Featured Books
  • థ జాంబి ఎంపరర్ - 1

    జాంబి ఎంపరర్ (The Zombie Emperor) అలా కట్ చేస్తే... ఒక నిశ్శ...

  • తనువున ప్రాణమై.... - 10

    ఆగమనం.....దెబ్బ తగలకుండా, దెయ్యం ఎలా వదులుతుంది నీకు!!ఏదో లవ...

  • అంతం కాదు - 2

    అమ్మాయి అలా వెళ్తూ ఉండగా రుద్రకు ఇక్కడ ఏదో తెలుస్తుంది. తన ద...

  • ఓ మనసా... - 3

    ఒక స్ట్రాంగ్ సెండ్ ఆఫ్ కిస్ తో టీనా లిప్స్ బైట్ చేసి నొప్పిన...

  • చంద్రుడు

    మానవ భావోద్వేగాలు, చెప్పని కథలు మరియు వ్యక్తిగత అంతర్దృష్టుల...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

తనువున ప్రాణమై.... - 10

ఆగమనం.....


దెబ్బ తగలకుండా, దెయ్యం ఎలా వదులుతుంది నీకు!!
ఏదో లవ్వు, కొవ్వు, తిరిగి ఇచెయ్యి అన్నావుగా!!
దా పొట్టి దాన! ఇస్తాను రావే..!!
ఇంత చాలదు, చాలా కావాలి అన్నావు కదే!!
దావే ఇస్తాను, నీకు ఎంత కావాలో అంత ఇస్తాను! దా...
అంటూ... రాడ్డు పట్టుకుని, పిచ్చ కోపంతో...తప్పించుకొని పరిగెడుతున్న, పొట్టి దాని వెంట పడుతున్నాడు.

ఆ ఫ్లోర్ లో ఉన్న, లిఫ్ట్ దగ్గరికి పరిగెడుతుంది!!
సిక్స్ ఫీట్ పొట్టి దాని వెనకాలే రాడ్ తో, వెంటపడుతున్నాడు!! అయినా, పొట్టిది 
క్యూట్ గా వాడిని కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తుంది.

ఎక్కడికే పొట్టి దాన, అలా పరిగెడుతున్నావు!! 
కావాలి, కావాలి అన్నావు కదా!! 
ఇస్తాను అంటే... తీసుకోకుండా, పరిగెడుతున్నావు!! 
ఆగవే... ఆగవే... పొట్టి దాన!!
క్రాక్ వచ్చిన కోతి లాగా పొట్టి దాని వెంటపడుతున్నాడు!!

సిక్స్ ఫీట్ అలా కాదు సిక్స్ ఫీట్!!
నేను చెప్పేది ఒకసారి విను సిక్స్ ఫీట్!! 
నువ్వు నన్ను ఇలా కొట్టేస్తే ఎలా సిక్స్ ఫీట్!! 
అంటూ లిఫ్ట్ బటన్స్, స్పీడ్ గా నొక్కేస్తుంది!!

పొట్టి దానికి అర్జెంట్ అని, అవి పైకి వస్తాయా??
ఒకటి ఫస్ట్ ఫ్లోర్ లో, మరొకటి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నాయి!!
డిస్ప్లే లో  కనిపిస్తున్న, ఫ్లోర్ నెంబర్స్ చూసింది!!
వెనక్కి తిరిగి తన లవర్ బాయ్ ని చూసింది!!
ఒక్క నిమిషం అక్కడే ఉంటే, వాడి చేతిలోని రాడ్...
పొట్టి దాని తలకి, కచ్చితంగా తగిలెది!!
తుర్రుమెంటు స్టెప్స్ వైపుకి పరిగెడుతుంది!!

ఒసేయ్ పొట్టి దాన, ఎక్కడికె పోతున్నావు... 
ఆగవే, నువ్వు ఒక్కటే ఇచ్చావు కదా..!! 
వన్ ప్లస్ వన్ బోనస్ తో కలిపి రెండు ఇస్తాను!! 
తీసుకుని వెళ్దువు గాని ఆగు...
సిక్స్ ఫీట్ కూడా లిఫ్ట్ దగ్గర టర్న్ తీసుకున్నాడు!!
పొట్టి దాని వెంటే, మెట్ల వైపు వెళుతున్నాడు...

వావ్ సిక్స్ ఫీట్, నీ ఫేస్ సో...సో... సో...హాట్!!
రెడ్ యాంగ్రీ బర్డ్ ల, సూపర్ సెక్సీగా ఉన్నావు!!
నీకు నామీద బాగా ప్రేమ ఎక్కువైపోయింది!!
నాకు కూడా తీసుకోవాలని ఉంది సిక్స్ ఫీట్!!
కానీ ఇంత ప్రేమ నేను భరించలేను సిక్స్ ఫీట్!!
ఇంత హాట్ హాట్ గా కాకుండా కొంచెం తగ్గించు!!
అంటు పొట్టిది మెట్ల మీద ఫాస్టుగా కిందకు దిగుతుంది!!
అయినా ఒక్కో డైలాగ్ కి, ఒక్కో ఫ్లయింగ్ కిస్ ఇస్తుంది!!

