Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

ప్రణయ గీతిక - 20

గీతిక ఫోన్ చేసిన తర్వాత లిఫ్ట్ చేసిన పప్పు మాటలతో ప్రభలేచి కూర్చోవడం   చూసి స్పీకర్ ఆన్ చేశాడు .

 ఆ వినిపిస్తుంది చెప్పు  అన్న పప్పుతో "సాయంత్రం చిన్న ట్రేట్ ఇస్తున్నా   తప్పకుండా రావాలి" అన్న వాయిస్ వినగానే ప్రభలేచి దగ్గరికి వస్తుంటే నవ్వుకున్నాడు పప్పు.

 అలాగే తప్పకుండా వస్తాం.

 "వస్తాం కాదు బ్రో వస్తా అని చెప్పు " అన్నమాట విని  ప్రభ ముఖం ఎర్రబడింది.

 పప్పు ఇంకా ఏదో చెప్పబోతుంటే వెంటనే కాల్ కట్ చేసి" ఈ బ్రో ఎప్పటినుండి" అన్నాడు పప్పు చేతిలోని ఫోన్ తీసుకుంటూ ప్రభ.

 అది చెబితే నువ్వు నమ్ముతావో లేదో కానీ నా మీద మాత్రం కోపగించుకోనంటేనే చెబుతాను.

 అదేదో విసగించకుండా త్వరగా చెప్పరా బాబు అన్నాడు ప్రభా పళ్ళు బిగించి మాట్లాడుతూ.

 "వామ్మో ! కోపం వస్తే  వీడు విశ్వామిత్రుని మించిపోతాడు. " అనుకొని ఆరోజు ఎగ్జిబిషన్ కి వెళ్ళామా అన్నాడు పప్పు.

 ఆ  వెళితే..

ఆ కాదు కాదు 
కాదు ఏంట్రా 
గీతిక వాళ్ల నాన్న బంగారం ని పిలుచుకొని వచ్చాడు చూడు ఆ రోజు రాఖీ పండుగ . బంగారం చేతికి కట్టిన రాఖి చూసి  "నాకు కూడా ఒక అక్కో, చెల్లో ఉండి ఉంటే రాఖీ కట్టించుకునే వాడిని." అని వాడితో నేను అన్నాను. వాడు గీతికతో ఆ మాట చెప్పాడో ఏమో,   అప్పుడు   నా కుడి చేతికి కట్టింది లే.   ఆ రోజు  నుంచి  తను నాకు చెల్లి అయిపోయింది. ఇంకో విషయం 
ఏంటది అన్నాడు ప్రభ.
రాఖీ కట్టేటప్పుడు నేను నువ్వు కలిసి వెళ్ళాo అక్కడ నువ్వు కూడా అడిగితే కట్టి ఉండేది కదా

ఏంట్రా ఏమన్నావ్ నాకు నా జీవితంలో ఉన్నది తను ఒక్కటి నా జిందగీ అలాంటిది అంటూ  లేచి వస్తుంటే లేదు లేరా జస్ట్ జోక్ అంతే నీ గురించి నాకు తెలియదా ఏంటి అని పప్పు చెబుతూ ఉండగా

సరే నువ్వు తనికి బ్రో అయిపోయావు గా ఇంకా నీ చెల్లి పిలుస్తుంది ట్రీట్ కి వెళ్ళు అన్నాడు ప్రభ.

ప్రభా నిజంగా తనను దగ్గర నుంచి చూస్తే చాలా మంచిదే కానీ  తనలో భయం , అపనమ్మకం తనని కదిలించలేకపోతున్నాయి.  ముందు తన మనసులో ఎటువంటి భావన ఉందో తెలుసుకో , భయాన్ని పోగొట్టు ,  నమ్మకాన్ని కలిగించు .  '   కోపం క్షణంలో రావచ్చు కానీ శాంతం రావడానికి క్షణం సరిపోదు అర్థం చేసుకో ప్రభా.

 అవును నేనే అర్థం చేసుకోవాలి నన్ను ఎవరు అర్థం చేసుకోరు అంటూ నిట్టూర్చాడు ప్రభ.

