Read Ventaade Needalu - 14 by sivaramakrishna kotra in Telugu థ్రిల్లర్ | మాతృభారతి

Featured Books
  • ప్రణయ గీతిక - 2

    ప్రభ, గోవిందు ' సారంగ్ లు ప్రిన్సిపల్ గది వైపు నడుస్తూ ఉ...

  • ఎవరు....? - 16

    Part - 16 సమయం : సాయంత్రం 6:45 గంటలువిజయవాడకు వస్తున్న SIT వ...

  • వెంటాడే నీడలు - 14

    వెంటాడే నీడలు ( ఏ క్రేజీ హాట్ రొమాంటిక్, సైకలాజికల్ అండ్ పార...

  • ప్రణయ గీతిక - 1

    ఉషోదయాన భానుడి లేలేత కిరణాలు పడుతూ ఉండగా పొగ మంచు మెల్లమెల్ల...

  • వెంటాడే నీడలు - 13

    వెంటాడే నీడలు ( ఏ క్రేజీ హాట్ రొమాంటిక్, సైకలాజికల్ అండ్ పార...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

వెంటాడే నీడలు - 14

వెంటాడే నీడలు

( ఏ క్రేజీ హాట్ రొమాంటిక్, సైకలాజికల్ అండ్ పారానార్మల్ థ్రిల్లర్)

కొట్ర శివ రామ కృష్ణ

"భయపడకు. నేనున్నాను కదా. నేను నీకేం కానివ్వను." తన గుండెల్లో భయం గొంతులో బయటపడకుండా, తన కుడిచేత్తో మల్లిక కుడిభుజం తడుతూ అన్నాడు సింహరాజు.

ఆ తరువాత విపరీతమైన జ్వరం వచ్చింది సాముదమ్మ కి. వూళ్ళో వైద్యుడు వచ్చి సూదిమందు ఇచ్చినా కూడా తగ్గలేదు. మూడోరోజు రాత్రి పదోగంట అవుతూండగా సింహరాజు ని దగ్గరికి పిలిచింది మంచం మీద పడుకునే సాముదమ్మ. మంచం మీద ఆమె కుడిపక్కన కూచుని తన రెండుచేతులు తన చేతుల్లోకి తీసుకున్నాడు సింహరాజు. మల్లిక కూడా ఆ ఇద్దరిదగ్గరికి వచ్చింది.

"ఇంక మల్లిక బాధ్యత నీదే. ఆ కబుసా బారినుండి ఎలా కాపాడుకుంటావో, కానీ నా మనవరాలిని కాపాడే భారం నీదే."

తరువాత ఆ గొంతు ఆగిపోయింది. ఆ తరువాత ఐదు నిమిషాల వరకూ తెలియలేదు ఆ ఇద్దరికీ, తన ప్రాణమే ఆగిపోయిందని.   

"మళ్ళీ ఆలోచనలో పడ్డావా? నీ ప్రియురాలిగురించేనా ఈ ఆలోచన?"

యస్మణి  అలా అడిగే వరకూ ఈ లోకంలోకి రాలేదు రాజు.

"ఇంక వేరే ఎవరిగురించి నాకు ఆలోచించాల్సిన అవసరం వుంది?" నిట్టూరుస్తూ కూర్చున్న కుర్చీలోనుండి లేచాడు రాజు. "ఆ జన్మలో తనని కాపాడలేకపోయాను. ఈ జన్మలోనన్నా రక్షించాలనుకుంటున్నాను."

"నిన్ను తనని గమనిస్తూ ఉండమని అన్నాను, ఆ పనిలోవున్నవా?" సింహరాజు ఖాళీ చేసిన కుర్చీలో కూలబడుతూ అడిగాడు యస్మణి.

"ఆ గమనిస్తూనే వున్నాను. తనని ఆ సమీర  చూసి వెళ్ళింది. త్వరలోనే తనని ఆ బ్లాక్ యాంట్ మెంటల్ కేర్ లో జాయిన్ చెయ్యొచ్చు."

