ఇది సూపర్ గా ఉంది డెల్టా..మనం ఎప్పుడన్నా వెళ్ళాలి..
కదా.., మరి నీ బుక్ ఎవడు చదువుతాడు
అదేంటి డెల్టా డిసప్పాయింట్ చేస్తావ్..
నిన్ను డిసప్పాయింట్ చెయ్యట్లేదు నేను నిజం మాట్లాడుతున్నా, నీకోటి తెలుసా “నిజం చాలాసార్లు చాలామందికి డిసప్పాయింటింగానే ఉంటుంది కుర్రాడా”.
నిన్ను నీతులు చెప్పమనలేదు, నాకు ఒక ఐడియా ఇవ్వు..
కోపం వద్దు చెప్తా, ఇప్పుడు జనాలు ఆనిమేలను చాలా బాగా చూస్తున్నారు, ఒకటా రెండా నరుటో, వన్ పీస్, డిమాన్స్లేయర్, అటాక్ ఆన్ టైటాన్ ఇలా చాలా అనిమే లు అప్పట్లో ఒక ఊపు ఊపాయి, వీటన్నిటినీ జనాల ఇంట్రెస్ట్ చూసి రీ రిలీజ్ చేస్తున్నారు, కాబట్టి నువ్వు కథ రాయి, నేను దాన్ని ఏఐ మోడల్ యూస్ చేసి మంచిగా డైలాగ్స్ రాయించి దాన్ని ఫ్రెష్ ఆనిమేగా జనాలకు అందజేద్దాం…
ఐడియా బాగుంది కానీ కథ రాయడమెందుకు, voice AI తో నా ఐడియాస్ చెప్పి కథ రాయిస్తా..
కథ రాస్తున్నప్పుడు వచ్చే త్రిల్ ను ఎంజాయ్ చెయ్యి కుర్రాడా, కావాలంటే నాలెడ్జ్ కోసం AI వాడు…
సరే నన్ను కొన్ని కథలు తెలుసుకోనివ్వు, తర్వాత కలిసి రాద్దాం.., కానీ ఇప్పుడు నోట్ బుక్, పెన్స్ ఎక్కడ దొరుకుతాయి.
వాటిని నేను ఆర్డర్ చేస్తా, నువ్వు ఆలోపు ఏవన్నా కథలు చదువు లేదా విను, నువ్వు సిద్దమనప్పుడు, రాయడం మొదలుపెడదాం అని షేక్ హ్యాండ్ ఇచ్చాడు డెల్టా..
రాత్రి 7:00 అవుతుంది అమ్మ ఇంటికి వచ్చింది.
అమ్మా నాకు సి పిన్ చార్జర్ కావాలి వెంటనే.
ఇప్పటికిప్పుడు సి పిన్ ఎక్కడ దొరుకుతుంది నాన్న..
నాకు ఒక ముఖ్యమైన పనుంది, కొంచెం వెతికివ్వు మా..
సరే ఆగు వెతికిస్తా అంటూ వెతకసాగింది, చాలాసేపటికి ఒక మూలన దుమ్ము పట్టిన ఛార్జర్ దొరికింది.
ఆకాష్ ఆ మొబైల్ కు చార్జింగ్ పెట్టాడు..
వంట చేసే ఓపిక లేక ఆన్లైన్ లో ఏదో ఆర్డర్ చేసింది అమ్మ, చేసిన పది నిమిషాలకు డ్రోన్ వచ్చి డెలివరీ ఇచ్చింది..
ఇద్దరు కూర్చుని తింటుండగా ఆకాష్ ఇలా అడిగాడు, “ అమ్మ ఆ మొబైల్ పాస్వర్డ్ ఏంటి”.
అది ఎప్పుడో ఒక కాలంలో మీ నాన్న వాడిన మొబైల్ రా ఇప్పుడు ఆయన కూడా లేడు, నాకు దాని పాస్వర్డ్ గుర్తులేదు మీ నాన్ననే అడుగు...
“సరే అమ్మ” అంటూ పరుగెత్తబోయాడు.
చేయి పట్టుకుని ఆపింది అమ్మ “ముందు తినేసి తర్వాత నీ పని చూడు”.
త్వర త్వరగా తిని వెళ్లి తన పర్సనల్ మొబైల్ తీసుకున్నాడు.
“హాయ్ డాడీ,
నేను పాత ఆండ్రాయిడ్ వర్షన్స్ పైన ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీ చేస్తున్నా, నాకు నీ పాత మొబైల్ పాస్వర్డ్ కావాలి” అంటూ మెయిల్ చేశాడు..
రిప్లై కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు..
ఒక అరగంట తర్వాత ఆ మెయిల్ కి రిప్లై వచ్చింది..
