Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

ప్రణయ గీతిక - 17

ప్రభ వైన్ బాటిల్ వలన నిజంగా " బ్యాటిల్ "  చేయాల్సి వచ్చింది. బాటిల్ తీసుకొస్తుండగా గీతికతో ఆటో జర్నీ చేయడంతో తను చేసిన యుద్ధం నుండి   ఉపశమనం పొందాడు. గీతిక తాతయ్య కోసం తెచ్చిన టాబ్లెట్స్ అతనికి ఇస్తూ తాతయ్య ఈరోజు నాలుగు ఐదు షాపులు తిరిగిన మీ టాబ్లెట్స్ దొరకలేదు చివరికి ఎంత దూరం వెళ్లానో తెలుసా? అనీ బుంగమూతి పెట్టి చెబుతూ నీళ్లు తీసుకొచ్చి నిలబడింది గీతిక.

 ఇంకో రోజు తీసుకొచ్చి ఉంటే సరిపోయేది కదమ్మా అంత దూరం ఎందుకు వెళ్లావు అన్నాడు తాతయ్య.

ఈ   టాబ్లెట్స్ వేసుకోకపోతే నీ హెల్త్ కి  ప్రాబ్లం అవుతుంది కదా.  నాకేo రిస్క్ కాదులే తాతయ్య ముందు టాబ్లెట్ వేసుకోండి అని తాతయ్యకి టాబ్లెట్స్ ఓపెన్ చేసి ఇచ్చి నీళ్లు  ఇవ్వగా తాతయ్య వేసుకున్న తర్వాత రూమ్ తన రూమ్ కి వెళ్లి  ఉదయం త్వరగా లేచి ఆఫీసుకి వెళ్ళింది గీతిక.

 ఆఫీస్ కి వెళ్ళగానే రాణి కి విష్ చేసి వచ్చి తన పని చేస్తుండగా బ్రేక్ టైం లో పరిచయమయ్యారు లవ్ లీ , జున్ను మరియు గుండులు. గీతిక లంచ్ బాక్స్ తీసుకోకుండా రావడంతో పార్సిల్ తెప్పిస్తానని అంటుంటే జున్ను తను తెచ్చిన లంచ్ బాక్స్ లో సగం అన్నo గీతికకి ఇచ్చింది. లవ్ లీ మాత్రం ఉదయం బాక్స్ లోని సగం టిఫిన్ తిని , మిగిలిన సగం ఇప్పుడు తినాలి కాబట్టి 'షేర్ చేసుకో గీతికా' అని సింపుల్గా  అంది. 

 గుండు  మాత్రం బాక్స్ తీసుకోకుండా రావడంతో అటు ఇటు తిరిగి ఒక బాటిల్ నీళ్లు తాగి మళ్లీ లోపలికి వెళ్ళాడు.  " వీడొకడు ! ఇంట్లో అన్నీ ఉన్నా  అల్లుని నోట్లో  శని "  అన్నట్లు పిసినారితనంతో కడుపుకి సరిగా అన్నం కూడా తినడు. పోనీ పిలిస్తే వస్తాడా రాడు . వాడికి సిగ్గు తో కూడిన బిడియం ఒకటి  అని పైకే అన్న జున్ను మాటలకి నవ్వింది గీతిక.  

జున్ను పెట్టిన అన్నం  తినడం అయిపోగానే బ్రేక్ టైం లో ఐదు నిమిషాలు ఉండడంతో "  15 రోజులైనా ఎవరూ కంపెనీ గురించి గానీ, మేనేజర్ గురించి గానీ ఒక మాట మాట్లాడరు.ఎవరి పని వారి చేసుకుని వెళుతున్నారు. పోనీ నేనే అడుగుదామంటే ఇక్కడ మాట్లాడొచ్చో  లేదో తెలీదు.  ప్రస్తుతం నేను చేస్తున్నది జస్ట్ ట్రైనింగ్. అదీ నిన్నటితో ముగిసింది కాబట్టి ఎవరిని ఏమీ అడగకుండా ఉందాం రోజులు గడిచే కొద్దిగా అన్ని తెలుస్తాయి. "  అని గీతిక అనుకుంటూ ఉండగా అక్క!  ఏం ఆలోచిస్తున్నావ్?  అంది జున్ను.

 ఏం లేదన్నట్టు తలూపింది  గీతిక. బ్రేక్ టైం పోవడంతో  తమ తమ పనికి వెళ్లారు ముగ్గురు.