"అంటే వాళ్ళకి మన అవసరం పడే సమయం దగ్గరలోనే ఉందన్నమాట." కుర్చీలో వెనక్కి జరగిలబడి అన్నాడు యస్మణి.

"అంతే కాదు, మనం అలోచించి నిర్ణయించుకోవాల్సిన విషయాలు చాలా వున్నాయి." ఇంకో కుర్చీ  యస్మణి దగ్గరికి లాక్కుని అందులో కూలబడుతూ అన్నాడు సింహరాజు.

ఆ తరువాత ఆ ఇద్దరూ ఆ ముఖ్యమైన విషయాలు చర్చించుకోవడం లో పడ్డారు.           

&&&

భుజంగరావు ఇల్లు చాలా పెద్దది. నిజానికి ఆ ఇల్లు మోహనరావే కట్టించాడు. అది ఎంత పెద్ద ఇల్లు అంటే అందులో కొన్ని కొన్ని గదులవీ వాళ్ళు వాడకుండా పూర్తిగా మర్చిపోయారు కూడా. అలాగ తాము మర్చిపోయివున్న ఆ భవనం లో కింద అంతస్తు లో వున్నఒక రూమ్ దగ్గరకి వచ్చాడు శ్రవణ్. ఆ రూమ్ లో తన బాగా చిన్నతనం లో ఒక అమ్మాయితో గడిపిన జ్ఞాపకం వుంది. ఎందుకనో ఈ రోజు తన రూమ్ లో ఖాళీ గా వున్నప్పుడు ఆ విషయం గుర్తుకు వచ్చింది. ఒకసారి ఆ రూమ్ లోకి వెళ్లి చూద్దామనిపించి ఇలా వచ్చాడు.

ఇది ఇంచుమించులో ఇరవై సంవత్సరాలు కిందట జరిగిన విషయం. అప్పుడు తనకి మూడు సంవత్సరాలు అలా ఉండొచ్చు. ఆ అమ్మాయి వయసెంతో తనకి గుర్తులేదు, తనని బాగా ఆడించేది. తనకి తిండి తినిపించేది. అప్పుడప్పుడు ఈ రూమ్ లోకి తీసుకుని ఇక్కడ కూడా ఆడిస్తూ ఉండేది. ఈ రూమ్ లోనే తను  ఉంటూండేది. ఒకరోజు  సడన్ గా మాయం అయిపొయింది.

కాలం గడుస్తూన్న కొద్దీ తను చాలా విషయాలు మర్చిపోయాడు. ఆ అమ్మాయి గురించి కూడా తను చాలా మర్చిపోయాడు. కానీ ఆ అమ్మాయి మాత్రం తనకి కొంతవరకూ గుర్తుండిపోయింది. ఒకటి రెండుసార్లు తన తల్లిదండ్రులని ఆ అమ్మాయి గురించి అడిగిచూసాడు కూడా. ఆ అమ్మాయి తమ ఇంట్లో పనిమనిషి అని, పని మానేసి వెళ్లిపోయిందని చెప్పారు.    

ఆ రూమ్ బయట తలుపులు గడియ పెట్టి వున్నాయి. ఆ గడియ తీసి ఆ రూమ్ లోకి ప్రవేశించాడు. పగటిపూట అయినా ఆ రూమ్ లో చీకటిగానే వుంది. ఆ రూమ్ దగ్గర స్విచ్ బోర్డు తలుపుదగ్గరే ఉంటుందన్న విషయం తనకి ఇప్పటికీ గుర్తుంది. ఆ స్విచ్ లు అన్నీ వేసిచూసాడు. ఒక్క బల్బు వెలగడం కానీ, ఫ్యాన్ తిరగడం కానీ జరగలేదు. జేబులోనుండి సెల్ ఫోన్ తీసి, సెల్ టార్చ్ ఆన్ చేసి ఆ రూమ్ అంతా నిశితంగా పరిశీలించడం మొదలు పెట్టాడు.

"ఈ గదిలోకి నువ్వెందుకు వచ్చావు శ్రవణ్ బాబూ......"

