Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

జతగా నాతో నిన్నే - 23








రాహుల్ ఆ ఇంటి ప్రస్తావని తీసుకొని రాగానే “ ఏంటి నిజమా ....? ” అంటూ అందరూ ఒక్కసారిగా అన్నారు.


అవును నిజమే అంటూ తల ఊపుతూ. ...
అన్వి వైపు చూశాడు. తను ఏం మాట్లాడకుండా మౌనంగా తన రూమ్ వైపుకి నడిచింది . అలా ఎందుకు ప్రవర్తిస్తుందో.......అర్థం కాక గీత , సంజన ఇద్దరు అలాగే చూస్తూ ఉండిపోయారు .



“ సరే అయితే రేపు ఆ స్థలాన్ని చూద్దాం. ఇంకా రేపే మన ఆర్గనైజేషన్ ని అందంగా రెడీ చేద్దాం ” అన్నాడు నవ్వుతూ.


దానికి అందరూ ఒప్పుకున్నారు . ఆ తర్వాత అక్కనుండి అభయ్ నేరుగా సెయింట్ చర్చ్ కి వెళ్ళాడు .


“ నేను వచ్చేసాను.....” గట్టిగా అంటూ డోర్ తీసుకొని చెప్పాడు.


“ ఏంటి ఈ రోజు చాలా అంటే చాలా సంతోషంగా కనిపిస్తున్నావు? ” అంటూ అప్పుడే ప్రార్థన పూర్తి చేసుకున్న పోప్ పలకరించాడు.


“ అవును! ఈ మొక్కల్ని సంరక్షించడానికి , నా టాస్క్ పూర్తి చేయడానికి నాకు ఒక మార్గం దొరికింది” అన్నాడు కళ్ళ ఎగరేస్తూ.


“ మంచి విషయమే ! కానీ ఈ మొక్కల్ని ఈ చర్చ్ ఆవరణలోనే నాటేస్తే, నేను కూడా సంరక్షిస్తాను కదా? ” అంటూ ఏదో ఉచిత సలహా ఇచ్చాడు.



“ అవును కదా? నాకు ఈ ఐడియా అసలు రానే రాలేదు . పోనీలే ఇప్పటికైనా చెప్పారు కదా! కొన్ని మొక్కలు ఇక్కడే నాటేస్తాను . నేను ఒక్కడినే సంరక్షించలేను కదా ” అన్నాడు కుర్చీలో కూర్చుంటూ.


“ అబ్బా ! అనవసరంగా నోరిజారానా ? ”


“ ఈ మొక్కల్ని మనుషులకి ఇవ్వడానికి నాకేం అభ్యంతరము లేదు . కానీ ఈ మొక్కల చుట్టూ చాలా దుష్టాత్మలు తిరుగుతూ ఉంటాయి . వాటి వల్ల వీళ్ళకి ఏమైనా ప్రమాదం ఏర్పడవచ్చు. నావల్ల ఒక్కరు గాయపడిన ......ఆ పాపం నా ఖాతకే చేరుతుంది. అందుకే వాటిని నేనే రక్షించాలని నిర్ణయించుకున్నాను. ఈ భూమి పైన చాలా ఏంజెల్స్ తిరుగుతున్నారని తెలుసు. కానీ వాళ్ళు ఎలా ఉంటారు అన్న విషయం నాకు తెలియదు కదా ? ఆ మొక్కల్ని వాళ్ళకి ఇచ్చి, సంరక్షించమని చెప్పడానికి కూడా.......” అంటూ ఆలోచిస్తూ అన్నాడు అభయ్.


“ తను చెప్పింది కూడా నిజమే కదా ! ఎందుకు హూరికే అనవసరమైన రిస్కులు ” అంటూ పోప్ కూడా ఆ ప్రభువు వైపు చూస్తూ కూర్చున్నాడు.



అలా ఇద్దరు కొద్దిసేపు మాట్లాడుకున్న తర్వాత అభయ్ వాళ్ళ ప్లాన్ గురించి , ఆ మొక్కల్ని మరో రెండు రోజుల్లో తీసుకొని వెళ్తానన్న విషయాన్ని కూడా చెప్పేసి అక్కడి నుండి బయలుదేరి పోయాడు.


######



ఈ రోజు ఎప్పుడు సూర్యుడు ఉదయిస్తాడా అని అందరూ ఆత్రుత ఎదురుచూశారు . రాత్రంతా బాగా ఆలోచించినా అన్వి.....వాళ్ళ అమ్మానాన్న ఉన్న ఇల్లు ఇప్పుడు ఒక మంచి పనికి ఉపయోగపడుతుందంటే, నేను ఎందుకు అలా ఫీల్ అవుతున్నాను ? అని ఆలోచనలో పడింది .