పొట్టిది ఇస్తున్న, ఫ్లైయింగ్ కిస్ లా ఎఫెక్ట్!!
యాంగ్రీ బర్డ్, సూపర్ సెక్సీ అంటూ వేస్తున్న డైలాగులు!!
యాంగ్రీ బర్డ్ ని రెచ్చగొడుతూ కవ్విస్తూ చేస్తున్న పనులు!!
లవర్ బాయ్ కాస్త డెవిల్ బాయ్ లాగా మారిపోయాడు!!

ఒసేయ్ పిచ్చా పొట్టి, యాంగ్రీ బర్డ్, సూపర్ సెక్సీ నా??
నిన్ను నాలుగు పీకితే సరిపోతుంది అనుకున్న!!
ఆహా..! నీ పిచ్చ పొట్టి వాగుడు బుర్రకి పీకడం కాదే...
ఏకంగా చంపేయాలి!! దావే పొట్టి దాన!!
నిన్ను, నా హాట్ హాట్ లవ్ తో చంపేసుకుంటా, దా...

పొట్టిది అసలు అందకుండా అలా పరిగెడుతూ...
సెకండ్ ఫ్లోర్ స్టెప్స్ కి టర్న్ అయింది!!
పొట్టి దాని వెనకాలే డెవిల్ బాయ్ కూడా టర్న్ అయ్యాడు!!

నన్ను చంపేస్తే ఎలా సిక్స్ ఫీట్??
నువ్వు ఎవరిని ప్రేమిస్తావు సిక్స్ ఫీట్??
నువ్వు ప్రేమించడానికి నేను ఉండాలి కదా, సిక్స్ ఫీట్!!
నీకోసం నువ్వు నన్ను ప్రేమించాలి కదా, సిక్స్ ఫీట్!!
నా ప్రేమ నీకు తెలిసింది కదా సిక్స్ ఫీట్!!
నువ్వు నాకోసం వస్తావు 6 ఫీట్!!
వచ్చేదాకా వెయిట్ చేస్తాను సిక్స్ ఫీట్!!
I LOVE YOU SIX FEET 
బాయ్ బాయ్ సిక్స్ ఫీట్....

అంటూ.. ఫస్ట్ ఫ్లోర్ స్టెప్స్ వైపుకి టర్న్ అవుతుంది!!
అప్పుడే ఇద్దరు అమ్మాయిలు మాట్లాడుకుంటూ..
సెకండ్ ఫ్లోర్ స్టెప్స్ వైపుకి టర్న్ అయ్యారు!!

పొట్టిది స్పీడ్ గా, ఒక అమ్మాయి వెనక్కి వెళ్లింది!!
ఆ అమ్మాయి కన్ఫ్యూజ్ గా, కంగారుగా చూస్తుంది!!
పొట్టిదేమో, ఆమె వెనకాల నిలబడి పట్టేసుకుంది!!

ఏయ్, ఎవరు నువ్వు? ఎందుకు పట్టుకున్నావు?? 
వదులు, వదులు నన్ను.. అని ఆ అమ్మాయి అరుస్తుంది!!
పక్కనున్న అమ్మాయి, టెన్షన్ టెన్షన్ గా చూస్తుంది!!
వేగంగా వచ్చిన సిక్స్ ఫీట్, కోపంగా ఆగిపోయాడు!!
రొప్పుతూ, నవ్వుతూ పొట్టిదేమో సిక్స్ ఫీట్ ని చూస్తుంది!!
ఒక్క క్షణం పొట్టిది, గట్టిగా ఊపిరి తీసుకొని వదిలింది!!
అంతే, మరుక్షణం పొట్టి దాని చేతిలోని అమ్మాయి... 
సిక్స్ ఫీట్ మీదకు వెళ్లి పడింది!!
ఆ అమ్మాయిని, తోసేసి... పొట్టిది పరిగెత్తింది!!

I LOVE YOU SIX FEET
నువ్వు నాకోసం వస్తావు, సిక్స్ ఫీట్!!
ఐ నో దట్, సిక్స్ ఫీట్!!
ఐ లవ్ యు..... 
ఐ లవ్ యు..... 
ఐ లవ్ యు.....
సి....క్స్..... ఫీ.....ట్....!!
అని అరుచుకుంటూ, ఎక్కడ ఆగకుండా.....
పొట్టిది పారిపోయింది!!

