వెంటాడే నీడలు
( ఏ క్రేజీ హాట్ రొమాంటిక్, సైకలాజికల్ అండ్ పారానార్మల్ థ్రిల్లర్)
కొట్ర శివ రామ కృష్ణ
"నాకెందుకో అది కావాలనిపించిన మాట నిజమే. కానీ తను కూడా ఇష్టపడే చేసింది." శరత్ అన్నాడు. "తనకి ప్రస్తుతం పీరియడ్స్. అయినా నన్ను ప్రొటెక్షన్ లేకుండా సెక్స్ చెయ్యమని ఫోర్స్ చేసింది. నేను తనని ఓరల్ సెక్స్ చెయ్యమన్నానని పంచాయితీ పెడుతూంది. కానీ తను నాచేత మెన్సెస్ లో వున్నానని కూడా ఆలోచించకుండా ఓరల్ సెక్స్ కి కూడా ఫోర్స్ చేసి చేయించింది.."
అందరికీ ఆశ్చర్యం కలిగించిన విషయం సుస్మిత కానీ, శరత్ కానీ ఎక్కడా సిగ్గుపడడం లేదు.
"యూజ్ లెస్ ఫెలో, నువ్వు.............."
"స్టాప్ ఇట్" సుస్మిత ఇంకా ఏదో అనబోతూవుండగా గట్టిగా అరిచింది సమీర. "మీ అందరితోటి నేనొక విషయం మాట్లాడాలి."
"ఏమిటది?" ఆశ్చర్యంగా అడిగింది సుస్మిత.
సమీర అలా అన్న తరువాత అక్కడున్న అందరిలోనూ అటువంటి ఆశ్చర్యమే వుంది.
"మీరెప్పుడన్నా ఇలా గొడవపడ్డారా? ఇలా బిహేవ్ చేశారా? ఇది మీకు ఆశ్చర్యంగా లేదా?"
శరత్, సుస్మిత ముఖముఖాలు ఆశ్చర్యంగా చూసుకున్నారు. "నువ్వేం చెప్పదలుచుకున్నావు వదినా?" అదే ఆశ్చర్యంతో అడిగింది సుస్మిత.
"అందుకు కారణం నాకు తెలుసు." సుస్మిత అన్నది విననట్టుగానే చెప్పడం మొదలుపెట్టింది. కబుసా గురించి తను ఎంత ఎలాగైతే తనూజ కి చెప్పిందో అదంతా కూడా చెప్పింది. "ప్రస్తుతం మేము మా మెంటల్ కేర్ లో ట్రీట్ చేస్తున్న పేషేంట్ కి ఎదో లింక్ ఆ కబుసా తో ఉండడం వల్ల మనమందరం కబుసా ఇన్ఫ్లుయెన్స్ లోకి వెళ్ళాం. అతని ప్రభావం వల్లనే సెక్స్ విషయం లో ఇలా ఫీలవుతూ, ఇలా బిహేవ్ చేస్తున్నాం. ఇక్కడ కేవలం మీ ఇద్దరూ మాత్రమే కాదు, అందరూ సెక్స్ విషయం లో ఇలాగె ఫీల్ అవుతున్నారు, బిహేవ్ చేస్తున్నారు."
"గాడ్! నిజంగానా?" ఆశ్చర్యపడుతూ అడిగాడు శరత్.
"విషయం అర్ధం అయింది కదా. ఇంక మీరిద్దరూ గొడవపడకండి." గట్టిగా నిట్టూరుస్తూ అంది సమీర. "ఇంకా మీరేమీ అనుకోకపోతే ఇక్కడనుండి మీరందరూ సాధ్యమైనంత త్వరగా వెళ్లిపోండి. పరిస్థితులన్నీ చక్కబడ్డాక రావచ్చును."
