Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

జతగా నాతో నిన్నే - 30














బయటికి వచ్చిన రాహుల్ కి ఎవరిని అడగాలో తెలియదు . ఏం చేయాలో తెలియదు . అసలు తను ఇంకా బ్రతికే ఉందన్న విషయం కూడా తెలియదు.

అలాగే రోడ్డుపైన ఒంటరిగా నడుచుకుంటూ వెళుతున్నాడు. అప్పుడే తన జోబులో ఉండే ఫోన్ రింగ్ అవ్వటం మొదలైంది . మొదట దాన్ని పట్టించుకోకుండా అన్వి కోసం వెతకడం మొదలుపెట్టాడు .



మళ్ళీ రెండోసారి రింగ్ అవ్వడంతో, అవతల వారికి ఏదైనా అవసరమేమో అన్న ఉద్దేశములో ఫోన్ తీసి “ హలో ..........” అన్నాడు.


అవతల నుంచి చాలా కంగారుగా మాట్లాడుతున్నాడు అభిషేక్ .


“ రాహుల్ నేను అభిషేక్ నీ! నీకు అర్జెంట్గా ఒక విషయం చెప్పాలి. అన్విని మా నాన్నగారికి కిడ్నాప్ చేశారు . తనని చంపాలని కూడా ప్లాన్ చేశారు.

నాకు అన్వికి, నీకు మధ్య గొడవ ఉందని తెలుసు. కానీ ఒక అమ్మాయిని చంపేంత మూర్ఖునైతే కాదు . మా నాన్నకి చెప్తామంటే నాకు అంత ధైర్యం సరిపోటం లేదు . అందుకే ఏం చేయాలో అర్థం కాక నీకు ఫోన్ చేసి విషయం చెప్తున్నాను .వీలైనంత తొందరగా విరూపాక్షి టవర్స్ దగ్గరికి వచ్చేయి ” అంటూ తొందర తొందరగా మాట్లాడేసి ఫోన్ పెట్టేసాడు.



అన్వి కోసం చిన్న ఆధారం వెతుకుతూ ఉంటే తనే దొరికినట్టు అనిపించింది రాహుల్ కి !


అందుకే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా అటువైపుగా అడుగులు వేశాడు. కొన్ని క్షణాల్లోనే అతను విరూపాక్షి టవర్స్ దగ్గరకొచ్చాడు.


తనకి ఎదురుగా అభయ్ కూడా అక్కడికి రావడాని చూసిన రాహుల్ కాస్త ఆశ్చర్యపోయాడు.

“ అభయ్ ........” అంటూ పిలిచాడు .

“ రాహుల్ ఎక్కడికి వెళ్లి పోయావు? నీ వైపు ఏమైనా అన్వి ఆచూకీ దొరికిందా ?” అన్నాడు దగ్గరికి వస్తూనే అలసిన స్వరంతో.


“ లేదు అభయ్! ఇందాకే నాకు అభిషేక్ ఫోన్ చేశాడు. వాళ్ళ నాన్ననే కిడ్నాప్ చేశాడంట .తనని ఈరోజు చంపాలని ప్లాన్ కూడా చేశాడు . విరూపాక్షి టవర్స్ దగ్గరికి రమ్మని చెప్పాడు ” అంటూ ఒక్కొక్క విషయాన్ని చెప్పాడు పూసకిచ్చినట్టుగా.


“ నేను అనుకున్నదే నిజమైంది . అభిషేక్ వాళ్ళ నాన్న మరెవరో కాదు , అన్వి నాన్నగారు స్థాపించిన కంపెనీలో పనిచేసే ఒక ఎంప్లాయ్ . ఇప్పుడు అతడే ఆ కంపెనీకి సీఈవో . అందుకే అన్విని అడ్డు తొలగించుకోవాలని ఇలా ప్లాన్ చేశాడు ” అంటూ అసలు విషయాన్ని చెప్పాడు .


