తన పిన్ని కొడుకు చంద్రహాస్ తనను అవమానపరిచేలా మాట్లాడడమే కాకుండా నారాయణ భార్యకు ఇంకా గీతిక బెడద తప్పించాలని చంపబోతున్న తరుణంలో పోలీస్ జీపు రావడంతో వాళ్ళు అక్కడ వదిలి వెళ్ళిపోతారు.
తను" అనాధ" అన్న మాటని పదేపదే వినడం వల్ల విసుగుచ్చింది తనను ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు అని ఇక భూమి మీద ఉండడం వ్యర్థమని భావించి రోడ్డు వైపు చూడంగా అంబులెన్స్ అత్యంత వేగంగా దూసుకొస్తోంది. ఎదురుగా వస్తున్న వాహనాన్ని గమనించినప్పటికీ గీతిక వెనక్కి తగ్గలేదు. తన అడుగులను రోడ్డు మధ్యకు వేస్తూ, ఆ వాహనం తన జీవితానికి ముగింపు పలికితే కనీసం ఈ బాధల నుంచి విముక్తి లభిస్తుందేమోనన్న ఆలోచనతో ముందుకు సాగింది.
అదే సమయంలో ఏదో పని మీద అటుగా వస్తున్న ప్రభ దూరం నుంచి రోడ్డుపై ఒంటరిగా నడుస్తున్న ఆ అమ్మాయిని గమనించాడు. ఆ సమయంలో రోడ్డుపై వాహనాల రాకపోకలు ఎక్కువగానే ఉన్నాయి . అయినా, వేగంగా వస్తున్న వాహనాన్ని లెక్కచేయకుండా ఆమె అలా ముందుకు వెళ్లడం అతడికి ఆశ్చర్యాన్ని కలిగించింది.
'ఎవరా అమ్మాయి? అలా ఎందుకు నడుస్తోంది?' అనుకుంటూ ప్రభ తన చూపును ఆమెపైనే నిలిపాడు. దూరం నుంచి ఆమె రూపం కనిపించిన తీరు, నడిచే విధానం అతడికి ఎక్కడో చూసిన పరిచయాన్ని గుర్తుచేశాయి.
'అది... గీతికనా ? ఏంటో ఎక్కడ చూసిన తనే కనిపించినట్లు అవుతుంది!' అని మనసులోనే అనుకుంటూ ఎక్కడ ఎవరైనా సరే ఆమెకు ఏమీ కాకూడదని అనుకుంటూ అరే !ఇంకా అక్కడే నిలబడి ఉన్నాను ఎందుకు అంటూ కళ్ళు తెరిచి చూసి లోగా ఓ పెద్ద వాహనం అడ్డు రావడంతో తనకు ఇవతలకి రావడానికి అవకాశం లేకపోయింది. వాహనం అలా వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వెళ్లి చూస్తే ఎవరు కనిపించలేదు. ఇంత తక్కువ సమయంలో ఆ అమ్మాయి ఎటు వెళ్ళింది. అంబులెన్స్ ఎక్కడ ? అది చాలా వేగంగా వెళుతుంది అనుకో . పోనీ ఆక్సిడెంట్ జరిగితే ఏదైనా ఆనవాళ్లు ఉండాలి కదా అంబులెన్స్ లోనే ఏమైనా తీసుకెళ్లారా ? ఇంతకీ తన ఎక్కడికి వెళ్ళింది ? ఎవరు ఆ అమ్మాయి ?" ఎవరైనా సరే బాగుంటే చాలు అనుకొని వెళతాడు.
***
అంబులెన్స్ కి అడ్డంగా వెళుతున్న గీతికను ఓ చెయ్యి పట్టుకుని రోడ్డుకి చివరికి లాగా బస్సు షెల్టర్ పక్కకి పడి ఉంటుంది గీతిక.
వదలండి, మీరు నన్నెందుకు ఆపుతున్నారు ." అని గీతిక గింజుకుంటుంది.
" ఏ అమ్మాయ్! నేను చెప్పేది విను . ఇంత చిన్న వయసుకే చచ్చిపోవాలని ఎందుకు అనుకుంటున్నావు. " అని అడిగింది గౌరీ.
