Read Ventaade Needalu - 17 by sivaramakrishna kotra in Telugu థ్రిల్లర్ | మాతృభారతి

Featured Books
  • వెంటాడే నీడలు - 17

    వెంటాడే నీడలు ( ఏ క్రేజీ హాట్ రొమాంటిక్, సైకలాజికల్ అండ్ పార...

  • వెంటాడే నీడలు - 16

    వెంటాడే నీడలు ( ఏ క్రేజీ హాట్ రొమాంటిక్, సైకలాజికల్ అండ్ పార...

  • ప్రణయ గీతిక - 4

    ప్రభా   గొర్రెల కాపరి పిలవడంతో గొర్రె కి నాటు వైద్యం చేసిన వ...

  • ఎవరు....? - 17

    Part - 17సమయం : రాత్రి 8:40 గంటలువిజయవాడ పోలీస్ కమిషనరేట్ ఆఫ...

  • వెంటాడే నీడలు - 15

    వెంటాడే నీడలు ( ఏ క్రేజీ హాట్ రొమాంటిక్, సైకలాజికల్ అండ్ పార...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

వెంటాడే నీడలు - 17

వెంటాడే నీడలు

( ఏ క్రేజీ హాట్ రొమాంటిక్, సైకలాజికల్ అండ్ పారానార్మల్ థ్రిల్లర్)

కొట్ర శివ రామ కృష్ణ

"నేను రావాల్సిన చోటుకే వచ్చానని నాకు అర్ధం అయింది."

సింహరాజు ఇంటిలోకి ప్రవేశించి అక్కడ వున్న చెడ్డ దేవతల బొమ్మలు చూసాక యస్మణి అన్నాడు.

"ఎవరిదగ్గరనుండో ఎందుకు నేను నీ దగ్గరనుండి కావాల్సినంత సమాచారం తీసుకోగలను."

"కానీ నేను బాణామతి, చేతబడి లాంటివి చెయ్యను." సింహరాజు అన్నాడు.

"నిజానికి నేను పరిశోధన చేద్దామనుకుంటున్నది మానవాతీత శక్తులు ఉన్నాయా, ఉంటే వాటికీ మనసుకి ఎటువంటి సంబంధం వుంది అన్న విషయం మీద. నువ్వు నాకు అవసరమైన సమాచారం ఇవ్వగలిగితే నేను దానికి కూడా డబ్బు ఇస్తాను."

సింహరాజు కి చాలా సంతోషం అనిపించింది. ఈ వ్యక్తిని చూస్తే చాలా ధనవంతుడిలాగే వున్నాడు. తనకీ ప్రస్తుతం డబ్బుతో అవసరం బాగానే వుంది. వాళ్ళ పొలాల్లో, వీళ్ళ పొలాల్లో పనిచేసి సంపాదిస్తున్నది సరిపోవడం లేదు. అందుకే ఈ వ్యక్తిని తనతో పాటుగా ఉండడానికి ఆహ్వానించాడు. తనంతట తానుగా ఇస్తానని అనివుండకపోతే, వంట చేసి భోజనం పెట్టినందుకు కూడా ఎంతోకొంత అడిగి ఉండేవాడు. ఈ రకం గా కూడా తనకి కొంత డబ్బు వచ్చే మాట అయితే మంచిదే కదా.

"నేను చెయ్యగలిగిన సహాయం చెయ్యడానికి నాకు అభ్యంతరం ఏమీ లేదు." అన్నాడు సింహరాజు.   

&&&

ఒకటి, ఒకటి తన దగ్గర వున్న చిన్న చెడ్డ దేవతలు, దేవుళ్ళు గురించి చెప్తూ వుంటే ఆసక్తిగా విన్నాడు యస్మణి.

"వాళ్ళందరూ ఒక ఎత్తు. ఈ కబుసా ఒక ఎత్తు. కబుసా అనుగ్రహిస్తే మనకి చాలా శక్తులని ప్రసాదిస్తాడు. కానీ కబుసా అనుగ్రహం పొందడం అంత తేలిక కాదు. కబుసా గురించి ఎక్కువ ఆలోచించినా కూడా, తన ప్రభావం లోకి వెళతాం." కబుసా గురించి వివరిస్తూ అన్నాడు సింహరాజు.

