా దూరంగా నెట్టి వేయబడ్డాయి .


అందులో నుండి కోటుని సరిచేసుకుంటూ, పాలిష్ చేయబడిన బ్రాండెడ్ బూట్లతో, రోలెక్స్ వాచ్ సరిచేసుకుంటూ కిందికి దిగాడు అతడు .


అలా దిగగానే తనకి సెక్యూరిటీ కల్పిస్తూ ఇద్దరు సైనికులులాగా వచ్చి నిలబడ్డారు. వాళ్ళ చేతిలో రెండు పెద్ద గన్నులు ఉన్నాయి.


చెవిలోని బ్లూటూత్ని నొక్కిపెట్టి " ఆ అమ్మాయి వివరాలు ఏమైనా తెలిసయా ?" అంటూ గంభీరంగా అడిగాడు .


ఆ అమ్మాయి గురించి ఒక ఫోటో దొరికింది సార్ . మేము మీ క్యాబిన్లోనే వెయిట్ చేస్తున్నాను సార్ అంటూ భయపడిపోతూ వణుకుతున్న గొంతుతో అన్నాడు పిఏ .


వెంటనే బ్లూటూత్ కట్ చేసి ,లిఫ్ట్ లోకి అడుగు పెట్టిన అతడు, కొన్ని క్షణాల్లోనే తన క్యాబిన్ లో ప్రత్యక్షమయ్యాడు .


“ ఇప్పుడు అభిషేక్ కి ఎలా ఉంది ” అంటూ ప్రశ్నించాడు .


చిన్న బాబు గారికి ఇప్పుడు పరవాలేదు. ఆ కొట్టిన వ్యక్తి పైన మేము కఠినంగా చర్యలు తీసుకుంటాం అంటాడు పిఎ . భయం అతని మాటల్లోనే స్పష్టంగా తెలుస్తుంది .


అతడు భయపడుతున్నాడని , “వాన్ని చంపితే ఏమొస్తుంది ? ఏ అమ్మాయి కోసమైతే వాడు అడ్డుగా నిలబడి పోరాడాడో, ఆ అమ్మాయినే లేకుండా చేస్తే అప్పుడు వాడికి అర్థమవుతుంది, నా అనుకున్న వాళ్ళకి కష్టమొస్తే ఎలా ఉంటుందో ” అంటూ కళ్ళు రెండు ఎర్రగా చేసి, తన చేతిలో ఉన్న తన కళ్లద్దాలని నలిపి విరిచేసాడు.


గాజు టేబుల్ పైన అస్పష్టంగా కనిపిస్తున్న ఫోటోని చూడటానికి దగ్గరికెళ్ళాడు .


ఫోటోలు ఎవరో అందంగా ఉన్న ఒక అమ్మాయి కనిపిస్తుంది. మసక మసక ఉన్న తన కళ్లను నలుపుతూ ఆ ఫోటోని దగ్గరగా పెట్టుకొని చూసాడు. అంతే! ఒక్కసారిగా షాక్ కొట్టినట్టు బిగుసుకుపోయి “ పిఏ కొత్త స్పెట్స్ ఇవ్వు ” అంటూ అరిచాడు.


పిఏ భయపడిపోయి పరుగు పరుగున కొత్త కంటిజోడు ఆయనకు ఇచ్చాడు. అవి పెట్టుకున్న సోమనాథ్ ఆ ఫోటోని చూసి ,“ ఈ అమ్మాయి అన్వేషణ కదా ” అంటూ పిఏ వైపు చూశాడు.


ఆ అమ్మాయి ఎవరో మీకు తెలుసా సార్ ? తన పేరు కూడా చెప్పేశారు ? అంటూ ఆశ్చర్యంతో నిండిన కంఠంతో ప్రతిధ్వనించాయి అతని మాటలు .


అప్పుడే గదిలోకి నొప్పితో బాధపడుకుంటూ వచ్చిన అభిషేక్ ; పేరు చెప్పకుండానే గుర్తుపట్టిన తన తండ్రిని చూసి ఆశ్చర్యపోయాడు .


“ నాన్న నీకు ఈ అమ్మాయి తెలుసా ?” అంటూ సందేహం నిండిన గొంతుతో అడిగాడు .


“ తెలుసా ఏంటి ? నాకు కావాల్సింది కూడా ఈ అమ్మాయే ” అంటూ గంభీరంగా చెప్తూ , ఏదో పథకాన్ని ఆలోచించడానికి తన గదిలోకి వెళ్లిపోయాడు .



అతడు వెళ్లిన వైపే పిఏ ఇంకా అభిషేక్ ఇద్దరు చూస్తూ ఉండిపోయారు .