అదంతా వింటున్న రాహుల్ కి బుర్ర తిరిగింది. తొందరగా వెళ్లి కాపాడాలి అన్న ఒక్క మాటతో ఇద్దరు చేరో వైపుకు చూశారు. విరూపాక్షి టవర్స్ అని రెండు పెద్ద భవంతులు కనపడ్డాయి.


“ అభయ్! ఏంటిది రెండున్నాయి . ఇప్పుడు ఎలాగా? ”


“ ఇప్పుడు మనకంత టైం లేదు. తొందరగా మనం ఈ బిల్డింగ్ లో ఉన్న యాభై గదులను వెతికేయాలి. నువ్వు ఇటు వెళ్ళు .....నేను ఇటు ” అంటూ ఎడమవైపు ఉన్న విరూపాక్షి బిల్డింగ్ లోకి వెళ్ళాడు అభయ్.


లోపలికి వెళ్ళిన అతడికి ఆ హోటల్ స్టాఫ్ అడ్డుపడ్డారు. కానీ తను ఒక పోలీస్ ఆఫీసర్ అంటూ ఏదో చెప్పి , సెర్చింగ్ కోసం వెతుకుతున్నాను అని చెప్పడంతో , వాళ్లు నిశ్శబ్దమయ్యారు మరి ప్రశ్నలు అడగకుండా!


మరోవైపు రాహుల్ కూడా తన గబ్బిల రూపంలో ఎగురుతూ, ఒక్కొక్క గదిని వెతుకుతూ ఉన్నాడు. అప్పుడే రాహుల్ ఉన్న హోటల్ పైన హెలికాప్టర్ శబ్దం వినిపిస్తున్నట్టుగా అనిపించింది .


అప్పటికే చీకటి అవ్వటం వల్ల ఆ చుట్టుపక్కల ఎలాంటి శబ్దాలు లేవు . కేవలం ప్రకాశించే ఆ విద్యుత్ దీపాలు తప్పితే , ఎటువంటి జాడ కూడా లేదు. అందుకే ఆ హెలికాప్టర్ శబ్దం చాలా స్పష్టంగా వినిపిస్తుంది . రాహుల్ పరుగు పరుగున టెర్రస్ మీదికి చేరుకున్నాడు.



టెర్రస్ పైన అప్పుడే అన్విని తీసుకొచ్చిన ఆ నలుగురు రౌడీలు , అన్విని మోకాళ్ల పైన కూర్చోబెట్టి కళ్ళకి గంతాలతో బెదిరిస్తున్నట్టుగా గన్ను చూపిస్తున్నారు .


గాల్లోనే హెలికాప్టర్ శబ్దం వినిపిస్తోంది .అది కొన్ని క్షణాలను ఆ విరూపాక్షి బిల్డింగ్ పై ల్యాండ్ అవుతుంది.


ఈ మధ్య సమయంలోనే రాహుల్ శరవేగంగా నలుగురు రౌడీల దగ్గరికి వెళ్ళాడు . వాళ్లు తమ గన్నులతో, కత్తులతో దాడి చేయాలని ప్రయత్నించారు. కానీ రాహుల్ చాలా తెలివిగా ఒక్కొక్కడిని మట్టుబెట్టి, హెలికాప్టర్ ల్యాండింగ్ కి ముందే పడేశాడు .



గాల్లో హెలికాఫ్టర్లో ఇదంతా చూస్తున్న సోమనాథ్ కి విపరీతంగా కోపం వచ్చింది . అందుకే వెంటనే తన రూమ్లో ఉన్న పదిమంది సెక్యూరిటీ గార్డ్స్ ని టెర్రస్ పైకి రమ్మనట్టుగా ఆర్డర్ వేశాడు.


హెలికాప్టర్ నుంచి సోమనాథ్ దిగుతూనే అతని వెనుక పది మంది సెక్యూరిటీ గార్డ్ లు నిలబడ్డారు.