"అవునా?" కబుసా వైపే ఆసక్తిగా చూస్తూ అన్నాడు యస్మణి

"మరీ అలా కబుసా వైపు చూడకండి కొంచెం ప్రమాదం." నవ్వుతూ అన్నాడు సింహరాజు. "కబుసా కొంచెం చిత్రమైన దేముడు. అనుగ్రహించి శక్తులు ప్రసాదించినా, ప్రసాదించకపోయినా జనాల్ని తన ప్రభావం లోకి తీసుకుని వాడుకుంటూ ఉంటాడు. మీరలా అతనివైపు చూస్తే, మిమ్మల్ని తన ప్రభావం లోకి తీసుకోవడం తనకింకా తేలిక అవుతుంది."

"నేనొక సైకియాట్రిస్ట్ ని. నాకిలాంటివి నమ్మడం కొంచెం కష్టమే. ఇలాంటి దేవుళ్ళు, దేవతలు, వాళ్ళ ప్రభావాలు నిజంగా వున్నాయంటావా?" సింహరాజు మొహంలోకి చూస్తూ అడిగాడు యస్మణి.

"కబుసా సమక్షం లో కబుసాని సందేహిస్తున్నారు. తన ఉనికి ని మీకు తప్పకుండా తెలియచేస్తాడు."

"సరే, ఈ కబుసా గురించి ఇంకొంచెం చెప్పు." నవ్వి అన్నాడు యస్మణి.

"తనకి పనికొచ్చే వాళ్ళని తన దగ్గరికి రప్పించుకుని వాడుకుంటాడు కబుసా అంటారు. మీరు ఇక్కడికి రావడం వెనకాతల కబుసా నిర్ణయం ఉందేమోనని నా అభిప్రాయం."

"కబుసా కి నేనే రకంగా ఉపయోగపడతాను? అది సరే కానీ ఈ కబుసా గురించి పూర్తిగా చెప్పు, నాకు చాలా ఆసక్తిగా వుంది."

"కబుసా శృంగారాన్ని ఇష్టపడే దేముడు. అదీ సవ్యమైన మార్గం లో కాకుండా అక్రమ శృంగారం అతనికి బాగా ఇష్టం. తన అనుగ్రహం కావాలంటే కొంచెం అక్రమ మార్గాలలో శృంగారం చేస్తూవుండాలి."

"ఆసక్తిగానే వుంది." మరోసారి నవ్వాడు యస్మణి. "నువ్వు కబుసా ని పూజిస్తూ అతని అనుగ్రహం కోసం ప్రయత్నిస్తున్నాని అన్నావు. అంటే దానర్ధం.............." సింహరాజు మొహం లోకి మర్మగర్భంగా చూస్తూ అన్నాడు.

"తప్పదు మరి. ఇలాంటి పల్లెటూళ్ళో అదంత కష్టమూ కాబోదు." సింహరాజు అన్నాడు. "అంతేకాకుండా కబుసా అనుగ్రహం పొందిన వ్యక్తి తన భార్యని ఇతరుల దగ్గరికి పంపించాలి. అలాగే ఇతరుల భార్యలతో అది చేస్తూండాలి. అప్పుడు మాత్రమే తన అనుగ్రహం నిలబడుతుంది. లేకపోతె కఠినంగా శిక్షిస్తాడు."

"అంటే రాజూ, నువ్వు అందుకు కూడా సిద్ధపడే కబుసాని పూజిస్తున్నావా?" ఆశ్చర్యంగా చూసాడు యస్మణి

ఉలిక్కిపడ్డాడు సింహరాజు. తనెప్పుడూ ఈ విషయం గురించి తీవ్రంగా ఆలోచించలేదు. మల్లిక ఎప్పుడన్నా అటువంటిదాని గురించి ఒప్పుకుంటుందా? తను మల్లికతో ఆ ప్రకారంగా చేయించగలడా? అలా ఆలోచిస్తే మల్లిక తన భార్య కాకపోవడమే మంచిది.

