Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

ప్రణయ గీతిక - 25

నారాయణ గీతికను చూసి  వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. ఎందుకు డల్ గా ఉన్నావ్ ? కళ్ళు చూడు వాసిపోయి ఉన్నాయి. ఇంతకీ నిన్న ఎక్కడికి వెళ్లావు ? అన్న ప్రశ్న నాన్న నోటి నుంచి వస్తూనే గీతికకి గుండె వేగంగా కొట్టుకో సాగింది. వెంటనే జేజి కల్పించుకొని 'తను శృతిని మాట్లాడించాలని వెళ్ళింది.' అని చెప్పడంతో  " అమ్మ!  .".అని చేతిని అడ్డంగా పెట్టడంతో వెనక్కి అడుగు వేసింది జేజి.

 గీతిక నేల వైపు చూస్తుండగా ,నారాయణ  'ఎందుకు నేల వైపు చూస్తున్నావ్.? శృతి ఇంటికి వెళితే చీకటి పడితే అక్కడే ఉండాలి కదా లేదా ఉదయమే వెళ్లి రావచ్చు కదా. " అని నారాయణ అంటుంటే "నాన్న అది.." అని  తడబడుతున్న గీతికను చూసి  "ఏంటి అది ఇది అంటూ  నీళ్లు నమల్తున్నావు.  నీకు ఇష్టం వచ్చినపుడు వస్తే అడిగేవాళ్ళు లేరు అనుకున్నావా, లేదా ఈ ముసలోళ్లంటే నీకు లెక్క లేదా "  అన్న నాన్న మాటలు మారడంతో గీతిక నాన్న వైపు భయంతో చూడగా ' ఈ భయం ముందే ఉండాలి ఇప్పుడొస్తే ప్రయోజనం ఏంటి ? "అన్నాడు నారాయణ.

 "అది కాదు నాన్నగారు " అంది  గీతిక ఏడుపు ముఖం పెట్టి.

 "ఏది కాదు, మధ్య రాత్రిలో మగపిల్లాడు వెనక వస్తే ఎలా? ఏం జరిగిందనుకోవాలి." అన్న నారాయణతో "నాన్న నేను అబ్బాయి బైక్ లో వచ్చింది నిజమే కానీ  తప్పని పరిస్థితిలో అలా రావలసి వచ్చింది. " అందీ ఏడుస్తూ గీతిక.

 చాలు, ఇంతకుముందు కూడా నువ్వు జాబ్ వచ్చిందని ఇలాగే అబద్ధం చెప్పి నిజానికి కప్పిపుచ్చుకున్నావ్. ఇప్పుడు మరో కథని అల్లడానికి రాకు.  పదే పదే నమ్మడానికి నేనేం వెర్రి నారాయణ కాదు. అని నాన్న మాటలు తూటాల్లా వస్తుంటే గీతికకు గుండెను చిత్రవధ చేస్తున్నట్టు అనిపిస్తోంది . అయినా బాధని భరిస్తూ  "నాన్న నేను నీ కూతురిని "  అంటూ వెక్కివెక్కి   ఏడ్చేసరికి,  నీవు ఏడిస్తే కరిగే రకం కాదు నేను "ఎక్కడున్నా నీ గురించే నా ఆలోచన నిన్ను ఒక మంచి స్థాయికి తీసుకెళ్లి ఒక మంచి ఫ్యామిలీకి ఇవ్వాలని అనుకున్నా. తీరా చూస్తే వాడితో అర్థరాత్రి ఇంటికి వచ్చావ్  అది కాక బైకు  దిగేటప్పుడు చూస్తే,  నేనేమో ఎవరో క్లాస్మేట్ లేదా స్నేహితుడు అని అనుకున్నా. కానీ వాడు బైక్ నిలిపన పైట  సవరించుకో, కురులు సరి చేసుకోమని చెబుతుంటే నువ్వు వాడు చెప్పినట్టే చేయడం నేను చూశాను .

