Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

జతగా నాతో నిన్నే - 22









లేత సూర్యకిరణాలు పగిలిపోయిన టెర్రస్ ఖాళీ ప్రదేశం నుండి వాళ్ళ పైన పడ్డాయి . దాంతో మేల్కొన్న అన్వి, రాహుల్ ఒడిలో ఉండటాన్ని చూసి ఆశ్చర్యపోయింది .



నెమ్మది నెమ్మదిగా తనకి రాత్రి జరిగిన విషయాలన్నీ కళ్ళ ముందు కదిలాయి. దాంతో బాధగా ముఖం పెట్టి , తన బ్యాక్ తీసుకుని ఏడుస్తూనే పక్కకు నడిచింది .


తను లేచిన చప్పుడికి మేలుకున్న రాహుల్ ,ఏం మాట్లాడకుండా తననే చూస్తూ ఉన్నాడు.


కొద్దిసేపటికి “ అన్వి........” అంటూ చిన్నగా పలకరించాడు రాహుల్.



“ రాహుల్ చాలా థాంక్స్!. ఇన్ని రోజులుగా నాలో ఉన్న బాధని ఎవరికి చెప్పుకోవాలి అర్థం కాలేదు. ఇప్పుడు నీవల్ల అది కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది. బహుశా నా బాధ కారణంగానే అనుకుంటా ,ఇంకా నా కళ్ళముందే అమ్మానాన్నలు ఉన్నారు అనుకుంటున్నాను. నువ్వు ఇచ్చిన ఓదార్పుతో ఇకనైనా ఈ నిజాన్ని గ్రహిస్తాను ” అంటూ కంటి పైన ఉన్న కన్నీటి చుక్కని కిందపడనివ్వకుండా ఆ ఇంటి నుండి బయటకు వెళ్ళిపోయింది .



నేనేమైనా తప్పు చేశానా అని ఆలోచిస్తూ అక్కడే ఉండిపోయాడు రాహుల్. కొద్దిసేపు అక్కడే గడిపిన తర్వాత బయటికి నడిచాడు .



అప్పుడే ఇంటి పక్కన ఉన్న ఒక అతను తోట పని చేసుకుంటూ కనిపించాడు .


ఈయనని అడిగితే ఏదైనా విషయం తెలియవచ్చు అంటూ అప్పుడే అక్కడికి కొత్తగా వచ్చినట్టు నటిస్తూ “ హలో అంకుల్ ......”అంటూ పలకరించాడు .


ఆయన చేతికి అంటుకున్న మట్టిని దులుపుకుంటూ ఎవరు అన్నట్టు తల పైకెత్తి చూశాడు. ఆ చూపులకి అసలు విషయం చెప్పమన్నట్టు అర్థమైనా రాహుల్ కి.....



“ అంకుల్ ! ఈ ఇంటి గురించి మీకు ఏమైనా తెలుసా? ఇందులో ఉండే వాళ్ళకి ఏమైంది ” అంటూ ప్రశ్నించాడు .


“ ఆ ఇషయాలన్నీ నీకెందుకు చెప్పాలిబ్బా ? యాడ నుంచి వచ్చినావు? ”.

ఆయన మాటలకి కాస్త ఆశ్చర్యపోయిన వెంటనే తేర్కొని , “ ఈ ఇంట్లో మా ఫ్రెండ్ ఉండేది .తన పేరు అన్వి . నేను ఇప్పుడే వచ్చాను . తీరా ఇల్లేమో ఇలా ఉంది .అందుకే విషయం కనుక్కుందామని ....” అంటూ సగం సగం చెప్పాడు రాహుల్.



“ ఓ అట్నా ! ఈ ఇల్లు పాడుబడి ఐదేళ్ళు అయితాంది . కుటుంబంతో కలిసి ఇంట్లో ఏదో ఫంక్సన్ పెట్టుకున్నారంటా, అదేదో షార్ట్ సర్క్యూట్ అది ఇల్లు మొత్తం తగలేడినది . అందులో ఉన్న వాళ్లు కూడా ఖాళీ బూడిదైనారు ” అంటూ చెప్పడం ఇష్టం లేకపోయినా ఏదో చెప్పాడు.



ఆ వ్యక్తి పూర్తిగా చెప్పేది నిజమైతే మరి అన్వి ఎలా ఇంటికి వస్తుంది ? అన్వి మాత్రమే తప్పించుకుందా? ఆ తర్వాత ఏం జరుగుతుంది? అంటూ కళ్ళు మూసుకున్నాడు. వెంటనే అతని పక్కగా ఒక ఆత్మ వచ్చి నిలబడింది .