"నేను పెళ్లి చేసుకోదలుచుకోలేదు. అటువంటప్పుడు అక్రమ సంభందాలు ఉంటే సరిపోతుంది." సింహరాజు వున్నాడు. "కబుసా బహిష్టు లో వున్న ఆడవాళ్ళని ఎక్కువగా ఇష్టపడతాడు. మనం కూడా అందులో వున్న ఆడవాళ్ళతో ఎలాంటి రక్షణ లేకుండా శృంగారం చేస్తే ఎక్కువగా అనుగ్రహిస్తాడు."

"కబుసా అనుగ్రహం తరువాత. ముందు మనకి జబ్బులొచ్చే అవకాశం వుంది."

"ముందు మీరు కబుసా ఇష్టాలకి వ్యతిరేకంగా మాట్లాడకండి, అదీ కబుసా సమక్షంలో. మంచిది కాదు." హెచ్చరికగా అన్నాడు సింహరాజు.

"అలాగే అయితే." తలూపాడు యస్మణి.

"కబుసా ముఖ్యంగా కన్నెపిల్లల్ల్ని ఎక్కువగా ఇష్టపడతాడు. తను ప్రత్యేకంగా ఇష్టపడే కన్నెపిల్లలకి ప్రత్యేక చిహ్నాలని చూపిస్తాడు. అంటే వాళ్ళు అతని కళ్ళలో మెరుపుని చూడడం, అతని వైపు లాగబడడం లాంటివి జరుగుతాయి. ఆ తరువాత ఆ కన్నెపిల్లలు కబుసా అనుగ్రహం కావాలనుకుని అతన్ని ఆరాధించడం ప్రారంభిస్తే, ఇంక ఆపగలగడం ఉండదు. వాళ్ళు వాళ్ళ పద్దెనిమిదో సంవత్సరం లోకి వచ్చేవరకూ తనని ఆరాధించడం కొనసాగించాలి. ఎవరితోనూ శృంగారం చెయ్యకూడదు. పద్దెనిమిదో సంవత్సరం లోకి వచ్చి అది ముగిసేలోపు తాము బహిస్టుతో వున్న రోజుల్లో తమని వచ్చి అనుభవించమని కబుసా ని ప్రార్ధించాలి. ఆ కన్నెపిల్ల కబుసా చేత ఎన్నుకోబడ్డది అయితే తన పద్దెనిమిదో సంవత్సరం ముగిసే లోపు ఏదో ఒకరోజు తను వచ్చి అనుభవిస్తాడు. ఇంక అక్కడితోటి తన పంట పడినట్టే. కబుసా విశేష శక్తులని అనుగ్రహిస్తాడు."

"ఒకవేళ ఆ కన్నెపిల్ల ఆ ఆరాధన ఆపేస్తే, లేకపోతె పద్దెనిమిదో సంవత్సరం వచ్చేలోగానే వేరే ఎవరినన్నా కలిస్తే................" అక్కడే వున్న కుర్చీలో కూలబడుతూ అడిగాడు యస్మణి.

"ఆ రెండిటిలో ఏది చేసినా కబుసా ఊహకే అందని విధంగా శిక్షిస్తాడు. అందుకని ఒకవేళ కబుసా చేత ఎన్నుకోబడ్డా, బాగా ఆలోచించుకునే తనని పూజించడం ప్రారంభించాలి. తనని తనంతట గా పూజించకపోతే కబుసా చెయ్యగలింగింది ఏమీ లేదు."

"తను ఎన్నుకున్న కన్నెపిల్లని కూడా కబుసా తన పద్దెనిమిదో సంవత్సరం లో వచ్చి అనుభవించకపోతే, అనుభవించినా ఏ శక్తులు ప్రసాదించకపోతే?" నొసలు ముడేసాడు యస్మణి.

"అలాగ జరగదనే అనుకుంటున్నా. అలా జరిగినట్టుగా వినలేదు." సాలోచనగా అన్నాడు సింహరాజు. "ఒకవేళ అలాగే జరిగితే పద్దెనిమిదో సంవత్సరం ముగిశాక ఆ కన్నెపిల్ల కబుసా గురించి మర్చిపోయి మామూలు జీవితం గడిపేవచ్చు."

"ఒక్క కన్నెపిల్లలకేనా? తక్కినవాళ్ళకి కబుసా అనుగ్రహం దొరకదా?"