మరోవైపు ఆ నలుగురు రౌడీలని కుమ్మేసిన రాహుల్, అన్వి కళ్ళకి కట్టిన ఆ నల్లని వస్త్రాన్ని తీసేసి, చేతికి ఉన్న కట్లని విప్పుతున్నాడు. తను రెండు రోజులగా ఏమీ తినకపోవడంతో చాలా నీరసంగా, తనకి అయినా ఆ గాయాలతో నిలబడలేకపోతోంది.


చిన్నగా బాధగా ఏడుస్తూ ఉంది. అది చూసిన రాహుల్ కి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. వెంటనే తన కోపం రెట్టింపు అయిపోయింది . అందుకే అన్విని అక్కడే కాసేపు కూర్చోమన్నట్టుగా ఆపి , యుద్ధానికి సిద్ధమైన వీరుడిలా తన ముందు నిలబడ్డాడు.


అతనికి ఎదురుగా రావణుడి లాంటి సోమనాథ్ తన రాక్షస దళంతో చంపడానికైనా, చాపడానికైన సిద్ధం అన్నట్టుగా చూస్తూ ఉన్నాడు.


కంటి సైకతోనే పదిమంది రౌడీలలో ఐదుగురు రాహుల్ ని కొట్టడానికి , వాళ్ళ దగ్గర ఉన్న కత్తులతో బయలుదేరారు . వాళ్లకి మాత్రం ఏమి తెలుసు? వాళ్ళ ఎదురుగా ఉన్నది మృత్యువు అనీ! అతడు మామూలు మనిషి కాదు . మనుషులని చంపి , రక్తం తాగే డ్రాకులా అనీ!


వాళ్లు తన వైపుకు వస్తూ ఉండడంతో , రాహుల్ కళ్ళు నీలిరంగులో మరింతగా ప్రకాశించాయి. తనకి ఇప్పుడు ప్రతి చిన్న కదలిక చాలా స్పష్టంగా కనిపిస్తుంది . రౌడీలు అరుస్తూ వేగంగా చుట్టుముట్టి వాళ్ళ కత్తులతో దాడి చేయడానికి ప్రయత్నించారు.



అందరూ ఒకేసారి దాడి చేయడంతో రాహుల్కి, అందరి నుంచి తప్పించుకోవడం కష్టమైంది . అందుకే ముఖ్యమైన భాగాలకి దెబ్బలు తగలకుండా ముగ్గురిని , వాళ్ళకత్తులతో వాళ్ళనే పొడుచుకునేలాగా కొట్టాడు .


మరో ఇద్దరి కత్తులు, రాహుల్ ఛాతి పైన , భూజం పైన విపరీతమైన గాయాన్ని చేశాయి. అతడు వేసుకున్న ఆ తెల్లని చోక్క , ఎరుపు రంగులో మారిపోయింది .


ముగ్గురిని ఒకటే దెబ్బతో చంపేసిన రాహుల్ కోపంగా చూస్తూ ఒకడిని గాలిలోనే బలంగా తన్నాడు. అతడి కాలిలో బలం కారణంగా ఆ బిల్డింగ్ పై నుండి కింద పడిపోయాడు వాడు.


ఇంకొకడిని తల పట్టుకొని ఆ హేలీపాడ్ పై బలంగా కొట్టాడు .అంతే వాడికి దిమ్మతిరిగిపోయి, పడిపోయాడు .


మిగిలిన ఐదుగురిలో ముగ్గురు, ముందు వాళ్ళు చేసిన తప్పుని చెయ్యకుండా పోరాటానికి వచ్చారు. వాళ్ళ శరీరాలు పైల్వాన్ లాగా ఉన్నాయి.


రాహుల్ మాత్రం ఏ మాత్రం తగ్గకుండా బలమైన పంచుల వర్షం కురిపించాడు . కానీ వాళ్ళ పంచుల ముందు తన బలం సరిపోలేదు .


