వెంటాడే నీడలు
( ఏ క్రేజీ హాట్ రొమాంటిక్, సైకలాజికల్ అండ్ పారానార్మల్ థ్రిల్లర్)
కొట్ర శివ రామ కృష్ణ
"అసలు నాకలా బిహేవ్ చేసిన విషయమే తెలియదు." ఇంకా అయోమయం ఎక్స్ప్రెషన్ తోనే వుంది సారిక. “నన్నెంతగానో ప్రేమించే నా పేరెంట్స్ ని, గ్రాండ్ పా ని నేనుచంపాలనుకోవడం కన్నా పెద్ద విడ్డూరం ఏం ఉండదు. కలలో కూడా నేను వాళ్ళకి అపకారం చెయ్యాలనుకోను."
"ఆల్రైట్. మరి ఆ ఓబులేసు విషయం. వాడిమీద నువ్వొకసారి అటాక్ చేసిన విషయం నాకు తెలుసు. ఇప్పుడు వాడిని చంపేశానని చెప్పావు." సమీర అంది.
"నేను వాడిని చంపేంత అటాక్ చేసాను. కానీ వాడు చచ్చిపోలేదు. బతికే వున్నాడు."
"ఎనీ హౌ ఎప్పుడన్నా వాడు నీతో మిస్-బిహేవ్ చేశాడా? నీకు కోపం తెప్పించేలా ఎమన్నా చేశాడా?" నిరంజన్ అడిగాడు.
"నో, నెవెర్." సారిక గొంతు వెహిమెంట్ గా వుంది. "వాడు మా కుటుంబానికి చాలా కాలం గా నమ్మిన బంటులా వున్నాడు. మా కుంటుంబానికి ఎంతో సేవ చేసాడు. నన్ను అమ్మాయిగారూ అని పిలుస్తాడు. నేనేది అడిగినా చేస్తాడు. నేనంటే చాలా అభిమానం వాడికి. ఎప్పుడూ వాడు నాకు కోపం తెప్పించేలా ఏమీ చెయ్యలేదు."
"చాలా పజ్లింగ్ గా వుంది! నీకు ఏ అపకారం చెయ్యని, నిన్నెంతగానో ప్రేమించే నలుగురు వ్యక్తులమీద నీకసలు కోపం ఎందుకువస్తూందో బోధపడడం లేదు." కుర్చీలో వెనక్కి జారగిలబడి అన్నాడు నిరంజన్.
"ఇంకొక విషయం." సమీర అంది. "నీకు అవకాశం దొరికితే నువ్వు అటాక్ చెయ్యడానికి ప్రయత్నించే మరో వ్యక్తి నీ గ్రాండ్ పా. అతని మీద కూడా నీకు కోపం వున్నట్టుగా నువ్విప్పుడు అన్నావు."
"గాడ్! నాకిదేదీ ఎందుకు తెలియడం లేదు? నేనెందుకు నన్ను ప్రేమించేవాళ్లనే చంపాలనుకుంటున్నాను?" ఆవేదనగా అంది సారిక.
"రిలాక్స్, రిలాక్స్ డియర్. నువ్విప్పుడు మా చేతుల్లో వున్నావు. నీ ప్రాబ్లెమ్ పూర్తిగా సాల్వ్ చేసే పూచీ మాదికదా." సారిక చేతిని తన రెండుచేతుల్లోకి తీసుకుని నొక్కుతూ అంది సమీర.
"నీకెందుకు అలా కోపం వస్తూందన్న విషయం తెలియక పోవచ్చు. కానీ నీ కోపం నలుగురి మెంబెర్స్ మీద కాన్సన్ట్రేటెడ్ గా వుంది. అది నీ పేరెంట్స్, గ్రాండ్ పా అండ్ దట్ ఓబులేసు." సమీర అంది.
"నీ జీవితం లో మాకు అర్ధం కానీ మరో యాంగిల్ నువ్వప్పుడప్పుడు గీసే ఆ ఒంటె తల తో నగ్నంగా వున్న మగ మనిషి బొమ్మ. దానికి రీజన్ తెలుసుకుంటే, తక్కిన వాటికీ రీజన్ తెలుసుకోవచ్చు." సమీర అంది. "నీకెప్పుడెప్పుడు అలాంటి బొమ్మ వెయ్యాలనిపిస్తుంది? నిన్నందుకు ఇంస్టిగేట్ చేసే ప్రత్యేకమైన పరిస్థితులు ఎమన్నా ఉన్నాయా?"
