Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

తొలి పౌర్ణమి - 12

మీ బొక్కలో బావని తీసుకొని నీ పక్కలో పెట్టుకో…, నేను అడుగుతోంది విక్రమ్ నీ దృష్టిలో ఎలాంటోడు అని. 
విక్రమ్ ఆ.. చాలా సిన్సియర్ హార్డ్ వర్కింగ్ అండ్ స్వీట్ పర్సన్ అంది .
మరి చాందిని…
తను బంగారం..
 అయితే మా వాడికి చాందినీ ని సెట్ చేయ్యోచ్చుగా.(నాకు దగ్గొచ్చింది)
విక్రమ్ కా…
ఆ మావాడికేం తక్కువ నా అంత కాకపోయినా బానే ఉంటాడు గా.
తను చిన్నగా నవ్వి, ఏం మాట్లాడుతున్నావ్ అది ఉండి ఉంటే మన ముగ్గురిని చంపేసేది, నీకు దాని గురించి తెలీదు.
“నాకు హెల్ప్ చేస్తా అని వీడు ఫ్లర్ట్ చేస్తున్నడేంటి అని మనసులో అనుకున్నా..”.
అలా కాదు శృతి విక్రమ్ అసలు అమ్మాయిల వంక కన్నెత్తి కూడా చూసేవాడు కాదు, అలాంటిది తనని ఇష్టపడుతున్నాడు, పిచ్చోడిలా ఏవేవో కవితలు కూడా చెబుతున్నాడు, అర్థం చేసుకో శృతి. 
కానీ చాందిని సంగతి నీకు తెలీదు దానికి లవ్, పెళ్లి అంటే అస్సలు పడవు, స్టార్టింగ్ ఇద్దరూ అమ్మాయిలు ఇలాంటిదే అడిగితే ఎంత రాధాంతం చేసిందో తెలుసా..
కరెక్టే…, కానీ వాడ్ని చూడు పిచ్చోడైపోయేలా ఉన్నాడు, కొంచెం ఆలోచించు
నేను తలవంచుకున్నా..
ఈ జయ గాడు ఎలాగోలా శృతిని కూడా ఒప్పించాడు, వీడి దగ్గర ఇన్ని స్కిల్స్ ఉన్నాయని నేను కూడా ఎక్స్పెక్ట్ తెలియదు..
నీకోసం కాకపోయినా విక్రమ్ కోసం చేస్తా, నేనేం చేయాలో చెప్పు.
విక్రమ్ తనని పెళ్ళి చేసుకుంటా అంటే తన ఒపీనియన్ ఏంటో కనుక్కో, దానికి ముందు ఆమె పెళ్ళి గురించి ప్రస్తుతం ఏమనుకుంటుందో కనుక్కో ఎందుకంటే మా వాడు తనతో ఇంటరాక్ట్ అయి తర్వాత తన ఒపీనియన్ మారుండొచ్చుగా, ఏదో ఒక స్టోరీ చెప్పి లాస్ట్ లో ఈ మాట అడుగు..
అయితే రేపే అడుగుతా…
వెంటనే వద్దు మా విక్రమ్ గాడు ఇంకొన్ని రోజులు తనతో మంచిగా టైం స్పెండ్ చేస్తాడు , తర్వాత చెప్పు. వెంటనే చెప్తే మనమంతా ప్లాన్ చేసినట్టు తనకు తెలిసిపోతుంది. 
“అదేదో నువ్వే చెప్పొచ్చుగా విక్రమ్” అని అడిగింది..
నాకు అలాంటి విషయాలు సూటిగా అడగాలంటే చాలా భయం శృతి,తనకి పెళ్ళి మీద పాజిటివ్ ఒపీనియన్ ఉంటే తర్వాత నేనే చెప్తా.
 సరే క్యాజువల్ గా అడుగుతా, కానీ తను ఎలాంటి రిప్లై ఇచ్చిన నువ్వు యాక్సెప్ట్ చేయాలి.
అలాగే శృతి థ్యాంక్యూ. 
మరుసటి రోజు చాందిని మరియు శృతి ఇలా మాట్లాడుకుంటున్నారు…, విక్రమ్ జయ ఏదో మూవీ చూస్తున్నారు..