ఎందుకంటే , నేనేం చెప్పలేను ప్లీజ్ అని గీతిక పట్టుకున్న చెయ్యని వదిలించుకోవడానికి ప్రయత్నిస్తోంది "
చూడమ్మా! నీకు ఆయుష్షు ఇంకా తీరలేదు కాబట్టి దేవుడు నన్ను ఇక్కడికి పంపించాడు మేలయింది . లేదంటే పోయి పోయి నిండు ప్రాణం అర్ధాంతరంగా ఆగిపోయేది. " అన్నదామె.
మీరెవరు ? ఎందుకు నన్ను చావకుండా బతికించారు. నేను బతికినా చచ్చినట్లు ఉండాలి. నాకంటూ ఎవరూ రాని, ఎవరు లేని నేనెందుకు అంటూ కుమిలిపోయింది గీతిక.
చూడమ్మాయ్, నేను చెప్పేది విను. " కష్ట సుఖాలు అనేవి బండికి ఉన్న రెండు చక్రాల్లాంటివి. అవి లేకుండా ఏ జీవితం ఉండదు. ధనవంతుడైనా, పేదవాడైనా కష్టసుఖాలకు అతిథులే. రెండింటిలో ఏది మనకు ఎదురొచ్చినా బ్యాలెన్స్ చేయాలే కానీ వాటికి లోంగి, కృంగిపోకూడదు ". పద, వెళదాం . మీ ఇంటి అడ్రస్ చెప్పు వదిలేసి వస్తాను అని గౌరీ అడుగుతుంది.
ఇల్లా! నాకు ఇల్లు లేదు , వాకిలీ లేదు, అసలు నాకెవరూ లేరు అంటూ రోదించింది గీతిక.
అలా అనకమ్మ, నేనైతే ఎక్కువ చదవలేదు.నాకు తెలిసింది చెప్పాను. మీరు ప్రపంచాన్ని చదివినవారు. మీరెప్పుడైనా వినలేదా | " జీవించి సాధించు, సాధించి సమాజంలో జీవించు "అన్న వాక్యం . మాస్టారు ఎప్పుడో చెప్పింది అలాగే గుర్తుపెట్టుకున్నాను అయినా ఇది కంప్యూటర్ యుగం కదా! టెక్నికల్ చదువులో ఇలాంటి సూక్తులు, జాతీయాలు, నియమాలన్నీ చదవడానికి సమయం నీకు చాలా తక్కువ. అందుకే బహుశా తెలియదు అనుకుంటా అన్నది గౌరీ.
అసలు జీవించడానికి వదలకుంటే ఇక సాధించేదెలా " అంటూ గీతిక చెబుతూ ఉండగా అదే పోలీస్ హారన్ తో మళ్ళీ రావడంతో చూడమ్మా ముందు ఆటో ఎక్కు ఈ రోడ్డు దగ్గర ఎక్కువసేపు ఉండడం అంత మంచిది కాదు అని గౌరీ చదువుతుంటే ఇక మారు మాట్లాడకుండా గౌరీతో పాటు ఆటో ఎక్కింది గీతిక .
ఆటో వేగంగా వెళుతూ గౌరీ ఇంటి ముందర ఆగేసరికి లోపలికి గీతికని తీసుకువెళ్లి కూర్చోమని చెప్పి పక్కన తను కూర్చుంటుంది.
చూడమ్మా జీవితం చాలా చిన్నది విలువైనది కూడా. ఇంత చిన్న వయసుకి నీకెంత కష్టం వచ్చిందో ఏమో! కష్టం మనకి ఎప్పుడూ ఉంటుంది కానీ ఆనందాన్ని మనమే వెతుక్కోవాలి ముందు ఈ నీళ్ళు తాగు అని ఆమె చెబుతూ ఉంటే గీతిక కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి.
గీతిక మరొకసారి గౌరీ వైపు చూసి ఆంటీ మీరెవరో నాకు తెలియదు గానీ నన్ను ఎందుకు కాపాడారు అంటూ ఇంకా దుఃఖించ సాగింది.
అది చూసిన గౌరీ " ఏడవకమ్మ కన్నీళ్లు చాలా విలువైనవి నా మాట విను నువ్వెవరు ఏంటి అని నేను అడగను కానీ నువ్వు ఒంటరిగా ఇలా ఎందుకు ఇంత బాధపడుతున్నామని మాత్రం నాకు చాలా బాధగా ఉంది .సరే అన్నం తిన్నావా లేదా కొంచెం గంజి అయినా చేసివ్వనా " అని గౌరీ అడుగుతుంటే వద్దు ఆంటీ నాకు తినాలని లేదు , తాగాలని లేదు అంటుంది .