"తెలీదు. ఆ బొమ్మ కూడా నాకు తెలీకుండానే వేస్తాను. ఆ బొమ్మ వేసే వరకూ నాకలాంటి బొమ్మ వేశానని తెలీదు.కానీ ఆ బొమ్మని వేసాక చూస్తే చాలా అసహ్యం అనిపిస్తుంది. చింపి పారేస్తూ వుంటాను." కాస్త ఆగాక మళ్ళీ అంది సారిక. "కానీ మీరు చెప్పారని ఇటీవల నేను వేసిన ఆ బొమ్మల్ని చింపి పారేయడం లేదు. నేను రీసెంట్ గా అలా వేసిన రెండు బొమ్మల్ని మీకు వాట్సాప్ చేసాను కూడా"
"ఎస్ యు డిడ్" సమీర తలూపింది. "అసలు ఏ వయసునుండి నువ్వు ఆ బొమ్మ అలా వేస్తూవున్నావ్?"
"నా చాలా చిన్నతనం నుండీ. కాన్వెంట్ చదివే రోజుల్లో నేనలాంటి బొమ్మలు నోట్ బుక్ ల మీద వేస్తె మిస్ లు నా పేరెంట్స్ కి కంప్లైంట్ చేసేవారు."
"అప్పుడు కూడా ఆ బొమ్మ వేసేవరకూ నీకు వేస్తున్నట్టుగా తెలిసేది కాదు."
"అబ్సల్యూట్లీ, ఎస్." తలూపింది సమీరా.
నిరంజన్ వైపు తలతిప్పి అతనివైపు చూస్తూ అంది సమీర ."సర్, మనం మొదట తనని హిప్నోసిస్ లోకి పంపి అసలు ఆ బొమ్మ ఎందుకు వేస్తూందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాలా చిన్నతనం నుండి తను చేస్తూన్న పని అది. అందుకు కారణం తెలిస్తే తక్కిన విషయాలకి కూడా మనకి కారణం తెలీవచ్చు."
"తప్పకుండా అలాగే చేద్దాం." కుర్చీలోనుండి లేచి అన్నాడు నిరంజన్. "కానీ అది రేపు చేద్దాం. తనని బాగా రిలాక్స్ అవ్వనిద్దాం."
"నా ప్రాబ్లెమ్ సాల్వ్ అవ్వకుండా నేను రిలాక్స్ అవ్వలేను." తనూ కుర్చీలోనుండి లేచి అంది సారిక.
"చూడు డియర్......." కుర్చీలోనుండి లేచి, సారిక ని దగ్గరికి తీసుకుని అంది సమీర. ".......... నేను ఆల్రెడీ నీకు చెప్పాను. యు ఆర్ ఇన్ ద సేఫెస్ట్ హాండ్స్. నీ ప్రాబ్లెమ్ పూర్తిగా సాల్వ్ చేసే పూచినాది. సో అనీ మర్చిపోయి జస్ట్ రిలాక్స్ యువర్ సెల్ఫ్."
"ఒకే డాక్టర్" తలూపి నవ్వింది సారిక. కానీ ఆమె మొహం లో ఆందోళన తెలుస్తూనే వుంది.
తరవాత సారిక ని తన ఫ్యామిలీ మెంబెర్స్ వున్న రూమ్ లో డ్రాప్ చేసి, తమ దారిన వెళ్లారు సమీర, నిరంజన్.
&&&
ఆ మర్నాడు ఉదయం బ్లాక్ యాంట్ మెంటల్ కేర్ కి రాగానే, సమీర ఫ్యామిలీ మెంబెర్స్ తో ఆ రోజు తాము చెయ్యదలుచుకున్నది చెప్పింది. "ఆ బొమ్మ గియ్యడం అన్నది సారిక చాలా చిన్నతనం నుండీ చేస్తూంది. అందుకు కారణం తెలుసుకుంటే, తక్కిన విషయాలలో తన బిహేవియర్ కి కూడా రీజన్ తెలియవచ్చని మేము అభిప్రాయపడుతున్నాం. అందుకనే తనని హిప్నోటైజ్ చేసి అందుకు కారణం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం."
