Read ventaade needalu by sivaramakrishna kotra in Telugu థ్రిల్లర్ | మాతృభారతి

Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

వెంటాడే నీడలు - 28

వెంటాడే నీడలు

( ఏ క్రేజీ హాట్ రొమాంటిక్, సైకలాజికల్ అండ్ పారానార్మల్ థ్రిల్లర్)

కొట్ర శివ రామ కృష్ణ

తన విల్ పవర్ అంతా వుపయోగించి, ఆ కోరికకి లోబడకుండా నిద్రపోవడానికి ప్రయత్నించింది. ఎప్పుడు నిద్రపట్టిందో తెలియదు కానీ తెల్లవారి లేచేసరికి మాత్రం సమయం ఎనిమిది అయిపోయింది.        

&&&

"సమీర గారూ, మీతో ప్రైవేట్ గా మాట్లాడ్డానికి నాకు ఒక రెండు నిమిషాల సమయం ఇస్తారా?" సమీర మెంటల్ కేర్ కి బయలుదేరి వస్తూండగా దగ్గరికి వచ్చి అన్నాడు అభినవ్. 

అప్పటికే ఆలస్యమైంది. 'కెన్ ఇట్ వెయిట్ టిల్ ఈవెనింగ్?' అనబోయి ఆగిపోయింది. అభినవ్ తనని ఇలా అడగడం ఇదే మొదటిసారి. అందులోనూ తన మొహం లో ఏదో ఆందోళన కూడా కనిపిస్తూ వుంది. ఏదో ముఖ్యమైన విషయమే అయివుంటుంది.

"రండి నా రూమ్ లో కూచుని మాట్లాడుకుందాం." అప్పటికి అరవింద్ బాత్ రూమ్ కి వెళ్లడం వల్ల, తనని తమ బెడ్ రూమ్ లోకి తీసుకువెళ్ళడానికి ఇబ్బంది ఏమీ అనిపించలేదు.

"ఇప్పుడు చెప్పండి. విషయం ఏమిటి?" తను బెడ్ మీద, అభినవ్ తనకి అపోజిట్ గా కుర్చీలో కూచున్నాక అడిగింది.

"ఇటీవల మీ సిస్టర్ బిహేవియర్ చాలా టిపికల్ గా వుంది."

"టిపికల్ గా వుంది అంటే, నాకు అర్ధం కావడం లేదు."

"నాకు ఎలా చెప్పాలో కూడా బోధపడడం లేదు." అభినవ్ మొహం అనీజీనెస్ తో నిండిపోయింది.

"ఎలాగోలా చెప్పండి." నవ్వింది సమీర. "నేనొక సైకియాట్రిస్ట్ ని అభినవ్. నేనే మీకు ఎక్కువ హెల్ప్ చెయ్యగలను ఈ విషయం లో. అంతే కాకుండా మీరు చెప్పబోయేది నా ఓన్ సిస్టర్ గురించి."

"తను సెన్సిటివ్. స్ట్రెయిట్ సెక్సే తనకిష్టం. అందులో వింత పోకడలు తనెప్పుడూ ఇష్టపడదు. నేనెప్పుడన్నా కొత్తగా ట్రై చేద్దామన్నా తను ఒప్పుకోదు. ఇట్ షుడ్ బి ఇన్ ద యూజువల్ ట్రెడిషనల్ వే."

'మై గాడ్! అభినవ్ ఏం చెప్పబోతూవున్నాడు?' గుండెవేగం హెచ్చింది సమీర కి.

"అలాంటిది ఇప్పుడు తను ఓరల్ సెక్స్ మీద ఇంటరెస్ట్ చూపిస్తూంది. షి సక్డ్ మై థింగ్ లైక్ ఎనీథింగ్ యు నో."

గుండె ఒక్క నిమిషం ఆగి మళ్ళీ కొట్టుకోవడం ప్రారంభించింది సమీర కి. యస్మణి చెప్పింది గుర్తుకొచ్చింది. అది తన సిస్టర్ వింత బిహేవియర్ వల్ల కాదు. తన ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాళ్ళని ఇరిసిస్టిబుల్, అన్రీజనబుల్ సెక్సువల్ డిజైర్ కి గురిచేయడం కబుసా మెయిన్ కారక్టర్స్టిక్! ఈ సంఘటనలన్నీ తాము కబుసా ఇన్ఫ్లుయెన్స్ లో ఉన్నామని మళ్ళీ, మళ్ళీ ప్రూవ్ చేస్తున్నాయి.          