అక్కడ ఎవరన్నా ఎమన్నా మాట్లాడే లోపు ఒక చిన్నపిల్లాడి ఏడుపు గట్టిగా వినిపించింది. "ప్రణయ్ లేచినట్టున్నాడు. నేను వెళ్ళాలి." అని తనూజ అక్కడనుండి వేగంగా వెళ్ళిపోయింది. తనూజ వెనకాతలే అప్పటివరకూ అక్కడ అంతా వింటూవున్న అభినవ్ వెళ్ళిపోయాడు.
"మన డెవిల్ లేచేలోపు మనం కూడా వెళ్లడం మంచిది." తన రూమ్ వైపు నడుస్తూ అన్నాడు అరవింద్. అరవింద్ వెనకాతలే నడిచింది సమీర కూడా.
శరత్, సుస్మిత మరోసారి ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకుని అక్కడనుండి నడిచారు.
"ఇంత అర్ధరాత్రి పూట ఎవరికీ ఫోన్? అందరూ పడుకుని వుంటారు కదా." రూమ్ లోకి వచ్చిన సమీర ఎవరికో ఫోన్ చేస్తూవుంటే అడిగాడు అరవింద్.
అరవింద్ మాటలు పట్టించుకోకుండా దయిలింగ్ టోన్ వింటోంది సమీర సెల్ ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని. తనకీ ఇష్టం లేదు నిరంజన్ ని ఈ సమయం లో డిస్టర్బ్ చెయ్యడం. కానీ ఈ విషయం లో సాధ్యమైనంత తొందరగా తన నిర్ణయం నిరంజన్ కి చెప్పాలి.
"సారీ టు డిస్టర్బ్ యు నిరంజన్ ఇంత అర్ధరాత్రిపూట ఫోన్ చేసి నీ నిద్ర చెడగొట్టినందుకు." నిరంజన్ లైన్ లోకి రాగానే అంది సమీర.
నిరంజన్ సర్ అనికాకుండా నిరంజన్ అని పిలిస్తే అరవింద్ కి కూడా అదొకలాగే ఉంటుంది.
"నెవెర్ మైండ్ సమీరా." ఫోన్ స్పీకర్ లో వుంచిందేమో నిరంజన్ నవ్వు అరవింద్ కి కూడా వినిపించింది. "అయినా ఇప్పుడు నువ్వు నా నిద్ర ఏమీ చెడగొట్టలేదు. ఎందుకంటే ఇప్పుడు నేనసలు పడుకోలేదు. మా ఇంట్లో మేము చాలా విచిత్రమైన పరిస్థితి అనుభవిస్తూ వున్నాం. ఐ థింక్ మీ ఇంట్లో పరిస్థితి కూడా అలాగే వుందనుకుంటా."
గట్టిగా నిట్టూర్చి అంది సమీర. "ఆస్క్ దట్ బాస్టర్డ్ టు కమ్ నిరంజన్. ఈ సమస్య మనం వాడు లేకుండా పరిష్కరించగలిగేదిగా అనిపించడం లేదు. ఆస్క్ దట్ యస్మణి టు బి ఇన్ అవర్ మెంటల్ కేర్ ఏజ్ ఫాస్ట్ ఏజ్ పాజిబుల్."
గట్టిగా వినిపించింది నిరంజన్ నవ్వు సమీర, అరవింద్ లకి. "థాంక్ గాడ్! సమీరా . ప్రస్తుతం మనం వున్న పరిస్థితులకి నేనాల్రెడీ ఆ యస్మణి కి రమ్మనమని చెప్పేసాను. ఈ విషయం నీకు చెప్పకుండా చేసినందుకు నువ్వేమన్నా ఫీలవుతావేమోనని భయపడుతున్నా. రేపు మార్నింగ్ టెన్ కల్లా అయన మన మెంటల్ కేర్ లో వుంటాడు."
"ఒకే దెన్" అని చెప్పి ఆ ఫోన్ కాల్ కట్ చేసింది సమీర.