"తప్పకుండా అలాగే చెయ్యండి." మాలతి అంది. "కానీ ఆ సమయం లో మేము కూడా తనతో ఉండొచ్చా?"
"సాధారణం గా ఆ సమయం లో పేషేంట్స్ తో ఎవరినీ ఉండనివ్వము. అంతే కాకుండా నిన్న కూడా తాను సడన్ గా మీ మీద, తన డాడ్ మీద, గ్రాండ్ పా మీద, ఆ ఓబులేసు మీద కోపం వెళ్లగక్కింది. తనని మేము హిప్నటైజ్ చేసి విషయాలు తెలుసుకునే ప్రయత్నం లో మరోసారి మీ మీద కోపం వస్తే, ఆ సమయం లో మీరక్కడే ఉంటే, విషయం ఇబ్బంది కరం అవుతుంది."
"అవును. ఆ విషయం గురించి సారిక చెప్పింది. తనకి మా నాలుగురిమీద కోపం ఉన్నట్టు చెప్పినట్టుగా చెప్పింది." మాలతి అంది.
"మామ్, అది నేను చెప్పినది కాదు. అలా నేను మాట్లాడిన విషయం కూడా నాకు గుర్తులేదు." సారిక అంది.
"ఒకే, ఒకే. ఏదో నిన్ను ఆవహించి అలా చెప్పేలా చేసింది. " నవ్వింది మాలతి. "మీరు చెప్పింది నిజమే. తనకి, అదే సారిక ని ఆలా ఆవహిస్తున్నదానికి, నా మీద సడన్ గా కోపం వస్తే కష్టం. నేనక్కడ వుండకపోవడమే మంచిది."
"సారిక కోపం కాన్సన్ట్రేటెడ్ గా వుంది. చూస్తూవుంటే నలుగురిమీద మాత్రమే తనకి కోపం వున్నట్టుగా వుంది. అది తన మామ్, డాడ్, గ్రాండ్ పా, ఇంకా ఆ ఓబులేసు. ఈ నలుగురు తననెంతో బాగా ప్రేమగా చూసుకునేవారే. వాళ్ళమీద తనెందుకు అలా కోప్పడుతూందో నాకు అర్ధం కావడం లేదు." ప్రమీల అంది.
"ఇప్పుడు మేము చెయ్యబోయే ఈ ప్రయోగం లో అన్ని విషయాలు తెలుస్తాయనే అనుకుంటున్నా." సమీర అంది
"తను ఆ ఓబులేశుని చంపేసేనని చెప్పేనని అంది, వాడు బతికేవున్నాడు కదా. ఎందుకలా అని వుంటుంది?" వంశీ అడిగాడు
"ఎదో మామూలుగా అలా అనివుంటుంది. మీరు ఆ ఓబులేసు తో ఒకసారి మాట్లాడి చూడండి." కుర్చీలోనుంచి లేచి అంది సమీర. "సారికా, నువ్వు నాతొ వస్తావా? ఈ రోజు ఉదయం ప్రోగ్రాం నీకు గుర్తుంది కదా."
"అఫ్ కోర్స్, ఐ రిమెంబర్." సారిక కూడా కుర్చీలోనుండి లేచి నిలబడింది. "డాక్టర్, నాకు కోపం వస్తూవున్నది నా పేరెంట్స్ మీద, గ్రాండ్ పా మీద, ఇంకా ఆ ఓబులేసు మీద అంతే కదా. అటువంటప్పుడు నా ఫ్రెండ్ ప్రమీల, నా బ్రో వంశీ నాకూడా ఇప్పుడు ఉంటే ఎమన్నా ఇబ్బందా? వాళ్ళు నాకూడా ఉంటే నాకు కొంచెం ఎక్కువ ధైర్యంగా ఉంటుంది."
"ఒకే దెన్. మీరిద్దరూ కూడా రండి నాతో అయితే." ప్రమీల వంశీ ల వైపు చూసి అలా అన్నాక అక్కడనుండి సారిక ని తీసుకుని బయలుదేరింది సమీర. వాళ్ళిద్దరి వెనగ్గానే వెళ్లారు ప్రమీల, వంశీ. మాలతి అక్కడున్న కుర్చీలో కూలబడింది రకరకాలు గా ఆలోచిస్తూ.
