Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

జతగా నాతో నిన్నే - 19











ఒకరినొకరు చూసుకుని ఇద్దరు షాక్ అవుతారు. కానీ మరే మాట్లాడుకోరు . రాహుల్ గదిలోకి వెళ్లడానికి దారి వదులుతాడు అభయ్.


“ సరే బాబు గదిని ఏం పాడు చేయకుండా శుభ్రంగా ఉంచుకోండి ” అంటూ చెప్పి అక్కడి నుండి ఆయన వెళ్ళిపోతాడు .


రాహుల్ ని పలకరిద్దాం అనుకుంటున్నాడు .కానీ తను ఏమి పలకరించకుండా అలాగే కాసేపు బెడ్ పై కూర్చుంటాడు . తన వస్తువులన్నీ సర్దుకున్న తర్వాత ఎక్కడ కూర్చోవాలో అర్థం కాదు రాహుల్ కి.


అందుకే మౌనంగా ప్రశ్నార్థకంగా ,అభయ్ వైపు చూస్తాడు . అభయ్ ఏదో గుర్తొచ్చిన వాడిలాగా లేచి తన బెడ్ని ఒకపక్కగా లాగుతాడు . అంతే! రెండు అటాచ్డ్ బెడ్లు విడిపోతాయి .


రాహుల్ తన బెడ్ ని తనువైపుగా లాక్కొని కాసేపు పడుకుంటాడు .


“ రాహుల్ నాకు కొంచెం పని ఉంది. నేను వెళ్తున్నాను డోర్ లాక్ చేసుకో ” అనీ చెప్పి , బయటికి నడిచాడు అభయ్ .


తను వెళ్లిపోయిన తర్వాత రాహుల్ మాత్రమే గదిలో ఉన్నాడు. నెమ్మది నెమ్మదిగా నిశ్శబ్దమలు అలుముకుంది. గది గోడలంతా నెమ్మది నెమ్మదిగా నలుపు రంగును సంతరించుకున్నాయి .


అదేదో వైరస్ పాకినట్టుగా ఆ చీకటి గుర్తులు మొత్తాన్ని నింపేశాయి. పైన ఉన్న ఫ్లోర్ కి ఒక మేఘం లాంటిది వచ్చి చేరి ఒక సుడిగాలి తిరగడం మొదలయింది.


అందులో చాలా లోతుగా ఒక వింత ప్రదేశం కనిపిస్తుంది . గది నాలుగు గోడల నుంచి చిన్నగా నక్కల ఊళలు వినిపిస్తూ ఉన్నాయి. ఆ నల్లని ప్రాంతం నుండి ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా గదినిండా ఎర్రటి కళ్ళు మేరవడం మొదలైంది.


వాటన్నిటిని చూస్తూ ఉన్న రాహుల్ చిన్నగా నవ్వుకున్నాడు .


“ అప్పుడే నా శక్తి తగ్గిపోవడానికి వచ్చింది. అర్జెంటుగా రక్తం తాగాలి .ఈరోజు రాత్రికి ప్రయత్నించాలి ” అని మనసులో అనుకున్నాడు.



మరుక్షణంలో అతని చర్మం బూడిద రంగులోకి మారింది . అతని పళ్ళా చివర్లలో కోరలు పెరగడం మొదలైంది . ఉన్నట్టుండి డోర్ శబ్దం అవ్వడంతో ఇంతకుముందు ఎలాగైతే రూము ఉందో అలాగే మారిపోయింది.



రాహుల్ కూడా తన పాత రూపానికి వచ్చేశాడు.

అభయ్ లోపలికి వస్తూ తింటానికి ఏవో తీసుకొని వచ్చాడు. " తింటావా....? " అని రాహుల్ ని అడిగాడు . కానీ తను ఏం పలకకపోవడంతో తానే తింటున్నాడు.



ఎవరిని చంపి ,రక్తం తాగాలా ? అని మన రాహుల్ తన మొబైల్ లో వెతకడం మొదలుపెట్టాడు. కానీ ఏ ఒక్క వ్యక్తి వివరాలు కూడా అందులో కనిపించలేదు . ఏంటి అని సరిగ్గా చూస్తే ,అందులో నెట్ బ్యాలెన్స్ అయిపోయింది .


" ఛ.,.. " అంటూ విసురుగా పైకి లేచి బయటికి వెళ్ళిపోతున్నాను అని చెప్పనైన చెప్పకుండా వెళ్ళిపోయాడు రాహుల్ .


రాహుల్ అలా గది దాటి బయటికి వెళ్లగానే అభయ్ ప్రశాంతంగా తింటూ, పైనున్న ఫ్యాన్ వైపు చూస్తూ ఉన్నాడు . నెమ్మది నెమ్మదిగా గదిలో ప్రకాశవంతమైన మేఘాలు వచ్చింది.