"అలాగని నేనెక్కడ అన్నాను? అలా అయితే కబుసా ని నేనెందుకు పూజిస్తాను? నేనూ కబుసాని పూజిస్తున్నానన్న విషయం మర్చిపోయారు మీరు." సింహరాజు నవ్వాడు. "తక్కినవాళ్ళకీ సాధ్యమే. కాకపోతే కబుసా ఇష్టపడ్డ కన్నెపిల్లకి అంత తేలిక కాదు. కొంచెం ఎక్కువ కష్టపడాలి."

"అంటే ఆ కొంచెం ఎక్కువ కష్టపడడానికి సిద్ధపడే కబుసాని పూజిస్తున్నావా?"

"అవును" తలూపాడు సింహరాజు. "డబ్బు లేని ఈ మామూలు జీవితం గడిపి, గడిపి విసుగొచ్చింది. కబుసా ప్రసాదించే శక్తులతో బాగా డబ్బు సంపాదించాలనుకుంటున్నా."

"నీ కోరిక తీరాలనే కోరుకుంటున్నా." యస్మణి అన్నాడు.

"కబుసా కి కావలసినది ఇంకొకటుంది. అది కబుసా కి ఇష్టం కాదు, అవసరం. కబుసా మనుషుల తాలూకు ఆత్మలు తీసుకుని బలోపేతం అవుతాడు. అయితే అది తను బలవంతంగా చెయ్యలేదు. ఆ మనుషులు తమంతట తాముగా తమ ఆత్మలని కబుసా కి అర్పించుకోవాలి. వారి ఆత్మ కబుసా లో కలిసిపోవడం వల్ల ఇంక మరివాళ్ళకి మరోజన్మకి అవకాశం ఉండదు. అయితే అటువంటి వాళ్ళు కోరుకున్న ఏ కోరికన్నా కబుసా తీరుస్తాడు."

"చిత్రంగానే వుంది." కుర్చీలో ఇంకా సర్దుకుని కూచుంటూ అన్నాడు యస్మణి.

"కబుసా ప్రభావం లోకి మనం వెళ్ళాం అనడానికి ఒక చిహ్నం. తట్టుకోలేని శృంగార కాంక్ష. ఆ వాంఛ ఎంత తీవ్రంగా ఉంటుందంటే, దాని గురించి ఎటువంటి తప్పుపనులైనా చేస్తారు. కబుసా ఇష్టపడే కన్నెపిల్లలు కూడా దీనికి అతీతం కాదు. కాకపోతే వాళ్ళు ఆ వాంఛని కూడా తట్టుకుని, తమకి పద్దెనిమిదో సంవత్సరం వచ్చి, కబుసా తమని ఆ సమయంలో అనుభవించేవరకూ ఎదురుచూడాలి."

కుర్చీలో అలాగే కూర్చుని సింహరాజు చెప్పేది జాగ్రత్తగా వింటున్నాడు యస్మణి          

"తక్కిన చెడ్డ దేవతల కన్నా కొంచెం భిన్నం గా ఉంటాడు కబుసా. ఇతని శక్తీ విధించే శిక్షలు కూడా ఎక్కువగానే ఉంటాయి. అందుకనే ఇతన్ని పూజించడానికి ఎక్కువ భయపడుతూ వుంటారు."

"నీకు నమ్మకముందా ఎప్పటికన్నా నిన్ను కబుసా కరుణిస్తాడని, అద్భుత శక్తులు ప్రసాదిస్తాడని?" యస్మణి అడిగాడు సింహరాజు ని. "ఒకవేళ ఇంతా కస్టపడి నిన్ను తను ఎప్పటికీ కరుణించకపోతే ఏం చేస్తావ్?"

"అందుకూ అవకాశం వుంది. కొంతకాలం చూసాక అప్పటికీ కబుసా కరుణించకపోతే ఇంక మర్చిపోతాను. కాకపోతే ఈ కబుసాని పూజించడం లో తక్కినవాళ్లందరికీ, కబుసా ఎన్నుకున్న కన్నెపిల్లలకి ఉన్నంత కష్టం వుండదు. కానీ కబుసా కరుణిస్తే వచ్చే లాభాలు మాత్రం అపారం గా ఉంటాయి."