&&&
"నేనిప్పుడు నిన్ను హిప్నోసిస్ లోకి పంపబోతూవున్నాను. హిప్నోటైజింగ్ గురించి నీకు ఐడియా ఉంటే నేను నీకు పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. నేను నీకు చెప్తూన్నది జాగ్రత్తగా వింటే సరిపోతుంది."
సారిక ని మళ్ళీ అదే చైర్ లో రిలాక్స్డ్ గా సెటిల్ చేసాక, తను సారిక ముందు నిలబడి, తన మొహం లోకి చూస్తూ అంది సమీర. క్రితం రోజు సమీర కూచున్న చైర్ లో వంశీ, నిరంజన్ కూచున్న చైర్ లో ప్రమీల కూచునివున్నారు. నిరంజన్ వేరే పేషేంట్ తో ఎంగేజ్ అయి వుండడం వల్ల సారిక ని హిప్నోటైజ్ చేసే ప్రోగ్రాం ని తనే పూర్తిగా టేక్ అప్ చెయ్యాల్సి వచ్చింది సమీర కి.
"నాకు హిప్నోటిజం అంటే బాగానే ఐడియా వుంది. సినిమాల్లో చూసాను, అలాగే చదివాను కూడా." కుర్చీలో వెనక్కి వాలి కళ్ళు మూసుకుని, రెండు అరచేతులు ఒక దానిమీదొకటి తొడల్లో పెట్టుకుంది సారిక.
"గుడ్. నేను చెప్పకుండానే పొజిషన్ లోకి వెళ్ళావు నువ్వు." నవ్వింది సమీర. "ఇప్పుడు నేను చెప్పేది నువ్వు జాగ్రత్తగా వింటున్నావ్. నీ ఆలోచనల మీద కానీ, ఇంక వేటి మీద కానీ నువ్వు కాన్సంట్రేట్ చెయ్యడం లేదు. నీ మనసంతా కేవలం నా మాటల మీదే కాన్సంట్రేట్ అయి వుంది."
"ఒకే డాక్టర్." సారిక అంది.
"నువ్వు నేను చెప్పేది వినడమే తప్ప, అనవసరం గా మాట్లాడకూడదు. నా ప్రశ్నలకి సమాధానం నీ నుండి ఆటోమాటిగా వస్తుంది."
అది విని అక్కడవున్న ప్రమీల, వంశీ నవ్వారు.
"ప్లీజ్. మీ ఇద్దరూ కూడా ఎలాంటి శబ్దాలు చెయ్యకుండా నిశబ్దంగా ఉండాలి." వాళ్లిదరివైపు చూస్తూ అంది సమీర.
"ఏజ్ యు సే డాక్టర్." వంశీ అన్నాడు.
సారిక మాత్రం కుర్చీలో అలాగే వెనక్కి జారగిలబడి కళ్ళు మూసుకుంది.
"నీకిప్పుడు చాలా ప్రశాంతంగా వుంది. నువ్వు నేను చెప్పేది జాగ్రత గా వింటున్నావ్. నీ మనసు, శరీరం పూర్తిగా నా అధీనం లో వున్నాయి. అవి నేను చెప్పినట్టుగా వింటాయి."
సమీర మాటల్లో ఎదో మ్యాజిక్ వున్నట్టుగా సారిక మొహం ప్రశాంతంగా మారింది.
"నీకు చాలా ప్రశాంతం గా, హాయిగా వుంది.......... నీకు చాలా ప్రశాంతంగా, హాయిగా వుంది ............ నీ కళ్ళు బరువెక్కుతూ వున్నాయి........... నీ కళ్ళు బరువెక్కుతున్నాయి........... నీ వళ్ళంతా బరువెక్కుతూ వుంది.......... నీకు నిద్ర ముంచుకొస్తున్నట్టుగా వుంది............. ఇప్పుడు కేవలం నీకు నా మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి........... నీ మనసంతా కేవలం నా మాటల మీద మాత్రమే కాన్సంట్రేట్ అయి వుంది."
సారిక మొహం అలా ప్రశాంతం గా, శరీరం ఏ కదలిక లేకుండా వుంది.
"ఇప్పుడు నెమ్మదిగా నువ్వు నీ గతం లోకి వెళ్తున్నావ్............. నువ్వు నీ గతాన్నంతా గుర్తు చేసుకోగలుగుతున్నావ్................ నువ్వు నీ గతాన్నంతా గుర్తు చేసుకోగలుగుతున్నావ్."