గాయాలపైనే వాళ్ళు నాలుకైదు పిడిగుద్దులు కురిపించే సరికి , చర్మం కమిలిపోయి రక్తం విపరీతంగా ఏగజిమ్మింది.


నొప్పిని భరిస్తూ నేలపై పడ్డాడు రాహుల్. అందులో ఒకడు రాహుల్ పై కూర్చుని , మూఖం పైన ఐదు పంచ్ లిచ్చాడు . రాహుల్ పెదవి చిట్లి రక్తం రావడం మొదలైంది . తన తెల్లని శరీరం కాస్త కమిలిపోయి ఎరుపు రంగులోకి మారినట్టుగా అనిపించింది .


“ రేయ్ వాడిని ఎంతసేపు కొడతారు. వెళ్లి దాన్ని చంపేయండి ” అన్న సోమనాథ్ మాటలు గట్టిగా వెనక నుంచి వినిపించాయి.


రాహుల్ని వాడికి వదిలేసి, అన్విని చంపడానికి బయలుదేరారు ఇద్దరు.


అన్వికి ప్రమాదం అన్న మాట రాహుల్ చెవిని చేరగానే పిడికిలి బిగిసింది . తన శక్తినంత పిడికిలోకి తీసుకొని, రౌడీ గొంతు పై ఒకటి ఇచ్చాడు . దెబ్బకి గొంతు కండరాలన్నీ విరిగాయి. వాడు గొంతు పట్టుకుని పడిపోయాడు.


వాడు అరిచిన అరుపుకి అన్వి వైపు వెళుతున్న ఇద్దరు భయంగా రాహుల్ ని చూశారు. రాహుల్ కళ్ళు నీలి రంగు నుంచి ఎరుపు రంగులోకి మారాయి. అచ్చం డ్రాకులాగా! . వాళ్ల వైపు వేగంగా వెళ్లి ఒకటి కడుపులో తన్నాడు . మరొకడికి తలని రెండు చేతులతో బలంగా మోదాడు.



ఎంత బలమైన వాడు అయినా సరే , చావును తెగించిన వాడి ముందు నిలబడ్డము అంటే ఆశామాసి కాదు . అందుకే వాళ్ల కూడా దెబ్బలు తగిలాయి. ఒకడిని రాహుల్ బలం అంత ఉపయోగించి ఆ బిల్డింగ్ పైన నుండి తోసేసాడు. మరొకడిని చితక్కొట్టడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నాడు.



అప్పుడే వెనకనుంచి ఒకడు రాహుల్ ని కాల్చడానికి షూట్ చేశాడు. ఆ బుల్లెట్ల వేగం తనను చేరకముందే రాహుల్ పక్కకు తప్పుకోవడంతో , అవి నేరుగా రాహుల్ కొడుతున్న రౌడీ గుండెల్లోకి దూసుకుపోయాయి .


అంత జాగ్రత్తగా తప్పించుకోవడం చూసిన రౌడీ ఆశ్చర్యపోతూ , నోరు తెరిచి చూస్తూ ఉన్నాడు. గన్ను పక్కన పడేసి రాహుల్ పై ముఖాముఖి యుద్ధకి బయలుదేరాడు.


పదిమందిలో మిగిలిన చివరివాడు, వాడి దగ్గర ఉన్న బల్లేన్ని రాహూల్ పైకి విసిరాడు . ఎదురుగా వస్తున్న రౌడీ పైనే దృష్టి ఉండడంతో , ఆ బళ్లెంని చూడలేదు. ఆ ఏమరపాటు కారణంగా నేరుగా రాహుల్ కడుపులోకి దిగింది అది .


రాహుల్ కడుపులో సగానికి పోయిన అది, దాని వెంట రక్తాన్ని ధారలాగా ప్రవహించేలా చేసింది . అది చూసిన అన్వి గట్టిగా అరుస్తూ ఏడ్చింది .


