Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

ప్రణయ గీతిక - 22

లవ్లీ ఆఫీస్  నుండి వడివడిగా బయటికి వచ్చి కొద్ది దూరం వెళ్లేసరికి ఒక కారు వచ్చి ఆగడంతో అందులో ఎక్కిసరికి కారు వేగంగా వెళ్లి ఓ అందమైన గెస్ట్ హౌస్ ముందు ఆగింది.  అక్కడ బయట వాచ్మెన్ ఎవరు కూడా లేకపోవడంతో లవ్లీతోపాటు శ్రీహరి కూడా దిగి లోపలికి వెళ్ళాడు. 

 శ్రీ! ఏంటి పనిచేసే టైంలో రమ్మని మెసేజ్ పెట్టావ్ ? అంది బ్యాగ్ పక్కన పెడుతూ లవ్లీ.

 ఏం చేయాలి నాకు మూడు ఎప్పుడు వస్తుందో నాకే తెలియదు .మూడు వచ్చింది పిలిచాను అంటూ ఆమె వెనక నుండి నడుము చుట్టూ చేతులు బిగించాడు శ్రీహరి.

 హలో!  అక్కడ ఆఫీస్ లో ఉన్నది మీ అక్క కాళీమాత. ఈ విషయం పొరపాటున ఆమెకి తెలిస్తే నన్ను పీస్ పీస్ చేసి పడేస్తుంది. ఏదో ఒక అబద్ధం చెప్పి వచ్చాను అంటూ తను వేసుకున్న జాకెట్ తీసి వేసింది లవ్లీ.

 అక్కకు నేను చెబితే తప్ప తెలిసే ప్రసక్తే లేదు. అయినా దాని గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు అంటూ ఆమె నడుము పైన ఉన్న చేతుల్ని అలా పైకి తీసుకుంటూ ఉండగా ఆస్పర్శకి అతని మెడ వంపులో  తల ఉంచి చేతులతో ముఖాన్ని తడుముతూ  పై పెదవిని కొరకుతూ అతని వైపు తిరగగా అర్ధ నగ్నంగా ఉన్న ఆమెను హత్తుకునేసరికి శ్రీహరి భారీ శరీరధారుఢ్యం ఆమె పాల వెల్లువని తాకుతుంటే అతనిలో నుండి బయటికి వచ్చిన మన్మధుడు విరుస్తున్న ఆమె పెదవులను అందుకుంటూ అందులోని మకరందాన్ని ఆస్వాదిస్తుంటే మెల్లగా ఆమె పడకను చేరేసరికి తను ఆమెను చేరగా ఆమె అతన్ని చేతులు బిగించి పట్టుకునేసరికి లవ్లీ అందిస్తున్న సుఖాన్ని అనుభవిస్తూ తన కోరికను తీర్చుకున్నాడు శ్రీహరి.

 శ్రీ ! ఓకేనా అంది లవ్లీ అతని ముఖం చూస్తూ. 

 'ఓకే ! ఇదిగో బ్యాంక్ చెక్' అని లక్ష రూపాయలని అంకెల్లో బ్యాంక్ చెక్కు మీద రాసి ఇవ్వగా ఆచక్ తీసుకొని పక్కనపెట్టి లవ్లీ బట్టలు వేసుకుంటుండగా శ్రీహరి ఫోన్ మోగడంతో అమ్మో బావ ! వీడియో కాల్ చేస్తున్నారేంటి. 'లవ్లీ!  ముందు నువ్వు ఇక్కడనుండి వెళ్ళిపో  అని చెప్పగా లవ్లీ వేరే  వెహికల్ రావడంతో వెళ్లిపోయింది.  ప్లాట్ కి వెళ్లి సైట్ ని ఒకసారి వీడియో కాల్ చేసి చూపించమన్నారు బావగారు . మరిచిపోయాను అనుకొని సైట్ చూపించడానికి వెళ్ళిపోయాడు శ్రీహరి.

