అక్కడ వీళ్ళ లాంటి ఫ్రెషర్స్ ఒక 30 మంది ఉన్నారు. ఇద్దరు వెళ్లి వాళ్లతో పాటు కూర్చున్నారు, కాసేపటి తర్వాత హెచ్ఆర్ లోనికి వచ్చింది..
హార్టీ వెల్కమ్ మై డియర్ ఫ్రెండ్స్ “మై నేమ్ ఈజ్ మేఘన”, అంటూ తన స్పీచ్ మొదలుపెట్టి ఒక ఐదు నిమిషాలు ప్రసంగించింది.
గాయ్స్, ఇక్కడున్న 30 మంది లో 20 మందికి మేము ఒక టెక్నాలజీ మీద ట్రైనింగ్ ఇవ్వబోతున్నాం, ఆ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీకు ప్రాజెక్టులను అలోకేట్ చేయడం జరుగుతుంది.
ఆ మిగిలిన పదిమంది ఏం చేయాలో నేను చెప్తా అంటూ 10 పేర్లు పిలిచింది, చాందిని మరియు శృతి ఇద్దరూ అందులో ఉన్నారు, “ఈ పదిమంది నాతో రండి, మిగిలిన వాళ్ళందరికీ నా సబార్డినేట్ ట్రైనింగ్ గురించి వివరిస్తాడు”, అంటూ తన క్యాబిన్ వైపుగా వెళ్ళిపోయింది హెచ్ఆర్.
చాందిని, శృతిలు కంగారుగా ఆ మిగిలిన వాళ్ళతో కలిసి హెచ్ఆర్ క్యాబిన్ వైపు నడిచారు.
నేను చెప్తే విన్నావా, మొదటి రోజు 9 కంటే ముందే రావాలి, ఆలస్యం చేశావు ఇప్పుడు చూడు, మనల్ని కంపెనీ నుంచి గెంటేస్తారో ఏమో.
ఒసే చాందిని అది కాదేమో, నాకు తెలిసి వేరే ట్రైనింగ్ ఇస్తారేమో అనుకుంటా.
ఆ బొంగు!.
ఒకవేళ నువ్వు చెప్పింది నిజమే అయితే మనతో పాటు ఎనిమిది మందిని ఎందుకు రమ్మంటారు..
“అది కూడా కరెక్టే” అని ఆలోచనలో పడింది చాందిని
ఇంతలో క్యాబిన్ వచ్చేసింది. ఆ పది మందిలో డోర్ ఎవరు తీయాలి అని ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు.
“Heyy guys you can come in”, అంటూ హెచ్ఆర్ పిలిచింది.
డోర్ తీసి లోనికి వెళ్ళారు, “గుడ్ మార్నింగ్ మ్యామ్” అన్నారు అందరూ .
Guys నేను ఇందాక చెప్పడం మర్చిపోయా, ఇక్కడ సార్, మేడమ్ ఇలాంటివి ఉండవు, అందరిని పేరు పెట్టే పిలవాలి, I am మేఘన.
హలో మేఘన అంటూ తమ పేర్లు చెబుతూ షేక్ హ్యాండ్ ఇచ్చారు అందరూ.
Guys, మ్యాటర్ ఏంటంటే మీ 10 మందికి ప్రాజెక్ట్ అలోకేట్ చేస్తున్నాం.
ఇద్దరి గుండెలు కాస్త స్థిమితపడ్డాయి.
ఒక బిజినెస్ రిక్వైర్‌మెంట్ వల్ల మిమ్మల్ని పుష్ చెయ్యడం జరుగుతోంది. మీలో ఇద్దరిని లేదా ముగ్గురిని కలిపి ఒక్కొక్క ప్రాజెక్టులోకి పుష్ చేస్తున్నాం.
“మేఘన మాకు ట్రైనింగ్ లాంటివి ఏమీ లేకుండా డైరెక్ట్ గా వర్క్ అంటే ఎలా మేనేజ్ చేయాలి” అడిగింది శృతి.
మనకు ఆల్రెడీ సీనియర్ రిసోర్సెస్ ఆ ప్రాజెక్టులో ఉంటారు, సో వాళ్ళు మీకు ఏం చేయాలనేది చెప్తారు, అయినా మిమ్మల్ని వెంటనే వర్క్ చేయమని ఒత్తిడి చెయ్యం “ యు హావ్ యువర్ ఓన్ టైం టు లెర్న్, బట్ నాట్ మచ్ టైం” , ఈరోజు వెళ్లి మీరు లాప్టాప్ కలెక్ట్ చేసుకోండి, ఇంకో టు డేస్ లో మీకు ఒక అఫిషియల్ మెయిల్ వస్తుంది.
