Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

తనువున ప్రాణమై.... - 29

ఆగమనం.....


అలా అనకు సిక్స్ ఫీట్!! 
అసలు ఎప్పటికీ అనుకు!! 
నేను నిన్ను కలవకపోతే... 
నువ్వు నన్ను ఎలా ప్రేమిస్తావు, సిక్స్ ఫీట్??
నీకోసం నువ్వు నన్ను ప్రేమించాలి కదా?? 
ఈ గుండె నీకోసమే, కొట్టుకుంటుంది!!
ఈ ప్రాణం నీకోసమే సిక్స్ ఫీట్!!
ఇంకెప్పుడూ అలా అనకు సిక్స్ ఫీట్!!
ఐ లవ్ యువ్! సిక్స్ ఫీట్!!

పొట్టిది మళ్లీ చుట్టుకునేసరికి... 
లాగేద్దామనుకున్నాడు గాని...
ఉహూ... మొదటిసారి పొట్టిది... 
సెంటిమెంట్ ఫీల్ అవుతుంది!!
పొట్టి దాని స్ట్రాంగ్ సెంటిమెంట్... 
ఎమోషన్ కి, మెల్ట్ అయిపోయాడు!!

పొట్టి దాన్ని తల మీద చేయి వేసి కదిపేసరికి... 
తల మాత్రమే, పైకి ఎత్తింది!! 
గడ్డం సిక్స్ ఫీట్ గుండెలకి, ఆన్చి పెట్టి...
అందంగా నవ్వుతూ, సిక్స్ ఫీట్ ని చూస్తుంది!!

పొట్టి దాని మొఖం చాలా బాగుంది!! 
మొదటిసారి సిక్స్ ఫీట్ కి, ఒక కొత్త అందం... 
పొట్టి దాని ముఖంలో కనిపిస్తుంది!!

పొట్టి వదులు...

అరవకుండ, సిక్స్ ఫీట్ మొదటిసారి... 
నెమ్మదిగా చెప్పాడు!!

ఐరన్ కి అటాచ్ అయిన అయస్కాంతం... 
అంత తొందరగా వదులుతుందా?? 
కానీ ఏంటో, సిక్స్ ఫీట్ లాగకుండా, తోయ్యకుండా... 
పొట్టి పాప గారు, క్యూట్ గా వదిలేసి... 
వన్ ఫీట్ డిస్టెన్స్ ఇచ్చింది!!

ఇందాక ఏమోగానీ, ఇప్పుడు మాత్రం...
సిక్స్ ఫీట్ ఇది అని, తెలియని ఇష్టంతో... 
పొట్టి దాన్ని చూస్తున్నాడు!!

తమ్ముడు.....

వస్తూనే, మన పొట్టి దాన్ని చూసుకుంటూ... 
వచ్చి, సిక్స్ ఫీట్ పక్కన నిలబడతారు.
తమ్ముడి లా 6 ఫీట్ కాకపోయినా...
5.9" ఫీట్ ఉన్నారు, ఆవిడ కూడా!!

పొట్టిది ఇద్దరిని, ఎక్సైట్ మెంట్ తో చూస్తుంది!!

అక్క ఏమయింది?? 
నాన్న ఏమన్నా పిలిచారా!!

ఏమీ లేకుండా రాకూడదా?? 
సరేలే, వెళ్ళిపోతాను!! 
దీని, అవసరం నీకు ఉంటుందని... 
ఇవ్వడానికి వచ్చాను!!

తమ్ముడు చేతిలో వాలెట్ పెట్టి...
నవ్వుతూ, అల్లరి పట్టిస్తుంది!!

ఏయ్ పొట్టి! నువ్వు ఇక్కడే ఉండు! 
ఎటన్నా, కదిలావో కాళ్లు ఇరుగుతాయి!!

పొట్టి దానికి సీరియస్ గా వార్నింగ్ ఇచ్చి!! 
అక్క చేయి పట్టుకొని నాలుగడుగులు... 
దూరంగా తీసుకు వెళతాడు!!

ఏంటి రా, అలా అరుస్తున్నావు?? 
అప్పుడే అంత క్లోజ్ అయిపోయావా?

ఇవి క్లోజ్నెస్ వల్ల వచ్చే అరుపులు కాదక్క!! 
దాన్ని టార్చర్ వల్ల వచ్చే అరుపులు!!
దానికి ఇలా కాదు ఎలా చెప్పినా ఎక్కదు!! 
అది.. అదొక... స్పెషల్ మెంటల్ పీస్ అదంతే!!