"అలా అంటే ఎలా ? బతకాలంటే తినాల్సిందే . నా మాట విని ఈ కాస్త తిని ఈ రాత్రికి ఇక్కడే పడుకో , ఉదయం నువ్వు మీ ఇల్లు ఎక్కడ ఉందో చెబితే నేనే వదిలి వస్తాను "అని గౌరీ చెబుతున్న. లేదు నేను ఎక్కడ ఉండను అంటూ నీళ్లు కూడా ముట్టుకోకపోవడంతో " సరే నువ్వు చెప్పింది వింటాను కానీ ఈ చీకటిలో నువ్వు ఒక్కదానివే ఎలా వెళతావు"అంటూ గీతికను చూస్తుంది
నాకు ఈ జీవితం వద్దు అనుకున్నాను కానీ మీరు నన్ను కాపాడి నాకు మరో జీవితం ఉందని చెబుతున్నారు ఆ జీవితం ఇంకా ఎంత నరకంగా ఉంటుందని నాకు చాలా భయం వేస్తుందండి
అలా భయపడక్కమ్మ భయపడితే జీవితం గడపలేము ధైర్యం, ధారాళము అనేది చాలా ముఖ్యం .ప్రపంచంలో అన్నిటినీ సాధించిన వారు లేరు, అవమానాలు పడని వారు లేరు , ప్రతి ఒక్కరు ఎక్కడో ఒకచోట అనుమానం ,అవమానం ఇవన్నీ ఎదురుచూసిన వాళ్లే. అలా అనుకుని వాళ్ళు చనిపోయి ఉంటే ఈరోజు గొప్ప గొప్ప వ్యక్తులు గాని సమాజంలో మిగిలేవారు కాదు. కాబట్టి నువ్వు ఎక్కువగా ఆలోచించకు ఈ రాత్రికి పడుకో ఉదయం నేను మీ ఇంటికి వదిలి వస్తాను "
మీరు నన్ను కాపాడినందుకు థాంక్స్ చెప్పాలో నేను బతికినందుకు బాధపడాలో అర్థం కావడం లేదు కానీ ఇక్కడ మాత్రం ఉండలేనoడి అన్నది గీతిక సమాధానం.
అంతలో బైక్ హారన్ వినిపించడంతో బయటికి వచ్చిన గౌరీ ప్రభ నీ ఫోన్ కోసమే ప్రయత్నం చేస్తున్నా ఫోన్ రింగువ లేదేంటి? ముందు లోపలికి రా అని మాట్లాడిస్తూ ఉండగానే అమ్మ ఇదిగో ఫ్రూట్స్ కావాలని పప్పుకి మెసేజ్ చేశారంట కదా అంటూ ఒక్కసారి లోపలికి వెళ్లి ఎవరొచ్చారో చూడాలని అనిపించినా కూడా చూసే సమయం లేక అమ్మతో అదే విషయాన్ని అని అడగాలని అనుకున్న తను మనసులో తాను అనుకున్న చోటికి వెళ్లాలని ఆలోచిస్తూ అడగకుండా కవర్ని ఇస్తాడు.
"లోపలికి రా నాన్న" అని పిలుస్తున్న లేదమ్మ నాకు కాస్త అర్జెంట్ పని ఉంది వెళ్ళాలి రేపు వస్తాను అని చెప్పి బైక్ స్టార్ట్ చేసుకుని వెళ్తాడు ప్రభ.
అరే వాడు లోపలికి కూడా రాలేదు ఇప్పుడు ఆ అమ్మాయి ఇక్కడ ఉండనంటుంది ఏం చేయాలి అనుకొని లోపలికి వెళ్లి కాస్త ఫ్రూట్ జ్యూస్ అయినా తాగమని చెప్పి తయారు చేసి ఇస్తుంది. ఇక అక్కడ తను ఉండలేదని అర్థం చేసుకున్న గౌరీ గార్డెన్ హౌస్ కి పిలుచుకొని వస్తుంది.