"అంటే, ఆ ముసలాడి కి నీ అందాల్ని చూసి ఆనందించే అవకాశం మరోసారి దొరుకుతూందన్నమాట." అరవింద్ అన్నాడు కోపం నటిస్తూ.
అరవింద్ ని కౌగలించుకుని అతని రెండుబుగ్గలమీద ముద్దుపెట్టుకుంది సమీర. "నువ్వుతప్ప ఇంకెవరూ నా అందాల్ని చూసికూడా ఆనందించకూడదా?"
"అలాగని కాదు." నెమ్మదిగా సమీర ని అక్కడవున్న బెడ్ వైపు నడిపిస్తూ అన్నాడు అరవింద్.
ఆ ఇద్దరికీ మరోసారి అది కావాలనే వుంది, కానీ అంతలోనే బేబీ శకుంతల గట్టిగా ఏడవడం మొదలుపెట్టడంతో అరవింద్ ని విడిపించుకుని అటువైపుగా పరుగుపెట్టింది సమీర. హుస్సురని నిట్టూరుస్తూ బెడ్ మీద పడుకున్నాడు అరవింద్ సమీర తనపని ఫినిష్ చెయ్యడానికి ఎదురుచూస్తూ. కానీ ఆ లోపుగా తనకి తెలియకుండానే నిద్రలోకి జారిపోయాడు.
బేబీ శకుంతలని ఉయ్యాల లో నిద్రపుచ్చి వచ్చి అరవింద్ పక్కన పడుకుంది సమీర అతన్నే అలాగ చూస్తూ. ఎప్పుడు నిద్రలోకి జారిపోయిందో తనకీ గుర్తులేదు.
&&&
యస్మణి తో పాటుగా వచ్చిన సింహరాజు ని ఆశ్చర్యంగా చూసారు నిరంజన్, సమీర.
"ఈ ప్రస్తుత సమస్య పరిష్కారం కావాలంటే నేనొక్కడినే సరిపోను. ఈయన కూడా ఉండాల్సిందే. తగిన సమయంలో ఈయన గురించిన మొత్తం సమాచారం మీకు తెలియచేస్తాను."
యస్మణి అలా అన్నాక సింహరాజు గురించి వేరే ప్రశ్నలు ఏమీ అడగలేదు వారిద్దరూ. ఆ రోజు కి విశ్రాంతి తీసుకుంటే మర్నాడు అన్నివిషయాలు మాట్లాడుకోవచ్చని సజెస్ట్ చేసాడు నిరంజన్.
"ఇది ఆలస్యం చేయదగిన విషయం కాదు. ఆ అమ్మాయి కుటుంబ సభ్యులతో వెంటనే ఒక సమావేశం ఏర్పాటు చెయ్యండి. అందరు కుటుంబ సభ్యులు ఉండటం మంచిది ఒక్క ఆ అమ్మాయి తప్ప. ఆ అమ్మాయి మాత్రం ఇప్పుడు మన సమావేశం లో వద్దు." యస్మనే మళ్ళీ అన్నాడు. "కాకపోతే ఆ అమ్మాయి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడ్డానికి ముందుగా, మేము మీ ఇద్దరితో మాట్లాడాల్సిన విషయాలు వున్నాయి."
ఆ తరువాత సమీర, నిరంజన్, సింహరాజు, యస్మణి నిరంజన్ ఛాంబర్ లో గంటకి పైగానే మాట్లాడుకున్నారు. అప్పుడే సింహారాజు వివరాలు కూడా చెప్పేసాడు యస్మణి వాళ్ళిద్దరికీ
ఆ మెంటల్ కేర్ లో వున్న పెద్ద కాన్ఫరెన్స్ హాల్లో సమావేశం ఏర్పాటు చేశారు. సింహరాజు, యస్మణి ఒకరిపక్కన ఒకరు కూచుంటే, వారిద్దరికీ ఎదురుగుండా నిరంజన్, సమీర, ప్రమీల, సారిక తప్ప తక్కిన సారిక కుటుంబ సభ్యులు వున్నారు. సింహరాజు కి, యస్మణి కి సారిక కుటుంబ సభ్యులనందరినీ పరిచయం చెయ్యడం జరిగింది.