 శ్రీహరి, కృష్ణ మురళికి సైట్ ని వీడియో కాల్ చేసి చూపించి మరలా గెస్ట్ హౌస్ లో ఏదో మర్చిపోయానని వస్తే డోర్ తీయగానే కిందపడి ఉన్న బ్యాంక్ చెక్ చేతికి తీసుకొని చూస్తే దానిపై రాసిన అంకెల్ని చూసి ఆశ్చర్యపోయాడు. వెంటనే తన మనుషులని పిలిచి లవ్లీ ఉన్న హౌస్ లో ఆమెని అటాక్ చేయమని చెప్పి పంపించగా అక్కడ లాక్ చేసి ఉండడంతో వాళ్లు శ్రీహరికి విషయం చెప్పేసరికి దాన్ని కనిపిస్తే చంపి పారేయండి అని  ఆర్డర్ ఇచ్చాడు శ్రీహరి.

 మరుసటి రోజు లవ్లీ ఆఫీస్ కి రాకపోయేసరికి లవ్లీ ఎందుకు రాలేదు. కనీసం ఇన్ఫర్మేషన్ అయినా ఇవ్వాలి కదా.  తను చాలా సెన్సియర్గా వర్క్ చేస్తుందని ఇంతవరకు ఏం చేసినా చూస్తూ ఉన్నాను అని కోప్పడింది రాణి. 

 అంతలో తమ్ముడు శ్రీహరి అటు హడావిడిగా రావడంతో ఏంట్రా కంగారుగా ఉన్నావ్ ? అడిగింది రాణి.

 ఏం లేదు , బావ సైట్ కి తీసుకొని పొమ్మన్నారు అందుకే ఇక్కడికి వచ్చారేమో అని వచ్చాను.

 మీ బావ ఇంకా ఇంట్లోనే ఉన్నారుగా అక్కడికి వెళ్ళు అని చెప్పింది రాణి.

 సరే అక్క అంటూ స్టాప్ ని ఒకసారి గమనిస్తూ వస్తూ ఉంటే లవ్లీ కనిపించలేదు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు శ్రీహరి.

 తమ్ముడిని పరిశీలనగా చూసిన రాణి ఏంటి వీడు ఏదో విషయం తనలోనే దాస్తూ ఎవరినో  వెతుకుతున్నట్టు అనిపిస్తుంది. వాడైతే ఏమి చెప్పలేదు అనుకొని గీతిక! అని పిలిచింది రాణి.

మేడం అంటూ వచ్చింది గీతిక.

ఇచ్చిన టార్గెట్ ఫినిష్ అయిందా అడిగింది రాణి.

 ఆల్మోస్ట్ అయిపోయినట్టే మేడం అంది గీతిక.

 ఇంకా వర్క్ పెండింగ్ ఉంటే ఆ లవ్లీ నో, మాలతినో హెల్ప్ తీసుకో త్వరగా ఫినిష్ చేయండి అని చెప్పి వెళ్ళింది రాణి.

అది విని  అలాగే మేడం అంటూ గీతిక వెళ్ళియితుంటే అరే! లవ్లీ రాలేదుకదా అనుకుంటూ మల్లె గీతికా అంటూందగా గీతిక ఆల్రెడీ తన చామ్బెర్లోకెళ్లగా సైలెంట్ అయిపొయింది రాణి.

 గీతిక లవ్లీ కోసం చూడగా అమ్మాయి కనిపించలేదు. ఇక మాలతి కూడా అక్కడ లేకుండా  పోవడంతో తనే వన్ అవర్ ఎక్స్ట్రా వర్క్ చేసి కంప్లీట్ చేసి రాణి మేడమ్ కి మెయిల్ చెయ్ కి పంపించింది.

 తర్వాత రోజు సెలవు కావడంతో గీతికా తన చిన్ననాటి స్నేహితురాలు శృతిని మాట్లాడించాలని బయలుదేరుతూ ఉంటే పప్పు కూడా కనిపించడంతో మాట్లాడించాగా, "గీతిక! నీ సమస్యకు పరిష్కారం చక్కగా దొరికిందoట కదా అడిగాడు పప్పు. 
అవును, మంచి పరిష్కారమే దొరికింది చెప్పింది గీతిక.