"కబుసా కరుణించడం వల్ల లాభపడ్డ వాళ్లెవరన్ననీకు తెలుసా?"

"వున్నారు, నేను చూసాను. నాకు తెలుసు." కాస్త ఆగాడు సింహరాజు.  "మా కుటుంబం మొదటినుండి ఈ చెడ్డ దేవుళ్ళ ఆరాధనలో ఉండేది. నాకు ఎందుకో మొదటినుండి ఈ కబుసా అంటే ఆసక్తి వుంది. తను అనుగ్రహించదలుచుకుంటే కబుసా కొంతమందిలో అటువంటి ఆసక్తి కలిగిస్తాడని విన్నాను. అందుకనే ఆరాధించడం మొదలుపెట్టాను."

"రాజూ, ఈ మూఢ నమ్మకాలకి నాకు ఏం మాట్లాడాలో తెలియడం లేదు. నాకు సందేహం లేదు ఈ కబుసా లాంటి దేవతలని ఎవరో పుట్టించారు. ఇవి ఊహలలో పుట్టినవి. నిజంగా లేవు. కన్నెపిల్లలని కరుణించడం, కబుసా అనుగ్రహం కోసం పాటించవలసిన నియమాలు, కబుసా ఇష్టాలు ఇవన్నీ కూడా ఊహా జనితాలే కానీ నిజం కావు."

"కబుసా సమక్షం లో వుండి అలా మాట్లాడకండి. అది చాలా ప్రమాదకరం. తనని అనుమానించేవాళ్ళని, అవమానించేవాళ్ళని కబుసా చాలా కఠినంగా శిక్షిస్తాడు మీరిలాగే కబుసా కి వ్యతిరేకంగా మాట్లాడితే, మీరు నాతో ఉండడానికి కూడా నేను ఒప్పుకోలేను."     

"సరేలే, సరేలే." నవ్వాడు సింహరాజు. "నీ ఇంట్లో ఒక్కటి కూడా మామూలు దేవుడి ఫోటో కానీ విగ్రహం కానీ లేవేమిటి?"

"ఇలాంటి చెడ్డ దేవుళ్ళని, దేవతలని పూజించేచోట, ముఖ్యంగా కబుసా ని పూజించే చోట, మామూలు దేవుళ్ళ ఫోటోలు, విగ్రహాలు కానీ వుండకూడదు. అసలు ఆ దేవుళ్ళని స్మరించడం, పూజించడం లాంటివి చెయ్యకూడదు." హెచ్చెరికగా అన్నాడు సింహరాజు.

"నేను రావాల్సిన చోటుకే వచ్చాననిపిస్తూంది. ఇలాంటి దేవుళ్ళని, దేవతలని  పూజించడం లో మనసు ఎలాంటి మార్పు చెందుతుంది? అసలు ఎందుకని ఇలాంటి దేవుళ్ళని, దేవతలని పూజించాలనిపిస్తుంది? వీళ్ళని పూజిస్తే అసలు ఎందుకు ఏవో శక్తులు వచ్చాయని అనిపిస్తుంది? నాకు పరిశోధన చేసుకోవడానికి కావలసినంత సరుకు వుందిక్కడ."

"సరే మీరు ఏ పరిశోధనాలన్నా చేసుకోండి. కానీ ఈ దేవుళ్ళకి, దేవతలకి కోపం రాకుండా చూసుకోండి. ముఖ్యంగా కబుసా కి. " యస్మణి చెయ్యబోయే పరిశోధన గురించి విన్నాక తనకి ఆశ్రయం ఇచ్చి తప్పుచేశానా అనిపించింది సింహరాజు కి. ఇప్పటికి కూడా వద్దని చెప్పి పంపించేగలడు, కానీ తను ఇవ్వబోయే డబ్బు తనకి చాలా అవసరం.

ఆ మర్నాడు ఉదయాన్నే సింహరాజు దగ్గరికి వచ్చాడు యస్మణి. "నువ్వు చెప్పింది నిజమే అనిపిస్తూంది. రాత్రి నాకు కలలో ఈ ఒంటె మొహం తో వున్నదేముడు కనిపించాడు. నన్ను తను ఎన్నుకున్నానని, తన కార్యక్రమాలకి నన్ను వాడుకుంటానని చెప్పాడు."