"ఇప్పుడు మీ సమస్య, మీ అమ్మాయి సారిక నలుగురు వ్యక్తులమీద అకారణ ద్వేషం చూపిస్తూంది. అది తన తల్లితండ్రులు, తన తాతయ్య, ఇంకా ఓబులేసు అనే మీ పనివాడు. ఎంత ఆలోచించినా ఆ అమ్మాయికి గానీ, మీకు గానీ ఆ అమ్మాయికి ఈ నలుగురిమీద ఎందుకు అలా కోపం వస్తూంది అన్న విషయం బోధపడడం లేదు, అవునా?" యస్మణి అడిగాడు.
"అంతే కాదు, మరొక ముఖ్యమైన విషయం కూడా వుంది. తను ఒంటె తలతో నగ్నంగా వున్నఒక మగ మనిషి బొమ్మ గీస్తూవుంటుంది." మాలతి అంది.
"ఆ విషయానికి తరువాత వద్దాం. ముందు ఈ విషయం తేలనివ్వండి." యస్మణి అన్నాడు.
"మీరు చెప్పింది నిజమే." మోహనరావు అన్నాడు. "తను మా నలుగురి మీద అటాక్ చేసింది కూడా. మా పీక నొక్కి చంపబోయింది. ఎదో అదృష్టం బావుండి బతికిబయటపడ్డం. ఆ సమయం లో తనకంత బలం ఎలా వస్తూందో మాకు బాధపడడం లేదు కానీ కొంచెం కూడా తన పట్టునుండి విడిపించుకోలేకపోయాం. కానీ ఎవరో ఇంటర్ ఫియర్ అవ్వడం వల్ల తను స్పెల్ నుండి బయటపడి మేము ప్రాణాలతో బయటపడ్డాం."
"మా నలుగురిలో ఆ ఓబులేసు చాలా చిత్రం గా చనిపోయాడు కూడా." భుజంగరావు అన్నాడు.
"ఓబులేసు చనిపోయాడా?" ఆశ్చర్యంగా అడిగింది మాలతి. "ఈ విషయం ఇంతవరకూ ఎందుకు చెప్పలేదు?"
శ్రవణ్, వంశీ కూడా ఆ విషయం విని చాలా ఆశ్చర్యపోయారు.
"వున్నవిషయాలకే మీరంతా అప్సెట్ అయిపోయివున్నారు. ఆ విషయం కూడా చెప్పి ఇంకా అప్సెట్ చెయ్యడం ఎందుకని చెప్పలేదు. అదీ కాకుండా సమీర కి ఈ విషయం తెలియడం మాకు ఇష్టం లేదు. తెలిస్తే తను మరీ డిస్టర్బ్ అవుతుందనిపించింది."
"మీరు చెప్పింది నిజమే." నిట్టూర్చింది మాలతి. శ్రవణ్, వంశీ మౌనంగా జరుగుతున్నది చూస్తున్నారు.
"దయచేసి ఈ సమస్య ఎలా సాల్వ్ ఆవుతుందో అది చెప్పండి. ఈ మెంటల్ హాస్పిటల్ లో మా ప్రాబ్లెమ్ సాల్వ్ అవుతుందనుకున్నాం. ఇక్కడకూడా సమస్య ఇంకా క్రిటికల్ అయిందే కానీ సాల్వ్ కాలేదు." యస్మణి మొహం లోకి ఆవేదనగా చూస్తూ అన్నాడు భుజంగరావు.
"మనకి మనంగా సృష్టించుకున్న సమస్యలు అంత తేలికగా పరిష్కారం కావు." మొదటిసారిగా మాట్లాడుతూ అన్నాడు సింహరాజు.