 చాందినీ…, యూ ట్యూబ్‌లో ఒక వీడియో చూశా. AI భవిష్యత్తులో మన జాబ్స్‌పై ఎలా ప్రభావం చూపుతుందో చెప్పారు. నిజంగా భయం వేస్తోంది. మనం జాబ్స్ పోతాయేమో అనిపిస్తోంది!.
“అవును నాకు కూడా ఈ మధ్య రీల్స్ లో ఇలాంటివి కనిపిస్తున్నాయి, అదీ కాకుండా మన ప్రాజెక్ట్‌లో AI టూల్స్ ఎన్ని ఉపయోగిస్తున్నాం చూడు. రేపు మనం అనవసరమైపోతామేమో!”– అంది చాందిని.
కూల్ గర్ల్స్, AI గురించి ఎందుకంత భయపడుతున్నారు, అది మీ జాబ్స్ ఏమి తినెయ్యదు.
“అది నువ్వు ఎలా చెప్పగలవు” అడిగింది చాందిని
ఎందుకంటే AI కూడా మనుషుల చేతే తయారు చేయబడింది కాబట్టి, దానికి కూడా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి, కొన్ని రొటీన్ గా ఉండే జాబ్స్ AI తో రీప్లేస్ అవుతాయి, కొన్ని కొత్త జాబ్స్ క్రియేట్ అవుతాయి. ముందు వర్క్ మొత్తం మాన్యువల్ గా చేసేవాళ్ళు, ఇప్పుడేమో మనం AI సహాయంతో చేస్తున్నాం. ఇంకొన్ని రోజుల తర్వాత మనం గైడ్ చేస్తే చాలు అదే పని చేస్తుంది..
ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, మనుషుల ప్రాబ్లమ్స్ అనంతం, అవే బిజినెస్ ఐడియాస్‌ కి సోర్స్. AI కి కూడా లిమిట్స్ ఉన్నాయి, అన్నిటిని సాల్వ్ చేయలేదు.  
“అయినా మొత్తం పని AI చేస్తే జనాలకు పని ఉండదు డబ్బులు ఉండవు, అప్పుడు ధనవంతులు బిజినెస్ ఎవరితో చేస్తారు, సో వాళ్ళు మనల్ని ఇలా ఆడిస్తూ ఉంటారు అంతే..”
సరిగ్గా చెప్పావ్ విక్రమ్, అన్నాడు జయ.
 మనం ఊహించినవేవి జరగకుంటే, అడిగింది చాందిని.
 ఒకవేళ మన జాబ్స్ అన్ని పోయాయనుకో , ఇంటికి వెళ్ళి వ్యవసాయం చేద్దాం! (అంటూ చిన్నగా నవ్వాను) , అలా ఏం అవ్వదు AI ని స్మార్ట్‌గా యూజ్ చేస్తే మన జాబ్స్ మరింత స్ట్రాంగ్ అవుతాయి.
నువ్వు చెప్పినట్టు అయితే బాగుండు విక్రమ్, అన్నారు చాందిని మరియు శృతి.
వ్యవసాయం చేస్తే నా..
కాదు.. కాదు.. జాబ్స్ నిలబడితే.
నేను జయ నవ్వుకున్నాం..
హే మీరందరూ మా ఊళ్లో జాతరకు రావాలి.., అంటూ పిలిచాడు జయ..
చాందిని, శృతి దీని గురించి డిస్కస్ చేసుకుంటున్నారు..
మీరు కచ్చితంగా రావాల్సిందే లేకపోతే నేను వెళ్ళను, అసలే మా నాన్న ఫ్రెండ్స్ ని కచ్చితంగా తీసుకురామన్నాడు..
సరే వస్తాం.., మరి విక్రమ్ అడిగింది శృతి..
వాడు లేకుండా ఎలా, సరే కాఫీ కి వెళ్దామా అన్నాడు జయ…
 ఆ రోజునుండి నేను చాందిని తో ఉంటున్న విధానాన్ని కొంచెం మార్చా. 
తనతో ఎక్కువ ఇంటరాక్టివ్ గా మాట్లాడుతున్నాను, తను కూడా ఇప్పుడు బాగానే రెస్పాండ్ అవుతోంది..
నాకు నవ్వించడం పెద్దగా చేత కాదు కానీ నా వల్ల అయినంతలో తనను నవ్విస్తూ తనతో కలిసి వర్క్ చేస్తూ అలా ఒక వారం రోజులు గడిచింది.