తనకి సహాయం చేయడానికి వచ్చిన రాహుల్ కి ఇన్ని దెబ్బలు తగులుతూ, తన ప్రాణాపాయ స్థితికి చేరుకోవడంతో , విపరీతంగా ఏడవడం మొదలు పెట్టింది. కానీ తను పారిపోవడానికి సత్తువలేదు. ఎదిరించడానికి బలము లేదు . ఏమీ చేయలేని దానిలా ఏడుస్తూనే ఉంది .


తన ప్రాణం పోయినా సరే అన్విని కాపాడి తీరాలని , రాహుల్ అలాగే లేచి నిలబడ్డాడు . ఆ నొప్పిని భరించలేక గట్టిగా అరిస్తూ ఆ బళ్లేన్ని చేత్తో బయటికి పీకాడు . రక్తంతో అభిషేకమైనట్టుగా ఉన్న దాన్ని చూస్తూ, ఎదురుగా వచ్చే రౌడీ తలపై ఒక్కటి పీకాడు.


ఆ దెబ్బకి వాడికి చుక్కలు కనిపించి నేలపై పడ్డాడు .


“ ఛ చెత్త నాయాలు! ఒక్కడిని కూడా చంపడం చేతకాదు. ఒక్కడిని ఎదిరించడానికి ఇంతమంది చావాలా ?” అంటూ లైసెన్స్ గన్ను తీసుకున్నాడు సోమనాథ్ .


బళ్లెం విసిరిన వాడు ఎలాగైనా చంపాలని, రాహుల్ వైపుకి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. అతడి వెనకాలే సోమనాథ్ గన్నుతో ఏమాత్రం అవకాశం దొరికిన పేల్చడానికి సిద్ధంగా ఉన్నాడు . తనకి ఏమాత్రం సత్తువ లేకపోయినా, రాహుల్ ని కాపాడాలన్న ఒకే ఒక్క ఉద్దేశంతో అన్వి, తన శక్తిని అంత కూడా తీసుకొని పైకి లేచి నిలబడింది .


“ మీకు నా అన్వి కావాల్సి వచ్చిందా రా? ” అంటూ కోపంగా , పూర్తిగా డ్రాకులాగా మారిపోయాడు రాహుల్. అతడి శరీరం ఏమాత్రం మారలేదు గాయల కారణంగా! కానీ అతడి రంగు పూర్తిగా బూడిద రంగులోకి మారింది .


కళ్ళు పూర్తి ఎరుపు రంగులోకి మారాయి. అతడి పళ్ల చివరలో కోరలు పెరిగాయి. తన చేతిలో ఉన్న బళ్లేన్ని ఆ రౌడీ వైపుకి వేగంగా విసిరాడు . ఊహించని ఆ పరిణామానికి తప్పించుకోవడానికి వేరే మార్గం లేకపోవడంతో , అక్కడే నిలబడిపోయాడు వాడు.


ఆ రౌడీ కడుపులో ఆ బళ్లెం గుచ్చుకుంది . ఆ బళ్లెం వేగానికి ఆ వ్యక్తి కూడా గాలిలో తేలుతూ వెనక ఉన్న సోమనాథ్ దగ్గరికి వెళ్ళాడు. వస్తున్నా రౌడీని ఏమాత్రం ఊహించని సోమనాథ్ , తప్పించుకునే లోపు ఆ బళ్లెం అతడి కడుపులోకి కూడా బలంగా దిగింది.


ఒకే బళ్ళేనికి ఇద్దరు చిక్కుకున్నారు. కానీ ఈ తొందరలో ఈ గజిబిజి వాతావరణంలో అనుకోకుండా సోమనాథ్ యొక్క గన్ను నుంచి బులెట్ పేలింది. దాన్ని రాహుల్ అయితే తప్పించుకున్నాడు. కానీ వెనక నిలబడిన అన్వి తప్పించుకోలేకపోయింది.