"మేము సృష్టించుకున్న సమస్యలా? ఆలా మేమెందుకు చేస్తాం? ఒకవేళ మేమే సృష్టించుకున్నా, అది మీకెలా తెలుసు? ఇంతకీ మీరెవరు?" సింహరాజు మొహం లోకి చూస్తూ కోపంగా అడిగాడు భుజంగరావు.
"నన్ను గుర్తుపట్టనే లేదా నువ్వు? అవునులే, కన్న కూతుర్ని, కన్న తల్లినే మర్చిపోయినవాడివి, నీకు నేనెలా గుర్తుంటాను? అయినా కొంచెం జాగ్రత్తగా చూడు, గుర్తుకువస్తానేమో." గట్టిగా నవ్వుతూ అన్నాడు సింహరాజు.
ఆశ్చర్యం తో సింహరాజు మొహం లోకి భుజంగరావు చూస్తూవుంటే, సింహరాజు నవ్వుతూనే వున్నాడు.
సడన్ గా కరెంట్ షాక్ కొట్టినట్టుగా గుర్తుకువచ్చింది భుజంగరావు కి. "......రాజూ" అన్నాడు.
"అమ్మయ్య, నీకు గుర్తుకు వచ్చేసేను." నవ్వాపుకుని కుర్చీలో వెనక్కి జారగిలబడి గట్టిగా నిట్టూర్చాడు సింహరాజు. "నీ చదువు కోసం, తన జబ్బు ని కూడా లక్ష్యపెట్టకుండా తన డబ్బంతా నీకే ఖర్చుపెట్టిన నీ భార్యగురించి నువ్వెలాగూ ఆలోచించలేదు. కానీ నీ కడుపున పుట్టిన కూతురి గురించి కూడా ఆలోచించలేకపోయావే. నీ ఇంట్లోవున్నన్ని రోజులూ నరకం చూపిస్తారా? తనక్కడనుండి పారిపోయివచ్చేలా చేస్తారా?"
మ్రాన్పడిపోయి వింటున్నారు అక్కడవున్న అందరూ. షాక్ లోనుండి తేరుకున్నాక అడిగాడు వంశీ. "మామ్, డాడ్ కి ముందొకసారి పెళ్లయిందా? తనకొక కూతురు కూడా వుందా?"
"అవును. మీ డాడ్ నన్ను పెళ్లిచేసుకోబోయే ముందు తనకి పెళ్లయి భార్య చనిపోయిందని మాత్రమే చెప్పాడు, తనకొక కూతురు వుందన్న విషయం చెప్పలేదు." చిన్న గొంతు తో అంది మాలతి.
"తను ఇప్పుడు ఎక్కడ వుంది, ఏం చేస్తూంది? మనింట్లో ఎప్పుడువుంది?" శ్రవణ్ అడిగాడు.
"మనింట్లో చిన్నప్పుడు నిన్ను ఆడించేదే, అది ఆ అమ్మాయే." తను ఎలా మాట్లాడుతూందో మాలతి కి అర్ధం కావడం లేదు.
"మరి తను మన పనిమనిషి అని చెప్పావే?" ఆశ్చర్యంగా అడిగాడు శ్రవణ్.
"తనని తన కూతురుగా మీ నాన్నే అంగీకరించలేకపోయాడు, ఇంకా సవతి తల్లి మీ అమ్మేం అంగీకరించగలుగుతుంది?"
"తను మాకు చెప్పకుండా మా ఇంట్లోనుండి వెళ్ళిపోయింది, దానికి మేమేం చెయ్యగలం?" చిన్నగొంతుతో అన్నాడు భుజంగరావు.
"మీరేం చెయ్యకుండానే వెళ్లిపోయిందా? తనని మంచిగా, బాగా చూసుకుంటేనే పారిపోయివచ్చేసిందా?" తీవ్రంగా చూస్తూ అడిగాడు సింహరాజు.
దానికి ఏం సమాధానం చెప్పాలో తెలియక మౌనంగా వుండిపోయాడు భుజంగరావు.