కరెంట్ షాక్ కొట్టినట్టుగా ఉలిక్కిపడి వెనక్కితిరిగాడు శ్రవణ్. తనని ఆ అమ్మాయి ఎప్పుడూ అలాగే పిలిచేది   శ్రవణ్ బాబు అనీ.

"నువ్విక్కడికెందుకు వచ్చావ్?" వెనకాతల కనిపించిన సారిక ని ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు శ్రవణ్.

"అదే ప్రశ్న నేను నిన్నూ అడుగుతున్నా. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి?" సారిక అడిగింది నొసలు చిట్లించి.

"నా చిన్నతనం లో ఈ ఇంట్లో ఒక అమ్మాయి పనిమనిషిగా పనిచేసేది. నన్ను తను ఆడించి బాగా చూసుకునేది. తను ఈ రూమ్ లోనే ఉండేది. ఆ విషయం సడన్ గా గుర్తుకొచ్చి, ఈ రూంలోకొచ్చి చూద్దామనిపించింది."

"నీ చిన్నతనం అంటే నీకు ఎంత వయసప్పుడు?"

"నాకు మూడేళ్లు వుండేవనుకుంటా. వంశీ ఏ పుట్టలేదప్పటికి."

"అంటే ఇప్పటికి ఇంచుమించులో ఇరవైరెండేళ్ల కిందటి విషయం. ఓకే ఎంత కాలం కిందటివిషయాలన్నా గుర్తుండే అవకాశం వుంది కానీ నీకు మూడేళ్లప్పుడు జరిగినవి  గుర్తున్నాయంటే నాకు ఆశ్చర్యంగా వుంది."         

"ఆ అమ్మాయితో నేనంత చేరికగా ఉండేవాడిని. నన్ను బాగా ఆడించేది." కాస్త ఆగి గట్టిగా ఊపిరి పీల్చి వదిలాడు శ్రవణ్. "కానీ ఒకరోజు నుండి సడన్ గా కనిపించలేదు. మామ్ అండ్ డాడ్ తను పనిమనిషి అనీ, వెళ్లిపోయిందని చెప్పారు."

"పనిమనుషులు ఎప్పుడన్నా పని మానేసి వెళ్లిపోవచ్చుకదా, అందులో ఆశ్చర్యం ఏముంది?"

"అది నిజమేలే." నిట్టూర్చి అన్నాడు శ్రవణ్. "నాకెందుకో సడన్ గా ఈ రోజు ఆ అమ్మాయి గుర్తుకు వచ్చింది. ఆ అమ్మాయి ఈ రూమ్ లోనే ఉండేది, ఈ రూమ్ లోకి వచ్చి చూద్దామనిపించింది. సో, ఇలా వచ్చాను."

"ఒక పనిమనిషి రూమ్ లో చూడ్డానికి ఏముంటుంది? పద పోదాం. చాలా ఉక్కగా ఉందిక్కడ." సారిక అంది.

"సరే పద." ఆ రూమ్ లోనుండి బయటకి వస్తూ అన్నాడు. ఇద్దరూ పై అంతస్తులోకి వెళ్తూ ఉండగా అడిగాడు. "ఇంతకీ నువ్వా రూమ్ దగ్గరికి ఎందుకు వచ్చావో చెప్పలేదు."

"ఎక్జాట్ గా రీజన్ చెప్పలేను. నాకూ సడన్ గా ఆ రూమ్ గుర్తుకువచ్చింది. ఆ రూమ్ దగ్గరికి వచ్చి చూడాలనిపించింది. ఆ సమయానికే నువ్వూ ఆ రూమ్ దగ్గరికి రావడం జస్ట్ కో ఇన్సిడెన్స్ అనుకుంటా."

"నాకంటే ఆ అమ్మాయితో ఆ రూమ్ లో టైం స్పెండ్ చేసేవాడిని కాబట్టి నాకా రూమ్ లోకెళ్ళి చూడాలనిపించింది. నీకెందుకు ఆ రూమ్ చూడాలనిపించింది?"