క్షణ కాలంలోనే అన్వి గుండెల్లోకి చోచ్చుకుపోయింది ఆ బుల్లెట్. “హ.........” అనే ఉచ్ఛ్వాసాన్నిచ్వాసన శబ్దం తప్పితే రాహుల్ కి ఏమి వినిపించలేదు . నెమ్మదిగా తల తిప్పి చూసాడు.



అన్వి బిల్డింగ్ చివరన నిలబడి ఉండడంతో ఆ బుల్లెట్ వేగానికి , బిల్డింగ్ పైనుంచి కిందికి పడిపోవడం మొదలైంది.


కొన ఊపిరితో మాత్రమే తను బ్రతికి ఉంది.



రాహుల్ కి కూడా విపరీతమైన గాయాలతో రక్తం కారుతూ ఉండడంతో, తన కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. అయినా ఏమాత్రం లెక్క చేయకుండా......గాయాలతో నిండిన శరీరంతోనే పరిగెత్తుకుంటూ వెళ్లి దూకేశాడు.


కిందకి వెళ్తున్న అన్వికి , తన కోసం వస్తున్న రాహుల్ డ్రాకులాగా కనిపించాడు . ముందు రోజు తన చెంపకి అయినా గాయం కారణంగా , రక్తం చుక్క గాలికి లేచి రాహుల్ బుగ్గపై ముద్దు పెట్టింది.


ఆ బిల్డింగ్ పైనుంచి ఒక్కొక్క గదిని దాటుతూ అన్వి కిందకి చేరడానికి సిద్ధమవుతుంది . రాహుల్ కూడా చాలా వేగంగా రావడంతో, అన్విని చేరుకున్నాడు . కానీ తనకి ఆ క్షణం తనను తను డ్రాకులాగా పరిచయం చేసుకోవాలనుకున్నాడు. అందుకే అన్విని , నేలకి తాకకుండా తన ఎదపైకి మార్చుకున్నాడు.


“ అన్వి! నేనొక డ్రాకులాను. కానీ నువ్వంటే నాకు చచ్చేంత ప్రేమ . అసలు నేను కాలేజ్ కి రావడానికి కారణం నువ్వు. నేను అబద్ధమైన ఉండొచ్చు! కానీ నాకు నీ పైన ఉన్న ప్రేమ మాత్రం అబద్ధం కాదు ” అన్నాడు బాధగా .


రాహుల్ కన్నిటి చుక్క, అన్వి బుగ్గ పై ముద్దు పెట్టింది .


“ నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు ఎవరన్నది నాకు అనవసరం రాహుల్! నువ్వు నాకోసం , నా ప్రేమ కోసం చాలా చేశావు . ఆఖరికి నేనంటే నీకు , నీ ప్రాణం కంటే ఏక్కువ అని నిరూపించావు. ” అంది ప్రేమగా.


అదే తమరి చివరి క్షణాలు అన్నట్టుగా తలవాల్చుకుంది . రాహుల్ కూడా ఆమెని తన కౌగిలిలో బంధించేశాడు .



అవతల వైపు వేతుకుతూనే , అభయ్ ఇద్దరిని చూశాడు . అతడు అన్వి అరిచిన అరుపుకి చూడడం మొదలు పెట్టాడు. కానీ అతను అక్కడికి చేరుకునే ఆ ప్రయాణంలోని ఇదంతా జరిగిపోయింది.


వారు అలా ఒక్కొక్క గదిని దాటూతూ , ఆకర్షిస్తున్న భూమివైపు వెళుతున్నారు.


ఏమాత్రం ఆలస్యం చేయాని అభయ్, తన రెండు రెక్కలని పిలిచాడు . వేగంగా వాళ్ళ వైపు ఎగిరాడు. రెప్పపాటు కాలంలో ఇద్దరిని సమీపించి , నేలపై వాళ్లిద్దరూ పడకుండా పట్టుకున్నాడు.