"అంతకన్నా ముందు ఒక రోజు............ తనకి పీరియడ్స్........... అప్పుడు నన్ను అది చెయ్యమని చెప్పి ఫోర్స్ చేసింది.......... ఏ ప్రొటెక్షన్ లేకుండా............ నేను చాలా ఇబ్బంది పడ్డాను."

ఏం జరుగుతోంది ఈ ఇంట్లో అసలు? మతి పోతున్నట్టుగా వుంది సమీర కి. తన అక్క అలా బిహేవ్ చేయడమా?

"నేనిదంతా తన మీద కోపం తో చెప్పడం లేదు. నేనంటే తనకి కూడా చాలా అభిమానం. నేనీ రోజు  ఇలా ఆనందం గా జీవించడానికి తనే కారణం. కానీ............" కాస్త ఆగాడు అభినవ్. ".......... ఇటీవల తన ప్రవర్తన మాత్రం నేను భరించలేకపోతున్నాను. మీరు సైకియాట్రిస్ట్ కూడా కదా. తనలో ఎమన్నా మార్పు మాట్లాడగలరేమోనని మీకు చెప్తున్నాను."

"తప్పకుండా అలాగే. నేను తనతో మాట్లాడతాను. మీరు నిశ్చింతగా వుండండి." బెడ్ మీద నుండి దిగుతూ అంది సమీర.

"సారీ మీకు ట్రబుల్ ఇచ్చాను." తనూ కుర్చీలోనుండి లేచి అన్నాడు అభినవ్.

"ఇది ట్రబుల్ కాదు. మీరు మా ఫ్యామిలీ లో పార్ట్. మీకు ఏదన్న సమస్య వస్తే అది మనందరి సమస్య. మీ ప్రాబ్లెమ్ సాల్వ్ అయ్యేలా చేస్తాను, మీరు నిశ్చింతగా వుండండి."

అలా అన్నాక ఆ రూమ్ లోనుండి బయటకి వెళ్ళబోతూ ఉండగా, అరవింద్ ఆ రూమ్ లోకి వచ్చాడు.

"అభినవ్ నాతో కొంచెం ప్రైవేట్ గా మాట్లాడాలంటే, మన బెడ్ రూమ్ లో మాట్లాడాను." అరవింద్ అడగక ముందే చెప్పింది సమీర అరవింద్ వైపు చూస్తూ.

"అది మన బెడ్ రూమ్ లోనే మాట్లాడుకోవాలా?" అలా అన్నాక డ్రెస్ తీసుకోవడానికి అన్నట్టుగా ఆ రూమ్ లో అల్మైరా దగ్గరకి వెళ్ళాడు అరవింద్.

అరవింద్ అన్నది విని నివ్వెరపోయింది సమీర. తను అలా మాట్లాడతాడని ఊహించలేదు. ఏదో అందామని అభినవ్ వైపు చూస్తే, అతను తల వంచుకుని వెళ్ళిపోతూ కనిపించాడు.                 

&&&

బ్లాక్ యాంట్ మెంటల్ కేర్ లో సారిక రూమ్ లోకి వెళ్ళగానే తనతో పాటుగా తన మామ్ మాలతి,  గ్రాండ్ పా మోహనరావు ఇంకా ప్రమీల కనిపించారు.

మామూలుగా పలకరింపులు అయ్యాక "సో ఫార్ మాకు తెలిసిన విషయం ఏమిటంటే సారిక కి నలుగురి మీద తనే అర్ధం చేసుకోలేనివిధంగా, తనకే తెలియకుండా కోపం వస్తూంది. అది తన మామ్, డాడ్, గ్రాండ్ పా, ఇంకా ఆ ఓబులేసు. కాబట్టి............." కాస్త ఆగి ఇబ్బంది పడుతున్న ఎక్స్ప్రెషన్ తో అంది. "............ మేము కారణం కనుక్కుని ప్రాబ్లెమ్ సాల్వ్ చేసేవరకూ మీ నలుగురూ తనతో డిస్టెన్స్ మైంటైన్ చెయ్యడం మంచింది."

"వాట్ ద  హెల్ యు ఆర్ టాకింగ్?" కోపంగా అన్నాడు మోహనరావు. "అంటే నా మనవరాలు దగ్గరే నేనుండకూడదా? తన పేరెంట్స్ కూడా తనకి దూరంగా వుండాలా?"