 ప్రభా  నేనేదో మామూలుగా తను ఏమైనా  చెబుతుందేమోనని      స్పీకర్ ఆన్ చేశాను . సారీ రా !  అని పప్పు చెప్పగా బెడ్ మీదకి వెళుతూ పప్పు!  నేనేమైనా అంటానని వెళ్లకుండా ఉండేవు నువ్వు వెళ్ళు. "నువ్వు ఆ మధుర హోటల్ కి ఎందుకు వెళ్లాలి అనుకుంటున్నావో నాకు తెలుసు. దాని పక్కనే చామంతి ఇల్లు ఉందిగా కాబట్టి నీ ఇష్టం ."అని ప్రభ చెప్పడంతో పప్పు ప్రభ గురించి బాధగానే ఉన్న చామంతి కోసం బయలుదేరి వెళ్ళాడు.

 పప్పు వెళుతుంటే  ప్రభ అటువైపే చూస్తూ " గీతికని నేనే తొందరపడి నేను ఇష్టపడుతున్నాను అన్న ఫీలింగ్ నాలో కనబడేలా చేసానేమో .     అవును, నాదే తప్పేమో ఒకమ్మాయి మనసు  మొగ్గగా ఉందని తెలుసుకోలేకపోయాను ఆ మొగ్గ విచ్చుకున్నప్పుడు చెబితే బాగుంటుంది . అయినా ఆ పరిమళం నాకెలా తెలుస్తుంది మనం ఎంత ఆలోచించినా ఎవరో ఒకరు బహిర్గతం చేయవలసిందేగా. మనసులో ఏముందో తెలిసేది అప్పుడే.  ఎంతైనా ఆ అమ్మాయి మరీ నన్ను ఇంత బాధ పెట్టడం సరికాదు . నాకు తెలిసి ప్రాజెక్టు సక్సెస్ అయినందుకే తను ఈ చిన్న ట్రీట్ ఇస్తుందని అర్థమైంది. కాబట్టి ఆ అమ్మాయి అంతరంగం అర్థమయ్యేదాకా కాస్త మౌనంగా ఉండడమే మంచిది అనుకొని మనసుని సముదాయించుకుని లైట్ ఆఫ్ చేసి బెడ్ షీట్ నిండుగా కప్పుకొని పడుకున్న నిద్ర రాకపోయేసరికి లేచి వెళ్లి తన చిన్న లైబ్రరీలోనే ఒక పుస్తకం తీసి పేజీ ఓపెన్ చేస్తే  "ప్రేమిక "  అన్న పుస్తకం చూసి అరే!  ఈ పుస్తకం నా సెల్ఫ్ లోకి ఎలా?....,     .  అనుకొని అది లోపల పెట్టి మరో పుస్తకం తీస్తే "  శృంగార వీణ" అన్న పేరు చదివి అబ్బా ! ఏ  మహానుభావుడు ఇక్కడ పెట్టాడో గాని నా మూడ్ కి  సెట్ కాని బుక్స్ దొరుకుతున్నాయి . అనుకొని పుస్తకాన్ని పక్కన పడేసి అలా బయటకు వెళతాడు. వస్తుండగా ఒక అంకుల్ అటువైపు రావడంతో తనతో మాటలో పడి కాస్త మనసును కుదుట పరుచుకున్నాడు.

 "మధుర హోటల్ "మీడియం  హోటల్ అయినా చాలా వెరైటీస్,  టేస్టీ ఫుడ్ దొరుకుతుంది అందుకే కస్టమర్స్ కూడా అలాగే నిండుగా ఉంటారు.

 లవ్లీ!  ఈ ట్రీట్  ఎందుకంటావ్   అడిగింది మాలతి సందేహంగా.

 ఓ ! నీకు తెలియదు కదా . మన అయిదుగురి ప్రాజెక్టు ప్లాన్స్ లో గీతిక ప్లాన్స్ ని డెమో ఇప్పించాడు సార్. చూశావుగా!  మనం ఛాంబర్ లో ఉన్నప్పుడే లోపలికి వెళ్లి తలుపేసింది అంది లవ్లీ.