కానీ అప్పటికే అన్వి గుండెలో ఉన్న బుల్లెట్, తనని ఇబ్బంది పెట్టడం మొదలు పెట్టింది.


“ మీరు ఇచ్చిన షాకులకి, ఇప్పుడు నేను ఆశ్చర్యపోయే టైం కూడా లేదనుకుంటా! ఒకరేమో ఏంజెల్, ఒకరేమో డ్రాకులా” అంటూ నవ్వుతూ కళ్ళు మూసింది అన్వి.


తనని బయటికి వదిలేస్తున్నట్టుగా రాహుల్ చేతులు కూడా చాలా వదులుగా అయ్యాయి. అప్పటికే రాహుల్ కూడా తన ప్రాణాన్ని వదిలేశాడు. అతడు శరీరం నుండి రక్తం విపరీతంగా కారుతుంది. తన శరీరం పైన విపరీతమైన కత్తి గట్లు పడ్డాయి.


రాహుల్ ని దగ్గరగా తీసుకున్న అభయ్ ఏడుస్తూ, “ నువ్వు ఒక డ్రాకులావి . అయినా కూడా నాతో బాగా ఉండగలిగావు. ఇబ్బంది పెట్టలేదు. కానీ నువ్వు కూడా అన్విని ప్రేమిస్తున్నావు. మీకోసం నా జీవితాన్ని కూడా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఒక్కసారి లేవండి ” అంటూ రాహుల్ ని ఒడిలో పెట్టుకొని రోదించాడు.


అప్పటికే అభయ్ శరీరానికి వారి రక్తం అంటుంది . అన్వి వైపు చూస్తూ, “ నేను నిన్ను ప్రేమించడానికి వచ్చాను . ఇప్పుడు చూశాక మీకంటె నా ప్రేమ గొప్పది కాదు అనీ ఒప్పుకుంటున్నాను. నిజంగా నీ అంత మంచి అమ్మాయిని ఎప్పుడు చూడలేదు. ” అంటూ తనని కూడా పట్టుకున్నాడు .


ఒకపక్క రాహుల్, మరో పక్క అన్వి ఇద్దరి శరీరంల మధ్యలో కూర్చున్నాడు అభయ్. అతని రోదన మొదలు నరికిన చెట్టులా ఉంది . చాలాసేపు అలాగే ఉన్నాడు .


అతని కంట్లో నుండి కన్నీళ్లు చుక్కలు రావడం మొదలయ్యింది. ఇంతకుముందు ఎప్పుడు ఏడవలేదు. కానీ మొదటిసారి వాళ్ళిద్దరి కోసం ఏడుస్తున్నాడు.


తన చేతికి అంటిన రక్తంతో, ఎరుపు రంగులోకి మారిన దుస్తులతో సెయింట్ చర్చ్ వైపుకి వాళ్ళిద్దరిని పట్టుకొని గాల్లోకి ఎగిరాడు అభయ్!


వాళ్ళని చర్చి బయటే పెట్టి , అభయ్ బాధగా అడుగు వేస్తూ లోపలికి ప్రవేశించాడు. తనని చూడగానే స్తంభించిపోయాడు పోప్.


ఏడవడం వల్ల వాచిపోయిన కన్నులు ఎరుపు రంగులో ఉన్నాయి. అతని చేతులకి దుస్తులకి రక్తంతో భయంకరంగా కనిపిస్తున్నాడు.


అభయ్ నేరుగా వెళ్లి ప్రభువు ముందు మోకాళ్లపై కూర్చున్నాడు .