ఓకే మేఘన.
క్యాబిన్ డోర్ తీసి ఒక్కొక్కరిగా బయటకు వెళ్తున్నారు.
“హా చెప్పడం మర్చిపోయా, ఆల్ ది బెస్ట్ ” అంటూ చిన్న స్మైల్ ఇచ్చింది మేఘన.
చాందిని మరియు శృతి ఒక చిన్న చిరునవ్వు నవ్వి అక్కడ నుంచి వెళ్లిపోయారు.
ఆ రోజు త్వరగా గడిచిపోయింది..
మరుసటి రోజు ఆఫీసు రీక్రియేషన్ ఏరియా లో చాందిని, శృతి కూర్చొని ఉన్నారు. కంప్యూటర్ స్క్రీన్లు ఖాళీగా మెరుస్తున్నాయి.
శృతి ఫోన్‌లో స్క్రోల్ చేస్తూ, "చాందిని, ఇప్పుడు ఇచ్చే ప్రాజెక్ట్ ఎలా ఉంటుందో ఏంటో" అని అడిగింది.
చాందిని చిన్నగా నవ్వి, "ఇంకా ఇవ్వలేదు కదా, ముందు ప్రాజెక్ట్ అలోకేషన్ మెయిల్ రానివ్వు.”
అప్పుడే ఇద్దరు అమ్మాయిలు – ప్రియ మరియు దివ్య – వీళ్ళు వైపు వచ్చారు. వాళ్లు కూడా కంపెనీలో కొత్తవారు లాగా కనిపిస్తున్నారు కాకపోతే కొంచెం ఎనర్జిటిక్‌గా ఉన్నారు.
"హాయ్! మీరు కూడా న్యూ జాయినర్సా?”, ఆని అడిగారు.
హా అవును…అంది శృతి.
ఇక్కడ ఇలా ఖాళీగా కూర్చొని ఏం చేస్తున్నారు? ఆఫీసులో ఫూస్‌బాల్ టేబుల్ ఉంది, ఆడదామా?" అని ప్రియ ఉత్సాహంగా అడిగింది.
"ఫూస్‌బాల్? అదేం గేమ్ ఆడిగింది శృతి.
చాందిని కూడా తలూపి, "అవును, మేము ఎప్పుడూ ఇలాంటిది ఆడలేదు,"
దివ్య నవ్వి, మీకు ఫుట్బాల్ తెలుసా..
“తెలుసు, కానీ మాకు ఆడటం రాదు” అంది శృతి
అరే, ఈ గేమ్ అలాంటిదే కాకపోతే చేతులతో ఆడతాం..
“ హ్యాండ్ ఫుట్బాల్ ఆ" అంటూ నవ్వింది చాందిని..
అలాంటిదే! చాలా ఈజీ. మేము నేర్పిస్తాం రండి..
కమాన్..బోరింగ్ గా ఉంది కదా? ఒక్కసారి ట్రై చేయండి, అని పట్టుబట్టింది, ప్రియా.
“ఇదేదో ఇంటరెస్టింగ్ గా ఉంది. ఓకే, పోదాం," అంది శృతి.
నలుగురూ ఆఫీసు రిక్రియేషన్ ఏరియాకి అవతలివైపున్న ప్లే ఏరియా కు వెళ్లారు.
ఫూస్‌బాల్ టేబుల్ వద్ద, మొదట్లో అంతా సరదాగా సాగింది. ప్రియ మరియు దివ్య రూల్స్ చెబుతూ, చిన్న చిన్న జోకులు వేస్తున్నారు. "ఇది ఫన్ గా ఉంటుంది, చూడండి!" అని ప్రియ బాల్‌ని స్పిన్ చేసింది. శృతి నవ్వుతూ ట్రై చేసింది, చాందిని కూడా కొంచెం ఆసక్తిగా పాల్గొంది.
కానీ కొద్దిసేపటికి, సంభాషణ మారిపోయింది. దివ్య ఒక గోల్ చేసి, "ఇలాంటి ఫన్ మా బాయ్‌ఫ్రెండ్స్ తో ఉండదు. ఎప్పుడూ ట్రస్ట్ ఇష్యూస్ తో గొడవలే," అని అన్నది.
ప్రియ కూడా జోడించింది, "లవ్ అంటే మొదట్లో స్వీట్‌గా ఉంటుంది, కానీ తర్వాత? చీటింగ్, డర్టీ సీక్రెట్స్... నా ఎక్స్ అయితే నన్ను మోసం చేసి, వేరే అమ్మాయితో ఫిజికల్ గా కూడా..." ఆమె మాటలు ఇబ్బందికరంగా అనిపిస్తున్నాయి వీళ్ళకి.