 మధ్యాహ్నం రెండు గంటలకి ఆఫీస్ బాయ్ వచ్చి "మేడం పిలుస్తున్నారని " చెప్పడంతో గీతిక ఆఫీస్ గదికి వెళ్లి పర్మిషన్తో లోపలికి వెళ్లి రాణి ముందు నిలిచింది.

 "గీతిక!  నీవు   మెడికల్ టెస్ట్ లో పాస్ అయ్యావు  అంతేకాక  ట్రైనింగ్ లో కూడా మంచి మార్కులు వచ్చాయి " అని రాణి చెబుతుంటే సంతోషమనిపించింది గీతికకి. అయితే రాణి మళ్లీ కానీ..  అని ఏదో చెప్పబోతుండగా ఏం చెప్తుoదో అన్న భయంతో అటువైపు చూసింది గీతిక.

 గీతిక ! నువ్వు ఆందోళన పడొద్దు నిన్ను నా పర్సనల్ అసిస్టెంట్ గా నియమిస్తున్నాను  అని రాణి అనడంతో చిరునవ్వుతో థాంక్యూ మేడం అని చెప్పింది గీతిక.

 మధ్యాహ్నం నుండి తామున్నచోటికి గీతిక రాకపోవడంతో జున్ను గుండు వైపు చూసి అడిగింది. ఏమో నాకేం తెలుసు అన్నట్టు అతను ఒక ముఖం పెట్టి చెప్పడంతో జున్ను తన పని తాను చేసుకుంటుంది.

 " గీతిక నిజంగా ఒక ప్రేమిక. " తనని చూస్తే " మెరుపు లాంటి ఆ కళ్ళు,  ఆ చక్కని ముక్కు,  అందాల పెదాలు, చందమామ లాంటి  ఆ నగుమోము"  అంటే ఎవరికి నచ్చదు నాకైతే చూస్తూనే పిచ్చిపిచ్చిగా నచ్చింది అనుకో.  కానీ ఏం చేద్దాం అoతా నా కర్మ చిన్నప్పటినుండి నా తలలో అక్కడక్కడ రింగులు చుట్టిన కొన్ని వెంట్రుకలు మాత్రమే ఉన్నాయి నా టోపీ  తీస్తే కనిపించేది  గుండే. నా పేరు 'గుండు మల్లేశ్వర్' అయినా నా పేరులో నాకు మిగిలింది గుండే. అని ఒకసారి టోపీని పూర్తిగా తీయకుండా కొంచెం పైకెత్తి వేళ్ళతో తడుముతూ ఉంటే పక్కనే పనిచేసుకుంటున్న జున్ను చూసి ఏంట్రా అని కనుబొమ్మలతో ప్రశ్నించగా "ఇదొక్కటి! దీనికి నేనంటే పిచ్చి .నా తలగుండైనా నేనే ఇష్టమని చెప్తుంది ."అనుకొని ఏమీ లేదన్నట్టు తలూపి పని చేస్తున్నాడు గుండు.
***
సింహగిరిలో 
ప్రభా రెండు రోజులు సెలవు పెట్టి అమ్మని చూడాలని  ఇంటికి వెళ్లేసరికి పని వదిలి వన్ అవర్ అయినా అమ్మ రాకపోవడంతో "  అమ్మని తీసుకురావడానికి సమయానికి బండి కూడా లేదు ఎలా? "  అనుకుంటుండగా గేటు తీసిన చప్పుడు కావడంతో అటు చూసేసరికి,  గౌరీ  కొడుకుని చూసి నవ్వుతూ వస్తుంటే  ప్రభ ఎదురు వెళ్లి చేతిలోని లంచ్ బ్యాగ్  తీసుకొని భుజంపై వేసుకుని అమ్మ!  వన్ అవర్ ఎక్స్ట్రా వర్క్ చేస్తున్నావా?  అని కొడుకు అడిగేసరికి అవునని చెబితే  " ఎక్స్ట్రా వర్క్ చేయొద్దు " అని చెబుతాడు. అందుకే ఆమె ఏం మాట్లాడకుండా చిన్నగా నవ్వింది.

 అమ్మ ! నువ్వు చెప్పకపోయినా నీ గురించి నాకు తెలుసులే నువ్వు ఎక్స్ట్రా అమౌంట్ వస్తుందని వన్ అవర్ పని ఎక్స్ట్రా పని చేస్తున్నావ్ ఇకనుండి ఇలా ఎక్స్ట్రా వర్క్ చేయకు అని ప్రభా చెబుతుంటే,' అలాగే నాన్న ' ముందు లాక్ తీ! అని కీస్ చేతికి ఇవ్వగా వాకిలి తీసి లోపలికి వెళ్లారు ఇద్దరు.

