Featured Books
  • వైశాలి - 1

    వైశాలి అందమైన యువతి.  ఆమె ఎంత అందంగా ఉంటుందంటే ముందు ముందు న...

  • ఔను నిజం నువ్వంటే నాకిష్టం

    తెనాలి రైల్వే స్టేషన్‍       అర్ధరాత్రికి ఇంకా అయిదు నిమిషాల...

  • ఆగంతకుడు

    క్యాప్ ని ముఖంపైకి లాక్కుని చీకటిగా ఉన్న భవంతివైపు నడచాడతను....

  • అచ్చిరాని అతితెలివి

    తనను ఎవరైనా చూస్తున్నారేమోనని పరిసరాలను జాగ్రత్తగా కనిపెడుతూ...

  • ఇంటిదొంగలు

    ఎగ్జిక్యూటివ్ ఏడుకొండలు, గన్ మేన్ గఫూర్, వ్యాన్ డ్రైవర్ జోసె...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

జతగా నాతో నిన్నే - 15








లారీ డ్రైవర్ వేగంగా తనని ఢీకొట్టి కాస్త ముందుకు వెళ్లి లారీని ఆపేశాడు .అక్కడినుండి లారీని వదిలేసి భయంతో పరిగెత్తుకుంటూ వెళ్లిపోయాడు .కొన ఊపిరితో కొట్టుకుంటూ శ్వాస తీసుకోలేక ఇబ్బంది పడుతూ రక్తమాడుపులో ఉంది గీత.


ఆమెకు “ గీత.....” అంటూ తన వైపే వస్తున్న మాటలు మాత్రమే వినిపించాయి. నెమ్మదిగా గీత కళ్ళు మూతపడ్డాయి.


“ గీతా......గీత నీకేం కాదు. నేనున్నాను ” అంటూ ధైర్యంగా తను నిద్రపోకుండా ఉంచడానికి ప్రయత్నిస్తుంది అన్వి.


సంజన కింద భూమి అంత కనిపించినట్టు అనిపించింది .తన ఎదురుగా రక్తం మడుపులో కొట్టుమిట్టాడుతున్న తన స్నేహితురాలిని చూసి చలించిపోయింది .



గీత తలకున్న రక్తం ,అన్వి వేసుకున్న బట్టలకి మొత్తం అయింది. తన చేతులకి అంతా అయింది. గీత అంటూ గట్టిగా గొంతు తడి పూర్తిగా ఆరిపోయే ఏడుపు మాత్రమే తనకు వస్తుంది.
చుట్టుపక్కన ఎవ్వరూ లేరు . ఆ రోడ్డుపైన కొంచెం దూరంలో ఆ లారీ తప్ప మరి ఏది కనిపించలేదు. అప్పటికే చీకటి పడుతూ ఉండటంతో అటుగా జనసంచారమేమి కనిపించలేదు.


అన్వి నీ వెతుక్కుంటూ వచ్చిన రాహుల్ అలసిన శరీరంతో రోడ్డు వైపుకి వచ్చి చూసాడు. అప్పుడే తన కళ్ళు దూరంగా ఏడుస్తున్న అన్విని గుర్తుపట్టాయి. అక్కడ కనిపించిన దృశ్యానికి ఒక్క క్షణం స్తంభించిపోయాడు .


వెనువెంటనే తేరుకొని ఆ పక్కనే ఆపేసిన కార్ని తన మాయ శక్తితో స్టార్ట్ చేశాడు . స్పీడ్ గా వాళ్ళ ముందుకి కార్ తీసుకొచ్చి ఆపి ,త్వరగా గీతని హాస్పిటల్ కి తీసుకొని వెళ్దాం అంటూ తన మాటలు దగ్గర వినిపించాయి. ఆ మాటలకి అప్పటిదాకా ఏడుస్తున్న గీత వెంటనే తనని కార్లో ఎక్కించడానికి సహాయం చేసింది .


కారు మామూలు వేగం కంటే చాలా వేగంగా హాస్పిటల్ ని చేరింది .


గీతాని తన చేతుల్లో ఎత్తుకున్న రాహుల్ హాస్పిటల్ లోకి పరిగెత్తుకుంటూ వెళ్లి ఒక స్ట్రక్చర్ పైన తనని పడుకోపెట్టాడు .



వాళ్ళ అరుపులకి అప్పటిదాకా ప్రశాంతంగా రిలాక్స్ అవుతున్న డాక్టర్లు తొందర తొందర ట్రీట్మెంట్ చేయడం స్టార్ట్ చేశారు. తనకి కాస్త ఫస్ట్ ఎయిడ్ చేసి పరిస్థితి ఏంటో అర్థం చేసుకున్నారు .తన ప్రాణం పోకుండా కాస్త ట్రీట్మెంట్ చేస్తూ బయటికి వచ్చారు.