ఆ తర్వాత వారం జయ గాడు వాళ్ల ఊళ్లో మంఖాళమ్మ జాతర ఉందని మా అందరిని తీసుకెళ్లాడు
        ********
జాతర మర్నాడు అనంగా ఈరోజు రాత్రి బయలుదేరాం,పొద్దున్నే రెండు కల్లా జయ వాళ్ళ ఇంటికి చేరుకున్నాం, రాత్రి సరిగా నిద్ర పట్టక ఇంటికి వెళ్ళిన వెంటనే అందరం గాఢ నిద్రలోకి జారుకున్నాం..
రేయ్ లేవరా,…. రేయ్ విక్రమ్ 
ఏంట్రా ఇంత పొద్దున్నే నిద్రలేపుతున్నావు మనం పడుకుందే రెండు కి ఇంకాసేపు నిద్రపోతా..
ఇది బెంగళూరు కాదు నువ్వు ఎనిమిదికి కి లేవడానికి, అయినా అమ్మాయిని వెతకడానికైతే త్వరగా లేస్తావ్ కదరా…
 ఏ అమ్మాయిని..,అంటూ లోనికి వచ్చారు చాందిని , శృతి.
“ ఓరి నీయబ్బా!, కొంప ముంచావు కదరా", అని మనసులో అనుకుంటూ ఉలిక్కిపడి లేచా..
అదేం లేదు చాందిని నన్ను నిద్రలేపడానికి అలా అన్నాడంతే. 
లేదు ఏదో ఉంది విక్రమ్ నువ్వు చెప్పాల్సిందే, అంది శృతి..
వీళ్ళిద్దరు ఇలా‌ ఇరికించేసారేంటి, సరే ఏదో ఒకటి చెబుదాం.
 నేను సాఫ్ట్ వేర్ లో జాయిన్ అయిన కొత్తలో, మా పక్క కంపెనీలో ఒక అమ్మాయిని చూశాను, ఎందుకో తెలియదు కానీ చూసిన వెంటనే చేసుకుంటే తనలాంటి అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలనిపించింది, అలా కొన్ని రోజులు వన్ సైడ్ గా చూస్తూ ఉండేవాడిని, ఒకరోజు ధైర్యం చేసి మాట్లాడాలనిపించింది, ఒకరోజు సాయంత్రం తనని కలుద్దామని వెళ్ళా., కానీ నేను రోడ్డు దాటేసరికి తను క్యాబ్లో వెళ్ళిపోయింది..
తర్వాత ఏమైంది, అడిగింది చాందిని..
ఆరోజు తర్వాత నుంచి ఆమె నాకు ఒక్కసారి కూడా కనిపించలేదు…
“కాఫీ వడగట్టినప్పుడు తను పాలలో వెళ్ళిపోయి, తన జ్ఞాపకాలు కాఫీ పొడిలా నా మనసులో మిగుల్చేసింది….”
అబ్బా… నీ స్టోరీ నే దరిద్రం అనుకుంటే ఆ లాస్ట్ లో ఆ డైలాగ్ ఇంకా దరిద్రంగా ఉంది రా.. అన్నాడు జయ.
అదేం కాదు.. బాగుంది అంది చాందిని..
చెప్పింది స్టోరీ నే కదా బానే ఉంటుంది లే..
ఏంటి…….., అడిగింది చాందిని
అదే విక్రమ్ స్టోరీ కదా నీకు బానే ఉంటుంది లే.
తను ఏం మాట్లాడలేదు..
రేయ్… చెప్పడం మర్చిపోయా ఈరోజు మా ఊళ్లో ఎడ్ల పందాలు ఉన్నాయి,అన్నాడు జయ.
“ఆ… ఎడ్ల పందాలా, సినిమాల్లో తప్ప ఎప్పుడూ రియల్ గా చూడలేదు” అని ఎక్సైట్ అయ్యింది శృతి.
 మనం కూడా పార్టిసిపేట్ చేయొచ్చారా అని ఉత్సాహంగా అడిగా..
ఆ చేయొచ్చు బండ్లో కూర్చునేది మనిద్దరమే..
మరి తోలేది ఎవరు, ఎద్దులు వాటంతట అవే పోతాయా.