ఆత్రుతగా దాన్ని ఓపెన్ చేసి చూస్తే 4 పాస్వర్డ్ ఉన్నాయి, అందులో ఉన్న అన్ని పాస్వర్డ్స్ ట్రై చేశాడు చివరి దానికి మొబైల్ ఓపెన్ అయింది..
వాళ్ళ నాన్న మొబైల్లో ఏముందో అన్న కుతూహలంతో ఫైల్ మేనేజర్ కి వెళ్లి అన్ని వెతుకుతున్నాడు. అందులో ఏం లేవు, వాళ్ల నాన్న మెయిల్ ఐడి నుంచి క్లౌడ్ బ్యాకప్ లో ఉన్న ఫైల్స్ ను రీస్టోర్ చేశాడు.
ఫైల్స్ అన్ని రీస్టోర్ అయ్యాక, అక్కడున్న ఫైల్స్ మొత్తాన్ని ఒక్కొక్కటిగా చూస్తున్నాడు, అతని కన్ను ఎందుకో ఆడియో ఫైల్స్ మీద పడింది, ఒక నాలుగు ఆడియోలు ఉన్నాయి, హెడ్ ఫోన్స్ పెట్టుకుని అందులో మొదటి ఫైల్ ఓపెన్ చేశాడు.
ఆ రోజు సోమవారం మేం ఇంటికి వచ్చి రెండు రోజులు అవుతుంది తాతగారు మల్లి మావయ్య కూతురిని కలవమన్నారు, బహు శా ఇది పెళ్ళి చూపులు లాంటిది అయ్యుండొచ్చేమో. కానీ నాకైతే ఇప్పుడు పెళ్ళంటే ఒక్క శాతం కూడా ఇష్టం లేదు. తాతయ్య మాట కాదన లేక వాళ్ళ ఇంటికి వెళ్ళాను.
వాళ్లింటికి వెళ్తున్నప్పుడు మల్లి మావయ్య ఎదురొచ్చాడు.
రా బాబు, అమ్మాయి లోన ఉంది.
ఏంటి అంకుల్ ముందే అంతా మాట్లాడుకున్నారా ఏంటి.
ఏదో అంటున్నావ్ బాబు అన్నాడు ఆయన, నేను చెప్పింది విననట్టు.
“అమ్మాయి లోనే ఉంది కదా అంకుల్ “, అంటూ లోపలికి వెళ్ళా..
వాళ్ళింట్లో రెండు హాల్స్ ఉన్నాయి, తను మెయిన్ డోర్ కి అవతలి వైపున్న హాల్ లో కూర్చుంది, నిదానంగా వెళ్లి తనకు ఎదురుగా కూర్చొన్నాను.
సమయం గడిచి పోతుంది.. ఆమె ఏం మాట్లాడట్లేదు, “ఆరోజు బస్టాప్ లో చాందిని తో ఏదో అలా మాట్లాడేసా కానీ, నాకు అమ్మాయిలతో మాట్లాడటం చాలా భయం”, సరే తనే పలకరిస్తుందని తలవంచుకున్నా..
మీరు విక్రమ్ కదా..
ఆమె వంక చూస్తూ, “అవును, మీరు గౌతమి గారు కదా”.
పర్లేదు గౌతమి అని పిలవచ్చు
ఓకే గౌతమి.
మా నాన్న మొత్తం చెప్పాడా…
ఆ చెప్పాడు, నాకు తెలిసి వీళ్లంతా కలిసి మనకి ఇది ఒక అనఫిషియల్ పెళ్ళిచూపులుగా కూర్చొబెట్టారు, ఒక అమ్మాయిని కలవమని ఉరికే ఎవ్వరు చెప్పారు కదా, మన ఇష్టాలు వీళ్ళకి అక్కర్లేదు, మనకున్న సమస్యలు వీళ్ళకి అనవసరం.
అవును నిజమే విక్రమ్ ముఖ్యంగా మా నాన్నకి..
సరే నీ అభిప్రాయం ఏంటో చెప్పు..
ఏం మాట్లాడకుండా అభిప్రాయానికి ఎలా వస్తావ్, మనం అలా బయటికి వెళ్లి మాట్లాడు కుందామా..
ఎందుకు ఇక్కడ అంత బానే ఉందిగా..
అది కొన్ని విషయాలు నేను ఇక్కడ చెప్పలేను, ఎవరైనా వింటే పెద్ద సమస్యవుతుందేమో అని కంగారుగా ఉంది. మనం అలా బయటికి వెళ్దామా, నీకు కూడా పొలాలను చూసినట్టు ఉంటుంది..
సరే పదా..