అప్పుడే నేను విన్నది నిజమనుకున్నాను . నా కూతురు ఇలా ఉంటుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. అని నారాయణ వెనక్కి అడుగు వేస్తుంటే  "నాన్న నేను చెప్పేది వినండి " అంటూ ముందు కొచ్చిన గీతికతో  " నీవు ఏడుస్తూ నటించకు. నిన్ను పెద్ద స్థాయికి తీసుకెళ్లాలన్న నా  కలని నాశనం చేసావ్ " ఇదిగో ఈ ముసలి వాళ్లు ఉన్నారే మీరు కూడా వాడు నిన్ను ప్రేమిస్తున్నాడు అన్న విషయం నాతో చెప్పకుండా దాచిపెట్టారు. ఇంతేనా!  మీరు నన్ను అర్థం చేసుకుంది అని బాధపడుతుంటే కళ్ళలో నీళ్ళు తిరిగాయి నారాయణకి.

 "నాన్న ప్లీజ్ నీ కాళ్లు పట్టుకుంటాను నన్ను నమ్మండి నేను చెప్పేది వినండి అసలు ఏం జరిగిందో ఒక్కసారి వినండి నాన్న  " అని కాళ్ళు పట్టుకోబోయిన గీతికని "నువ్వు నిజంగా నా కూతురైతే ఇలా చేసేదానివి కాదు అందుకే ఈరోజు నుండి నాకు ఈ కూతురు లేదు. " అని చెప్పి వెళ్ళిపోయాడు నారాయణ.

 గీతిక బాధని తట్టుకోలేక ఎక్కివెక్కి ఏడుస్తూ గేటు వరకు పరుగెత్తినా నారాయణ వెనక్కి తిరిగి చూడకుండా వెళ్లిపోవడంతో జేజిని కౌగిలించుకొని రోధించ సాగింది గీతిక.

 కిటికీలో గీతిక ఏడవడం చూసిన పప్పు ,  ప్రభా!  ప్రభ!  అని తట్టగా ప్రభ పైకి లేచేసరికి ' అటు చూడు గీతిక ఎందుకు ఏడుస్తోంది.'అనడంతో లేచి కిటికీ నుండి చూసిన ప్రభ  'ఏమైంది , ఇంటికి ఆలస్యంగా వచ్చినందుకు తాతయ్య వాళ్ళు ఏమైనా మందలించారా' అనుకుంటూ ఒడి ఒడిగా వెళ్లి గేటు లోపలికి వెళ్లి 'తాతయ్య ! ఏం జరిగింది ? తనను ఏమైనా అన్నారా 'అని అడిగాడు ప్రభ.
వెంటనే ఇటు తిరిగిన గీతిక కోపంతో " ముందు నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో ఏదో హీరోలా వచ్చి  ఫీల్ అయ్యి మళ్ళీ నేను బాధపడడం చూడలేక ఓదార్చడానికి వచ్చావేమో ! నిజంగా నిన్నటి సంఘటనతో నేను చచ్చిన బాగుండేది నీవల్ల బతికి చివరికి ఉన్నది ఒక్క మా నాన్నతో అనుబంధం కూడా తెగిపోయింది. అంతా నీ వల్లే  "అంటూ ప్రభ కాలర్ని పట్టుకొని లాగుతూ బోరున విలపించసాగింది  గీతిక. పప్పు,  జేజి గీతికని ఎంత విడిపించినా అంతే ఆక్రోషoతో  ప్రభనీ కొట్టినంత పని చేసింది.

 "గీతిక!  ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ అంటున్న ప్రభను "ఇంకొక్క మాట నువ్విక్కడ నిలబడి మాట్లాడిన నిజంగా నేను ఆత్మహత్య చేసుకుంటాను.  అంది గీతిక.  " జేజి!  ప్లీజ్ తను ఆవేశంతో ఏదో మాట్లాడుతుంది లోపలికి తీసుకెళ్లండి. " అని ప్రభ సైగ చేసేసరికి జేజి గీతికని లోపలికి తీసుకెళ్లగా ఇల్లంతా కలయ చూస్తూ  'నాన్న! నాన్న! "అంటూ గట్టిగా రోదించ సాగింది. జేజి ఎంత ఓదార్చిన ప్రయోజనం లేకపోయింది.ఇక ఏం చేయాలో తెలీక వాకిలి మూసి గీతిక పక్కన కూర్చుని     తను కూడా కన్నీళ్లు పెట్టింది.