ఆకాశం పూర్తి మేలిరంగుతో చిన్న మచ్చ కూడా లేనట్టుగా ఉంది . మొత్తం ఏ హద్దులు లేనటువంటి ఆకాశంగా మారింది . దూరంగా సంగీతాల చప్పుడు కిలకిలమంటూ నవ్వులతో, మనసుకు ప్రశాంతంగా అనిపించే కొన్ని దృశ్యాలు కనిపించాయి.


“ నేను నా ఇంటిని వదిలిపెట్టి ఎన్ని రోజులు అయిందో ? ఒకసారి వెళ్లాలనిపిస్తుంది ” అంటూతలకింద చేతులు పెట్టుకున్నాడు.


బయటికి వెళ్లి నెట్ బ్యాలెన్స్ వేయించుకొని వచ్చిన రాహుల్, గదిలోకి రాగానే అది మాయమైపోయి యథమాములు ఉంది .


కాసేపు తన ఫోన్లో వెతికిన తర్వాత ,మళ్లీ డోర్ చప్పుడు అయింది .


“ ఏంటి ఈ నాసా ! ” అంటూ విసురుగా బయటికి చూశాడు.


“ బాబు మీరు ఈరోజే కాదా చేరింది .తినడానికి ఏమీ వండుకునట్టు లేరు . మా ఇంట్లో భోజనానికి రండి ఈరోజు ” అంటూ పిలిచాడాయన.


రాహుల్ ఏదో చెప్పబోదాం అనుకునే లోపు అభయ్ " పదండి అంకుల్ వచ్చేస్తున్నాము " అన్నాడు.



రాహుల్ కోపంగా చూస్తాడు తప్ప!,మరే మాట్లాడడు . ఇక తప్పనిసరి పరిస్థితుల్లో తన ప్లాన్ ని పోస్ట్ పోన్ చేసుకుని తినటానికి వెళ్తాడు. అక్కడ వాళ్ల కోసం చాలా రకరకాల వంటలు చేసి ఉంటారు. ఎందుకంటే వాళ్ళ ఇచ్చిన డబ్బులే అందుకు కారణం.


" సూపర్ గా చేశారు ఆంటీ " అంటూ పొగుడుతూనే అభయ్ ఒక్కొక్కటి రుచి చూడడం మొదలుపెట్టాడు. రాహుల్ మాత్రం ఏం మాట్లాడకుండా తింటూ ఉన్నాడు . తర్వాత రాహుల్ తను ఒకటే కాలేజ్ అనీ, వాళ్ళు ఒకటే క్లాస్ అని తెలుసుకుంటాడు మా ఇంటి ఓనర్ .


అలా కాసేపు వాళ్ళతో మాట్లాడక రాహుల్ వద్దంటున్నా సరే తనకి కడుపునిండా పెడతారు.


ఇంటి ఓనర్ కి కొడుకులంటే చాలా ఇష్టం. కానీ తనకి పిల్లలే లేరు .అందుకే రెంట్ కి అబ్బాయిలకు మాత్రమే ఇస్తాడు .


ఇద్దరికీ కడుపునిండటంతో ' భోజనానికి చాలా థాంక్స్ అంకుల్ ' అంటూ చెప్పి నడుచుకుంటూ పైకి చేరుకున్నారు .ఇద్దరు వాళ్ళ బెడ్ పైన పడుకున్నారు. కడుపునిండా తినడం వల్ల ఏమో ? తెలీదు కానీ, కంటినిండా నిద్ర వచ్చేస్తుంది .అలా వాళ్ళు నిద్రపోతూ ఉంటారు .


నెమ్మది నెమ్మదిగా రాహుల్ వైపు ఉన్న ఆ ప్రాంతమంతా , ఇంతకుముందు ఊహించుకున్న ఆ నరకలోకంలా కనిపిస్తుంది ,చాలా భయంకరంగా! అభయ్ పడుకున్న వైపు అంతా ఒక స్వర్గంలా కనిపిస్తుంది. ఒకటే గదిలో రెండు ప్రపంచాలు ఏర్పడాయి.




చూస్తుండగానే నెమ్మదిగా తెల్లవారింది .ఆ ఇంట్లో వండుకోవడానికి చాలా ఉండడంతో అభయ్ ముందుగానే అన్ని సిద్ధం చేసి పెట్టాడు. రాహుల్ లేవగానే కిచెన్ లోకి వెళ్లి కాఫీ పోసుకొని బాల్కనీలోకి వచ్చాడు.


అభయ్ వ్యాయామం చేస్తూ కనిపించాడు.