*******


బారెడు పొద్దెక్కిన తర్వాత నిద్ర లేచారు మన దోస్తులు.


“ ఈ రోజు ఆదివారం హబ్బా! వారానికి ఒక రోజు ఆదివారం వస్తుంది . ఆరోజు మొత్తం సెలవే! ఇంతకుముందు టీ షాప్ లో చేసినప్పుడు ఈరోజు హాలిడే ఉంటే బాగుంటుంది అని ఎన్నిసార్లు అనుకున్నానో తెలుసా ?” అంటూ చూస్తూ అంది సంజన .


“ అవునే రోజంతా కష్టపడుతూ ఉంటే ,ఎప్పుడే మనకి ఓపిక వచ్చేది ” అంటూ బద్దకంగా వోళ్ళు విరిచేస్తూ పైకి లేచింది అన్వి పాప .



“ మనకంటూ మన మనశ్శాంతికంటూ సెలవిచ్చిన రోజే ఈ ఆదివారం. దీన్ని కూడా ఇంకా మీ నిద్ర మబ్బు మాటలతో వేస్ట్ చేస్తారు ఎందుకు? లేచి త్వరగా రెడీ అవ్వండి . ఎటైనా వెళ్లి తినేసి వద్దాం ” అంటూ అన్వి పర్సు పట్టుకొని అడిగింది గీత.


“ హే దొంగ మొఖమా! ఎప్పుడు తీసుకున్నావే? ” అంటూ చింపిరి చింపిరి జుట్టేసుకొని తనని గదిలో పట్టుకోడానికి పరిగెత్తింది అన్వి.


“ ఏయ్ సంజన, క్యాచ్ పెట్టుకో! మళ్ళీ డబ్బులు, మన కష్టాలు అంటూ ఇవ్వదు .పెద్ద పిసినారిల అయిపోతుంది ఈ మధ్య ” అంటూ తన వైపుకి విసిరేసింది .


సంజన కిలకిల నవ్వుతూ దాన్ని పట్టుకొని ఇద్దరూ కాసేపు ఆడుకున్నారు. మధ్యలో అటు ఇటు కోతిలా ఎగురుతున్న అన్వికి నీరసం వచ్చేసి ,

“ సరేలే బాబు చెప్పండి. ఏం తిందామో? వాటికి మాత్రమే డబ్బులు ఇస్తాను .ఎక్స్ట్రా ఖర్చులు ఏమైనా పెట్టాలని చూస్తే మాత్రం కాళ్ళు ఇరగ కొడతాను ” అంటూ గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఊపిరి గట్టిగా పిల్చుకుంటుంది.



“ మాకు ఇందులో ఎక్కువ వద్దు ఒక ₹1000 అయితే ఒక పెద్ద ఆ రెస్టారెంట్లో బిర్యానీ తినేసి కాసేపు ఏసి కింద కూర్చొని రావచ్చు ” అంటూ ఊహల్లో తేలిపోతూ, గీత నెమ్మదిగా చెప్పింది.


“ ఏంటి వెయ్యి రూపాయలా ? ” అంటూ కప్పల నోరు తెరిచింది అన్వి.


సంజన మాత్రం ఇంకా ఆ రెస్టారెంట్ ఊహల్లోనే ఉంది . కాసేపు నడుంపై చేయి పెట్టుకొని ఆలోచించిన అన్వి ,ఇప్పుడు వీళ్ళని రెస్టారెంట్ తీసుకొని వెళ్తే అనవసరంగా వేయ్యి వేస్ట్! త్వరగా ఏదో ఒక పథకం ఆలోచించాలి అని బుగ్గపై కాసేపు వేలు పెట్టుకొని ఆలోచించింది .


” ఒసేయ్ ఒక పని చేద్దాం .మనం ఈరోజు చికెన్ బిర్యాని ఇక్కడే చేసుకుని ,ఇక నా బుజ్జి సెల్లుకి నెట్ వేయించుకొని ఒక హర్రర్ మూవీతో పెప్సీ ఎలా ఉంటుందంటారు ” అంటూ వాళ్ళవైపు ఊరిస్తున్న కళ్ళతో చూసింది అన్వి.


తను చెప్పడం మొదలు పెట్టినప్పటి నుండి వాళ్ళ ఊహల్లో నుంచి జరగబోయే దాని గురించి ఆలోచించడం మొదలుపెట్టారు ఇద్దరు .



ఆ ఊహ ఎంత బాగుందో ! నన్ను డిస్టర్బ్ చేయకు రాజా అని పోసనిలాగే ఫీల్ అయిపోతూ ఉండిపోయారు .