 ఎవరికివారు ఫ్రెష్ అప్ అయ్యి హాల్లోకి రాగా  " అమ్మ!  నువ్వు కూర్చో కాఫీ తెస్తాను "అని తనే కాఫీ కలుపుకొచ్చి అమ్మకిచ్చి పక్కన గ్లాస్ తీసుకొని కూర్చున్నాడు ప్రభా.

 ప్రభా ! వర్క్ ఎలా ఉంది? అమ్మ ప్రశ్న.

 వర్క్ అంటే ఎక్కడికెళ్ళినా మామూలే కదమ్మా చెప్పాడు కాళీ కప్పు కింద పెడుతూ.

 హార్డ్ వర్క్ అదీ, ఇదీ అని ఎక్కువ ఒత్తిడి  తీసుకోవద్దురా.  టెక్నిక్ తో పనిచేయాలి అంది గౌరీ.

 నాకు మాత్రం చెబుతావు గాని నువ్వు హార్డ్ వర్క్ ని తగ్గించుకోవు. హెల్త్ కూడా చాలా అవసరం కదమ్మ నా మాట విను నువ్వు ఎక్స్ట్రా పని చేయకు అంతే అన్నాడు ప్రభా.

 అలాగే లేరా.  ఇంతకీ పప్పు,  నీ ఫ్రెండ్ అడ్జస్ట్ అవుతున్నాడా?

 అడ్జెస్ట్  అవుతాడమ్మ. వాడు మంచోడే కాకపోతే కొంచెం డ్రింక్ చేస్తే నోరు అదుపులో ఉండదు అదొక్కటే వాడి ప్రాబ్లం అయినా ఈమధ్య చాలా కంట్రోల్ చేసుకుంటున్నాడులే అని చెప్పాడు ప్రభ.

 గౌరీ గ్లాసులో లోపలికి తీసుకెళుతుంటే అమ్మ!  అని ప్రభ పిలిచేసరికి వెనతిరిగింది గౌరీ.

 ఏంట్రా? 

 అమ్మ ! ఒక నిమిషం ఇలారా నీతో మాట్లాడాలి అని అన్నప్రభ మాటలకి సోఫా మీద  కూర్చోగా ప్రభ అమ్మకి ఎదురుగా కూర్చుని  " అమ్మ నేను ఒక విషయం గురించి నీతో మాట్లాడాలి అనుకుంటున్నాను." అన్నాడు ప్రభ.

 చెప్పరా 

 నేను ఒక ఇల్లు కొనుక్కోవాలి అనుకుంటున్నాను.

  ఇల్లా! ఎక్కడ?
టౌన్ లోనే.అర్జున్  అన్నయ్య రెంట్ కి ఉన్నాడు కదా ఆ ఓనర్ కొత్త ఇల్లు కట్టాడంట ఇది చిన్న ఇల్లని  అమ్మకానికి పెట్టాడని అన్నయ్య చెప్పాడు.

 టౌన్లో అంటే డబ్బు ఎక్కువ అవుతుందేమో! 

 అవునమ్మా . అయినా అన్నయ్యకి తెలిసినవారే కాబట్టి ఆరు నెలల వరకు టైం ఇస్తామని చెప్పారంట.

 అంత డబ్బు ఎలా రా?

 అలా అనుకుంటే కాదు,ఆలోచించాలి అన్నాడు అమ్మని చూస్తూ ప్రభ.

 ఆరు నెలలంటే అప్పటికి నాకు 'పి.ఎఫ్' డబ్బులు వస్తాయనుకుంటా కానీ అది సరిపోదు కదా.

 అమ్మ !  నేను కూడా ఎన్నాళ్ళు పనిచేసిన డబ్బుని వాడుకోలేదు.

 మరి నీ పర్సనల్ ఖర్చులకి ఏం చేసావ్?  నన్ను కూడా డబ్బు పంపించు అని అడగలేదు  కదా.

 దానికోసం డైలీ టూ అవర్స్ వేరే వర్క్ చేస్తున్నాను.

 ఏంటది?

 ఒక వెటర్నరీ డాక్టర్ పరిచయం అయ్యాడులే. అతనికి హెల్ప్ గా అప్పుడప్పుడు వెళుతూ ఉంటాను.

 అవునా,  అయితే నీ ఇష్టం అని చెప్పింది గౌరీ.

 ఈ ఒక్క మాట చాలమ్మా  అంటూ సంతోషంగా ఉన్న ప్రభాని చూసి, అయితే ఒక కండిషన్ ! అన్న గౌరీ మాటలకి మళ్లీ కండిషన్ ఏంటి అన్నట్టు చూసాడు ప్రభ. 