"చెప్పలేను బ్రో........." సారిక తన రూమ్ లోకి ప్రవేశిస్తూ ఉంటే, తనూ ఆమె రూమ్ లోకి ప్రవేశించాడు శ్రవణ్. ".........మన ప్యాలస్ లో ఇంకా అలాంటి ఉపయోగించని రూమ్స్ వున్నాయి. కానీ నాకు సడన్గా ప్రత్యేకంగా ఆ రూమ్ ఎందుకు చూడాలనిపించిందో రీజన్ తెలియడం లేదు." బెడ్ మీద ఎడ్జ్ లో కూలబడుతూ అంది సారిక.

"ఆల్రైట్, డోంట్ బ్రేక్ యువర్ హెడ్." అక్కడున్న కుర్చీలో కూలబడుతూ అన్నాడు శ్రవణ్. "అవును నువ్వు నన్నా రూమ్ లో ఏమని పిలిచావ్?" సడన్ గా గుర్తుకువచ్చి ముందుకు వంగి అడిగాడు.

"ఏమని పిలిచాను? నిన్ను నేనసలు ఎలా పిలుస్తాను. బ్రో, అన్నయ్యా, ఇంకా ముద్దొస్తే 'రేయ్' అంతే కదా." నవ్వుతూ అంది సారిక.

"లేదు నువ్వు నన్ను అలా పిలవలేదు. జాగ్రత్తగా గుర్తుచేసుకో ఎలా పిలిచావో."    

"నేను సడన్ గా ఆ రూమ్ దగ్గరికి ఎందుకు వచ్చానో నాకు అర్ధమై చావక కిందా మీదా పడుతున్నాను. నేను నిన్నప్పుడు ఎలా పిలిచానో గుర్తుచేసుకునే ఓపిక నాకు లేదు కానీ నువ్వే చెప్పు." చిరాకు పడుతూ అంది సారిక.

"శ్రవణ్ బాబూ, నువ్వు నన్ను శ్రవణ్ బాబూ అని పిలిచావ్."

"అలా పిలిచానా?" ఆశ్చర్యపడుతూ అడిగింది సారిక. "నేను నిన్నెప్పుడూ అలా పిలవనే."

"కానీ నువ్వు నన్ను అలాగే పిలిచావు అప్పుడు."

"సర్లే, ఎదో అలా పిలిచుంటాను. దానిగురించి ఎందుకంత ఆలోచన?"

"నన్నెప్పుడూ ఆడించే ఆ పనమ్మాయి నన్నలాగే పిలిచేది 'శ్రవణ్ బాబూ' అని. ఆ అమ్మాయి కి సంబంధించి నాకు గుర్తున్న విషయాల్లో అదొక్కటి." 

"సంథింగ్ సర్ప్రైజింగ్! ఆ అమ్మాయి పిలిచినట్టుగా నేను నిన్నెందుకు పిలిచాను?" సారిక లో ఆశ్చర్యం ఇంకా ఎక్కువైంది.

"ఒకే. నువ్వీ విషయం గురించి తల బద్దలుకొట్టుకోకు." కుర్చీలోనుండి లేచాడు శ్రవణ్. "నువ్వు అప్పుడప్పుడు మన ఆఫీస్ కి వచ్చి అక్కడ విషయాలన్నీ అబ్జర్వ్ చేస్తూండు. నువ్వు మన బిజినెస్ లో చాలా యాక్టివ్ రోల్ ప్లే చెయ్యాలి కదా."

"స్యూర్ .......స్యూర్ ..........." అలా అంటూ తనూ బెడ్ మీద నుండి దిగి శ్రవణ్ దగ్గరికి వచ్చింది సారిక. ఆశ్చర్యంగా తన మొహం లో భావం మారింది. "………చాలా పెద్దవాడివైపోయావ్." తన మొహం మీద చేతులు ఉంచి అంది.

తన ధోరణి చాలా ఆశ్చర్యంగా వుంది శ్రవణ్ కి. అంతలోనే తను తమ తల్లిని, ఓబులేశుని చంపబోయిన విషయం గుర్తుకువచ్చి గాభరాగా వెనక్కి నడుస్తూ అన్నాడు. "నన్ను చంపబోకు, నన్ను చంపబోకు ప్లీజ్."                            