ఇక్కడ సిక్స్ ఫీట్ మీద పడిపోయిన అమ్మాయి, ఆమె ఫ్రెండ్స్ హెల్ప్ తో పైకి లేచింది.

పైకి లేచిన 6 ఫీట్, వాళ్ళిద్దర్నీ దాటి గబగబా 2 అడుగుల ముందుకు వచ్చి స్టెప్స్ మీద చూస్తున్నాడు. ఎక్కడన్నా పొట్టిది కనిపిస్తుందేమోనని! కానీ, ఎక్కడ అప్పటికే పారిపోయింది.

అక్కడ నిలబడిన ఆ ఇద్దరు అమ్మాయిలు, సిక్స్ ఫీట్ ని కొంచెం సీరియస్ గా, చూస్తున్నారు.

6 ఫీట్ కి వాళ్లు అలా ఎందుకు చూస్తున్నారో, అర్థం కాలేదు!
పొట్టిది దొరకలేదన్న, ప్రెస్టేషన్లో ఉన్నాడు పాపం.

హలో మిస్టర్! వాట్ ఇస్ దిస్? ఇది షాపింగ్ మాల్ అనుకుంటున్నారా? లేకపోతే, ఏదన్నా  ప్లే గ్రౌండ్ అనుకుంటున్నారా?? మీ ఇష్టానికి ఆడేసుకుంటున్నారు! పైగా చేతిలో ఆ రాడ్ తో, మాకేమైనా అయితే? హూ ఇస్ దా రెస్పాన్సిబిలిటీ??

సిక్స్ ఫీట్ మీద పడిపోయిన అమ్మాయి, వాడి మీద ఫైర్ అవుతుంది. మరి తోసేసిన పొట్టిది పారిపోయింది కదా! ఎదురుగా ఉన్న సిక్స్ ఫీట్ మీద పడిపోతుంది!!

మీరిద్దరూ ఎంత లవర్స్ అయితే మాత్రం, ఈ విధంగా పబ్లిక్ ప్లేస్ లో ఆడుకుంటారా?? అదేదో మీ ఇంట్లోనూ మీ బెడ్ రూమ్ లోనూ ఆడుకోవాలి!! కొంచెము కూడా కామన్ సెన్స్ లేదు వీళ్ళకి!! ఇడియట్స్.... ఏయ్, పద వెళదాం!!

పడిన అమ్మాయికి తోడుగా వచ్చిన ఫ్రెండ్!!
తన ఫ్రెండ్ కి సపోర్ట్ గా, ఇంకో నాలుగు డైలాగులు వేసుకుంది.ఆ ఇద్దరు సీరియస్ గా 6 ఫీట్ వైపు చూసుకుంటూ వెళ్ళిపోయారు!!

రెండు చేతులు తలలోకి పోనించి, గట్టిగా జుట్టు పట్టేసుకున్నాడు. అక్కడే, మెట్ల మీద సెటిల్ అయ్యాడు!!
బుర్ర అంతా గిర్రున తిరుగుతుంది.

"మాస్టర్ కొట్టినందుకు కాదు, స్టూడెంట్ చూసినందుకు"
అన్నట్టు ఉంది. మన సిక్స్ ఫీట్ పరిస్థితి. పొట్టిది చేసిన లవ్ ప్రపోజల్ కి బ్రెయిన్ బరస్ట్ అయిపోయింది. ఇప్పుడు వీళ్లు అన్న మాటలకి, ఇంకా వరస్ట్ గా తయారయింది!!

ఫస్ట్ టైం మాట పడ్డాడు!!
అది ఆడపిల్లలతో అనిపించుకున్నాడు!!
ముక్కు మొహం తెలియని వాళ్ళతో తిట్టించుకున్నాడు!!
ఒకరేమో లవ్ అంటూ ముద్దు పెట్టి పోతే....
మరో ఇద్దరేమో లవ్ గేమ్ అంటూ తిట్టిపోయారు!!

ఇటువంటి సిట్యుయేషన్ లో ఎవరైనా ఏం చేస్తారు!! కూర్చొని జుట్టు పీక్కోవడం తప్ప, 
పాపం మన హీరో పరిస్థితి కూడా అదే!!
బరస్ట్ అయినా బ్రెయిన్ మీద ఉన్న జుట్టుని...
వరస్ట్ సిట్యువేషన్ లో పీకేసుకుంటున్నాడు!!

@@@@@@@@@

తదుపరి భాగం... మీకోసం, వెయిట్ చేస్తూ ఉంది.

నచ్చిన వారితోపాటు, చదువుతున్న ప్రతి ఒక్కరు మీ రేటింగ్స్, సమీక్షలను అందజేస్తే... మాకు మరింత ప్రోత్సాహకంగా ఉంటుంది.

మళ్లీ కలుద్దాం.
థాంక్యూ సో మచ్.
వర్ణ.