 నిజంగా  యు ఆర్  బ్రిలియంట్  సుమా!

 హలో!  పప్పు అంతా మెప్పు వద్దు బాబు. 

  ఉన్న మాటే చెబుతున్నాగా.

 సరేలే నీతో ఎందుకు నాకు వాదన. ఇంతకీ ఎక్కడికి బయలుదేరావ్?

 నువ్వు ఎక్కడికి బయలుదేరావడిగాడు పప్పు.

 ముందు నువ్వు చెప్పరా.

 లేదు, నేను ముందు చెప్పను ఎందుకంటే మళ్లీ నువ్వు కోప్పడతావ్ నువ్వే ముందు చెప్పు.

 సరేలే, నేనే సీబుతా.ఈరోజు హాలిడే కాబట్టి నా ఫ్రెండ్ ని చూడడానికి వెళుతున్న.

 నేను మెడికల్ షాప్ కి వెళ్తున్నాను చెప్పాడు పప్పు.

 బాగానే ఉన్నట్టు కనిపిస్తున్నావు కదరా.

 నాకు కాదు గీతిక. మా వాడికి  జలుబు, తలనొప్పి చాలా ఉందని  ఉదయం నుంచి కప్పిన బెడ్ షీట్ తీలేదనుకో పాపం తలనొప్పితో సతమతమై పోతున్నాడు  అందుకే టాబ్లెట్ తీసుకురావాలని వెళ్తున్నాను.

 భరించరాని తలనొప్పా .ఆ తలనొప్పి నిజంగానే వచ్చిందా లేదా తెచ్చుకున్న తలనొప్పా.

 ఇదేం ప్రశ్న సిస్.

 అతనికి అలాంటి తలనొప్పులు ఎక్కువ వస్తుంటాయి కదా అందుకే అడిగాను. 

 లేదు లేదు నిజంగా  వాడు తలనొప్పి తో బాధపడుతూ ఉన్నాడు చెప్పాడు పప్పు. 

 అవునా ! అయితే నాతో నేను నా దగ్గర ఒక చిట్కా ఉంది.

 అదేంటో చెప్పవా ప్లీజ్.
మెడికల్ షాప్ లో దొరికే జలుబుకి ఆవిరి పట్టే టాబ్లెట్స్ని,  నీళ్ళని బాగా మరిగించి అందులో వేసి రగ్గు కప్పుకొని ఆవిరి తీసుకుంటే కొంచెం ఉపశమనం కలుగుతుంది. తర్వాత  రెండు రోజులు వేడి నీళ్లు తాగాలి అంతే జలుబు తలనొప్పి మాయమైపోతుంది చెప్పింది నవ్వుతూ గీతిక. 

 గీతిక!  మీరిద్దరూ తోడు దొంగలు. ఇద్దరికీ ఏదో అనుబంధం ఉందనిపిస్తుంది లేకపోతే వాడికి బాగా లేకపోతే నువ్వెందుకు స్పందిస్తావో చెప్పు " ఇద్దరూ ఇద్దరే కానీ ఇద్దరు అర్థం కారు" అనుకుని టాబ్లెట్స్ తీసుకొని వెళ్ళాడు పప్పు.

 ప్రభ ! లేరా టాబ్లెట్ తెచ్చాను అని పప్పు లేపగా,  ప్రభ లేచి టాబ్లెట్ వేసుకొని పడుకో బోగ ఆగాగు. అప్పుడే పడుకోవద్దు గీతిక నీకు ఒక చిట్కా చెప్పింది అనీ పప్పు లేచి  ఆ చిట్కా చెప్పి లేచి వెళ్లి స్టవ్ మీద వేడి నీళ్లు మరిగించగా మరిగించి తీసుకొచ్చాడు.