"ప్లీజ్. నేను చెప్పేది కొంచెం రైట్ స్పిరిట్ లో అర్ధం చేసుకోండి." వస్తూన్న ఇరిటేషన్ ని కంట్రోల్ చేసుకుంటూ అంది సమీర. అసలే ఇంటిదగ్గర సంఘటనలతో చాలా చిరాగ్గా వుంది తనకి. "ఇప్పటికి ముగ్గురి మీద అటాక్ చేసింది. అప్పుడు తనకి విపరీతంగా బలం వుండి వాళ్ళకి తప్పించుకోవడానికి కూడా కష్టం అయింది. తనకలా కోపం ఉన్నవారిలో మీరూ వున్నారని తేలింది. మీమీదా అటాక్ చేస్తే పరిణామాలు ఎలా వుంటాయో తెలియదు కదా."  

"మీ దగ్గరికి తీసుకొచ్చి ఇన్నిరోజులయినా ఏ సొల్యూషన్ చూపలేకపోయారు. కానీ ఇటువంటి సజెషన్స్ మాత్రం బాగానే ఇస్తున్నారు." మోహనరావు ఇంకా కోపంగానే వున్నాడు.

"బ్లాక్ యాంట్ మెంటల్ కేర్ చాలా రెప్యుటేడ్ మెంటల్ కేర్. డాక్టర్ సమీర చాలా కాపబుల్ సైకియాట్రిస్ట్. మనం కొంచెం వెయిట్ చెయ్యాలి." ప్రమీల అంది.

"నాన్నా......" మోహనరావు ఇంకా ఎదో అనబోతూవుండగా మాలతి అంది. "........... డాక్టర్ సమీర మనగురించి ఆలోచించే చెప్పింది, మనం అలా కోపం తెచ్చుకుంటే ఎలా?"

"సరేలే." కోపం తగ్గించుకుని అన్నాడు మోహనరావు. "ఇంతకీ నేను కొంతసేపు నా మనవరాలితో మాట్లాడొచ్చా, మాట్లాడకూడదా?"

"ఏజ్ యు విష్." ఇంక అంతకన్నా తను చెప్పగలిగింది ఏమీ లేదన్నట్టుగా అక్కడనుండి వెళ్ళిపోయింది సమీర.   

"మీరూ కావాలంటే అలా ఎక్కడికన్నా వెళ్ళిరండి. నేను కాసేపు నా మానవరాలితో వంటరిగా మాట్లాడాలి." ప్రమీల, మాలతి ల వైపు చూస్తూ అన్నాడు మోహనరావు.

"ఒకే అయితే" మాలతి కుర్చీలోనుండి లేచింది. "మనం అలా కాసేపు బయట తిరిగివద్దాం."

వద్దనబోతూనే తనూ కుర్చీలోనుండి లేచింది ప్రమీల. తరవాత ఆ ఇద్దరూ ఆ రూమ్ లోనుండి బయటకి వెళ్లిపోయారు.  

అప్పుడు బెడ్ మీద ఎడ్జ్ లో పక్క, పక్కన కూచుని వున్నారు సారిక, మోహనరావు.

"నువ్వు దీనికి దేనికీ కంగారు పడొద్దు. నీకున్నది చాలా చిన్న సైకలాజికల్ డిజార్డర్. దానికి ఇంత హడావిడి అవసరమే లేదు."

"ఒకే గ్రామ్ప్స్." నవ్వింది సారిక. "అంత చిన్న సైకలాజికల్ డిజార్డర్ తోనే నేను ముగ్గురిని చంపడానికి ట్రై చేసానా?"

"ఆ ముగ్గురిలో ఎవరూ చనిపోలేదుగా. ఎదో నువ్వు చేసిన చిన్న అటాక్ కి చంపడానికి ట్రై చేసావ్ అనేంత పెద్ద వర్డ్స్ ఎందుకు?"

"ఒకే. గ్రాండ్ పా." మళ్ళీ నవ్వింది సారిక. "అలాంటి చిన్న అటాక్ అయినా నేను ఎందుకు చేసాను?"

"సారికా......." తనని దగ్గరికి తీసుకుంటూ అన్నాడు మోహనరావు. ".......... నీకేదో ఒక చిన్న సైకలాజికల్ డిజార్డర్ వుంది. అది క్యూర్ అవుతుంది. దానిగురించని చెప్పి మమ్మల్నందరినీ నీకు దూరం పెడతామంటే నేను ఒప్పుకోను."