ఏరా ఎకసెకాల, నాకు బండి తోలడం వచ్చు.. ఇంతకుముందు పోటీ చేసినప్పుడు నేనే నడిపా, నువ్వు నాతో పాటు కూర్చో, మా నాన్న మావయ్య సపోర్ట్ గా ఉంటారు.. వాళ్లకు ఎద్దులు బాగా అలవాటు పడ్డాయి.
ఎందుకురా పాపం ముసలోళ్ళు వాళ్ళని ఇబ్బంది పెట్టడం, ఈ వయసులో పరిగెట్టించడం అవసరమా..
ఎవరిని బాబు ముసలోడు అంటున్నావ్, అంటూ లోనికి వచ్చాడు జయ వాళ్ళ నాన్న, ఆయన పేరు నరసింహ పేరుకు తగ్గట్టుగానే చాలా గంభీరంగా ఉన్నాడు..
అదేం లేదు అంకుల్ మీకు వయసు అయ్యింది కదా పరిగెడితే మీకు ఏదన్నా అవుతుందని అలా అన్నా అంతే..
అవునా అయితే పందాల్లో ఎలా పరిగెడతానో చూద్దువు లే..
నేను జయ వంక చూసా, వాడు నవ్వాడు..
సరే మీ ఇద్దరు పోటీకి సిద్ధం అవ్వండి, నేను అమ్మాయిలతో కలిసి బండిని అలంకరిస్తాను, “ రండమ్మా” అంటూ బయటకు వెళ్లిపోయారు.
నేను జయ నీలగిరి ఆకులని నీళ్లలో మరిగించి, ఆ నీళ్లతో స్నానం చేశాం.
ఉదయం 7 అవుతోంది, ఎడ్ల బండ్లన్నీ పోటీ స్థలానికి చేరుకున్నాయి..అందరూ వాళ్ళ ఎడ్లను నిమురుతూ పోటీకి సిద్ధం చేస్తున్నారు.
జయ పగ్గాలు అందుకున్నాడు నేను అతనికి సపోర్ట్ గా కూర్చున్నాను..
బళ్లన్నీ వరుసగా నిలబడ్డాయి..
 కుర్రాళ్ళంతా ఉత్సాహంతో ఒకసారి గట్టిగా కేకలు వేసారు, అక్కడ ఉత్సాహం ఉరకలు వేస్తోంది, నేను ఇలాంటిది ఇంతవరకు ఒక్కసారి కూడా చూడలేదు..
మొదట్లో జయ వాళ్ళ మావయ్య మరియు ఆయన అనుచరులు ఒక్కొకరిగా కొంత దూరం ఎద్దుల పక్కన పరుగెడతారు, చివర్లో జయ వాళ్ళ నాన్న వస్తారని చెప్పాడు జయ..
అందరూ వినండి అంటూ ఏదో అనౌన్స్మెంట్ స్టార్ట్ చేశారు, “ బండి లో నుంచి ఒక్కరు కింద పడిపోయినా ఆ బండి ఓడిపోయినట్టే.. “.
“ సిద్ధంగా ఉన్నారా!!!…”.
మళ్ళీ గట్టిగా కేకలు..,మళ్ళీ ఉత్సాహం ఉప్పొంగింది, వాళ్లతో పాటు నేను గట్టిగా అరిచాను, అది నేనేనా అన్నట్టుగా నా వంక చూసాడు జయ..
అందరూ వాళ్ల వాళ్ళ బళ్లకు పూజలు చేసి, టెంకాయల కొట్టారు..
గట్టిగా ఢంకా మోగింది..ఏదో యుద్ధానికి సన్నాహమవుతున్నట్లు అనిపించింది.
సారధులంతా తమ పగ్గాలను గట్టిగా విదిల్చారు, గట్టిగా మేళాలు మ్రోగాయి, అంతే ఎద్దులు ఒక్కసారిగా కుప్పించి ముందుకు దూకాయి….
 జయ వాళ్ళ మావయ్య మరియు ఆయన అనుచరులు ఒక్కొక్కరిగా ఎడ్ల పక్కన పరిగెడుతూ వాటిని ఉత్సాహ పరుస్తున్నారు.
మా వేగం పెరిగింది, సగం దూరం వరకు మొదటి స్థానం లోనే ఉన్నాం.. కానీ దూరం ఎక్కువ ఉండటం వల్ల ఎద్దులు అలసిపోయినట్టు అనిపించింది. మేం వెనకబడ్డాం.