నాతో మాట్లాడారు. కనీసం చూడరు. అలాంటి వాళ్ళు నాకు చిట్కా చెప్పడం ఏంటి?

  మీరిద్దరూ   అయస్కాంతము లో  ఒకరు ఈస్ట్ అయితే మరొకరు వెస్ట్  కాబట్టే  అయస్కాంతంలా ఎక్కడో ఓచోట ఆకర్షించుకుంటారు. కాకపోతే మీ ఇద్దరికీ అది అర్థం కావట్లేదు. ఏం చేద్దాం, టైం రావాలి. ముందు ఇక్కడికి రా అని అందులో టాబ్లెట్స్ వేసి వంగు అని చెప్పి బెడ్ షీట్ కప్పి ఒక నాలుగు సార్లు ఆవిరి పట్టేసరికి అమ్మ అంటూ మళ్ళీ అలాగే  పడుకున్నాడు ప్రభ.

 ఇప్పుడెలా ఉంది అడిగాడు పప్పు.

 ఇప్పుడు కొంచెం ఊపిరి ఫ్రీగా ఆడుతున్నట్టు ఉంది రా. 

 హమ్మయ్య ! చిట్కా పనిచేసింది అన్నమాట.

 ఉండొచ్చు అన్నాడు ప్రభ..

  టాబ్లెట్స్ వేసుకున్నావుగా పడుకో.అదే తగ్గిపోతుందిలే. నీకు వాటర్ కావాలంటే వేడి నీళ్లు ఇక్కడ పెట్టాను తాగు. చల్లటి నీళ్లు తాగొద్దు. అని చెప్పి పప్పు  బయటికి వెళ్ళాడు.

 "గీతిక !నీలో ఉన్న నీ అంతరంగం నిన్ను డ్రామా ఆడిస్తూ ఉంది . నీకు అర్థం కావట్లేదు కానీ అర్థమయ్యే రోజు కచ్చితంగా వస్తుంది." థాంక్యూ డియర్ నాకు ఇప్పుడు నిద్ర వస్తోంది" అనుకుంటూ పడుకున్నాడు ప్రభ. 

శృతిని కలవడానికి వెళుతున్న గీతికకు దారిలో

 గీతిక కొద్ది దూరం వెళ్ళాక మాలతి కనిపించింది.మాలతి ,ఏం గీతిక!   ఎక్కడికి వెళ్తున్నావ్? అడిగింది మాలతి.

 మా ఫ్రెండ్ ఇంటికి వెళుతున్నాను చెప్పింది గీతిక .

 గీతిక  నీకీవిషయం తెలుసా!   మన రాణి మేడమ్ భర్తకి హార్ట్ ప్రాబ్లం  వచ్చిందని కొంతమంది స్టాఫ్ చూడటానికి వెళ్లారు.  నేను కూడా అక్కడికే వెళుతున్నాను చెప్పింది మాలతి.

 అవునా!  ఆ విషయం నాకు తెలియదే . పాపం రాణి మేడమ్   స్ట్రిక్ట్    అయినా పర్లేదు మంచివారే అలాంటి వాళ్లకి ఇలా జరుగుతూ ఉంటుంది పాపం అంది గీతిక జాలిగా.

 మరి నీ ఫ్రెండ్ లవ్లీ  రాలేదే.

 లవ్లీ ఏదోముఖ్యమైన పని మీద ఊరెళ్ళిందంట.

 అవును హార్ట్ ప్రాబ్లం వస్తే  హాస్పిటల్ కి తీసుకు వెళ్ళాలి గాని ఇంట్లో ఎందుకు ఉన్నారు అడిగింది సందేహంగా గీతిక.

 నిన్న మధ్యాహ్నం అలా జరిగిందంట.  రాత్రంతా హాస్పిటల్ లో ఉండి ఇప్పుడు ఇంకా ఇంటికి వచ్చారని చెప్పారు.

 అవునా ! అయితే ఇప్పుడు బాగానే ఉందంటనా?  డాక్టర్స్ ఏం చెప్పారు? 