"థాంక్ యు గ్రాండ్ పా." అతని కుడిభుజం మీద తలపెట్టుకుంటూ అంది సారిక. "నన్ను ఇంతగా ప్రేమించేవాళ్లు దొరకడం నాకు ఎంత అదృష్టం?"

"లేదు. నీలాంటి మంచి అమ్మాయి మనవరాలిగా, కూతురిగా దొరకడం మా అదృష్టం." తనని ఇంకా దగ్గరికి తీసుకుంటూ అన్నాడు మోహనరావు.

"తనంటే మీకెంత ప్రేమ. తను మిమ్మల్ని చంపడానికి ప్రయత్నించనినా మీకేం పర్వాలేదు. నేనంటే మాత్రం మీకు ద్వేషం, కోపం. ఎందుకలా?"

"నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్ధం కావడం లేదు." అయోమయం గా అన్నాడు మోహనరావు.

"అవును. దాన్నెందుకు అంత ప్రేమిస్తారు. నన్నెందుకు అంత ద్వేషించారు?"

"నువ్వేం మాట్లాడుతున్నావా నాకు బోధపడడం లేదు తల్లీ." సారిక ని రెండుచేతులతో దూరంగా పెట్టి, తన మొహం లోకి చూస్తూ అన్నాడు మోహనరావు.

"అవున్రా, నేనంటే ఎందుకురా అంత ద్వేషం? నేను మీకేం అపకారం చేశాను రా?" గట్టిగా అరుస్తూ మోహనరావు ని బలంగా కిందకి తోసింది సారిక. దానితో బెడ్ మీద నుండి కిందకిపడిపోయాడు మోహనరావు.

"ఇంత సడన్ గా నీకేమయిందమ్మా?" నెల మీదనుండి పైకి లేవడానికి ప్రయత్నిస్తూ షాక్ తో అడిగాడు.

"నేను నిన్ను బతకనివ్వనురా. నిన్ను చంపేస్తాను." అతని మెడ చుట్టూ చేతులు వేసి నొక్కుతూ అంది సారిక.

"ప్లీజ్ సారికా. ఏమిటిది, నన్ను విడిచిపెట్టు." తన గొంతు చుట్టూవున్న ఆమె చేతులు విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ అన్నాడు మోహనరావు.

"నిన్ను బతకనివ్వనురా, నిన్ను బతకనివ్వను." అతని గొంతుచుట్టూ తన పట్టు మరింత బిగిస్తూ అంది సారిక.

మోహనరావు గొంతుచుట్టూ సారిక పట్టు ఎంత బిగిసిందంటే అతను మాట్లాడలేకపోతూఉన్నాడు. కళ్ళు తెల్ల గుడ్లు పడి నాలుక బయటకి వచ్చింది. ఇంక తను తప్పించుకోవడం అవదు, ప్రాణాలు పోవడం ఖాయం అన్న నిర్ణయానికి వచ్చేసాడు. అంత అలాంటి స్థితిలోనూ మోహనరావు ని ఆశ్చర్యపరిచిన విషయం ఏమిటంటే, ఎంతో నాజూకుగా వుండే సారిక కి అంత శక్తీ ఎలా వచ్చిందని?            

"నిజంగా ఆ రోజు నాకు చాలా ఆశ్చర్యమనిపించింది. అంతవరకూ చాలా మామూలుగా వుంది సారిక. అప్పుడే సడన్ గా చేంజ్ వచ్చి నా మీద అటాక్ చేసింది. "

మెంటల్ కేర్ కారిడార్ లో నడుస్తూవుండగా మాలతి చెప్తూవుంటే, ప్రమీల వింటూంది.

"తను అప్పుడప్పుడు నా మీద, తన డాడ్ మీద, ఇంకా తన గ్రాండ్ పా మీద అర్ధం లేకుండా కోప్పడుతూవుండేది. కానీ అంతగా అలా ఎక్స్పోజ్ అవ్వడం మాత్రం అదే మొదటిసారి."

"ఆంటీ, అంటే అప్పుడప్పుడు తను మీమీద అలా కోప్పడుతూ వుండేదా?" ప్రమీల  ఆగి అడిగింది.

"అవును. కానీ అడిగితే ఎదో పనికిమాలిన రీజన్ చెప్పేది. అయితే అది కేవలం ఒక ఎక్స్క్యూజ్ మాత్రమే. మామీద ఎందుకు కోపం వస్తూంది అన్నది తనకే తెలిసేది కాదు."