సారిక నుదుటి మీద ఏవో ముడతలు కనిపించాయి తనేదో గతాన్ని గుర్తుచేసుకుని ప్రయత్నం ప్రారంభించినట్టుగా.
"ఇప్పుడు నీ ఒంటె తలతో నగ్నం గా వున్న మగ మనిషి బొమ్మ నువ్వు వేసిన సందర్భాలు నీకు గుర్తుకు వస్తున్నాయి. చాలా తేలికగా ఆ సందర్భాలన్నీ నీకు గుర్తుకు వస్తున్నాయి. నీకు ఆ బొమ్మ ఎందుకు అలా వేయాలనిపిస్తూందో తెలుస్తూంది. ఆ బొమ్మ గీయాలని నీకు ఎందుకు అనిపిస్తూవుందో, నీకు పూర్తి ఐడియా వస్తూంది."
సారిక నుదిటిమీద ముడతలు ఇంకొంచెం దిట్టం గా మారాయి, సమీర మాటలు తనని మరికొంచెం ఆలోచనల్లో పెట్టినట్టుగా.
"నీకు ఆ బొమ్మ ఎందుకు అలా వేయాలనిపిస్తూందో నువ్వు నాకు చెప్తావు. అది నీకు ఎందుకు గీయాలనిపిస్తూవుందో నువ్వు నాకు చెప్తావు."
సారిక రెండు చేతులు పిడికిళ్ళుగా మారాయి. తన నుదిటిమీద ముడతలు ఇంకా దిట్టంగా మారాయి. సారిక కేవలం ఎదో ఆలోచించడం మాత్రమే కాదు, దేనికో బాగా స్ట్రగుల్ అవుతూందని కూడా చూస్తూన్న వాళ్ళకి అర్ధం అవుతూంది.
"ఆ కారణం నువ్వు నాకు చెప్తావు. అది చెప్పకుండా నువ్వుండలేవు."
సారిక సడన్ గా గుటకలు మింగుతున్నట్టుగా, పుక్కిలిస్తున్నట్టుగా శబ్దం చేస్తూ, తల అటూ ఇటూ ఊపడం ప్రారంభించింది. ఆ రోజు సమీర కి, మాలతి సారిక సిమిలర్ గా బిహేవ్ చేస్తున్నట్టు చెప్పిన విషయం గుర్తుకు వచ్చింది.
"అలాంటి బొమ్మ వెయ్యడానికి వెనక వున్నకారణం నువ్వు నాకు చెప్తావు. చెప్పే తీరతావు." సారిక లో వస్తూన్న మార్పుని పరిశీలనగా చూస్తూ అంది సమీర.
సమాధానం చెప్పడానికి బదులుగా తన చేస్తున్న ఆ శబ్దాలు ఇంకా ఎక్కువయ్యాయి. విసురుగా కుర్చీలోనుండి లేచి, సమీర ని వేగంగా రెండు చేతులతో వెనక్కి తోసింది. బాలన్స్ కాసుకోలేక వెనక్కిపడిపోయింది సమీర.
"స్టాప్ హర్." సారిక రూమ్ లోనుండి బయటకి పరిగెత్తుతూ ఉంటే, లేవడానికి ప్రయత్నిస్తూ అరిచింది సమీర.
తనని ఆపడానికి ప్రయత్నించిన ప్రమీల ని, వంశీ ని విసిరి కొట్టింది సారిక. ఆ బలానికి పూచిక పుల్లల్లా పక్కకి పడిపోయారు ఇద్దరూ కూడా.
ఆ రూమ్ బయటకి వచ్చి వేగంగా పరిగెత్తుతూన్న సమీర ని గమనించి ఒక ముగ్గురు మెంటల్ కేర్ స్టాఫ్ కూడా, సమీర, ప్రమీల, వంశీ లతో పాటు తనని పట్టుకుని ఆపడానికి ప్రయత్నించారు.
"ఎందుకు, ఎందుకు మీరందరూ నన్ను ఇలా పట్టుకున్నారు?" సడన్ గా ఆగి వాళ్ళందరి మొహాల్లోకి అయోమయంగా చూస్తూ అడిగింది సారిక.