“ అన్వి, అమ్మానాన్న చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళింది ? ఆ విషయాన్ని కనుకో ....” అంటూ దానిని ఆదేశించి ముందుకు నడిచాడు రాహుల్ .



పాపం పక్కన ఆ పని చేసుకుని అతను మరిచిపోయాడు అనుకుంటా! కళ్ళముందు ఆత్మను చూడగానే అతడు అక్కడే పడిపోయాడు .



#####



ఆరోజు ఏమీ జరగనట్టుగానే కాలేజీకి వచ్చింది అన్వి. అంతే సంతోషంగా వాళ్ళ స్నేహితులతో మాట్లాడుతూ ఉంది.


అభయ్ కూడా అప్పుడే ఆయాసపడుతూ అక్కడికి వచ్చాడు . అతన్ని చూసిన రాహుల్ చిన్నగా వాళ్ళ పక్కగా చేరాడు.


“ అన్వి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. మనం మన ప్రాజెక్టు చేయొచ్చు తెలుసా? ” అన్నాడు రొప్పుతూ అభయ్.


“ అవునా ఎలా అభయ్? ” అంది ఆశ్చర్యంగా.


“ మనం ఒక గదిని రెంటుకు తీసుకుందాం. దాంట్లో
ఫైటింగ్ విత్ యువర్ మెమోరీస్ అనే ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేద్దాం. దాంట్లో మనమేం చేయాలి అంటే చిన్న చిన్న కారణాలకి గొడవలు పెట్టుకుని డిప్రెషన్ లోకి వెళ్లిపోతూ.....ఏం చేయాలో తెలియక చాలామంది చనిపోతున్నారు . ఇంకొంతమంది వాళ్ళ మధ్యలో ఉన్న చిన్న చిన్న గొడవల్ని పెద్దవి చేసుకుంటూ కుటుంబాల నుంచి విడిపోతున్నారు. దాన్ని మన ఆర్గనైజేషన్ ద్వారా అరికట్టవచ్చు ” అంటూ ఏదో చెప్పబోయాడు అభయ్!.


“ ఇదేదో బతుకు జట్కా బండిలాగా ఉంది ” అంటూ మొఖం తేలేసి చెప్పింది సంజన .


“ నువ్వు ఆగవే ! తన్ను చెప్పనివ్వూ? ” అంటూ కసిరి, చెప్పమన్నట్టు సైగా చేసింది .


“ విషయం ఏంటి అంటే మనుషుల మధ్య గొడవలు నివారించడానికి సైంటిఫిక్ గా చాలా పద్ధతులున్నాయి . మామూలుగా వాటిని సైకాలజిస్ట్లు వాడుతూ ఉంటారు. మనం వాటిని ఉపయోగిస్తూ వాళ్లకి ఆ గొడవ జీవితాంతం గుర్తుండి, మళ్ళీ ఇకపై అలా గొడవ పడకుండా ఉండటం కోసం మనం ఒక మొక్కను ఇద్దాం. అప్పుడు ఆ ప్రకృతి హ్యపీస్..... వాళ్లు హ్యపీస్.......మనము హ్యాపీస్ ” అంటూ అసలు విషయాన్ని చెప్పాడు .


“ ఇవన్నీ అయ్యే పనులు కాదు . అయినా మనల్ని నమ్ముకొని ఎవరో వస్తారు. చూడ్డానికి మనమే చిన్నపిల్లల్లా ఉన్నాం కదా ?” అంది డిటెక్టివ్ గీత.



“ మనం ఒకసారి ప్రయత్నిద్దాం ,పోయేదేముంది.”


అతని బాధ చూడలేకపోయినా అన్వి ,“ సరే అభయ్ ! నువ్వు చెప్పిందాన్ని ఎవరి పైన అయినా ప్రయత్నిద్దాం . అందులో మనం సక్సెస్ అయితే దీన్ని అఫీషియల్ గా స్టార్ట్ చేద్దాం. ఒకవేళ అది కాకపోతే ఇక ఈ ఆలోచన వద్దు ” అంటూ తేల్చేసింది .


“ సరే........” అంటూ సంతోషంగా ఫీల్ అయిపోయాడు అభయ్.



ఆరోజు సాయంత్రం వాళ్ళ అయిదుగురు కలిసి నడుచుకుంటూ వస్తున్నప్పుడు , ఆ వీధిలో ఒక ఇంట్లో భార్య భర్తలు గొడవ పడుతున్నారు . గొడవను చూడటానికి వచ్చిన చాలామంది ....