శృతి అసౌకర్యంగా నవ్వి, ఆడుతూ ఉంది..
దివ్య చాందిని వైపు చూసి, "ఏ చాందిని, నీకు ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ ఏదైనా ఉందా?” అని కొంటెగా అడిగింది.
చాందిని చిన్నగా తల వంచి, "నాకు ఈ టాపిక్ గురించి మాట్లాడటం ఇంట్రెస్ట్ లేదు. గేమ్ ఆడుదాం," అని మృదువుగా చెప్పి, బంతిని స్పిన్ చేసింది”.
ప్రియ వదలలేదు, "కమాన్, చాందిని! ఏదైనా స్పైసీ స్టోరీ ఉంటే చెప్పు. లవ్‌లో ఇలాంటివి సహజమే కదా!" అని నవ్వుతూ అడిగింది, దివ్య దీనికి జోడిస్తూ, "అవును, నీ బాయ్‌ఫ్రెండ్‌తో ఏమైనా జరిగింటే షేర్ చెయ్యి!".
చాందిని ముఖం ఒక్కసారిగా సీరియస్ అయింది. ఆమె ఫూస్‌బాల్ హ్యాండిల్ ని గట్టిగా పట్టుకుని బంతిని బలంగా కొట్టింది. ధాక్!........ బంతి టేబుల్ అంచుకు తగిలి గట్టిగా శబ్ధం చేసింది, ఆఫీసు ప్లే ఏరియాలో అందరూ ఒక్కసారిగా వీళ్ళ వైపు చూశారు. ప్రియ మరియు దివ్య చాందిని వైపు కొంచెం భయంగా చూశారు.
"నాకు ఈ లవ్ మీద, లేదా ఇలాంటి డర్టీ టాపిక్స్ లో ఒక్క పర్సెంట్ కూడా ఇంట్రెస్ట్ లేదు, మీకు ఇష్టమైతే మీరు మాట్లాడుకోండి, కానీ నన్ను ఈ స్టఫ్‌లోకి లాగొద్దు. నాకు ఈ గేమ్ చాలు”, అంటూ ఆమె హ్యాండిల్‌ని వదిలేసినది.
"నేను వెళ్తున్నా” అని శృతి కి చెప్పి ఆ ఏరియా నుండి వెళ్లిపోయింది.
శృతి అసౌకర్యంగా నవ్వి, ప్రియ మరియు దివ్య వైపు చూస్తూ, "సారీ, ఆమెకి ఇలాంటి టాపిక్స్ అంటే ఇష్టం ఉండదు. మీరు ఏమీ అనుకోకండి," అని చెప్పి, ఆమె కూడా చాందిని వెంట వెళ్లిపోయింది.
ప్రియ మరియు దివ్య నిశ్శబ్దంగా ఒకరినొకరు చూసుకున్నారు. కదులుతున్న ఫూస్‌బాల్ బంతి టేబుల్ అంచున ఆగిపోయింది.
అది 2035వ సంవత్సరం, 12 ఏళ్ల ఆకాష్ ఇంటిపైన ఉయ్యాలలో ఊగుతూ ఇలా ఆలోచిస్తున్నాడు, “ఈరోజు స్కూల్లో అందర్నీ మీరు పెద్దయ్యాక ఏమవుతారు అని అడిగితే, చాలామంది డాక్టర్, ఇంజనీర్, ఆస్ట్రోనాట్ ఇలా చాలా రొటీన్ గా చెప్పే సమాధానాలు చెప్పారు, కానీ ఆకాష్ “ నేను ఒక రచయిత అవుతానని” చెప్పాడు, అంతే మేడం అతనిని నిలబెట్టి అందరి ముందు క్లాప్స్ కొట్టించింది. “రచయిత అవుతానని చెప్పాడు గాని దాని గురించి ఎలా మొదలుపెట్టాలో అతనికి తెలీదు.”
“ఆకాష్ కొంచెం బద్ధకస్తుడు, ఏదన్నా కొత్త విషయాలు గానీ చిన్న చిన్న విషయాలు గాని తెలుసుకోవడం లో అంతగా ఆసక్తి చూపేవాడు కాదు , ఒక రచయిత ఎప్పుడూ దీనికి భిన్నంగా ఉంటాడు, ఆకాష్ కు అందరు మాములుగా గా చేసే పనులు కాకుండా వేరే ఏదన్నా డిఫరెంట్ గా చెయ్యాలి అని మాత్రం మనసులో ఉండేది, ఏం చేస్తాడో చూడాలి మరి”
“ ఏమైతే అది అయ్యింది ఇక నా లైఫ్ లో నాకున్న గోల్ రచయిత అవ్వవడమే” అని డిసైడ్ అయ్యాడు, ఆలోచించడం మానేసి కిందకు పరిగెత్తాడు..