మెంటల్ కాదు గాని, స్పెషల్ పీస్ ఎ!! 
హుమ్మ్... నీ స్పెషల్ పీస్, చాలా బాగుందిరా!!
బుట్ట బొమ్మ లాగా అందంగా ముద్దుగా ఉంది!! 
కాకపోతే, నీ పక్కన హైట్ మ్యాచ్ అవ్వటం లేదు రా!! 
ఒక అర అడుగు హైట్ చెక్కలు కడదాము, కాళ్ళకి!!

అక్క....!!

టిస్ చేస్తున్న అక్కని... 
సూటిగా చూస్తున్నాడు!!

ఏంటి తమ్ముడు ఆర అడుగు...
సరిపోవు అంటావా??

అక్క... ఏడిపించకు, చాలు కానీ!!
అది హిల్స్ వేయదు, ప్లాట్స్ వేసుకుంటుంది!! 
అయినా దాని ఎగురుడికి అది హిల్స్ వేస్తే... 
రెండు కాళ్లు విరిగిపోతాయి!!

ఆహా... పర్లేదురా బానే తెలుసుకున్నావు!!

అక్క..!! దానికి......
అని, చెప్పబోతున్న వాడు ఆపేసి... 
అలాగే పొట్టి దాన్ని చూస్తున్నాడు!!
తమ్ముడు కోపంగా చూస్తుంటే... 
అక్క ఆశ్చర్యంగా చూస్తుంది!!

తనని దూరం పెట్టి అక్క తమ్ముళ్లు... 
ఇద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు!!
అన్న ఆపుకోలేని ఆత్రం తో... 
పొట్టిది దగ్గరికి వచ్చేసింది!!

ఒసేయ్ పొట్టి దాన నిన్ను అక్కడ... 
ఉండమన్నాను కదా! ఎందుకు వచ్చావు??

మీరు మాట్లాడుకునేది నా గురించే కద సిక్స్ ఫీట్!! 
నా గురించి ఏమన్నా డౌట్ వస్తే... 
క్లారిటీ ఇద్దామని, దగ్గరికి వచ్చాను సిక్స్ ఫీట్!!

నీ గురించా...?? 
ప్రపంచం అంతా నీ గురించే, మాట్లాడుకుంటుందే! 
నువ్వు ఒక వరల్డ్ ఫేమస్ ఫిగర్ అని!! 
ఎవరే చెప్పింది నీ గురించి అని!! హా...
కొంచెం అన్న సెన్స్ ఉందా?? 
ఇలా వచ్చి మధ్యలో దూరిపోయావు!!

తమ్ముడు ఆగు నువ్వు!!
తమ్ముడు చిరాగ్గా అరుస్తున్న... 
కూడా నవ్వుతూ ఉన్న... 
పొట్టి దాన్ని చూస్తే... 
తెగ ముద్దొచ్చేస్తుంది, ఆవిడకి!!

చూసారా, చూసారా... మీ తమ్ముడికి నేనంటే ఎంత ఇష్టమో! నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో.. నా సిక్స్ ఫీట్!!

జన్మజన్మల బంధం అనంత రేంజ్ లో చెప్పేసి... 
చక్కగా ఆమెను పక్కనుంచి, చుట్టేసుకుంటుంది!!

అబ్బా... ఒసేయ్ పొట్టి, తను మా అక్క తినేద్దాం అనుకుంటున్నావా?? వెళ్లి పక్కన చేరిపోయావు!!

నాకు తెలుసు సిక్స్ ఫీట్ ఇందాక చూశాను!! 
మార్నింగ్ ఫోన్ లో, మాట్లాడుతుంటే విన్నాను!! 
మీ అక్క చాలా అందంగా ఉంది!! 
కాకపోతే నీ అంత కాదు, సిక్స్ వీట్!!

చెబుతూనే.. రెండో చెంప వైపు చెయ్యి పెట్టి...
తన వైపుకి వంచుకొని, రెండు బుగ్గల మీద... 
ఆమెకు గట్టిగా ముద్దులు పెట్టేస్తుంది!!

ఏయ్... ఆగు.. ఆగు... చాలు ఇంకా ఆపు!! 
అని ముందు పొట్టి దాన్ని విడిపించుకుంటుంది!!

సిక్స్ ఫీట్, పొట్టి దాన్ని 
లిటిల్ సీరియస్ లుక్ తో చూస్తున్నాడు!!

మా వాడు అన్నట్టు నువ్వు స్పెషల్ పీస్ వే!! 
చాలా బాగున్నావు! అలాగే అల్లరి... అని నవ్వేస్తుంది!!