కింద పెదవిని పెదవుల మధ్య బిగించి, మాలతి మొహంలోకి ఆలోచిస్తూ చూస్తోంది ప్రమీల.

"ఈ అబ్నార్మల్ బిహేవియర్, ఈ పనికిమాలిన కోపం మా ముగ్గురి మీద తన చిన్నతనం నుండీ వుండేది. కాకపోతే మేము అదెప్పుడూ సీరియస్ గా తీసుకోలేదు."

"ఆంటీ ఒక్క విషయం చెప్పండి. అలాంటి అన్రీజనబుల్ యాంగర్ ఓబులేసు మీద  కూడా ఎప్పుడన్నా చూపించిందా?"

భృకుటి మూడేసి ఆలోచనలో పడింది మాలతి. "ఎస్, ఒకటి రెండు సందర్భాల్లో వాడిమీద కూడా అనవసరంగా అరిచి తిట్టిందిట. కాకపోతే వాడికి కూడా తనంటే చాలా అభిమానం కదా, అది నవ్వుతూ చెప్పాడు."

"పదండి ఆంటీ. మనం తన రూమ్ లోకి వెళదాం." వేగంగా వెనక్కి తిరిగి నడుస్తూ అంది ప్రమీల.

"ఏంటమ్మా, ఎందుకని?" తనూ ప్రమీల వెనక వేగంగా నడుస్తూ అడిగింది మాలతి.

కానీ ప్రమీల దానికి సమాధానం ఇవ్వలేదు. అలాగే వేగంగా నడుస్తూ ఇద్దరూ సారిక రూమ్ లోకి చేరుకున్నారు.             

&&&

"నాన్నా ........ మీరు ఇలా పడుకోండి. ప్రస్తుతానికి ఏమీ ఆలోచించకండి." తన తండ్రి ని అక్కడ వున్న బెడ్ మీద పడుకోబెడుతూ అంది మాలతి.

"నేను గ్రాండ్ పా ని కూడా చంపబోయాను కదా." మోహనరావు వైపు చూస్తూ ఏడుస్తూంది సారిక.

"ప్లీజ్.......... ప్రస్తుతానికి నువ్వు కూడా ఏమీ ఆలోచించకు." సారిక ని దగ్గరికి తీసుకుని గుండెలకి హత్తుకుంటూ అంది ప్రమీల.

"మీరిద్దరూ సమయానికి రాకపోతే, ఈ పాటికి నా బాడీ చూసివుండేవారు." వగరుస్తూ, అక్కడ బెడ్ మీద పడుకున్నాడు మోహనరావు.

మాలతి, ప్రమీల సారిక రూమ్ లోకి చేరుకునేసరికి తను మోహనరావు పీక నొక్కుతూ కనిపించింది. ఇద్దరూ కలిసి తనని మోహనరావు ని విడిపించే సమయం లో ఆ స్పెల్ వదిలేసింది.

"గ్రామ్ప్స్, ఇప్పుడు నువ్వు నన్ను చూసి భయపడుతున్నావు కదా?" ప్రమీల పట్టునుండి విడిపించుకుని మోహనరావు వైపు చూస్తూ అడిగింది సారిక.

"నో, నో, నాట్ ఎట్ ఆల్ డియర్." నీరసంగా నవ్వాడు మోహనరావు. "నేను డెబ్బై ఏళ్ళు పైబడినవాడిని. నీ చేతిలో చచ్చి పోవడం వల్ల నీ సమస్య ఎమన్నా సాల్వ్ అవుతుందంటే నేను ఆనందంగా చచ్చిపోతాను. కానీ అందువల్ల నువ్వు జైలుకి వెళ్తావేమో అన్నదే నా భయం."

"గాడ్! ఇప్పుడు నేనేం చెయ్యాలి? మిమ్మల్ని అందరినీ చంపితే కానీ నా ప్రాబ్లెమ్ సాల్వ్ కాదా?" రెండు చేతుల్లో మొహం దాచుకుని భోరుమంటూ అంది సారిక.

"రిలాక్స్............ రిలాక్స్............ మనం ఇప్పుడే ఈ విషయం ఆ సైకియాట్రిస్ట్ తో డిస్కస్ చేద్దాం." సారిక ని సముదాయిస్తూ అంది ప్రమీల.                 