 అవును, నేను చూశాను. అయితే   వచ్చిన బిజినెస్ పార్ట్నర్స్ గీతిక ప్లానిoగ్ కే  ఓకే చెప్పారన్నమాట అంది మాలతి.

 ఇంతకీ ప్రాజెక్టు సక్సెస్ అయిందని నీకెలా తెలుసు?  అడిగింది మాలతి.

  నా లంబు ఉన్నాడుగా ! వాడే మెసేజ్ పంపించాడు.

 లంబు   ఎవరు? 

 అదేనే, ఆరోజు మనం డెమో ఇవ్వాలని రూంలో ఉంటే సర్  కంటే ముందే ఓ ఆరడుగుల ఎత్తన్న వ్యక్తి సూటు బూటుతో వచ్చాడు చూడు వాడు.

 వాడు చూడడానికి ఏమoత.... అని మాలతి ఇంకా ఏదో చెప్పబోతుండగా,  చూడు!  వాడు ఆవరేజ్ ఫేస్ అయినా ఎవరనుకున్నావు?  ఈ కంపెనీకి వారసుడు రాణి మేడమ్ తమ్ముడు శ్రీహరి.

 నువ్వే సరినే  " ధోని సిక్స్ కొట్టి వరల్డ్ కప్ తెచ్చినట్టు కోట్ల పడగతో గొడుగు పట్టించుకుoటున్నావ్.

 మరి  ఈ లవ్లీ అంటే ఏమనుకున్నావ్ ఏదైనా అనుకుంటే సాధించే దాకా వదలదు అంది లవ్లీ. 

 సరే నీ మాటల్ని ఆపి అక్కడ చూడు. వేసింది సింపుల్ డ్రెస్ అయినా కొత్త హెయిర్ స్టైల్ ఏం లుక్ కనిపిస్తుంది కదా అని మాలతి అంటుంటే అటు ఇటు చూసి  " ఎవరి గురించే నువ్వు చెప్పేది "  అన్న లవ్లీతో ఇంకెవరు  "ప్రాజెక్ట్ విన్నర్ క్వీన్ గీతికా." అనగానే అటు చూసి నువ్వు చెప్పింది నిజమేనే తను అలాగే కనిపిస్తోంది అంటూ ఉండగా గీతిక రావడంతో ఇద్దరినీ పలకరించింది గీతిక.

 లవ్లీ ! క్యాబ్  వాడు టైం కి వచ్చాడా?  అని గీతిక అడిగేసరికి జడుసుకుంది మాలతి.

 ఏంటే  క్యాబ్  ని  బుక్ చేసింది నువ్వు  కాదా   అని  చెవిలో గొణిగిన మాలతితో , మరి నా డబ్బులు వేస్ట్ చేసుకుంటానా అంది లవ్లీ.

 నువ్వు చాలా గ్రేట్ డబ్బు గురించి ఎంత జాగ్రత్త తీసుకుంటావు అని మాలతి అంటూ ఉండగా గీతిక ఇటు వైపు తిరిగేసరికి నవ్వుతూ హోటల్ లోపలికి వెళ్లి టేబుల్ చుట్టూ ఉన్న రెండు చేర్ లలో   కూర్చున్నారు ఇద్దరు. గీతిక ఎదురుచూస్తున్న జున్ను,  గుండులు కూడా రావడంతో ఎవరికి ఏం కావాలో ఆర్డర్ ఇచ్చి కూర్చుంది గీతిక.

 గీతిక!  ఇంతకీ ఈ ట్రేట్ ఏంటి అడిగింది మాలతి తెలిసినా అమాయకంగా.

  ఎందుకంటే ఈరోజు మా తమ్ముడు బంగారం పుట్టినరోజు అంది గీతిక.
గీతిక!  నువ్వు నీ తమ్ముడి పుట్టినరోజు చేస్తుండొచ్చు కానీ నీ సంతోషానికి కారణం మాత్రం ప్రాజెక్టు ప్లానింగ్ సక్సెస్ అని నాకు తెలుసులే "  అనుకుంది మనసులో లవ్లీ.