తర్వాత ఏదైతే అది అయిందని దానికి ఒప్పుకుంటూ , తన మనసుకి సర్ది చెప్పుకుంది .


రాహుల్ వాళ్ళని ఆ ఇంటి వైపుకి తీసుకొని వెళ్ళాడు . అది చూడ్డానికి ఒక పాతబడిన బంగ్లాలా కనిపిస్తుంది . దాన్ని చూడగానే అందరూ ఒక్కసారిగా వణికిపోయారు ....రాహుల్ , అన్వి తప్ప!


” ఇదే మనం మార్చాల్సిన అసలైన ప్లేస్ ” అంటూ దానిని పరిచయం చేశాడు రాహుల్.


అందరు భయంగానే దాని వైపు చూస్తూ , “ దీంట్లో చాలా చేంజ్ చేయాలన్నమాట” అన్నారు.


“ ఇంకెందుకు ఆలస్యం? చేసిస్తే పోయో.....” అంటూ పక్కనే తోటలో ఉన్న కొన్ని వస్తువులని తీసుకోవడానికి అటుగా వెళ్ళాడు.


రాహుల్ చూసిన వ్యక్తికి నోటి నుండి మాట రాలేదు . మళ్లీ ఆ దయ్యం మనిషి ఎందుకు ఇక్కడికి వస్తున్నాడు? అని చెమటలతో వణికిపోసాగాడు. తను ఏది అడిగితే అది ఇచ్చేయాలని బలంగా నిర్ణయించుకొని అన్నిటికీ ఎస్ అన్నట్టుగా తలుపాడు.


వాళ్లు ఆ ఇంట్లోకి వెళ్లి , ఒక ప్లేస్ ని నీట్ గా శుభ్రం చేశారు . వాళ్ళకి కావాల్సినవన్నీ అక్కడ పెట్టేసి అదేదో పెద్ద ప్లానింగ్ లాగా ఒక బుక్ లో రాయడం మొదలుపెట్టారు.

ముందు ఇంటికి పెయింటింగ్ వేయాలి .ఆ తర్వాత బయట ఉన్న ఓపెన్ గ్రౌండ్ ని చెట్లతో నింపేయాలి .ఆ తర్వాత ఇంటీరియర్ డిజైనింగ్ చేయించాలి అంటూ అందరూ మాట్లాడుకుంటూ ఒక్కొక్క ఐడియా చెప్తూ ఉన్నారు .


ఇంతలో ఆ ఇంటి మ్యాప్ ని చూస్తున్న అభయ్ ఏదో గుర్తొచ్చినట్టుగా ;

“ అందులో ఐదు చిన్న చిన్న రూములని సిద్ధం చేద్దాం. అందులో ఒకటి మామూలుగా మాట్లాడుకోవడానికి , ఇక రెండవది ఏదైనా ఆకలిస్తే వండుకోవడానికి” అంటూ వాళ్లకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ కడుపులో గుడు గుడమంటూ ఉంటే వాళ్ళ వైపు చూశాడు .



వాళ్లకు కూడా ఆకలేస్తుండటంతో నిశ్శబ్దంగా ఉండిపోయారు. మనకు ఆకలేస్తే వండుకోవడానికి ఒకటి ఉండాలి అని మనసులో అనుకున్నారు . ఇక మూడు రూంలు .....మన కస్టమర్ల కోసం ! ఈ ఒక్కొక్క గది మధ్యలో ఒక్కొక్క టేబుల్ ని పెట్టేసి దానిపైన ఈ మొక్కలని నాటుదాం . దాని వేర్లు నేరుగా ఆ టేబుల్ లో నుంచి నేలని తాకేలాగా ఒక కొత్త టేబుల్ ని తయారు చేద్దాం .



ఇక ఆ ఇల్లు ఒక డబ్బా ఆకారంలో కాకుండా ఒక రౌండ్ షేప్ లో ఉంటే బాగుంటుంది. చుట్టూ లైట్లు పెట్టేద్దాం . బయట రెండు పెద్ద చెట్లు నాటేద్దాం అంటూ మళ్ళీ తన బ్యాక్ లో నుండి ఆ మొక్కను తీయడానికి వెళ్ళాడు అభయ్.


మళ్లీ రాహుల్ కి ఆ మొక్క గుర్తుకురాగానే తలనొప్పి గుర్తుకొచ్చింది .