&&&

"మీరు ఈ ప్రాబ్లెమ్ ని సాల్వ్ చెయ్యగలరని ఎంతో ఆశ తో వచ్చాం. మెంటల్ కేర్ లో తనని అడ్మిట్ చేసేకన్నా అది సాధ్యం అవుతుందేమో అనుకున్నాం. కానీ ప్రాబ్లెమ్ ఇంకొంచెం క్రిటికల్ అయింది. తను తన గ్రాండ్ పా ని కూడా చంపడానికి ట్రై చేసింది." మాలతి అంది.

ఆ సమయం లో నిరంజన్ ఛాంబర్ లో నిరంజన్, సమీరా, సారిక, మోహనరావు, ప్రమీల ఇంకా వంశీ వున్నారు. మోహనరావు, ప్రమీల, వంశీ ల గురించి ఎక్స్ట్రా కుర్చీలు కూడా తెప్పించి వేశారు.

"మీరొక విషయం ఇక్కడ అర్ధం చేసుకోవాలి. సారిక సమస్య చాలా లాంగ్ టైం నుండీ వుంది. అంతేకాకుండా తన అబ్నార్మల్ బిహేవియర్ కి కారణం ఏమిటన్నది కూడా బోధపడడం లేదు. అందువల్ల........."

"అందువల్ల తన సమస్య ఎప్పటికీ సాల్వ్ కాదు, తను ఇలాగే సఫర్ అవుతూ వుండాలంటారా?" మోహనరావు కోపంగా అడిగాడు.

"డాక్టర్, తన ప్రాబ్లెమ్ స్ప్లిట్ పెర్సనాలిటీ కాదంటారా? తనని హిప్నోటైజ్ చేసి ఆ సమస్యని సాల్వ్ చెయ్యడానికి మీరెందుకు ట్రై చెయ్యడం లేదు?" నిరంజన్ ఎదో చెప్పబోతూండగా, అంతలో సమీర మొహం లోకి చూస్తూ అడిగింది ప్రమీల.

"ప్రమీలా......... నువ్వొక సైకాలజీ స్టూడెంట్ వి. నీకు పెద్దగా ఎక్ష్ప్లైన్ చెయ్యాల్సిన అవసరం లేదనుకుంటా." బలవంతం గా ఒక చిరునవ్వుని పెదవుల మీదకి తెచ్చుకుంది సమీర. "ప్రతీ డిఫెరెంట్ బిహేవియర్ స్ప్లిట్ పెర్సనాలిటీ కాదు. ఈవెన్ నేను కూడా అది స్ప్లిట్ పెర్సనాలిటీ ఏ అనుకుంటూవున్నా అదింకా అలా ప్రూవ్ కాలేదు. తొందరపడి హిప్నోసిస్ లోకి పంపి స్ప్లిట్ పెర్సనాలిటీ ని ఎక్స్పోజ్ చెయ్యడం వల్ల అది మెయిన్ క్యారక్టర్ గా మారిపోయి మన సారిక ని మరుగున పెట్టేసే ప్రమాదం వుంది, ఇది నీకు తెలియదా? ఒకసారి తనని హిప్నోసిస్ లోకి పంపడం వల్ల వచ్చిన ఇబ్బంది కూడా చూసావు కదా. "         

"ఐ యామ్ సారీ డాక్టర్." అప్పుడే ఆ విషయం అర్ధం అయినట్టుగా, సారీ చెప్తూ అంది ప్రమీల.

"ఎనీ హౌ రిస్క్ తీసుకోక తప్పదు. రేపు తనని మళ్ళీ హిప్నోసిస్ లోకి పంపి అసలు తనకి ఆ నలుగురి మీద కోపం రావడానికి కారణం తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. మీ ఫీలింగ్స్ ని నేను అర్ధం చేసుకోగలను. పేషేంట్ ని త్వరగా క్యూర్ చేసి పంపించెయ్యాల్లానే తాపత్రయమే మాకూవుంటుంది. కానీ తీసుకునే స్టెప్స్ వల్ల వచ్చే ఇబ్బందులు కూడా దృష్టిలో పెట్టుకోవాలి కదా."

(ఇక్కడివరకూ నచ్చిందనే ఆశిస్తా. తరువాతి భాగం సాధ్యమైనంత త్వరలోనే పబ్లిష్ చేస్తా. రేటింగ్ ఇచ్చి, రివ్యూ రాయడం మరచిపోవద్దు.)