 జున్ను, గుండులు మాత్రం ఈ మాటలేవి పట్టించుకోకుండా ఇద్దరూ తమకి ఇష్టమైన వాటిని షేర్ చేసుకుంటూ తింటున్నారు. గుండు కల్పించుకొని హ్యాపీ బర్త్డే టూ యువర్ బ్రో గీతిక అన్నాడు.

  థాంక్యూ అంది గీతిక.

 లవ్లీ,  మాలతి వాళ్లు కూడా' హ్యాపీ బర్త్డే టూ యు యువర్ బ్రదర్ ' అని చెప్పడంతో 'థాంక్యూ వెరీ మచ్' అని చెప్పింది వారికి కూడా గీతిక.

 తినడం ముగియగానే లవ్లీ మాలతీ లు  అనుకున్న మాటలు గీతిక నోటి నుండి రాకుండా పోవడంతో ఏదో అర్జెంట్ వర్క్ ఉందని వెళ్లారు ఇద్దరూ.

 గీతిక! ఎందుకు అబద్ధం చెప్పావు అడిగింది జున్ను.

 అబద్ధం చెప్పకపోతే  వాళ్ళు కూడా నాతో పాటు ప్రాజెక్టు ప్లానింగ్ తెచ్చారు కదా బాధపడతారేమో అని అలా అన్నాను అంతే అని చెప్పింది గీతిక.

 మంచి పని చేసావు  లేదంటే మాలతి చచ్చిపోయేది అన్నాడు గుండు. అవునా!  అని చూసింది గీతిక.

పప్పు 'మధుర హోటల్ 'అని బోర్డు చదివి లోపలికి పోకుండా నేను త్వరగా వెళ్లి చామంతిని మాట్లాడించి రావాలి అని వడివడిగా  వెళ్లి చామంతి వాళ్ళింటి గోడ పక్కన నిలబడి చామంతికి మెసేజ్ పెట్టి తొంగి చూడగా చామంతి వాళ్ళ నాన్న కనిపించడంతో  "అబ్బా  ! బట్టతల భద్రయ్య నీతో గొడవ పడే ఓపిక నాకు లేదురా నాకు ఇల్లు ఉంది పొలం ఉంది కానీ అది నీకు సరిపోదoటావు. నన్ను తాగుబోతుని ఎన్నిసార్లు తిట్టావురా అందుకే రోజు రోజుకి తాగేది తగ్గిస్తున్న." అనుకుంటూ మరోసారి  తొంగి చూడగా అతను అక్కడ ఎవరితోనో మాట్లాడుతూ ఉంటే  "ఈ రోజు వచ్చింది వేస్ట్ ఏమో వీడు నాకు చామంతిని ఇచ్చేది లేదని భీష్మ ప్రతిజ్ఞ చేసుకున్నాడు. " అని  ఇటు వైపు తిరిగేసరికి చామంతి మెసేజ్ చదివినాక చామంతి వచ్చి అప్పుడు మాట్లాడించి వెళ్లడంతో అక్కడి నుంచి    మధుర హోటల్ కి వస్తాడు 

హోటల్ లో గీతిక, జేజి, తాతయ్యలు మాత్రమే ఉండడంతో " హాయ్ గీతిక! అని పప్పు పలకరించగా'  ఇప్పుడా రావడం ఇదిగో నీ కోసం ఆర్డర్ ఇచ్చినవి చల్లారిపోయాయి. అని గీతిక అనేసరికి, ఏదో చిన్న పని ఉంటే వెళ్లాల్సి వచ్చింది అని చెప్పి  జాయిన్ అవ్వగా, పప్పు ఒక్క నిమిషం  వేరే ఆర్డర్ ఇస్తానులే అన్న గీతికతో, వద్దులే గీతిక వేడిగానే ఉన్నట్టుంది అంటూ ఆరగించగా గీతిక బిల్లు కట్టడానికి వెళ్లడంతో పప్పు కూడా వచ్చి ఒక బిర్యాని పార్సెల్ కావాలని అడుగుతుంటే హోటల్ అతను ఇవ్వగా పప్పు నేనే అమౌంట్ పే చేస్తాను అంది గీతిక.