“ ఏందిరా! మనకి రోజు ఈ గోల. ఎప్పుడు చూడు గొడవ పడుతూనే ఉంటారు . అర్జెంటుగా కాలనీ ప్రెసిడెంట్ తో మాట్లాడి, పంపించేయాలి. వీళ్ళ వలన మనశాంతి మొత్తం కరువైతుంది ” అంటూ గోనుక్కుంటున్నారు .



“ నాకెందుకో ఇదే కరెక్ట్ టైం అనిపిస్తుంది . మనం వీళ్ళపైనే ట్రై చేస్తే ఎలా ఉంటుంది అంటారు” అన్నాడు అభయ్.


“ నీకేమైనా పిచ్చా? వాళ్లీ చూసావా ? కోపంగా గొడవ పడుతున్నారు . మధ్యలో మనం పోతే మనకి గట్టి కోటింగ్ ఇస్తారు ” అంటూ తిట్టింది సంజన.


అన్వి నువ్వు చెప్పు అన్నట్టుగా కళ్ళతోనే తన వైపు చూశాడు .



“ సరే అభయ్ చేద్దాం ” అంటూ వాళ్ళ మధ్యగా వెళ్ళింది అన్వి.


తను అలా వెళ్లడంతో రాహుల్ కి అబ్బాయి పైన కోపం వస్తుంది . దాన్ని కంట్రోల్ చేసుకుంటూ తను కూడా వెళ్లి వాళ్ళిద్దరిని విడదీస్తాడు.


“ రేయ్ ఎవడ్రా మీరు ? నా పెళ్ళాన్ని నేను కొట్టుకుంటే మీకేమైంది . నువ్వేంటి రా మా ఇంట్లోకి వెళ్తున్నావు ” అంటూ కోపంగా అభయ్ వైపు వచ్చాడు ఆ వ్యక్తి .



రాహుల్ వచ్చి చెంపపై గట్టిగా ఒకటి పీకాడు. ఆ దెబ్బకి ఆ వ్యక్తి చెంప పట్టుకొని నిశ్శబ్దం అయిపోయాడు . వాళ్ళ ఇంట్లోకి వాళ్ళిద్దర్నీ తీసుకుపోవడంతో, జనాలంతా ఆశ్చర్యంగా వీళ్ళనే చూస్తూ ఉన్నారు .


వాళ్ళిద్దరిని ఒక టేబుల్ దగ్గర కూర్చోబెట్టి అభయ్ బ్యాగు నుండి ఒక మొక్కను బయటకు తీశాడు. అదే పవిత్ర వృక్షం! . దాన్ని చూడగానే రాహుల్ కి తలనొప్పి స్టార్ట్ అయింది .దాంతో తల పట్టుకొని బాధగా బయటికి నడిచాడు. అక్కడే ఉంటే తనని అందరూ గుర్తుపడతాడు అన్న భయంతో !



“ అసలు మీ ప్రాబ్లం ఏంటి ? రోజు గొడవ పడుతున్నారు అంటా! అసలు ఏమైంది? ” అంటూ గట్టిగా నిలదీశాడు అభయ్.



అప్పుడే ఆ పవిత్రం వృక్షం పనిచేయడం మొదలు పెట్టింది. దానికి ఒక గొప్ప శక్తి ఉంది . అది ఎవరి మనసునైనా ప్రశాంతంగా మార్చేస్తుంది . వాళ్ల మనుసుతో మంచివైపు ప్రయాణించేలా చేస్తుంది. కాబట్టే ధైర్యంగా అభయ్, ఈ ప్లాన్ ని వాళ్ళ ముందు పెట్టాడు .



“ ఇది నా డబ్బులు మొత్తం సరదాలకి ఖర్చు చేస్తుంది. డబ్బులు ఏవి అని నేను అడిగితే, ఏమి ఉలకదు పలకదు . అందుకే కొడుతున్నాను...తప్ప? ” అన్నాడు కోపంగా.


“ అమ్మ మీరు చెప్పండి. అతను చెప్పేది నిజమేనా? ” అన్నాడు చాలా ప్రశాంతంగా అభయ్.