 గుండెలో కొంచెం హోల్ అయింది. ప్రస్తుతం కి ట్రీట్మెంట్ ఇచ్చాము . పెద్ద హాస్పిటల్ కి వెళ్తే అది క్యూర్ అవుతుంది అని డాక్టర్ చెప్పారంట.
సరేలే నువ్వు వెళ్ళు నేను మా ఫ్రెండ్ ఇంటికి వెళ్లి టైం ఉంటే అలాగే చూసి వస్తాను చెప్పింది గీతిక.

  సరే నీ ఇష్టం.  కానీ సర్ ని ఇక వన్ అవర్ లో హాస్పిటల్ కి తీసుకువెళ్తారంట అందుకే అందరూ వెళ్లారు. నేను కూడా వెళ్తాను చెప్పింది మాలతి.

 అలాగా ! అయితే నేను కూడా వచ్చి చూసి అలా మా ఫ్రెండ్ ఇంటికి వెళ్తానులే అని మాలతి బండిలో వెనక కూర్చుంది గీతిక.

 మాలతి స్కూటీని రైడ్ చేస్తూ ఉండగా గీతిక అడిగిన ప్రశ్నలకు జవాబు చెబుతూ ఒక బంగ్లా దగ్గరికి వెళ్ళగా అదిగో చూడు అదే మేడం వాళ్ళ ఇల్లు చూపించింది మాలతి.

 ఎంత పెద్ద బంగ్లా !  చాలా బాగుంది. చుట్టూ గ్రీనరీ తో ఎంత బాగా కనిపిస్తుందో ! బయటే ఇంత అందంగా ఉంటే లోపల ఎలా ఉందో  అంది గీతిక.

 అవును, ఇంకా లోపలికి వెళ్లి చూస్తే   లోపల ఎలా ఉందో అంది మాలతి.

 బంగ్లా గేటు దగ్గరికి చేరుకోవడంతో చుట్టూ చూసిన గీతిక , బోర్డు ను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయింది. "కృష్ణ మురళి నిలయం " అని బోర్డు చదివిన గీతిక అరే! ఇది సర్ వాళ్ళ ఇల్లు. పేరుకు తగ్గట్టుగా ఇల్లు కూడా బాగుంది అని బోర్డుని  తడుముతూ "సర్ చాలా మంచి వాళ్ళు పాపం వారికి ఎందుకిలా జరిగిందో ఏంటో! " అనుకుంటూ ముందుకు అడుగు వేసింది గీతిక.

 ప్రభకి తలనొప్పి తగ్గడంతో పైకి లేచి పప్పు కోసం చూస్తుంటే లోపలికి వచ్చిన పప్పు, ప్రభా! ఓనర్ ఎందుకో ఫోన్ చేసాడు చూడరా నీతో మాట్లాడాలంట  అని ఫోన్ ఇచ్చి కిందికి వెళ్లిపోయాడు పప్పు.

 ప్రభ ఓనర్ కి కాల్ చేయడంతో అతను రిసీవ్ చేసి  "ప్రభ!  ఇంటి దగ్గరకు వస్తావా  నువ్వు వెళ్లి ఆ కొత్త బిల్డింగ్ దగ్గర ఎలా పనిచేస్తున్నారో చూసొద్దాం."అని పిలిచాడు ఓనర్.

 "సర్ మీకు జ్వరం వచ్చిందని చెప్పారు కదా!  మీరు రెస్ట్ తీసుకోండి. నేను ఆల్రెడీ ఆ బిల్డింగ్ చూశాను. నేను, పప్పు వెళ్లి  వస్తాం."అని ప్రభ చెప్పడంతో  'సరే వెళ్ళిరండి' అని చెప్పాడు ఓనర్.

 ప్రభా కిందికొచ్చి పప్పు కోసం చూడగా వాడు బయటికి వెళ్ళాడు అని తెలిసి ఒక్కడే బయలుదేరాడు.