” అభయ్! ఇప్పుడే ఎందుకు లే? మొక్క వద్దు సరేనా.....అయితే మీరందరూ ప్రజల్ని హ్యాండిల్ చేసే పని తీసుకోండి . నేను వాళ్ల దగ్గర రిజిస్ట్రేషన్ చేయించుకుంటాను. తర్వాత ఆ చిన్న గార్డెన్ లో మొక్కలని వాళ్లకి అందిస్తాను ” అంటూ తన ఏం చేయాలనుకుంటున్నాడో చెప్పేశాడు .



“ ఆ ఐడియా బాగుంది . ......అయితే నేను వాళ్లతో ఎలా మాట్లాడాలి .వాళ్ళని ఎలా కన్విన్స్ చేయాలో ఆ బాధ్యత నేను తీసుకుంటాను ”” అన్నాడు అభయ్.


ఓ మీరిద్దరు ఆ పనిని తీసుకుంటారా? అయితే నేనేం చేయాలి అబ్బా ? అంటూ బుగ్గపై వేలు పెట్టుకొని ఆలోచిస్తూ ఉన్నది సంజన .ఇంకా ఏది నిర్ణయించుకోలేకపోయింది .


ఇంతలో గీత టక్కును గుర్తొచ్చిన దానిలాగా ” అయితే నేను వాళ్ల గొడవలో ఎంతవరకు నిజం ఉంది, వాళ్ళు నిజం చెప్తున్నారా......అబద్ధం చెబుతున్నారు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను. ఐం డిటెక్టివ్ ”” అంది చేతులు దగ్గరికి తెస్తూ .


అంతసేపు ఆలోచిస్తున్నా సంజనానికి ఏదో టక్కున గుర్తు వచ్చి “ అయితే నేను మన ఆర్గనైజేషన్ ని పబ్లిసిటీ చేస్తే ఎలా ఉంటుంది ?. ఒక ఛానల్ క్రియేట్ చేసి, దాంట్లో యాంకర్ గా నేనే వాళ్ళ కేసెస్ ఎలా సాల్వ్ అయ్యాయి అన్నది యూట్యూబ్లో పెట్టేస్తాను. అప్పుడు దాన్ని చూస్తున్న చాలామంది వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా ?” అంది సంతోష పడిపోతూ.


దానికి అందరూ నిజమే కదా అని ఒప్పుకున్నారు . ఒకరేమో వాళ్ళ ఆర్గనైజేషన్ ని పబ్లిసిటీ చేస్తున్నారు . ఒకరేమో అందులో ఎంత నిజమో కనుక్కుంటున్నారు .


ఇంకొకరేమో గార్డెన్ ఎలా ఉండాలో చూసుకుంటామంటున్నారు. ఇంకొకరేమో ఆ ప్రాబ్లం ని ఎలా సాల్వ్ చేయాలో ఆ బాధ్యత తాను తీసుకుంటాను అంటున్నారు. ఇక నాకు చేయడానికి ఏముంది అంటూ నిట్టూర్పు వీడుస్తూ అంది అన్వి.


“ నువ్వు మా లీడర్ .....” అన్నారు అందరూ ఒకటేసారి!.


అర్థం కానట్టుగా వాళ్ళ వైపు చూస్తూ ఉంది .

“ అంటే మేము అలసిపోతే, ఏదైనా కుక్ చేసి పెట్టొచ్చు కదా? ” అంటూ చిన్నగా భుజంపై కొకుతూ సంజన.


“ నేను మీకు అందరికీ పనిమనిషి నా ?యు......” అంటూ కోపంగా కొట్టడానికి వచ్చింది అన్వి. కాసేపు నవ్వులతో గదంతా ఆనందంతో నిండిపోయింది.


అనుకున్నది తడువుగా రోజుకు ఒక పనిలాగా మూడు రోజుల్లో వాళ్ళు చేయాలనుకున్న అందమైన ఆర్గనైజేషన్ రెడీ చేశారు . ఆ ఆర్గనైజేషన్ తెరిచేది రాత్రి మాత్రమే !


ఎందుకంటే అప్పుడే వీళ్లకు కాలేజ్ అయిపోతుంది. గేట్ దగ్గర ” ఫైటింగ్ విత్ యువర్ మెమోరిస్ ” అనే నేమ్ ప్లేట్ పెట్టి,దాన్ని ఎలక్ట్రిక్ బల్బ్ లతో అలంకరించారు. ఆ ప్లేస్ లోకి వెళ్లడానికి ఒక కార్పెట్, దానిపై ఒక అందమైన విద్యుత్ దీపాలు ఉన్నాయి. గదిలోకి వెళ్లగానే ఒక ఆఫీసు......ఒక కిచెన్ ఎడమవైపు కనిపిస్తాయి.