చుట్టూ పచ్చదనం, రకరకాల పంటలు, అక్కడ నుంచి వస్తున్న స్వచ్ఛమైన గాలి, నాకైతే ఒక 10 సంవత్సరాల తర్వాత సాఫ్ట్ వేర్ జాబ్ వదిలేసి ఇక్కడ వ్యవసాయం చేసుకోవాలనిపినస్తోంది
“విక్రమ్ ఏంటి ఆలోచిస్తున్నావ్?” పిలిచింది గౌతమి.
హా ఏం లేదు, నువ్వు ఏదో మాట్లాడాలన్నావ్.
యాక్చువల్ గా చిన్నప్పటి నుంచి మా నాన్న చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. మా నాన్నకు ఉన్న ఒకే ఒక్క కోరిక నన్ను ఇక్కడే ఎవరైనా బంధువుల్లో ఇచ్చి పెళ్ళి చేస్తే లైఫ్ లాంగ్ తనతోనే ఉంటాను అని అనుకుంటున్నాడు, కానీ నేను ఆయన ఆశలను అర్థం చేసుకోక ముందే ఒకడిని ప్రేమించాను, సో దాన్ని ఇప్పుడే చెప్పలేను, ఎందుకంటే నేను ఇప్పుడు చెప్తే మా నాన్న జాబ్ మానుకోమంటాడు, బలవంతంగా నీకు కాకపోయినా ఎవరికో ఒకరికి ఇచ్చి పెళ్ళి చేస్తాడు. సో నువ్వే నాకు హెల్ప్ చెయ్యాలి.
సరే హెల్ప్ చేస్తా గాని నాకు ఈ విషయం చెప్పు, అతన్ని ఎలా ప్రేమించావు, లైక్ తనను ప్రేమిస్తున్నావని నీకు ఎలా తెలిసింది.
నేను అసలు అబ్బాయిల జోలికి వెళ్ళేదానిని కాదు, కానీ వాడు కొంచెం వింత మనిషి నాకు పరిచయమైన కొత్తలో నచ్చేవాడు కాదు ఎప్పుడు ఏదో ఒక పిచ్చి పని చేసేవాడు, వాడి కోతి పనులతో ఎప్పుడు నన్ను నవ్విస్తూనే ఉండేవాడు, జీవితంలో నవ్వడం లాంటి గొప్ప విషయం ఇంకొకటి ఉంటుందంటే నేను నమ్మను, ఒకరోజు సడన్గా వచ్చి జీవితాంతం నీ పక్కనే ఉండి ఇలాగే నవ్విస్తూ ఉంటా అని చెప్పాడు, నాకు మంచిగా అనిపించి ఓకే చెప్పేసా, తను కూడా ఇప్పుడు జాబ్ చేస్తున్నాడు.
అవునా… ఇంతకీ తన పేరేంటి.
తన పేరు చందు, కానీ తర్వాత మాకు బ్రేకప్ అయ్యింది.
ఎందుకూ.
“ వాడు ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడు ఐదు సప్లీ లు ఉన్నాయి, వాడేమో నా వెంట తిరుగుతూ టైమ్ పాస్ చేస్తున్నాడు, అందుకే ఒకరోజు తిట్టేసా, అయినా వాడు మారలేదు, ఇలా అయితే వాడు కరెక్ట్ రూట్ లోకి రాడని నెంబర్ బ్లాక్ చేశా, కొంచెం avoid కూడా చేశా, ఆ తర్వాత అతను ఎగ్జామ్స్ క్లియర్ చేసి బయటకెళ్ళి జాబ్ కొట్టాడని తెలుసుకున్నా, తీర వాడితో మాట్లాడదామని ప్రయత్నిస్తే నా నెంబర్ ముందే బ్లాక్ చేసేసాడు, నేను కాలేజ్ ప్లేస్‌మెంట్స్ గోలలో పడి అతన్ని నేరుగా కలవలేకపోయాను”, నేను అతన్ని దూరం పెట్టింది తన కోసమే అని చెప్పాలి.
డోంట్ వర్రీ గౌతమి తను కచ్చితంగా అర్థం చేసుకుంటాడు.
గౌతమి, మీ ప్రేమ విషయం, మీ అమ్మకు చెప్పక పోయావా, మీ నాన్నతో తనే మాట్లాడేది..
మా అమ్మ, తను మూగది..మా నాన్నతో ఏం మాట్లాడదు.
అయ్యో పాపం..
ఆహా… నువ్వు అలా అర్థం చేసుకోవద్దు, మా నాన్న ముందు గట్టిగా మాట్లాడదు అని అంటున్నా..
అలాగా, నువ్వు ఏదన్నా క్లారిటీగా చెప్పు గౌతమి..