“ ఏంటే ? ఆ రెస్టారెంట్ హా ? లేదంటే మనం ముగ్గురం కలిసి ఎంజాయ్ చేయడమా? తొందరగా నిర్ణయం తీసుకోండి ” అంటూ చేతులు కట్టుకుంటూ కాస్త గట్టిగా చెప్పింది అన్వి.


“ రెస్టారెంట్ కు పోతే ఒకటే దెబ్బకి ₹1000 స్వాహా. తిన్నట్టు కూడా ఉండేదే ! మనం కలిసి ఇదే ప్లాన్ చేద్దాం .ఒక చిన్నపాటి పార్టీలా ఉంటుంది మన గదిలో .”


“ అవును అన్వి . నీ ఐడియానే చాలా బాగుంది. తొందరగా ఇదే మనం ప్లాన్ చేసేద్దాం ” అంటూ సంజన కూడా తన దగ్గరికి వచ్చింది .


వెంటనే చేతిలో ఉన్న పర్సు లాక్కొని , “ దొరికిపోయారుగా ఇప్పుడు? ” అంటూ వెక్కిరించింది అన్వి.


“ అంటే నువ్వు ఇప్పుడు దాకా చెప్పింది అంతా అబద్దమా ?” దాదాపు ఏడుపు మూఖలు పెట్టుకొని అడిగారు ఇద్దరు.


“ అన్వి అనే నేను .ఈ రూమ్ యొక్క ప్రజల పైన కాస్త దయుంచి ,ఇప్పుడు కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నాను .

ఎలాగో మన కాఫీ షాప్ డబ్బులు వారానికి ఒకసారి అందుతాయి . వచ్చేనెల రెంట్ కూడా మనం ఈసారే పే చేసేసాం .

ఇక యాంకర్ సంజన కి వచ్చే డబ్బులు మన ముగ్గురి కాలేజీ ఫీజు కి సరిపోతాయి . కాబట్టి ప్రతి ఆదివారం మనం ఒక చిన్నపాటి పార్టీ చేసుకుందాం.

మనకు నచ్చినట్టు ఆ రోజంతా గడిపేద్దాం ! ప్రతి ఆదివారం మీ వెయ్యి రూపాయలతో మీ అన్వి ” అని టకటక రాజకీయ నాయకుల్లాగా హామీ ఇచ్చేసింది.


ఆ మాటలు వినగానే ఇద్దరు వచ్చి కౌగిలించుకొని , “సూపరే నువ్వు ......” అంటూ ఊపేస్తున్నారు .


హే ఛీ ఛీ అంటూ వాళ్ళిద్దరిని విదిలించి , “ పాచి దంతలు వేసుకొని మీరేంటే, వెళ్లి ఫ్రెష్ అవ్వండి ” అంటూ కసిరింది .


“ నువ్వేంటి మాకు చెప్తున్నావు? నువ్వు ఎలాగున్నావో చూసుకున్నావా ?” అంటూ నడుము పైన చక్కిలిగింతలు పెట్టారు. అలాగే బెడ్ పై పడిపోయారు. వాళ్లు గలగల నవ్వులు సెలయేర్లలాగా ఆ గదిలోనే చప్పుడు చేస్తూ ఉన్నాయి.



“ నిన్న ఎలాగో అనుకొని మనం చేయలేకపోయాం. కాబట్టి ఫ్రెష్ అవ్వడానికి ముందే మనం ఐడియాస్ ని ఆలోచిద్దాం ” అంది అన్వి.


“ దేని గురించి మాట్లాడుతున్నావే ” అంటూ తల గోక్కుంటూ అడిగింది సంజన .


“ అదేనే కాలేజీ ప్రోగ్రామ్స్ గురించి ” అంటూ వచ్చి పక్కన కూర్చుంది గీత .


మన ముగ్గురం కలిసి ఒక స్కిట్ చేద్దాం! ఇంకా నాకు ఎలాగో డాన్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి నేను చేస్తాను. గీత నువ్వే చెస్ గేమ్ ఆడు. ఇక సంజనకి ఎలాగో యాంకరింగ్ పని ఉంటుంది .


ఈరోజు మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు మనం స్కిట్ కంప్లీట్ చేయాలి. దాని తర్వాత నా డాన్స్ కొరియోగ్రఫీ మీరు చేయాలి అంటూ చాలా సీరియస్ గా చెప్పింది అన్వి.


సరే ! ముందైతే తొందరగా రెడీ అయ్యి బ్రేక్ ఫాస్ట్ చేసి ,మొదలుపెడదాం.


ఒకసారి కూర్చుంటే ఇక అస్సలు కదలకూడదు అంటూ ముగ్గురు నిర్ణయం తీసుకున్నారు. వెనువెంటనే అనుకున్నదే తడువుగా ప్రారంభించేశారు.



——— ***** ———