"చంపడమా ? నేను నిన్నెందుకు చంపుతాను శ్రవణ్ బాబూ?" తన చేతుల్ని శ్రవణ్ మొహం మీద నుండి తొలగిస్తూ ఆశ్చర్యంగా అడిగింది సారిక.

"అదిగో, అదిగో నువ్వు మళ్ళీ నన్ను అలాగే పిలిచావ్." షాకింగ్ గా అన్నాడు శ్రవణ్

"ఎలా పిలిచేన్రా?" కోపంగా అడిగింది సారిక. "ఏంటీ రోజు ఇలా మొదలుపెట్టావ్?"

"అంటే ఇప్పుడు జరిగినదేదీ నీకు గుర్తులేదా?" నొసలు చిట్లించాడు శ్రవణ్

"అంటే ఎం జరిగింది? ఎలా బిహేవ్ చేసాను?" షాకింగ్ గా అడిగింది సారిక

"ఆల్రైట్, ఆల్రైట్. నథింగ్ సీరియస్ హేపెన్డ్. జస్ట్ ఫర్గెట్." తలవిదిలిస్తూ అన్నాడు శ్రవణ్.

"ఏం జరిగిందిరా? నేను నిన్నూ చంపబోయానా ఏం?" గాభరాగా అడిగింది సారిక.

"అబ్బే, అటువంటిది ఏమీ లేదు. నువ్వు నన్ను మరోసారి శ్రవణ్ బాబూ అని పిలిచావ్ అంతే. దానిగురించి అంతగా ఆలోచించకు."

"నేను నిన్నెందుకు ఎప్పుడూ పిలవని విధంగా పిలుస్తున్నాను?" మరోసారి కంగారుపడుతూ అంది సారిక.

సారిక దగ్గరగా వెళ్లి తనని తన చేతుల్లోకి తీసుకున్నాడు శ్రవణ్. "ఏదో మామూలుగా అనివుంటావ్. ఆ విషయం గురించి పెద్దగా ఆలోచించకు. జస్ట్, నీ బిజినెస్ నాలెడ్జ్ పెంచుకుని మన బిజినెస్ లో మేజర్ రోల్ ఎలా ప్లే చెయ్యడం అన్నవిషయం మీద కాన్సెన్ట్రేట్ చెయ్యి. ప్రస్తుతానికి నువ్విక్కడే ఉండకుండా బయటకి ఎక్కడికన్నా వెళ్లి కాసేపు ఎంజాయ్ చేసి రా."

అలా అని బయటకి వచ్చాక శ్రవణ్ కి హాల్లో ప్రమీల కనిపించింది. "నువ్వూ నా సిస్ ఇద్దరూ బయటకివెళ్ళి ఏదన్నా మంచి మూవీ చూసిరండి." ఎదో మూడ్ చేంజ్ కి అన్నట్టుగా ఇద్దర్నీ బయటకిపంపించాడు శ్రవణ్.

ప్రమీల, సారిక ఇద్దరూ ఆనందంగా మూవీ చూడ్డానికి వెళ్లిపోయారు కారులో ప్రమీల డ్రైవ్ చేస్తూండగా.               

&&&

“ఒక్క విషయం నువ్వు నాకు స్పష్టం గా చెప్పు. నేను నీకు బెస్ట్ ఫ్రెండ్ నని, నాతో ఎప్పుడూ వుండడానికి అవకాశం వుంటుందని చెప్పి నా బ్రో ని పెళ్లిచేసుకున్నవా లేక నువ్వూ నా బ్రో ప్రేమించుకున్న కారణం గా తనని పెళ్లిచేసుకున్నవా?” తమిద్దరూ ప్రమీల రూమ్ లో మాట్లాడుకుంటూ వుండగా, ప్రమీల ని సడన్ గా అడిగింది సారిక.