"అది చాలక తనెక్కడ మీ ఆస్తిపాస్తుల్లో వాటా అడుగుతుందో అని తన అడ్డు తొలగించుకోవడానికి మీ నమ్మినబంటు ఓబులేసు ని కూడా పంపించారు కదా."
"నేను నా తల్లి గురించి ఆలోచించలేదు, నా కూతురిగురించి పట్టించుకోలేదు. అలా వాళ్ళ గురించి ఆలోచించను, పట్టించుకోను అని మాట ఇచ్చాను." సింహరాజు మొహం లోకి చూస్తూ అన్నాడు భుజంగరావు. "కానీ తన అడ్డు తొలగించుకోవాలని మాత్రం ఏ నాడూ అనుకోలేదు."
"అంటే ఆ ఓబులేసు తనని చంపేసిన విషయం నీకు అసలు తెలియనే తెలియదా?"
"తను చనిపోయిందా?" షాక్ తో కుర్చీలోనుండి లేచి నిలబడ్డాడు భుజంగరావు.
"అవును, ఆ ఓబులేసు తనని రేప్ చేసి, తన ఇంటి వెనకాతల గొయ్యితీసి, అందులో బతికివుండగానే పాతిపెట్టేసాడు."
&&&
"అది సరే కానీ నా సిస్టర్ కి తన పేరెంట్స్ మీద, గ్రాండ్ పా మీద, ఇంకా ఆ ఓబులేసు మీద ఎందుకు కోపం రావాలి? తనకి కనీసం మా డాడ్ మొదటి కూతురిగురించి తెలీను కూడా తెలీదు." వంశీ అన్నాడు ఆశ్చర్యంగా.
"మా అభిప్రాయం లో సారిక కి ఎలాగో మీ డాడ్ మొదటి కూతురు మల్లిక విషయాలు తెలిసాయి. బహుశా వాటితో చాలా ఇన్ఫ్లుయెన్స్ అయింది. అందువల్ల తనలో మల్లిక స్ప్లిట్ పెర్సనాలిటీ డెవలప్ అయింది. తను మల్లికగా మారినప్పుడు తన పేరెంట్స్ మీద, గ్రాండ్ పా మీద, ఆ ఓబులేసు మీద అలా కోపం చూపిస్తూంది." గట్టిగా నిట్టూర్చింది సమీర. "కానీ ఈ సింహరాజు, మా గురువుగారు చెప్పేకారణం వేరేలా వుంది."
"చనిపోయిన మల్లిక, సారిక గా పుట్టింది. గతజన్మలో ఈ సారికే ఆ మల్లిక. తన గత జన్మ గుర్తుకువచ్చినప్పుడల్లా అలా ప్రవర్తిస్తూంది." గట్టిగా నవ్వుతూ మాలతి మొహం లోకి చూసాడు సింహరాజు. "నువ్వెంతగానో అసహ్యించుకున్న నీ సవతి కూతురే, నువ్వెంతో ప్రేమిస్తూన్న నీ సొంత కూతురు. చాలా ఆశ్చర్యంగా వుంది కదా."
మ్రాన్పడిపోయింది మాలతి అదివిని. మెదడు కి ఏ ఆలోచనా కూడా తట్టడం మానేసింది.
"ఓకే. కానీ ఇంకా ఒక విషయం అలాగే మిగిలివుంది. తనెందుకు ఆ ఒంటె తలవున్న..........."
"మల్లికే సారికగా పుట్టడం కన్నా కూడా పెద్ద సమస్య ఇది." వంశీ ని కట్ చేస్తూ చెప్పి, గట్టిగా నిట్టూర్చాడు సింహరాజు. "నిజానికి ఈ సమస్య కి నేను కూడా కారణం."