 "పుట్టించిన నాన్న ఎక్కడున్నాడో తెలీదు. పెంచిన నాన్నేమో చెయ్యి వదిలించుకుని వెళ్ళాడు .  నేనేం తప్పు చేశానని నాకి శిక్ష. నేను జరిగింది చెబుదామన్నా వినడం లేదు. నేనేం చేయాలి ,నాకు ఎవరున్నారు ,నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఎవరికి వారు  స్వార్థపరులే .నాన్నకేమో కొడుకు ఉన్నాడు .ముక్కు ముఖం తెలియని ప్రేమికుడు ఒకడు. నన్ను ఎవరు అర్థం చేసుకున్నారు . నేనెప్పటికీ అనాధగా మిగిలాల్సిందేనా!   అవునులే, అనాధ ఎప్పటికీ అనాదే కదా." అంటూ  ఊపిరి బిగబట్టి గట్టిగా ఏడుస్తూ ఉండడంతో  సోమ్మసిల్లి  పడిపోతుంది. 

జేజి నీళ్లు చెల్లి కాస్త తేరుకోగానే కొన్ని నీళ్లు తాగించేసరికి ఏడవడానికి శక్తి లేదు. నీరసించి కళ్ళు మూసుకు పోతుంటే అలాగే నిద్రపోయింది గీతిక. జేజే భయంతో గీతిక గుండె దగ్గర చేయి పెట్టి చూసి  నిద్ర వచ్చినట్టుంది అనుకుని పక్కనే విసనకర్రతో గాలిని విసరసాగింది జేజి.

ప్రభ గుమ్మం నుండి కొద్ధి దూరం వెళ్లేసరికి కళ్ళలో నీళ్లు తిరుగుతుంటే కంట్రోల్ చేసుకుని "  గుండె తలుపులు మూసిన గీతికను తలచుకొని  "తల పట్టుకుని కూర్చోగా తాతయ్య పప్పులు ఏమి చెప్పలేక కాసేపు మౌనంగా ఉండి తాతయ్య కల్పించుకొని  "ప్రభా!  ఇంతకీ ఏం జరిగింది? మీరిద్దరూ కలిసి వచ్చారని నారాయణ చెబుతున్నాడు అనగానే ప్రభా జరిగిన విషయం చెబుతాడు ప్రభ. 

  "చూడు జరిగింది వేరు. వాడు చూసింది వేరు. పాపం గీతిక చెప్పడానికి ఎంత ప్రయత్నించినా నారాయణ వినడానికి అయినా ప్రయత్నం చేయలేదు. అనేసి ఇక నన్ను నాన్న అని కూడా పిలవద్దని కండిషన్ పెట్టి వెళ్ళాడు ."ఇప్పటికే తను చాలా బాధలో ఉంది ఇప్పుడిప్పుడే తను కోలుకుంటుంది అనుకుంటుండగా ఇప్పుడు ఇలా జరిగింది చూడు. ఇప్పుడు తనకి ఇది ఇంకా తట్టుకోలేని బాధ ." ఏం చేస్తుందో ఏమో అని తాతయ్య అంటుంటే  "చచ్చిన పామును ఇంకా చంపడం అంటే ఇదేనేమో  తాతయ్య " పాపం నేను తనని ఇష్టపడడం వల్లే తనకి ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఇక జీవితాంతం నన్ను క్షమించదు. నా ముఖం కూడా చూడదు. అని ప్రభ బాధపడుతుంటే  "ప్రభ!  ముందు  మనం రూమ్ కి వెళ్దాం పద. " అని పప్పు రూమ్ కి తీసుకెళ్లాడు ప్రభాని.