“ఎందుకు ఈ ప్రశ్న నీకు సడన్ గా ఈ వేళ ఆడగాలనిపించింది?” నొసలు ముడేసింది ప్రమీల.

“ఎందుకంటే నీకు నాకు మూడేళ్లు అలా ఏజ్ గాప్ వుంది. అయినా నేను నీ బెస్ట్ ఫ్రెండ్ ని నాతో పాటుగా వుండడానికి అవుతుందనే నా బ్రో ని పెళ్లి చేసుకున్నాను అంటున్నావ్. అయితే పెళ్లయ్యాక నువ్వు నాతో స్పెండ్ చేసే సమయం కన్నా నా బ్రో తో స్పెండ్ చేసే సమయమే ఎక్కువగా వుంటోంది. అంతే కాకుండా పెళ్లి కాకముందు మీ ఇద్దరూ కూడా బాగా ఫ్రెండ్స్.” కంప్లయింట్ చేసింది సారిక.

“సారీ సారికా. అలా ఎక్కువ సమయం వాడితో స్పెండ్ చేస్తే కానీ వూరుకోవడం లేదు ఆ రాస్కెల్. నేనూ నీ బ్రో కూడా ఫ్రెండ్స్ అన్న విషయం నేనొప్పుకుంటా. కానీ మనిద్దరం కూడా ఎలా వుండేవాళ్ళం?ఈ ఏజ్ గాప్ ఎప్పుడన్నా మనమధ్య ఎలాంటి డీఫెరెన్స్ అన్నా క్రియేట్ చేసిందా? ఎప్పుడూ నువ్వు నాతో వుండాలన్న వుద్దేశ్యం తోనే కదా, ఇల్లరికం వుండడానికి ఇస్ట పడతాడని నా తమ్ముడితో నీకు సంభందం ఖాయం చేయాలని తాపత్రయపడుతున్నాను.”

“అంటే ఇందులో నా అభిప్రాయం తో కూడా ఏం నిమిత్తం లేదా? నేను నీ తమ్ముడిని చేసుకుని తీరాల్సినదేనా?” చిరునవ్వుతో అడిగింది సారిక.

“నో, నాటేటాల్.” సీరియస్ ఎక్స్ప్రెషన్ తో అంది ప్రమీల. “కానీ నీకు వాడిమీద అటువంటి వుద్దేశ్యం లేకపోతే ఆ విషయం వాడికి త్వరగా చెప్పేసేయ్. ఆల్రెడీ వాడు నీ మీద ఏవో వూహలు పెంచుకుంటున్నట్టున్నాడు.”

“రిలాక్స్ వదినా. అనవసరంగా కంగారు పడకు. నీ బ్రో కూడా చిన్నప్పటినుండీ నాకు ఫ్రెండే కదా. ప్రస్తుత పరిస్తితులలో నా గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తినే నేను పెళ్లిచేసుకోవడం మంచిందనుకుంటున్నాను. నో, డౌట్ ప్రదీప్ నన్ను పూర్తిగా అర్ధం చేసుకుని, నాతో చాలా చక్కగా వుంటాడు.” చిరునవ్వుతో చెప్పింది సారిక.

“నేను, నా బ్రో, నువ్వూ, నీ బ్రో చాలా చిన్నప్పటినుండీ స్నేహితులం. కలిసి ఆడుకుంటూ వుండేవాళ్ళం.” ప్రమీల అంది  

"ఎస్, అఫ్కోర్స్ . మీ డాడ్, మా డాడ్ మంచి ఫ్రెండ్స్. ఇళ్ళు కూడా పక్క పక్కన వున్నాయ్. సో, మన మధ్య ఇంటిమసీ కి ఫ్రెండ్షిప్ కి అలా కుదిరింది. చాలా చిన్నతనం నుండి కలిసి ఆడుకునేవాళ్ళం." సారిక అంది.