ప్రస్తుతానికి తన పరిస్థితి ఏమంత బాగోలేదు. తనకి రక్తమెక్కిస్తున్నాము. తొందరగా తనకి ఒక మేజర్ ఆపరేషన్ చేయాలి. దానికి 50 వేలు ఖర్చు అవుతుంది . మీరు తొందరగా దాన్ని కట్టకపోతే ఇక తన ప్రాణాలు పోయి పరిస్థితి ఏర్పడవచ్చు అంటూ డాక్టర్ చెప్పి తొందర తొందరగా ఆపరేషన్ కావాల్సినవి సిద్ధం చేసుకోవడంలో ఉన్నాడు.


అప్పటిదాకా ఏదో మూలన గీతం బతుకుతుంది అన్న ఆశతో ఉంది కానీ అతడు చెప్పిన డబ్బులు వినగానే అన్వి మాట్లాడలేకపోయింది. మౌనంగా అక్కడే కూర్చుని తలదించుకుని ఉంది .ఇప్పుడు మెదడులో కదులుతున్న ఒకే ఒక్క ఆలోచన డబ్బును ఎలా సిద్ధం చేయాలి అనీ!


రాహుల్ జాలిగా తన వైపు చూశాడు. వెంటనే ఆమె పరిస్థితి అర్థం అయింది.



వెంటనే ఆ పక్కనే ఏదైనా బంగారు షాప్ ఉందేమో వెతికాడు . అదృష్టం కొద్దీ ఒక అతడు అప్పుడే షాప్ మూస్తు కనిపించాడు . వెంటనే రాహుల్ తన మెడలో ఉన్న ఒక బంగారు గొలుసుని ఆయనకిచ్చి దాని ధర చెప్పమన్నారు .కొద్దిసేపు దాన్ని పరీక్షించి అతడు ఇదే 15,000 దాకా విలువ చేస్తుంది అని తెలిసి చెప్పేశాడు.


“ సార్ ఇప్పుడు మాకు డబ్బులు చాలా అవసరం .ప్లీజ్ కాస్త ₹20,000 అని చేసుకోండి ” అంటూ బ్రతిమలాడం మొదలు పెట్టాడు రాహుల్.


చివరికి ఆయన ఎలాగోలా ఒప్పుకున్నాడు. వెంటనే తన ఐఫోన్ ని కూడా అతడికి ఇచ్చి , “సార్ ఇది కూడా తీసుకొని దీనికి ఒక ₹30000 ఇవ్వగలరా? ” అంటూ దాదాపు చేతులెత్తి నమస్కరించాడు.


అతని పరిస్థితి ఏంటో పూర్తిగా అర్థం చేసుకున్న
ఆ బంగారు షాప్ యజమని , “ నువ్వు అత్యవసర సమయం కాబట్టి వీటిని తాకట్టు పెట్టడానికి వచ్చావు. నేను ఇంకా మామూలుగా డబ్బులు అవసరమయ్యి వచ్చామనుకున్నాను. సరే నువ్వేమీ భయపడకు! నేను నీ ఫోన్ ఇంకా నీ బంగారు చైన్ ని భద్రపరుస్తాను.
నువ్వు మళ్ళీ వచ్చినప్పుడు తీసుకోవచ్చు. అప్పటిదాకా ఈ డబ్బులు నీకు ఇస్తాను .నువ్వు డబ్బులు కట్టి వీటిని తీసుకెళ్ళు ” అంటూ ఎంతో ఆప్యాయంగా యాభై వేలు చేతికి అందించాడు.


ఆరోజు కాంపిటీషన్లో తను గెలుచుకున్న ₹10000 కలిపితే మొత్తం 60 వేల దాకా వచ్చాయి . వాటిని తీసుకొని కౌంటర్లో కట్టేసి ,ఆ పదివేలతో టాబ్లెట్లు , కొన్ని ఫ్రూట్స్ కూడా తీసుకున్నాడు రాహుల్ .


అన్వి దగ్గర ఆ ఫ్రూట్స్ తో పాటు వెళ్లి తన పక్కన కూర్చున్నాడు .ఇదంతా కేవలం ఒక పది నిమిషాల్లోనే జరిగిపోయింది. అన్వి ఇంకా అలాగే దిగులుగా కూర్చుని ఉంది .