"అయితే మీరు చాలా అదృష్టవంతులు. కబుసా తను కరుణించబోయేవాళ్ళకి అలా కలలో కనిపించి చెప్తూఉంటాడు. నాకెప్పుడూ అలా కనిపించి చెప్పనే లేదు."

"తరువాత ఆ వాంఛ నాలో చాలా పెరిగింది. భయంకరంగా వుంది. అసలు తట్టుకోలేననిపిస్తూంది." అనీజీ ఎక్స్ప్రెషన్ తో అన్నాడు యస్మణి.

"కబుసా ప్రభావం లోకి వెళ్ళారనడానికి ఇది మరొక గుర్తు." నవ్వాడు సింహరాజు. "మరి ఏం చేస్తారు? పరిశోధన ఆపి ఇంటికి వెళతారా? లేకపోతే మీ భార్యగారినే ఇక్కడికి పిలిపిస్తారా?"

"ఆ సౌకర్యం ఉండడానికి నేనసలు పెళ్లిచేసుకోనే లేదు."

"మీకు నలభై ఏళ్ళకి తక్కువ ఉండకపోవచ్చు. మరి పెళ్ళెందుకు చేసుకోలేదు?"

"నాకు కుటుంబ జీవితం మీద ఆసక్తి లేదు, అందుకనే పెళ్లిచేసుకోలేదు." యస్మణి అన్నాడు. "ఈ అవసరాన్ని అప్పుడప్పుడు ఎదో రకంగా తీర్చుకుంటూ వుంటాను. కానీ ఇప్పుడు కలిగినంతగా ఈ వాంఛ ఇప్పటివరకూ నాకు ఎప్పుడూ కలగలేదు. అసలు తట్టుకోలేననిపిస్తూంది."

"నేను వెళ్లే ఒకరిద్దరు వున్నారు.  వాళ్ళదగ్గరికి మిమ్మల్ని నేను తీసుకుని వెళతాను. కొంచెం ఓపిక పట్టండి."

"ఇక్కడకూడా అటువంటి వెసులుబాటు ఉందా? చాలా సంతోషం." యస్మణి మొహం ఆనందం తో నిండింది.

"ఈ వూళ్ళో కబుసా ని పూజించి పెద్దవాళ్ళైన వాళ్ళున్నారు. వాళ్ళు తమకి మాత్రమే తమ భార్యలు పరిమితం కాకుండా చూసుకుని, ఆ దేముణ్ణి సంతృప్తి పరచాలి. కాబట్టి మిమ్మల్ని కాదనడానికి లేదు."

"కబుసా ఈ రకంగా నన్ను కాపాడాడు." నవ్వాడు యస్మణి.

"కాకపోతే ఆ సమయం లో మీరు ఎటువంటి రక్షణ తీసుకోవడానికి వీలులేదు. ఆడ కానీ, మగ కానీ శృంగారం సమయం లో కానీ, ఆ తరువాత కానీ ఎటువంటి రక్షణ తీసుకోకూడదు. అది కబుసా ఇష్టానికి విరుద్ధం. అంతే కాదు..........." కాస్త ఆగి అన్నాడు సింహరాజు. ".......... వాళ్ళు బహిష్టు సమయం లో కూడా శృంగారం చెయ్యడానికి ముందుకు వస్తారు, ఎందుకంటే ఆ సమయంలో కబుసా కి ఎక్కువ ఇష్టం కాబట్టి. అయితే ఆ సమయంలో సరిగ్గా మీకేది తెలిసి కాదనడానికి వీల్లేదు. చేసితీరాల్సిందే. అప్పుడు కూడా ఎటువంటి రక్షణ తీసుకోవడానికి వీల్లేదు." హెచ్చరికగా అన్నాడు సింహరాజు.

"ఈ సమయం లో అటువంటి విషయాలు ఆలోచించే శక్తి లేదు నాకు. నాలో వాంఛ చాలా తీవ్రంగా వుంది." యస్మణి ఆ వాంఛతో ఎంతగా బాధపడుతూవున్నాడో అతని మొహం లో తెలుస్తూంది.