***
 ఏదో ఒక గంటలో వస్తామని చెప్పి  రోజంతా  గడిపినట్టయింది అని కృష్ణమురళి అంటుంటే రాణి కార్ని నడుపుతూ కృష్ణ మురళి నిలయం దగ్గర ఆపింది.

 "కృష్ణ గేటు తీస్తావా? " అని రాణి చెప్పడంతో' ఈ వాచ్మెన్ సెలవు పెట్టి రెండు రోజులైంది ఎప్పుడొస్తాడో ఏమో ' అనుకుంటూ సరేలే, మన పని మనం చేసుకోవడంలో తప్పేముందిలే అనుకొని గేటు తీస్తూ చేతికి ఏదో తగలడంతో మరో కమీ పెట్టుకుని గేటు తీయగా కారు లోపలికి పోనిచ్చింది రాణి . కృష్ణ చుట్టూ ఒకసారి కలిగే చూసి లోపలికి వెళ్ళాడు.

 ఏమండీ!  శ్రీహరికి ఒకసారి కాల్ చేయండి వాడు ఇంటికి వెళ్ళాడో లేదో కనుక్కోండి అంది రాణి డ్రెస్ చేంజ్ చేయడానికి వెళుతూ.

 అలాగే అంటూ ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ అని వస్తుండడంతో 'వీడొకడు చేయాల్సిన పనిమీద ఎంత శ్రద్ధ ఉందో ఎక్స్ట్రాల మీద కూడా అంతే శ్రద్ధ ఉంటుంది ' అనుకొని మళ్ళీ కాల్ చేసిన స్విచ్ ఆఫ్ అని రావడంతో వాడి అనుచరులు ఒకడికి ఫోన్ చేయగా " సర్ అన్న నిన్న మీ ఇంట్లో పడుకోడానికి వెళ్లిన వాడు మమ్మల్ని అక్కడికి రావద్దు అన్నాడు కానీ ఇప్పటివరకు ఇంటికి రాలేదు. "అని అతను చెప్పేసరికి  "ఇతనికి రాత్రులు నిద్ర తక్కువ కాబట్టి ఎక్కడైనా పడుకున్నాడేమో అని రూమ్లన్నీ వెతికి ఇంట బయట అంతా చూస్తే ఎక్కడ కనిపించలేదు అంతలో రాణి రావడంతో వాడు ఇక్కడైతే లేడు. అక్కడికి వెళ్లలేదంట ఒకసారి ఇంటికి ఫోన్ చెయ్ మని చెబుతాడు కృష్ణ. 

అలాగేనండి అంటూ అమ్మకి కాల్ చేస్తే తమ్ముడు రాలేదని చెప్పడంతో తనకు తెలిసిన వారు కొందరికి ఫోన్ చేసి అడిగితే అందరి సమాధానాలు ఒక్కటే కావడంతో నిన్నటి నుండి వాడు రానేలేదని చెప్పడంతో రాణిలో గుబులు మొదలైంది .అక్క ఈ రోజు వన్ అవర్   రెస్ట్ తీసుకుని వెళ్తాను అన్న తమ్ముడి మాటలు పదే పదే గుర్తొస్తున్నాయి. ఏం చేయాలో పాలు పోలేదు. అక్కడే బెడ్ మీద కూలబడిపోయింది. ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి కరెంటు లేకపోవడంతో బ్యాటరీ తీసుకునే తిరిగి తిరిగి చూశాడు కృష్ణ. కరెంట్ ఎందుకు తీశారు .ఏదో ఓ  మోస్తారు వర్షం పడితే చాలు గాలికి తీగలు ఎక్కడ తెగుతాయో తెలియదు " అనుకుంటూ గేటు దాటి బయటికి వచ్చి కొంచెం ముందుకెళ్ళగా లైన్మెన్ కనిపించడంతో ఏంటి సార్ ఇలా వచ్చారు అని అడిగాడు కృష్ణ.