“ నేను డబ్బులు ఖర్చు పెట్టిన మాట నిజమే, కానీ అవి నా సరదలకి కాదు . ఇంటి రెంటు, కరెంట్ బిల్లు ఇలా చాలా ఉన్నాయి . అతనేమో తీసుకొచ్చే సంపాదన చాలా తక్కువ. దాంతో కుటుంబాన్ని గడపడమే చాలా కష్టం . అందుకే ఆ డబ్బులు పొదుపుగా వాడితూ మా ఖర్చులకి ఉపయోగిస్తున్నాను. కానీ ఆయనేమో ఉన్న ఫలంగా డబ్బులు అడిగాడు. ఆయనకి చెప్పిన అర్థం చేసుకోరు అని అర్థమయ్యే అలా మౌనంగా ఉండిపోయాను .



నేను ఏదైనా మాట్లాడితే చాలు ఇలా తాగేసి వచ్చి నన్ను కొడుతూ ఉంటాడు . నాకు ఇదంతా అలవాటైపోవడంతో, ఇక దెబ్బలు తినడం తప్పితే వేరే మార్గం లేదా అనిపించింది ” అంటూ చెప్పింది.



“ ఇప్పుడు చెప్పు! నీ సంపాదన ఎంత? నీ ఖర్చులు ఎంత ?” అని సూటిగా ప్రశ్నించాడు అభయ్.



ఆ మాటలకి ఏం చెప్పాలో అర్థం కాక ఆ వ్యక్తి కాస్త ఆలోచనలో పడ్డాడు . మొక్క ప్రభావం వల్ల అతడు అంత ప్రశాంతంగా ఆలోచించగలుగుతున్నాడు . లేకపోతే నానా రభస చేసేవాడు.



చివరికి అసలు విషయాన్నీ గ్రహించిన ఆయన, క్షమించమని తన భార్యని అడిగాడు . ఇకపై ఇలాంటి తప్పు చేయనని ఆమె కూడా భరోసా ఇచ్చాడు.



“ చూశారా మాట్లాడితే తెల్చుకొనే, ఇలాంటి చిన్న చిన్న విషయాలకి ; మీ పరువు అంతా రోడ్డుపై పెట్టారు .అవసరమా? ఇది ఎవరికి ఉపయోగం ? ఇకనైనా మంచిగా ఉండండి ” అంటూ చెప్తూ సంజన, గీత వైపు చూశాడు.



వాళ్ళిద్దరూ నమ్మలేనట్టుగా నోరు తెరిచారు. కేవలం రెండు నిమిషాలు ముందర ,అంత కోపంగా గొడవపడే వ్యక్తి ; ఇప్పుడేమో ఇంత ప్రశాంతంగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవడం అనేది ఆలోచించాల్సిన విషయమే కదా!



అన్వి మాత్రం చిన్నగా నవ్వుతూ ఆ ఇంటి పెరట్లో ఉన్న ఒక చిన్న మొక్కను తీసుకొని ,“ తప్పుగా అనుకోకండి . మీ గొడవకి గుర్తుగా ఈ మొక్కని మీరే ఇద్దరు కలిసి నాటండి . ఆ మొక్కను చూసిన ప్రతిసారి మీకు ఇంకోసారి ఇలాంటి గొడవ పెట్టుకోకూడదు అనిపిస్తుంది .” అంటూ చెప్పింది.



తర్వాత వాళ్లు అక్కడి నుండి బయటకు వచ్చారు. బయట తల పట్టుకుని ఉన్న రాహుల్ ని చూసి ......


“ ఏమైంది రాహుల్ ! ఎందుకలా మధ్యలోనే వచ్చేసావు? ” అంటూ అడిగాడు అభయ్.


“ లేదు కొంచెం తలనొప్పిగా అనిపిస్తే బయటకు వచ్చేసాను . ఏమైంది అంతా ఓకే కదా ?”


“ నేను చెప్పా కదా ! ఇది కచ్చితంగా సక్సెస్ అవుతుంది అనీ” అంటూ నవ్వాడు.


“ అలా అయితే మన ప్రాజెక్టుకి ఒక మంచి ఐడియా దొరికింది అన్నమాట. ఇప్పుడు ఉన్నఫలంగా మనం ఒక గదిని వెతకాలి ” అంది ఆలోచిస్తూ గీత .


“ నాకు తెలిసిన ఒక ప్లేస్ ఉంది . అది ఇప్పుడు పూర్తిగా పాడుబడిపోయింది . దాన్ని మేడ్ ఇన్ హెవెన్లా మారిస్తే , ఎలా ఉంటుందంటారు ” అన్నాడు పోయెట్రీగా రాహుల్ .


తను మాట్లాడేది తన ఇంటి గురించే అనీ అన్వికి అర్థం అయిపోయింది.


——— ***** ———