యస్మణి తమ గ్రామం లో ఆ పరిశోధన చేస్తున్నంత కాలం సింహరాజు అందుకు ఒప్పుకునే ఆడవాళ్ళ దగ్గరికి తీసుకెళ్లి, ఆ వాంఛ తీర్చుకునేందుకు సహాయం చేసాడు. కాకపోతే ఒకటి రెండు సమయాల్లో బహిష్టులో వున్నఆడవాళ్లతో కూడా చెయ్యాల్సి వచ్చి ఇబ్బంది పడ్డాడు.                            

"ఈ గ్రామం లోకి నేను మనసు కి, మానవాతీత శక్తులకు వున్న సంభందం మీద పరిశోధన చెయ్యడానికి వచ్చాను. ఇంకా అసలు మానవాతీత శక్తులు ఉన్నాయా లేదా అన్నది తెలుసుకోవడం కూడా నా ఉద్దేశం. ఇప్పుడు మనసుకి ఆ శక్తులకు వున్న సంభందం మీద అవగాహన రాకపోయినా, ఆ మానవాతీత శక్తుల మీద నమ్మకం కలిగింది. ముఖ్యంగా ఆ కబుసా మీద కూడా నాకు పూర్తి నమ్మకం కలిగింది." ఒకరోజు యస్మణి అన్నాడు.

నవ్వాడు సింహరాజు. "ఇంతకీ మీ పరిశోధన పూర్తయినట్టా లేదా?" అడిగాడు.

"అది తరువాత. అసలు నేనిక్కడకి రాకపోయివుంటేనే మంచిదని నాకనిపిస్తూంది. ముఖ్యంగా ఆ కబుసా గురించి తెలుసుకుని, అతని ప్రభావం లోకి నేను వెళ్లకుండా ఉండాల్సింది."

"అలా ఆలోచించేవాళ్ళు కూడా చాలామందే వున్నారు." సింహరాజు అన్నాడు. "కానీ కబుసా దగ్గరవుండి మీరలా అనడం మంచిది కాదు. కబుసా కి కోపం రావచ్చు. కబుసా కి కోపం తెప్పించే ఏ పనీ చెయ్యడం మంచిది కాదు." 

ఆ సమయం లోనే మల్లిక కూడా తన ఇంటికి రావడం, యస్మణి కి పరిచయం కావడం జరిగింది.

"కబుసా మీద ఆసక్తి చూపిస్తూన్న వాళ్ళల్లో ఈ అమ్మాయి కూడా ఒక్కర్తి." మల్లిక ఉండగానే సింహరాజు అన్నాడు.

"కబుసా గురించి పూర్తిగా తెలిసే ఆసక్తి చూపిస్తూందా?" యస్మణి అడిగాడు.

"ఆ నాకు తెలుసు. వీడంతా చెప్పాడు." నవ్వుతూ అంది మల్లిక. "అతని ఇష్టాలు అవీ కొంత చికాగ్గానే వున్నా, అతను అనుగ్రహిస్తే వచ్చే శక్తులమీద చాలా ఆసక్తి వుంది."

"మరి కబుసా ని ఆరాధించడం మొదలుపెట్టావా?"

"కబుసా ఎన్నుకోకుండా ఆరాధించడం మొదలుపెడితే, కన్నెపిల్లకే అయినా అతని అనుగ్రహం కలుగుతుందో లేదో చెప్పడం కష్టం." సింహరాజు అన్నాడు. "అయినా తన మామ్మ అందుకుససేమిరా ఒప్పుకోదు."

"ఒకవేళ కబుసా నన్ను ఎన్నుకుంటే మాత్రం నా మామ్మ ఇష్టాయిష్టాలతో నాకు సంభందం లేదు. కబుసా ని తప్పకుండా పూజిస్తాను." ధృడంగా అంది మల్లిక.

"ఒకవేళ కబుసా ఏ కన్నెపిల్లనైనా ఎన్నుకుంటే ఆమెని ఏ వయసులో ఎన్నుకోవడం జరుగుతుంది?"

(ఇక్కడివరకూ నచ్చిందనే ఆశిస్తా. తరువాతి భాగం సాధ్యమైనంత త్వరలోనే పబ్లిష్ చేస్తా. రేటింగ్ ఇచ్చి, రివ్యూ రాయడం మరచిపోవద్దు.)