మరోవైపు రౌండ్ గా ఉండే మూడు చిన్న చిన్న గదులు కనిపిస్తూ ఉన్నాయి. వాటి లోపల టేబుల్ పైన పవిత్రవృక్షం .

వృక్షానికి చుట్టూరా చిన్నచిన్న లైట్లు ఉన్నాయి. ఎవరైనా వాటిని మొదటిసారి చూస్తే, ఆ చెట్టుకి మెరిసే పండ్లు కాశాయిమో అనుకుంటారు . గదిలో ఒక్కొక్క రంగుతో పూర్తిగా అందంగా ముస్తాబయింది .


ప్రజలను ఆ గదిలోకి తీసుకొని వెళ్ళటానికి ముందు వాళ్లతో కొద్దిసేపు మాట్లాడి, వాళ్ళ ప్రాబ్లం తీవ్రతను బట్టి వాళ్ళని ఆ మూడు గదుల్లో ఎందులోకి తీసుకొని వెళ్లాలో నిర్ణయించుకుంటాడు అభయ్. దాన్నిబట్టి ఆ వ్యక్తులపైన ఎంత కఠినంగా మాట్లాడాలి అన్నది నిర్ణయించబడుతుంది .


ఆ గదిలో ఉన్న వృక్షాల పైన తన శక్తిని ఉపయోగించి , రక్షణ వలయాన్ని సిద్ధం చేశాడు. అందుకే రాహుల్ ఎప్పుడు ఆ గదిలోకి వెళ్లాలనుకున్న తన వల్ల అయ్యేది కాదు . అందుకే తనకెప్పుడూ బయట చెట్లను పెంచుతూ కూరగాయలన్ని నాటుతూ ఉండేవాడు . అవి తీగలు తీగలుగా పెరిగి అందంగా కొన్ని రోజులకే ముస్తాబయ్యాయి.


అప్పుడప్పుడు అన్వి టీకప్ తీసుకొని అక్కడికి వచ్చి, రాహుల్ తో మాట్లాడేది. తన కారణంగానే ఇండ్లు ఇలా కళకళడుతుంది. దాంతో రాహుల్ అంటే ఆరాధన భావం ఏర్పడిపోయింది. టీ తాగడం కోసం అనే ఒక నెపంతో రాహుల్ ని ఇష్టంగా చూసేది అన్వి.


ఆ ఆర్గనైజేషన్ పెట్టిన ఒక నెల రోజుల తర్వాత ఆ కాలేజీలో ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది. వీళ్ళు సొంతంగా ఒక కంపెనీని స్టార్ట్ చేశారు అనీ! తర్వాత అసలు అందులో ఏముందో తెలుసుకుందామని అందరూ వాళ్లకు గురించి వెతకడం మొదలుపెట్టారు.


అప్పుడే వాళ్ళకి ఆ ప్లేస్ గురించి వివరిస్తున్న సంజన యూట్యూబ్ వీడియో దొరికింది .అందులో ఒక కేస్ ని వాళ్ళు హ్యాండిల్ చేసే విధానం ......వాళ్ళని కలిపే విధానం అంత చూసి వాళ్ళందరూ ఇంప్రెస్ అవుతారు.


దానికితోడు వీడియోలో అభయ్, రాహుల్ కనిపించడంతో అందరూ పిచ్చి పట్టిన వారిలాగా లైక్స్ , షేర్ చేయండి చేసేవాళ్ళు . వీడియో చూసిన వాళ్లలో అమ్మాయిలు ఎక్కువగా ఉండటం మరో విశేషం.


వాళ్లకున్న కాంటాక్ట్లను బట్టి అందరికీ వీడియోని షేర్ చేస్తారు. దాంతో కొన్ని రోజుల్లోనే వాళ్ళు వైరల్ అయిపోతారు.



ఆ విషయం కాలేజీ అంతట పాకుతుంది . ఇదిలా ఒక పక్కన జరుగుతూ ఉంటే , మరో పక్కన ఎగ్జామ్స్ వస్తాయి. ఆ ఎగ్జామ్స్ అయిపోయి రిజల్ట్స్ కూడా వచ్చేస్తాయి. అందులో అభయ్ బాబు ఫేల్ అవుతాడు.


దాంతో చాలా బాధపడుతూ , డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాడు. మరీ ఏంజెల్స్ కూడా ఫీలింగ్స్ ఉంటాయండీ !


——— ***** ———