నెమ్మదిగా తన పక్కన కూర్చుని, తన భుజం పైన చిన్నగా చేయి వేశాడు రాహుల్ . ఏమి చేయలేని నిశ్శయిరాలాగా కళ్ళు నిండుకుండలా ఉన్నాయి. వాటిని చూడగానే రాహుల్ మనసు చల్లించిపోయింది.


మరేం మాట్లాడకుండా బిల్ పేపర్ ని అన్వి చేతిలో పెట్టాడు . ఒక్క క్షణం ఆశ్చర్యపోతూ దాని వైపు చూసింది .ఆపరేషన్ కావాల్సిన డబ్బులు రాహుల్ కట్టేసాడని తనకి అర్థం అయింది.



ఇంతలో అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చిన నర్స్ “ సార్ మీ మెడల్ ఇక్కడే మర్చిపోయారు మీరు. మేము కేవలం మీ ప్రైజ్ మనీ తీసుకుంటాము. ఈ మెడల్ మాకేం అవసరం లేదు .మీ దగ్గరే ఉంచండి " అంటూ వచ్చి దాన్ని ఇచ్చేసింది .


అన్వికి అప్పుడు అర్థమవుతుంది. తనకి బహుమతిగా వచ్చిన డబ్బులని గీత ఆపరేషన్ కి తీసుకొచ్చాడు అనీ .ఆ పేపర్ ని గట్టిగా పట్టుకుంటూ కళ్ళల్లో నీళ్లు జలపాతంల దూకుతుంటే ,మరేం ఆలోచించకుండా రాహుల్ భుజం పై తల పెట్టుకుని ఏడ్చేసింది .


అలా ఏడుస్తూ ఉంటే రాహుల్ కి కూడా చాలా బాధగా అనిపించి తన తలపై చిన్నగా నిమిరాడు. వాళ్లు అలా కాలం స్తంభించిపోయినట్టుగా ఎంతసేపు కూర్చున్నారో తెలియదు .కానీ ఆపరేషన్ పూర్తి చేసిన డాక్టర్లు బయటకు వచ్చి, వాళ్ళని మామూలు స్థితిలోకి తీసుకొచ్చారు .


“ ఆపరేషన్ సక్సెస్ఫుల్గా అయిపోయింది .తనకి ఒక రెండు రోజులు రెస్ట్ అవసరం అవుతుంది. జాగ్రత్తగా చూసుకోండి ” అంటూ చెప్పి తన కోటులో చేతులు పెట్టుకొని వెళ్ళిపోయాడు .


సంజన డబ్బుల కోసం తీవ్రంగా ప్రయత్నించిన తనకి దొరక్క పోవడంతో అటుగా వచ్చి వాళ్ళిద్దరిని చూసి అక్కడే నిలబడిపోయి ఉండింది .



డాక్టర్ ఆ మాట చెప్పడంతో తనకి విషయం అంత అర్థమయ్యే, నెమ్మదిగా వీళ్ళ దగ్గరకు వచ్చింది. తను రావడంతోనే అన్వి నుంచి దూరంగా జరుగుతు, “ సరే మీరు జాగ్రత్తగా ఉండండి .మీకోసం కూడా టిఫిన్ తీసుకొని వచ్చాను ” అంటూ ఒక కవర్ ని అక్కడే బెంచ్ పై పెట్టాడు .



సంజన దగ్గరికి వచ్చి తన దగ్గర మిగిలి ఉన్న ఐదువేల రూపాయలను ఆమె చేతికి అందిస్తూ , “ ఇవి మీ ఖర్చులకి ఉపయోగపడాతాయి ” అంటూ చిన్నగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు రాహుల్.


తనకి తెలుసు. అన్వికి ఆత్మ అభిమానం ఎక్కువ. తను ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే వేరే వాళ్ళ దగ్గర నుండి ఉచితంగా వచ్చేవి అస్సలు తీసుకోదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో కూడా తాను ఎవరి దగ్గర సహాయం ఆశించలేదు .అలా అని తన స్నేహితురాలి ప్రాణాన్ని కూడా పణంగా పెట్టలేదు.


అందుకే ఇంతసేపు తను దోబూచులాటాడుతుంది . దాన్ని అర్థం చేసుకున్న రాహుల్ తనకి సహాయం చేశాడు .వెళ్ళిపోతున్నా రాహుల్ వైపే ఇద్దరు చూస్తూ ఉండిపోయారు.


కొద్దిసేపటికి స్పృహలోకి వచ్చిన గీత కాస్త బాధగా “ క్షమించండి .తప్పంతా నాదే ! నేను చూసుకొని ఉండాల్సింది .ఇప్పుడు అనవసరంగా మీకు భారం అయ్యాను ” అంటూ కన్నీళ్లు పెట్టుకుంది.