థాంక్యూ!! థాంక్యూ సో మచ్!! 
ఆమెను చుట్టేసి ఉక్కిరి బిక్కిరి చేసేస్తుంది!!

మీరు నాకు ఒక హెల్ప్ చేస్తారా? 
ప్లీజ్....ప్లీజ్....ప్లీజ్.... అని కాక పట్టేస్తుంది!!

ఏయ్ పొట్టి ఏం హెల్ప్?? 
నువ్వు మూసుకొని ఇటు రా!! 

అబ్బా ఎందుకురా అలా అరుస్తావు!! 
హెల్ప్ ఏ కదా అడిగేది!! 
దీనికే అరవాలా?? 
నువ్వు ఉండు కాసేపు!!

అక్క నీకు దాని సంగతి తెలియదు!! 
నువ్వు సేఫ్ గా ఉండడం నాకు అవసరం అక్క!! 
ప్లీజ్ అక్క, నువ్వు వెళ్ళు!! ప్లీజ్, అర్థం చేసుకో!!

నేను వెళ్లడం నీకు అవసరమని... 
నాకు తెలుసు రా! ఒక్క నిమిషం ఉండు!!
అని తమ్ముడిని వారిస్తూ....

నువ్వు చెప్పు ఏ హెల్ప్ కావాలి నీకు?? 
అని, పొట్టి దానికి హెల్ప్ చేయడానికి ఫిక్స్ అయిపోయారు!!

ఏ పొట్టి పిచ్చిపిచ్చిగా ఏదైనా వాగేవో... 
చచ్చేవే, నా చేతిలో చెప్తున్నా!!
ముందుగా, పొట్టి దాన్ని వార్న్ చేస్తున్నాడు!!

6 ఫీట్ ఇచ్చిన వార్నింగ్ కి... 
అక్క తమ్ముడిని చిరు కోపంతో చూస్తుంటే... 
పొట్టిది, సిగ్గుపడుతూ చిరునవ్వుతో చూస్తుంది!!

వాడు అంతేలే, కొంచెం కోపం ఎక్కువ!! 
వాడిని పట్టించుకోకు..!! 
నువ్వు అడుగు ఏం కావాలో!!

నన్ను పట్టించుకోకు!!
హు... భలే చెప్పావు అక్క!! 
నా గెస్ కరెక్ట్ అయితే అది... 
కచ్చితంగా నీకు షాక్ ఇస్తుంది!!
సిక్స్ ఫీట్ తన మైండ్ లో ఇన్నర్ వేసుకుంటూ...
పొట్టి దాన్ని, క్యూరియాస్ గా చూస్తున్నాడు!!

ఏం లేదు చాలా సింపుల్!! 
నాకు, మీ తమ్ముడికి అసలు ఎక్స్పీరియన్స్ లేదు!! 
మీరు చాలా ఎక్స్పీరియన్స్ కదా!! 
అందుకే మీ ఎక్స్పీరియన్స్ అంతా... 
యూస్ చేసి, నాకు హెల్ప్ చేయండి!! 
ప్లీజ్.....ప్లీజ్..... ప్లీజ్.... ప్లీజ్....

అన్ని ప్లీజ్ లు వద్దు కానీ, హెల్ప్ ఏంటో చెప్పు!!
చక్కగా ప్రశాంతంగా, అడుగుతున్నారు!!

మీరు చాలా చాలా చాలా మంచి వాళ్ళు!!
నాకు చేయవలసిన హెల్ప్ చాలా సింపుల్!! 
నాకు 6 ఫీట్ అంటే చాలా ఇష్టం!! 
సిక్స్ ఫీట్ కి కూడా నేనంటే చాలా ప్రేమ!! 
మీ తమ్ముడి ఈ రోజు.. చాలా హాట్ గా, సూపర్ సెక్సీగా ఉన్నాడు, నేను కూడా అలాగే అందంగా ఉన్నాను కదా!! అందుకే, మేమిద్దరం ఈరోజు... 
మా ఫస్ట్ నైట్ చేసుకుంటున్నాం!! 
మీ ఫస్ట్ నైట్ ఎక్స్పీరియన్స్... 
అంతా నాకు చెప్తే మేము ఇద్దరు... 
దాన్ని యూస్ చేసుకుంటాము!! 
ప్లీజ్ చెప్పరా!

@@@@@@@@@

ఫ్రెండ్స్ డోంట్ ఇగ్నోర్...
5 స్టార్ రేటింగ్, మీ కామెంట్, మీ కాంప్లిమెంట్!!

మళ్లీ కలుద్దాం.
థాంక్యు.
మీ వర్ణ.