 ఇల్లు కొనే వరకు నన్ను ఎక్స్ట్రా పని చేయొద్దని చెప్పొద్దు ఇక ఆరు నెలలోపల నా ఆరోగ్యానికి ఏంకాదులే సరేనా ! అంది గౌరీ.

 హమ్మయ్య ! అని ఊపిరి పీల్చుకుంటూ ప్రభ సరే అని తలూపడంతో  "వెరీ గుడ్ నాన్న నేనే అడుగుదామనుకున్నా కానీ ఎలా అడగాలి అని ఆలోచిస్తుంటే  నీకే  ఆ  ఆలోచన వచ్చింది అని ప్రభ  నుదుటి మీద ఓ ముద్దు పెట్టి ఆనందంతో లోపలికి వెళ్ళింది గౌరీ.

 ప్రభ అమ్మ కళ్ళలోని ఆనందాన్ని చూసి సంతోషించి అక్కడి నుండి లేచి బయటకొస్తు"  ఇల్లు కొంటానని అనుకున్నాను కానీ మా దగ్గర ఉన్నది సగం డబ్బు మాత్రమే. మిగిలిన సగంలో కొంచెం అన్నయ్య హెల్ప్ చేస్తానన్నాడు ఇక 25% గురించి ఆలోచించాలి ఆరు నెలల లోపు అమ్మని సొంత ఇంటికి చేర్చాలి. చూద్దాం , "మనసుంటే మార్గం ఉంటుందన్న మాటల్ని అనుభవంతో చెప్పిన పెద్దల మాట ఒమ్ము కాదని నాకనిపిస్తుంది." అనుకొని ఓనర్ని మాట్లాడించాలని వెళ్ళాడు ప్రభ.

 ప్రభ కంటే ముందే పప్పు,  చామంతిని చూడాలని అనుకున్నా ఆరోజు పోలేక పోతాడు.పప్పు గేటు దగ్గరికి ఏదో పనిమీద వస్తూ ఉండగా శైలు రావడం చూసి " నీ భర్తకు నమస్కారం తల్లి మా ప్రభని ఎన్ని తిప్పలు పెట్టించాడు.మీరు ఊరుకెందుకెళతారో ఏమో ! " అని మనసులో అనుకుంటూ ఉండగా  పప్పు గారు ! ఈ బ్యాగ్  కాస్త దించరా? అని శైలు అడిగేసరికి ఓకే మేడం అంటూ ఆటో నుండి బ్యాగ్ తీసి ఇవ్వగా తీసుకొని లోపలికి వెళ్ళింది శైలు.

రూమ్ కి వెళ్ళిన శైలు గీతికకి ఫోన్ చేసి రమ్మనడంతో నాకు ఇంపార్టెంట్ వర్క్ ఉంది నువ్వే రా అని చెప్పిన గీతిక, " అమ్మయ్య! ఎలాగో తప్పించుకున్నాను లేదంటే ఆ ప్రభ కాదు కాదు వాడున్న చోటుకి కి అస్సలు వెళ్ళను. "ఒకవేళ అలా   శైలుకి చెబితే ఎందుకు , ఏంటని ప్రశ్నల  వర్షం కురిపిస్తుంది అనుకుంది గీతిక.

 శైలు, గీతిక ఇంటికి వచ్చి గడప దాటుతుండగా తాతయ్య , జేజీలు ఎదురుగా హాల్లో కనిపించడంతో వాళ్లని పలకరించి గీతిక రూమ్ కి వెళ్ళగా లాప్టాప్ మూసేస్తోంది  గీతిక.

 రా!  శైలు పిలిచింది గీతిక ల్యాప్టాప్ పక్కన పెడుతూ.

 మంచం మీద శైలు కూర్చోగా  తనూ పక్కన కూర్చుని,  ఊరెళ్ళావట కదా ! ఆంటీ, అంకుల్ బాగున్నారా? అడిగింది గీతిక.

  బాగున్నారు. సమాధానమిచ్చింది శైలు.

 అవును, నాలుగు రోజులు ఊరెళ్ళావు కదా మగాళ్లు ఇల్లంతా చిందర మందార చేసి ఉంటారు ఎందుకంటే వాళ్ళకి శుభ్రం చేసే అలవాటు ఉండదు కదా ఇంత త్వరగా శుభ్రం చేసావా?  అడిగింది గీతిక.