ఆ తరువాత సింహరాజు కబుసా గురించి చెప్తూవుంటే ఆసక్తిగా విన్నారు అందరూ. అది వినడం పూర్తయ్యే సరికి అందరి మనసులు భయంతో నిండిపోయాయి.
"తనని ఆరాధించే కన్నెపిల్లల్ని జన్మ జన్మల కి వెంటాడతాడు కబుసా. అందులోనూ క్రితం జన్మలో తను కన్యగా ఉండగా, తన పద్దెనిమిదవ ఏట, కబుసా అనుభవించకుండానే చనిపోయింది మల్లిక. ఈ జన్మలో తన పద్దెనిమిదవ ఏట ఎవరూ అనుభవించకుండా మొదట తనే అనుభవించాలని కబుసా అభిప్రాయం. అందువలన తను ఎవరితోనూ కలవకుండా చూస్తూ వుండివుంటాడు."
'ఇదంతా ట్రాష్. నేను నమ్మను.' అనబోయి ఆగిపోయింది సమీర సారిక చెప్పిన విషయం సడన్ గా గుర్తుకువచ్చి. ఇది నిజం కాకపోతే సెక్స్ లో సరిగ్గా లాస్ట్ మూమెంట్ దగ్గరికి వచ్చేసరికి తనలా ఎందుకు బిహేవ్ చేస్తుంది?
"ఇది పెద్ద సమస్యే అయినా నేను పరిష్కరిస్తాను. కొంచెం అలోచించి చేయాల్సిన పని." సింహరాజు అన్నాడు.
"ప్రస్తుతానికి మీరంతా వెళ్లి విశ్రాంతి తీసుకోండి. మనం ఏమిటి చెయ్యాలి, ఎలా చెయ్యాలి అన్నది తరువాత ఆలోచిద్దాం." అని నిరంజన్ కుర్చీలోనుండి లేచాడు. ఆ తరువాత తక్కిన అందరూ కూడా కుర్చీలలోనుండి లేచి అక్కడనుండి వెళ్లిపోయారు.
&&&
"మీ కాన్ఫరెన్స్ లో ఏం మాట్లాడుకున్నారు? నన్నెలాగూ అక్కడ ఉండనివ్వలేదు, కనీసం మీరేం మాట్లాడుకున్నారో చెప్తే వచ్చే ఇబ్బందేమిటి?" తన రూమ్ లో తన ఫ్యామిలీ సభ్యలందరు మళ్ళీ అసెంబుల్ అవ్వగానే అడిగింది సారిక.
అందరూ మొహామొహాలు చూసుకున్నారు తప్ప ఎవరూ ఏం మాట్లాడలేదు.
"అసలు నా సమస్యకి సొల్యూషన్ దొరికిందా లేదా? నాది సాల్వ్ అయ్యే ప్రాబ్లెమ్ కాదని ఆ కొత్తగా వచ్చినవాళ్లు కూడా చెప్పేశారా ఏం?" భృకుటి ముడేసింది సారిక.
"అటువంటిది ఏమీ లేదు." వంశీ అన్నాడు. "నీ అబ్నార్మల్ బిహేవియర్ కి అంతటికీ కారణం తెలిసింది. మొత్తం పజిలంతా విడిపోయింది."
"అలా అయితే అదంతా తెలుసుకోకుండా నేనుండలేను. ప్లీజ్ దయచేసి చెప్పండి." సారిక ఆతృతగా అడిగింది.
"అదంతా నీకు చెప్తే మళ్ళీ నువ్వు ఎలా రియాక్ట్ అవతావో, మళ్ళీ అలా వయొలెంట్ గా బిహేవ్ చేస్తావేమోనని మాకు భయంగా వుంది." శ్రవణ్ అన్నాడు.
(ఇక్కడివరకూ నచ్చిందనే ఆశిస్తా. తరువాతి భాగం సాధ్యమైనంత త్వరలోనే పబ్లిష్ చేస్తా. రేటింగ్ ఇచ్చి, రివ్యూ రాయడం మరచిపోవద్దు.)