. ఆటో దిగిన గీతిక ఇంటికి తాళం వేసి ఉండడం చూసి తాతయ్య జేజీ లు ఎక్కడికి వెళ్లారు. బహుశా నేను ఇంత సేపైనా రాలేదని బయటికి చూడ్డానికి వెళ్లారా? లేదా నాన్నగారు వాళ్లను కూడా తీసుకెళ్ళారా? బహుశా అదే పని జరిగి ఉండవచ్చు లేదంటే సాయంత్రం లోపల నాకు కచ్చితంగా ఫోన్ గాని మెసేజ్ గాని వచ్చేది. ఆ రెండు లేవంటే కచ్చితంగా నన్ను తీసుకుని వెళ్లి ఉంటారు అని ఆలోచిస్తూ ఉన్న ఆ అమ్మాయితో గీతిక! లోపలికి వెళ్ళు అనబోయే తలుపుని చూస్తే తాళం వేసి ఉండడంతో పగలగొడుతుంది.
ఏంటమ్మా ఇంట్లో ఎవరూ లేనట్టుంది మా ఇంటి దగ్గర ఉండమంటే ఉండనని చెప్పావు ముందు లోపలికి వెళ్ళు అని చెబుతూ ఉంటే గీతిక గౌరీని దీనంగా చూస్తుంది.
గీతిక ఆలోచిస్తున్నావేంటి అవును ఆలోచించారా ఏంటి ఇప్పుడు తను ఒంటరిగా ఉండాలి కదా తను కూడా లోపలికి వెళ్లి చూస్తే చాలా బాగుంది. గీతిక ప్రకృతి ఒడిలో ఉన్నట్టుందమ్మ అయినా ఇలాంటి ఇంటిలో నీకు ఎలాంటి కష్టం వచ్చిందో ఆలోచిస్తేనే బాధగా అనిపిస్తుంది అంటూ గీతికను చూస్తుంది.
ఆంటీ మా ఇల్లు. చాలా పెద్ద ఇల్లు . దాని పేరు గార్డెన్ హౌస్. ఎప్పుడు పచ్చని చెట్లు రంగురంగుల పువ్వులతో బయటకి కళగానే కనిపిస్తుంది . కానీ లోపలే ..... అని గీత బాధపడుతూ చెప్పేసరికి "
గీతిక నువ్వు పదేపదే గడిచిన దాన్ని తలచుకోకు , అదంతా ఒక బ్యాడ్ టైం అనుకో . ఎక్కువగా ఆలోచించకు. వెళ్లి విశ్రాంతి...తీసుకో" అని చెప్పింది గౌరి .
ఆలోచించి , ఆలోచించి నా బుర్ర పాడైపోయింది. ఎంతని నేను పాజిటివ్‌గా ఆలోచించను , నేను నా మనసుని సిద్ధం చేసుకునే లోగా ఏదో ఒక ఆటంకం జరుగుతూనే ఉంది అనుకుంది గీతిక మనసులో.
ఏంటి! ఈ అమ్మాయి ఇలా మనసులోనే ఏదో ఆలోచిస్తోంది. తనకు అమ్మ, నాన్న ఎవరూ లేరా? అన్న ఆలోచన వచ్చి అడగాలనుకుంది గౌరీ. కానీ వద్దులే అడిగి ఆ అమ్మాయిని బాధ పెట్టడం ఎందుకు అనుకొని " గీతిక! ఆరోగ్యం జాగ్రత్త " నేను ఇక వెళ్ళొస్తాను అని చెప్పింది గౌరీ.
ఆ మాట వినగానే గీతికకి చాలా బాధగా అనిపించింది. ఇక బాధను తట్టుకోలేక గౌరీ దగ్గరికి పరిగెత్తి గౌరీ గుండెపై వాలిపోయింది
గీతిక వీపు పై తన రెండు చేతులు ఉంచి కుడి చేతితో వీపును తడుతూ మౌనంగా సమబాయించింది. గీతికకి, గౌరీని వదలాలి అనిపించడం లేదు . కళ్ళల్లో కన్నీళ్లు కారిపోతున్నాయి . కాసేపటికి గీతిక! గ...గీతిక! గీతిక! అని గౌరీ అనేసరికి మెల్లగా గౌరీ భుజం మీద ఉన్న తన చేతులను వదిలి వెనక్కి జరిగింది గీతిక.
"గీతిక ఏడవకు , ఏడుపు మన గుండెలోని బరువుని తగ్గించొచ్చు కానీ మన కష్టాన్ని తగ్గించలేదు. దానికి పరిష్కారాన్ని వెతికేది కేవలం మన మనసు మాత్రమే " అని గౌరీ చెబుతుంటే కళ్ళలో నీళ్ళు తుడుచుకుంటూ గౌరీ వైపు చూసింది గీతిక.