" గుడ్ మార్నింగ్ బాస్ "


రాహుల్ మాత్రం చేతి కప్పును పైకి చూపిస్తూ, గుడ్ మార్నింగ్ అన్నట్టే సైగ చేశాడు.


అప్పుడే వాళ్ళు ఉదయించే ఆ సూర్యున్ని చూస్తూ ,అలా మేడ పైన ఉన్నారు. అప్పుడే వాకింగ్ కి వెళ్దామని బయటికి వచ్చిన ఆ ఇంటి ఓనర్ ; బయట కుప్పలు దెబ్బలుగా అమ్మాయిలు కూర్చోవడానికి చూసి ఆశ్చర్యపోయాడు.


“ ఏంటి ఉన్నట్టుండి ,మా ఇంటి ముందు వీళ్ళు ధర్నాకీ వచ్చారా ? ” అని మనసులో భయపడుతూ ఉన్నాడు.


అప్పుడే వారి చూపుల్ని బట్టి వాళ్ళు ఆ ఇంటిని కాదు ,ఆ ఇంటిలో ఉన్న ఆ ఇద్దరు అబ్బాయిలు చూస్తున్నారని అర్థమైంది. ఒక్క క్షణం నవ్వాలో? ఏడవాలో ? కూడా అర్థం కాలేదు ఆయనకి .


ఏం చేయాలో అర్థం కాక, “ రాహుల్, అభయ్ మీరు కాస్త లోపలికి వెళ్లి తలపేసుకోండి బాబు. మీకు చాలా దిష్టి తగిలేలా ఉంది " అంటూ అరిచాడు.


పాపం ఆయన పరిస్థితికి నవ్వుకుంటూ ఇద్దరు లోపలికి వెళ్లారు .బయట ఉన్న అమ్మాయిలంతా వాకింగ్ కి వచ్చారు .తీరా, అక్కడ ఆ ఇద్దరిని చూసి మైమరిచిపోయారు .అందుకే వాళ్ళవైపు చూస్తూ ఉన్నారు .


వాళ్ళని పంపించేయడంతో ఆ ఇంటి ఓనర్ పైన వాళ్ళ కోపంగా చూస్తూ ఉంటారు.


" మీరు, మీ దిష్టిబొమ్మల మోకాలు వేసుకొని నా ఇంటి ముందే కూర్చున్నారు; పోండి ” అంటూ పక్కనే ఉన్న ఒక చిన్న కర్ర తీసుకొని వాళ్ల పైకి విరుచుకుపడ్డాడు.



ఆ దెబ్బకి కాస్త భయపడిన వాళ్లు అందరూ వెనక్కి తగ్గారు .

“ ఎవరైనా అమ్మాయిలకు కాపలా ఉంటారు. నేనేంటో వీళ్లకు కాపల ? అమ్మో రేపు ఏదో ఒకటి చేసేయాలి .లేదంటే రాష్ట్రంలో ఉన్న మహిళా సంఘాల మొత్తం మా ఇంటి ముందు వచ్చి కూర్చున, ఆర్చర్యపోనక్కరలేదు. " అంటూ ఊపిరి భారంగా పీల్చుకుంటూ బయటికి నడిచాడు.


ఒకరోజు సన్నిహిత్యం కారణంగా, అన్వికి తను చేసిన సహాయం కారణంగా అభయ్తో తొందరగానే రాహుల్ కలిసి పోయాడు . రాహుల్ కూడా తన మౌనాన్ని కాస్త పక్కకు పెట్టి, అవసరమైనప్పుడు మాట్లాడటం మొదలుపెట్టాడు . ఇద్దరు కలిసి ఆరోజు వంట చేసుకుని కాలేజీకి బయలుదేరారు.


********


“ అనుకున్న ప్రకారమే ప్లాన్ మొత్తం రెడీ చేయండి. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి తన తప్పించుకోకూడదు ” అంటూ ఫోన్లో ఎవరితోనో వారీస్తూన్నాడు సోమనాథ్.


అప్పుడే కాఫీ తాగుతూ ఆయన గదికి వచ్చిన అభి, " ఏంటి డాడ్ ! ఏదో సీరియస్ ఇష్యులో ఉన్నారు ” అంటూ పలకరించాడు .


“ అదేం లేదురా, నువ్వు చేసిన పనికి నాకు చాలా గర్వంగా ఉంది . ఐ ఫౌడ్ ఆఫ్ మై సన్ ” అంటూ కౌగిలించుకొని వెళ్ళిపోయాడు .


“ అసలు నేనేం చేశాను?.ఈయన ఏం మాట్లాడుతున్నాడు ? ”అంటూ అర్థం కాక అయోమయంగా సోఫాలో అలాగే కూర్చున్నాడు అభిషేక్.


——— ***** ———