వాళ్ల నాన్న రూమ్ లో బుక్స్ ఏమన్నా దొరుకుతాయేమో అని కబ్బోర్డ్స్ అన్ని వెతకసాగాడు , సహాయంగా డెల్టా ను కూడా పిలుచుకున్నాడు(డెల్టా అనేది ఒక హ్యుమనాయిడ్ రోబోటిక్ మోడల్ పేరు, 2035 లో దాదాపు ప్రతి ఇంటికి ఇలాంటి ఒక రోబోట్ ఉంటుంది, ఈ మోడల్ మనం ఏ పని చెప్పినా చేస్తుంది, మనకు మంచి సలహాలు ఇస్తుంది, చిన్న పిల్లలకు హోమ్ వర్క్ లాంటివి చేయిస్తూ అవసరమైతే వాళ్లకు పాఠాలు కూడా చెబుతుంది).
టెక్నాలజీ ఎంత అడ్వాన్స్ అయిందంటే జనాలు బుక్స్ వాడడం కంప్లీట్ గా మానేశారు. మొత్తం డిజిటల్ గా మారిపోయింది కనీసం ఆధార్ పాన్ కార్డు లాంటివి కూడా పేపర్స్ రూపం లో లేవు, చాలామందికి అవతలి వాళ్ల ఒరిజినల్ పేర్లు కూడా తెలుసుండవు ఎందుకంటే మొత్తం బయోమెట్రిక్ లేదా ఐరిస్ రికగ్నైజేషన్ ద్వారా నడుస్తోంది ప్రపంచమంతా, మనుషులు ఒకరితో ఒకరు మాట్లాడుకోవటం తగ్గించి అంతా సోషల్ మీడియా లో పడ్డారు.
ఎంత వెతికినా ఒక్క బుక్ కూడా దొరకకపోయే సరికి చాలా నిరాశపడ్డాడు. సరే అని బీరువా మూస్తుండగా అతని కంటికి ఒక పాత మొబైల్ కనబడింది, దాని ఆండ్రాయిడ్ వర్షన్ ఒక 12 లేదా 13 ఉండొచ్చు. ఇప్పుడు చూస్తే ఆండ్రాయిడ్ 25 రన్ అవుతోంది. ఆ మొబైల్ అందుకొని స్విచ్ ఆన్ చేయడానికి ప్రయత్నించాడు ఎంత ప్రయత్నించినా అది ఆన్ కాలేదు, అందులో చార్జింగ్ లేదని గ్రహించిన ఆకాష్ దాన్ని తీసుకెళ్లి వైర్లెస్ చార్జింగ్ పోర్ట్ దగ్గర పెట్టాడు, అది పనిచేయటంలేదే ఎందుకంటే అప్పటి మొబైల్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేయవు, “ సి “ టైప్ పిన్ ఉన్న ఛార్జర్ కోసం వెతక సాగాడు, ఎంత వెతికినా ఒక్క సి పిన్ కూడా కనిపించలేదు.
అమ్మ రావటానికి ఇంకా టైమ్ ఉంది, డెల్టా తో మాట్లాడటం మొదలు పెట్టాడు ఆ కుర్రాడు..
హే డెల్టా..
చెప్పు మ్యాన్…(NLP(నాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్) మరియు AI ద్వారా మనం ఏ భాషలో మాట్లాడినా అవి మన భాష, యాస రెండిటినీ అర్థం చేసుకొని వాటికి తగ్గట్టుగా మాట్లాడే విధంగా డెల్టా యొక్క అల్గోరిథెమ్స్ రూపొందించబడి ఉంటాయి)
నాకు రచయిత అవ్వాలనుంది కానీ ఈ జనరేషన్ లో బుక్ ఎవరు చదవడం లేదు, నా బుక్ చదివేలా ఒక ఐడియా ఇవ్వు..
ఇప్పుడు జనాలు ICW(ఇన్ టు ద సినిమాటిక్ వరల్డ్) లో సినిమా చూసి వాటికి కూడా ఏవేవో వంకలు పెడుతున్నారు.
ICW నా అదేంటి, అడిగాడు ఆసక్తిగా..
చెప్తా విను, ఇప్పుడు మనం మూవీస్ ను 2D లేదా 3D లో చూసి ఉంటాం, కానీ ఈ ICW అనేది హొలోగ్రామ్ టెక్నాలజీ ద్వారా మనల్ని తీసుకెళ్లి సినిమా మధ్యలో కూర్చోబెడుతుంది, అంటే మనం సినిమా లో ఉండే విజువల్స్ ను లేదా క్యారెక్టర్ ను పక్కనే ఉండి చూడొచ్చు..