“ ఛీ ఆపవే ! నువ్వు ఎప్పటికీ మాకు భారం కాదు. మన విధిరాత అలా ఉంది మరి ,మనం దాన్ని మార్చలేము ” అంటూ ఓదారిస్తున్నట్టుగా తన చేతిని పట్టుకుంది అన్వి.


“ అవును. మరి రేపు మనం స్కిట్ ప్రాక్టీస్ చేయాలి కదా ! దానికోసమే మనం చాలా కష్టపడ్డాం. నాకోసం మీరు దాన్ని వదులుకోకండి ” అంటూ చెప్పింది గీత.


“ ఈ సమయంలో కూడా ఆ స్కిట్టులేంటి ? నీకు అది ఏమి అంత వద్దు . నువ్వు రెస్ట్ తీసుకో ” అంటూ కసిరింది అన్వి.


“ మరి నా ఆపరేషన్ కి మీకు డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయి ” అంటూ జాలిగా వాళ్ళ వైపు చూసింది .


“ అదంతా నీకు అనవసరం. వద్దని చెప్పా కదా! నువ్వు కాస్త రెస్ట్ తీసుకో ” అంటూ ఇంకాస్త రెట్టించిన గొంతుతో అంది .


“ ప్లీజ్! నాకోసం అన్న మీరు స్కిప్ చేయండి .నాకు చూడాలని ఉంది .ఎలాగో నిన్ను రేపు డిశ్చార్జ్ అవుతాను కదా ? చూస్తాను " అంటూ బ్రతిమిలాడింది గీత .


అన్వి దగ్గర నిశ్శబ్దము తప్ప సమాధానం లేదు.


మధ్యలో కల్పించుకున్న సంజన ,“ నువ్వు అనుకున్నట్టే చూద్దువు. సరేనా ! రేపు కచ్చితంగా అన్వి స్కిట్ లో నటిస్తుంది ” అంటూ తన భుజంపై చెయ్యేసి భరోసా ఇచ్చింది .


ఇంతలో నర్స్ బయటికి వెళ్ళమని చెప్పి ,గీతకి మత్తుమందు ఇచ్చింది. తను ప్రశాంతంగా నిద్రపోయింది .

బయటికి వచ్చిన అన్వి , “ అసలు ఏంటే నువ్వు అలా చెప్పావు .మళ్ళీ ఆశలు పెట్టుకుంటుందేమో ?మనం స్కిట్ చేయాలంటే ముగ్గురు ఉండాలి కదా. ఇప్పుడైతే ఎవరూ లేరు .ఎలా చేయగలుగుతాం ” అంటుంది.


“ రాహుల్ ని అడుగు రా ,తను మనకి సహాయం చేస్తాడు. ”


“ వద్దు తన్ని ఇప్పటికే మనం చాలా ఇబ్బంది పెట్టాం. మళ్ళీ మన వల్ల తను ఇంకా ఇబ్బంది ఎందుకు? ”


“ గీత కోసం ప్లీజ్ ...” అంది కళ్ళల్లో నిండిన కన్నీరుతో .

అన్వి మౌనంగా ఉంది.



ఆ మరుసటి రోజు కాలేజ్ కి వచ్చిన సంజన రాహుల్ కి విషయం అంతా చెప్పింది . తను విషయం మొత్తం చెబుతున్నప్పుడు అభయ్ కూడా విన్నాడు. రాత్రి జరిగిన పరిస్థితికి ఎంతలా ప్రతికూల పరిస్థితుల పడ్డారో అర్థమైంది


రాహుల్ కి నటించడం అంటే అస్సలు రాదు .కానీ వాళ్ల కోసం తప్పకుండా చేయాలి అనుకున్నాడు .కానీ వాళ్లు రాసిన స్కిట్లో ముగ్గురిదీ అమ్మాయిల పాత్రలే ! ఇప్పుడు ఎలాగో రాహుల్ చేరాడు. కాబట్టి దాన్ని మార్చాల్సి ఉంటుంది .


దాన్ని మార్చడం , మరోపక్క గీతను చూసుకోవడం ఇదంతా పెద్ద పనిగా మారింది . చూస్తుండగానే సాయంత్రం అయింది .వాళ్ళ స్కిట్ ఎంతకు ముందుకు పోలేదు. అందువల్ల ఏం చేయాలి అనీ ఆలోచిస్తూ వెళ్లి పడుకున్నారు.



——— ***** ———