 మా ఆయన అందరిలా కాదు  నేను లేకపోయినా ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటాడు. నాకు కూడా అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు నాతోపాటు పనిలో కూడా భాగస్వామ్యం ఉండాల్సిందే. తన బట్టలు తానే ఉతుక్కోవాలి.  నావి మాత్రమే నేను ఉతుకుతా అని శైలు చెబుతుంటే నోటిమీద వేలేసుకుంది గీతిక.

 ఒకవేళ పిల్లలు పుడితే ఇద్దరు  వాళ్ల పనుల్ని ఇద్దరు పంచుకుంటారా ఏంటి?

 అవును, ఇద్దరు కలిసి పని చేసుకుంటాం. ఇంకో విషయం తెలుసా తనకు డ్రింక్ అలవాటు కూడా ఉంది. అయితే నేను లేనప్పుడు, లేదంటే వీక్లీ వన్స్ పర్మిషన్ ఇచ్చాను అప్పుడు మాత్రమే డ్రింక్ చేస్తారు చెప్పింద శైలు.

 ఇంకా ..అంది గీతిక.

 ఇంకా అంటే సంపాదనలో ఇద్దరం ఫ్యూచర్ కి కాస్త పొదుపు చేస్తాం మిగిలింది ఇక మామూలే అందుకే శైలు.

 అంటే " మొగుణ్ణి కొంగుకు ముడి వేసుకోవడం అంటే ఇదేనా ? అంది సంకోచంగా గీతిక.

 "హలో ! మొగుడు పెళ్ళాం చెప్పిన మాట వినడం మాత్రమే  నీవు చెప్పిన సామెత సరిపోతుంది కానీ మాది అలా కాదు ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుని ముసలు కొంటున్నాం అంటే భాగస్వామ్య సంసారం ." అని అర్థం.

 అవునవును ఇది నిజమైన భాగస్వామ్యం అన్నమాట. ఎప్పుడో నాయకత్వం గురించి ఎవరో చెబుతుంటే  భాగస్వామ్య నాయకత్వం చాలా ఉత్తమం అని విన్నాను ఇది మంచి మాటే  అంది గీతిక.

  నీకూ పెళ్లి అయితే అప్పుడు తెలుస్థాయి ఇవన్నీ అంది కొంటెగా శైలు.

 అసలు  పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశమే నాకు లేదు దాని గురించి వదిలేయ్ గాని అని గీతిక అంటుండగా జేజి రావడంతో ఇద్దరు అటు చూసేసరికి గీతిక! నేను, తాతయ్య అలా బయటికి వెళ్లొస్తామని చెప్పి వెళ్ళింది జేజి.

 శైలు!  కూర్చొని  మాట్లాడిందే సరిపోయింది రా అలా కిచెన్ కి వెళ్లి మాట్లాడదాం అంటూ కిచెన్ కి వెళ్లి జ్యూస్ తాగుతావా ? కాఫీ తాగుతావా?  అని శైలుని అడిగితే కాఫీ అని చెప్పడంతో కాఫీ  కలుపుతోంది గీతిక.

 గీతిక ! జాబు పర్లేదా అడిగింది శైలు.

ఆ,పర్లేదు. నన్ను రాణి మేడమ్ తన అసిస్టెంట్గా తీసుకున్నారు తెలుసా అoది గీతిక.

 అవునా ! పోనీలే ,నీ నాలెడ్జ్ గుర్తించినట్టుంది . ఇంతకీ ఏదో ప్రాజెక్టు అన్నావ్ అని అడిగింది కాఫీ కప్పు తీసుకుంటూ  శైలు.

 అవును, ఏదో కొత్త ప్రాజెక్టు ప్లానింగ్ రెడీ చేయమని ఐదుగురికి చెప్పారు అందులో నేను ఒక దాన్ని అందుకే నాకు వచ్చిన ప్లాన్ని నేను రెడీ చేసి ఉంచాను రేపు హయ్యర్ అథారిటీ సర్ వస్తారంట వాళ్ళ ముందు డెమో ఇవ్వాలి అంది గీతిక కాళీ కప్పు పక్కన పెడుతూ.

నువ్వు సెటిల్ అయితే చాలు గీతిక అంది శైలు.

 నాకు కావాల్సింది అదే కదా అన్న గీతిక మాటలు వింటూ వాచ్ వైపు చూసుకున్న శైలు ఆమ్మో! మా ఆయన వచ్చే టైం అయింది వెళ్తాను.  నేను కూడా రేపటి నుండి ఆఫీస్ కి వెళ్ళాలి .వీలైతే హాలిడే  ఉన్న రోజు మా ఇంటికి రా అని చెప్పి వెళ్ళింది శైలు.