“ ప్రభు నీకు అన్ని ముందే తెలుసు కదా ! కానీ ఎందుకు నన్ను ఇలా పంపించావు. ఇప్పుడు నేను నిజముగా కోరుకుంటున్నాను....నాకు నా స్నేహితుల కంటే ఏది ఎక్కువ కాదు. గతంలో జరిగిన దానిలాగా నన్ను కూడా శక్తులు తీసేసుకుని, వారిని బ్రతికించు! నేను ఇంకెప్పుడు స్వర్గ ద్వారాల వైపుకి రాను. ప్లీజ్...!” అంటూ మాట్లాడటానికి కూడా మాటలు రాకపోవడంతో అలాగే ప్రార్థిస్తూ ఏడుస్తూ ఉన్నాడు.



తనని చూసిన పోప్ కి కూడా చాలా భాధగా అనిపిస్తుంది.

నెమ్మదిగా ఆ ప్రభువు వెనుక నుంచి ఒక ప్రకాశవంతమైన కాంతి అభయ్ పైన పడింది. అందులో నుండి ఆకాశవాణి మాట్లాడుతూ,

“ మీకు ఇచ్చిన పరీక్షలో నువ్వు విజయం సాధించావు. నువ్వు నిజమైన ప్రేమని గ్రహించాలన్నది ఈ పరీక్ష !.నీ వాళ్ళ కోసం నువ్వు కార్చిని కన్నీరు చాలా అమూల్యమైనది. అందుకే నీ కోరికను తీరుస్తున్నాను ” అంటూ కాంతి విరుమిట్లు గోలిపే టపాసులాగా మాయమైపోయింది.

అభయ్ ! ఆనందంతో బయటికి పరిగెత్తుకుంటూ వచ్చాడు . వారి వైపు చూస్తూ ఉంటే, ఆకాశంలో నుంచి రెండు ఆత్మలు నేరుగా వాళ్ళ శరీరంలోకి ప్రవేశించాయి. వాళ్లకైనా గాయాలు నెమ్మదిగా మాయమై, వాళ్ళిద్దరి దగ్గుతూ సృహలోకి వచ్చారు .


వారిని చూడగానే, అభయ్! ఏడిస్తూ వెళ్లి కౌగిలించుకున్నాడు. అప్పుడే ఆకాశంలో రెండు ఆత్మలు కనిపించాయి. ఒకటి అభయ్కి సహాయం చేసిన పెద్దాయన ఆత్మ. మరొకటి రాహుల్ కి సహాయం చేసిన అమ్మ రూపంలోని ఆత్మ .


రెండు ఆత్మలని చూడగానే అన్వి అప్రయత్నంగా ఏడుస్తూ, “ అమ్మ .......నాన్న ...” అంటూ పిలిచింది .


రాహుల్,అభయ్ ఇద్దరు షాక్ అయ్యి, అన్వి వైపు ఆశ్చర్యంగా చూశారు. ఆ ఆత్మలు సంతోషంగా అక్కడి నుండి మాయమైపోయాయి.




తర్వాత కొన్ని రోజులకి అభయ్ అసలైన ఏంజల్ గా మరి, స్వర్గపు ద్వారాలలో ఉత్తమ పదవిని స్వీకరించాడు .


రాహుల్, అన్వి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. దాంతో నరకపు సామ్రాజ్యంలో శాప విమోచనం కలిగి ప్రశాంతమైన జీవితాన్ని గడపడం మొదలుపెట్టారు.

భూమిపై తమ జీవితాన్ని గడిపేస్తూ, తమ స్నేహితులతో కంపెనీ చూసుకుంటూ ఉంటారు రాహుల్, అన్వి!.



“ నిజమైన ప్రేమ కేవలం నిస్వార్ధంగా ఆలోచించి, ఎదుటివారిని మంచిని కోరుకున్నప్పుడే దొరుకుతుంది. ఈ ప్రపంచంలో అన్ని బలాలకి అతీతమైనది . ఆది నుంచి అంతము దాకా మిగిలి ఉండే ఒకే ఒక్క శక్తే ఈ ప్రేమ! ”.



_______ సమాప్తము ______