"నేనూ, నీ బ్రో ఆపోజిట్ సెక్స్. కాబట్టి చిన్నతనం నుండీ మా మధ్య వేరే రకమయిన అట్రాక్షన్ కూడా ఉండేది. ఆడోలెసెన్సు లో ఆ అట్రాక్షన్ తోటే కొన్ని ఎక్స్పెరిమెంట్ లు కూడా చేసాం. అంటే ముద్దులు పెట్టుకోవడం తో పాటుగా దట్ టూ." బుగ్గలు సిగ్గుతో ఎర్రబడుతూండగా అంది ప్రమీల.

"రాస్కెల్, ఇప్పుడు చెప్పు. నాతో ఫ్రెండ్షిప్ వల్ల, నాతో వుండాలని నా బ్రో ని పెళ్లి చేసుకున్నానని." తలగడా ని తీసుకుని దానితో ప్రమీలని కొడుతూ సీరియస్ నెస్ మాక్ చేస్తూ అంది సారిక.

"అడొలెసెన్స్ లో చేసే ఎక్స్పెరిమెంట్స్ లవ్ కేమీ గుర్తు కాదు. అవి కేవలం సెక్స్ పట్ల మనకొస్తున్న కాన్షస్నెస్ కి ఒక చిహ్నం. నేనూ నీ బ్రో చేసినటువంటివి కూడా జస్ట్ అటువంటివే. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ వి అన్నది జస్ట్ స్టాండ్స్ ఏజ్ ఇట్ ఈజ్." ప్రమీల కూడా ఒక సీరియస్ ఎక్స్ప్రెషన్ తో అంది. "నువ్వు  నా బ్రో కూడా ఆపోజిట్ సెక్స్. మా మధ్యలాటి ఆకర్షణ మీ మధ్య అడొలెసెన్స్ లో ఉండగా ఎప్పుడన్నా వచ్చిందా? మేం చేసినలాంటి ఎక్స్పెరిమెంట్స్ మీరెప్పుడన్నా ట్రై చేశారా? నో అఫెన్స్ ప్లీజ్ సారికా."

"నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ వి. ఒక కారణం లేకుండా ఇటువంటి ప్రశ్న వెయ్యవు." నవ్వింది సారిక. "కానీ దీనికి సమాధానం చెప్పడానికి ముందుగా నువ్వీ ప్రశ్న ఎందుకు వేశావో తెలుసుకోవాలనుంది."

"సెక్స్ లో నీ అబ్నార్మల్ బిహేవియర్ గురించి విన్నాక, మొదటినుండి అదలాగే వుందా అన్నది నాకు తెలుసుకోవాలనుంది. నువ్వు మొదటినుండి సెక్స్ గురించి ఎలా ఫీల్ అవుతున్నావో తెలుసుకుని నేను ఒక ఒపీనియన్ కి వస్తాను."

"ఒకే ఐ అండర్‌స్టూడ్ " చిరునవ్వుతో తలూపింది సారిక. "నిజం చెప్పాలంటే నేనూ నీ బ్రో కూడా కలిసి ఆడుకుంటూ ఉండేవాళ్ళం. పన్నెండు, పదమూడు సంవత్సరాల వయసులో నన్నొకసారి గట్టిగా కౌగలించుకుని ముద్దుపెట్టుకున్నాడు. అందులో ఎదో థ్రిల్ వుందనిపించి నేనూ కో-ఆపేరెట్ చేసాను. అలా ఫిజికల్ ఇంటిమసీ ని మేము కొన్నిసార్లు ఎంజాయ్ చేసేవాళ్ళం. ఆ వయసులో అపోజిట్ సెక్స్ పట్ల ఆకర్షణ అప్పుడప్పుడే మొదలువుతూవుంటుంది కాబట్టి మాకది చాలా థ్రిల్లింగ్ గా కూడా ఉండేది." ఆలా చెప్తూవుంటే సారిక బుగ్గలు కూడా సిగ్గుతో ఎర్రబడ్డాయి.

(ఇక్కడివరకూ నచ్చిందనే ఆశిస్తా. తరువాతి భాగం సాధ్యమైనంత త్వరలోనే పబ్లిష్ చేస్తా. రేటింగ్ ఇచ్చి, రివ్యూ రాయడం మరచిపోవద్దు.)