"థాంక్ గాడ్!" గట్టిగా నిట్టూర్చింది సమీర. "పద నీ రూమ్ లోకి వెళదాం. అక్కడ అన్ని విషయాలు మాట్లాడుకుందాం."
&&&
"తను సడన్ గా ఎందుకు అలా బిహేవ్ చేసిందో, ఎందుకు అలాంటి శబ్దాలు చేసిందో నాకు అర్ధం కావట్లేదు నిరంజన్. ఐ యామ్ టోటల్లీ కంఫ్యూజ్డ్!"
కేవలం కొన్ని సందర్భాల్లో మాత్రమే తెలీకుండా అలా పిలిచేస్తుంది సమీర. తను తనని అలా పిలిచినప్పుడల్లా ఎదో ధ్రిల్లింగా, ఎగ్జైటింగా ఫీలవుతాడు నిరంజన్. తనని తను ఎప్పుడూ అలాగే పిలవాలనుకుంటాడు.
ఎందుకనో తను చెప్తూన్న విషయం మీద కాకుండా, తన మీదే కాన్సంట్రేట్ అవుతూంది నిరంజన్ మనసు. ఒక పాప పుట్టిన తరువాత కూడా అందం ఎంతమాత్రం తగ్గకుండానే వుంది సమీర. వద్దనుకున్నా గ్రీన్ కలర్ లో వున్న ట్రాన్స్పరెంట్ సారీ కింద క్లీవేజ్ చూస్తూవుంటే, తన మగతనం నెమ్మదిగా పైకిలేవడం తెలుస్తూంది. గుండ్రంగా, దిట్టంగా వున్నా ఆమె పాలిండ్లని, ఆమె బ్లౌస్ ఇంకా బ్రాసియర్ కంట్రోల్ చెయ్యడానికి పాట్లు పడుతున్నాయి. ఇంత అందగత్తె ని పొందగలిగిన అరవింద్ ఎంత అదృష్టవంతుడో, రోజూ ఎంత సుఖం అనుభవిస్తూవున్నాడో, ఈర్ష్యగా అనుకున్నాడు నిరంజన్.
"కొన్ని సందర్భాల్లో మనుషులకి అలాంటి శక్తి వస్తుందని నాకు తెలుసు. కానీ ఆ సమయం లో సారిక శక్తి నాకు ఆశ్చర్యంగా వుంది. నాకు హిప్నటైజింగ్ ద్వారా సమాచారం రాబట్టగలనని అనిపించడం లేదు. ఏం చేద్దామంటారు సార్?"
బలవంతంగా తన మనసుని ఈ లోకంలోకి లాక్కొచ్చాడు నిరంజన్. "నేను మన గురువుగారు యస్మణి కి ఆ ఫోటో వాట్సాప్ చేసాను. ఆయన ఆ విషయం లో ఏమంటారో చూద్దామా? ఆ బొమ్మ మీద ఆయనకి ఎమన్నా అవగాహన వుంది ఉండొచ్చు కదా. " నిట్టూరుస్తూ అన్నాడు
మనోహరంగా నవ్వింది సమీర. "ఆయన ఏదన్నా పారానార్మల్ కి లింక్ పెట్టిచెప్తాడేమోనని నా భయం. అయినా ఒకసారి ఆయన ఏమంటారో తెలుసుకోవడం లో వచ్చే ఇబ్బంది ఏమీ లేదు."
"నేనిప్పుడే ఫోన్ చేసి స్పీకర్ లో పెడతాను. ఆయన ఏమంటారో నువ్వూ విందువుగాని."
నిరంజన్ యస్మణి కి ఫోన్ చేసి స్పీకర్ లో పెట్టాడు.
"నువ్విప్పుడు ఫోన్ చేసినది ఎందుకో నాకు తెలుసు. ఆ ఒంటె తల తో నగ్నంగా వున్న మగ మనిషి బొమ్మ గురించి తెలుసుకోవాలనుకుంటున్నావు కదా." యస్మణి గొంతు వినిపించింది ఇద్దరికీ
(ఇక్కడివరకూ నచ్చిందనే ఆశిస్తా. తరువాతి భాగం సాధ్యమైనంత త్వరలోనే పబ్లిష్ చేస్తా. రేటింగ్ ఇచ్చి, రివ్యూ రాయడం మరచిపోవద్దు.)