 అసలు ఇది ఎవరికన్నుకున్నావు?  మావాడు ప్రభకి.  ఈ టైంలో నువ్వు డబ్బు పే చేసావని తెలిస్తే దీనిని అసలు ముట్టుకోడు. వాడికి కోపం వస్తే తట్టుకోలేడు వద్దు, నేనే ఇస్తానని చెప్పి తనే డబ్బిచ్చి గీతిక వాళ్ళతో పాటే కలిసి వెళ్ళాడు పప్పు.

 రూమ్ కి వచ్చిన పప్పు, ప్రభ కోసం చూడగా ముసుగుతన్ని , గుర్రుపెట్టి నిద్రపోతున్న ప్రభను లేపలేక, ఉండలేక , ఏం చేయాలో అర్థం కాక అటు ఇటు తిరుగుతుంటే రూమ్ బయట ఓ దుబ్బ పిల్లాడు మారం చేస్తుంటే ఎత్తుకొని అటు ఇటు తిరుగుతూ ఓదారుస్తున్న ఒక ఆమెను చూసి అక్క ! బాబు ఎందుకు మారం చేస్తున్నాడు అంటూ ఆ బాబు దగ్గరికి నిలబడి ఏం కావాలి నాన్న అంటూ తొడ దగ్గర  గిచ్చడంతో వాడు ఇంకా గట్టిగా అరుస్తుంటే పప్పు నోరు కూడా లేవడంతో ఆ సౌండ్ కి  ప్రభ లేచిన ప్రభ బయటికొచ్చి " ఏమ్మా! పిల్లాడికి ఏమైందో కాస్త చూడు గుక్క పెట్టి ఏడుస్తున్నాడు పాపం" అని అంటూ ఉంటే' లేదు ప్రభా ఇందాక నేను ఎంతో కష్టపడి వాడిని సముదాయించా. ఇదిగో ఈ సచ్చినోడు చిన్న , కన్నా అంటూ ఏం చేశాడో ఏమో వాడు ఇంకా గట్టిగా ఏడుస్తూ ఉన్నాడు. గుడ్ల గూబ కళ్ళు  వీడు. వీడు చూసినా ఏడుస్తారు పిల్లలు అంటూ వెళ్లిపోయిందామే.

 ఏంట్రా ఆ పిల్లాడిని ఏం చేసావ్ ఏంటి.

 అబ్బే! నేనేం చేయలేదు వాడు ఏడుస్తుంటే ఇంకా ఓదార్చడానికి ప్రయత్నించాను.

 నాకు నీ గురించి తెలియదేoట్రా పిల్లల్ని గిచ్చే అలవాటు ఉందని నాకు తెలుసు కదా. చేసింది చాలు పదా లోపలికి అంటూ మళ్ళీ వెళ్లి పడుకున్నాడు ప్రభ.

కస్టపడి లేచేలా చేస్తే మళ్ళీ అదేపని చేస్తున్నావేంట్రాఅనుకుని బెడ్ దగ్గరికెళ్లి "ప్రభ! అన్నం తిన్నావా?  పాత్ర కూడా ఖాళీగానే ఉంది.కనీసం టీ కూడా తాగినట్టు లేదు. లేరా!  నీ కోసం బిర్యానీ తెచ్చాను అని లేపుతున్నాడు పప్పు.

 నాకు ఆకలిగా లేదు.

 అలా అంటే ఎలా ? కొంచెం తినరా ప్లీజ్ నేనే నా డబ్బులతో తెచ్చాను.

 నేనేమైనా ఎవరైనా పార్టీకి  పిలవలేదని అన్నం తినకుండా ఉండను. పనిచేయడానికి శక్తి కావాలి గా అందుకే ఓనర్ తో కలిసి పార్టీకి వెళ్లి కడుపునిండా తినొచ్చాను సరేనా నాకు నిద్ర వస్తుంది నన్ను ఇలా వదిలేయ్ అంటూ మళ్ళీ రగ్గు కప్పుకునేసరికి  బిరియాని మూత పెట్టి పాపం వీడు ఎంత బాధ పడుతున్నాడో ఏమో కాలమే వీడికి అనుకూలించేలా చేయాలి అనుకుని తాను కూడా నిద్ర లోకి జారుకున్నాడు పప్పు.