అప్పుడొచ్చాడు జయ వాళ్ళ నాన్న, పంచ ఎగ్గట్టుకొని, భుజం మీదున్న కండువా చేతిలో పట్టుకొని, ఆయన ఎలా పరిగెడుతున్నాడంటే నిజంగా అమ్మవారే ఆయనలో పూనుకున్నారేమో అన్నట్టుగా, ఆయన శరీరం ఎలా ఉందంటే మేం జిమ్ లో ఈ జన్మంతా వర్కౌట్ చేసిన అలాంటి బాడీ , అలాంటి సత్తా రాదు, పల్లెటూళ్లలో కష్టపడి పని చేసి ఆ ఆహారపు అలవాట్లు ఉన్నవాళ్ళకు మాత్రమే ఆ నాచురల్ ఇంటెంట్ వస్తుందేమో .
ఆయనకు ఆ ఎద్దులు బాగా అలవాటుపడ్డాయి, ఆయన ఒక కేక వెయ్యగానే వాటి వేగం రెండింతలు పెరిగింది.., మా ముందున్న బళ్ళన్నింటినీ ఒక్కొక్కటిగా వెనక్కి నెట్టుకుంటూ ముందుకు కదిలాం, మమ్మల్ని చూసి గట్టిగా కేకలు వేస్తున్నారు...
రెట్టించిన ఉత్సాహంతో జయ పగ్గాలు విదిల్చాడు, దెబ్బకు మొదటి స్థానానికి చేరుకున్నాం..
విజయ గీత దగ్గరికి వచ్చేశాం, “మావ గెలిచేది మనమే” అంటూ నావైపు తిరిగి నవ్వాడు జయ..
ఇంతలో…. బండి చక్రం ఒక దిబ్బను ఎక్కేసింది, ఎడ్ల బండి ఒక్కసారిగా గాల్లోకి ఎగిరింది, నేను జయ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నాం, ఎగిరి కింద పడ్డ దెబ్బకి బండి అటు ఇటూ ఊగింది, జయ అదుపుతప్పి బండికి ఎడమవైపు పడబోయాడు..
వెంటనే నా ఎడమ చేత్తో జయా ని పట్టుకున్న.., ఇంకో పక్క పగ్గాలు కిందకు జారకుండా కాళ్ళతో తొక్కి పట్టుకున్నా, మాకు సపోర్ట్ చేసే వాళ్ళంతా అలాగే పట్టుకో అని గట్టిగా అరుస్తున్నారు, ఎందుకంటే బండ్లో నుంచి ఎవరు కిందపడ్డ మేము ఓడిపోయినట్లే..
ఎడం చెయ్యి చాలా నొప్పిగా ఉంది సపోర్ట్ కోసం నా కుడి చేతితో బండిని గట్టిగా పట్టుకుని అలాగే ఓర్చుకున్నా..
జయ వాళ్ళ నాన్న గట్టిగా ఒక కేక వేశాడు, ఆ కేక వేసిన 2 సెకండ్లకి అంతిమ గీత పైన ఉన్నాం..
చివరికి అంతిమ గీతను దాటేసాం, బండి ఏమో ఆగకుండా అలానే ముందుకు వెళ్తోంది, జయ వాళ్ళ నాన్న ఎలాగోలా బండిని ఆపాడు.., సపోర్ట్ గా ఉంచిన నా కుడి చేయి వదిలేసి రెండు చేతులతో పట్టుకొని జయా ని పైకి లేపా.
బండి దిగి వెళ్ళగానే మమ్మల్ని ప్రశంసలతో ముంచెత్తారు , కుర్రాళ్ళు చిన్నపిల్లలు గట్టిగా కేకలేస్తున్నారు, ఈ పోటీ ఎలా ఉన్నా నాకు మాత్రం చాలా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. 
జయ వాళ్ళ నాన్న ఎడ్లను కట్టేసి వచ్చి మా ఇద్దరిని గట్టిగా కౌగిలించుకున్నాడు…
అలా సంబరాల్లో మునిగిపోయాం.. ఇంతలో ఎవరో నా ఎడమ చెయ్యి పట్టుకున్నారు..
చూస్తే చాందిని..