సరే కానీ, ఇప్పుడు నా ప్రేమ విషయం అడగాలని నీకెందుకపించింది విక్రమ్. కొంపతీసి నువ్వు ఎవరినన్నా…
ఛఛ… అలాంటిది ఏమీ లేదు, నా లైఫ్ లో అలాంటిది ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు, ఎందుకంటే నాకు ఈ లవ్ కి ఎక్సైట్మెంట్ కి తేడా తెలీదు, “ఐ యాం నాట్ మెచ్యూర్ ఎనఫ్ టు లవ్”.
అలా ఏం లేదు విక్రమ్, నువ్వు ఎవరన్నా ఒక అమ్మాయిని చూసినప్పుడు, తనని చూసిన ఫస్ట్ టైం ఎంత ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యావో , తన్ని చూసిన ప్రతిసారి అదే ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంటే కచ్చితంగా ఆ అమ్మాయిని వదులుకోవద్దు. నేను చందు ని చూసిన ప్రతిసారి అలాగే ఫీల్ అవుతున్నా, అతనితో మాట్లాడిన ప్రతిసారి ఏదో ఒక తెలియని సంతోషం.
“ఒక్కసారి మనం ఎవరినన్నా మనసులో దాచుకుంటే మన ప్రతి హార్ట్ బీట్ లోను వాళ్ళ ప్రేమను ఫీల్ అవుతుంటాం”
ఇదేదో బాగుంది కానీ ప్రాక్టికల్ గా ఇలాంటివన్నీ ఉంటాయంటే నాకు నమ్మకం కలగట్లేదు, గౌతమి.
ఎందుకు ఉండవు నువ్వు కూడా బాగా గుర్తు తెచ్చుకో ఖచ్చితంగా నీకు కూడా ఏదో ఒకసారి ఇలా జరిగే ఉంటుంది..
“ఇప్పుడు నువ్వు చెప్పిందంతా విన్నాక, యాక్చువల్ గా నేను ఒక అమ్మాయిని చూసి ఎక్సైట్ అయ్యా, మళ్లీ చూసినా ఎక్సైట్ అవుతాననే నమ్మకం నాకుంది. ఎందుకంటే తను అప్పటినుంచి నా ఆలోచనలోంచి పోవట్లేదు” అని చెప్పగానే మెల్లగా నా ముఖం మీద చిరునవ్వు..
ఆ.. ఆ.. ఏంటి విక్రమ్, నీ ముఖం ఎర్రబడింది, సిగ్గు పడుతున్నట్లున్నావ్..
హే.. అదేం లేదు అంటూ చిన్నగా నవ్వుతూ మొహం దాచుకున్నా..
సిగ్గుపడటం ఆపి, తను ఎలా ఉంటుందో చెప్పు, అని అడిగింది గౌతమి..
తనా….
అమావాస్యపు అంచున తన అడుగులు పడగానే, హిమకరుడు వచ్చాడేమోనని కంగారుగా కలువ పూలన్నీ వికసించేలా ఉంటుంది..
వెన్నెల ఒడిలో తన పాదాలు కదులుతుంటే, జాబిలమ్మ తన జాడ లేకుండా మబ్బు చాటుకు వెళ్ళిపోయేలా ఉంటుంది..
ఒక్క మాటలో చెప్పాలంటే మామూలుగా ఒక అమ్మాయి అందాన్ని కొలవడానికి చందమామని పోలిక అడుగుతుంటాం, కానీ చందమామే తన అందాన్ని కొలవడానికి ఒక అమ్మాయిని పోలిక అడిగితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ….
అబ్బా ఏం చెప్పావ్ విక్రమ్, నువ్వు తన కోసం కవి అయ్యేలా ఉన్నావే.
అలా ఏం లేదు గౌతమి ఏదో తన గురించి ఆలోచిస్తుంటే అలా వచ్చేసింది అంతే
రేయ్ ఇక పడుకో రా టైం పదకొండు అవుతుంది అంటూ అరిచింది అమ్మ. వెంటనే ఆడియో ఆపేసి , బెడ్ షీట్ కప్పుకున్నాడు ఆకాష్.
కానీ అతనికి నిద్ర పట్టట్లేదు ఆ ఆడియో గురించే ఆలోచిస్తున్నాడు, అతని ఆలోచనంతా వాళ్ళ నాన్న కథ గురించే, అసలు నాన్న ఈ కథలో ఎవర్ని ప్రేమించాడు ?, అమ్మనేనా లేదా వేరే అమ్మాయి నా..
అలా కాసేపు ఆలోచిస్తూ అలిసిపోయి నిద్రపోయాడు.
ఆరోజు బుధవారం, పొద్దున్నే ప్రాజెక్ట్ అలోకేషన్ మెయిల్ వచ్చింది.
త్వరగా ఆఫీస్ కు వెళ్ళాలని చాందిని ముందే నిద్రలేచింది.