Featured Books
  • వైశాలి - 1

    వైశాలి అందమైన యువతి.  ఆమె ఎంత అందంగా ఉంటుందంటే ముందు ముందు న...

  • ఔను నిజం నువ్వంటే నాకిష్టం

    తెనాలి రైల్వే స్టేషన్‍       అర్ధరాత్రికి ఇంకా అయిదు నిమిషాల...

  • ఆగంతకుడు

    క్యాప్ ని ముఖంపైకి లాక్కుని చీకటిగా ఉన్న భవంతివైపు నడచాడతను....

  • అచ్చిరాని అతితెలివి

    తనను ఎవరైనా చూస్తున్నారేమోనని పరిసరాలను జాగ్రత్తగా కనిపెడుతూ...

  • ఇంటిదొంగలు

    ఎగ్జిక్యూటివ్ ఏడుకొండలు, గన్ మేన్ గఫూర్, వ్యాన్ డ్రైవర్ జోసె...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

తనువున ప్రాణమై.... - 4

ఆగమనం.....

ఆమె అసలు, కనురెప్ప వేయడం లేదు. ఆమె చూపు ఎటు తిప్పడం లేదు. అయస్కాంతం లా ఆమె హార్ట్ బీట్, ఆమె చూపులు... ఆ ప్రతిబింబానికి, అతుక్కుపోయాయి.

W...O...W..,.. ఆమె గుండె, ఆమెకు చెబుతుంది.

ఆమె తన గుండె మీద, చేయి పెట్టుకుంది.

ఎస్ యు ఆర్ రైట్.

హి ఇస్ వావ్.....వ్

ఏమి, ఉన్నావురా..???

ఎక్కడి నుంచి ఊడిపడ్డవురా...??

ఇన్ని రోజులు ఏమైపోయావు రా?? నా కంటికి కనబడకుండా, ఎక్కడ దాక్కున్నావురా??

నీకు పెళ్లి అయ్యిందా? నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా?

ఏయ్, అసలు నీకు బుద్ధుందా? ఇటువంటి ప్రశ్న ఇప్పుడు అవసరమా? అందుకే, నువ్వు నాకు నచ్చవు.
ఐ హేట్ యు!!

ఆమెకు ఆమె ప్రశ్న వేసుకుని, ఆ ప్రశ్న పుట్టిన బ్రెయిన్ మీద కోపంతో, తన తల మీద ఒక మొట్టికాయ వేసి, దానిని కసురుకుంటుంది.

అద్దం వైపు చూస్తూ, అద్దంలో కనిపిస్తున్న ప్రతిబింబాన్ని వేళ్ళతో, చుట్టూ తిప్పి ముద్దు పెట్టుకుంటుంది.

యు ఆర్ మైన్..!!

నీకు గర్ల్ ఫ్రెండ్ ఉన్న, పెళ్లయిన, పిల్లలు ఉన్నా కూడా... ఏది ఏమైనా సరే..... యు ఆర్ మైన్.!!

నేను ఫిక్స్ అయిపోయాను. నువ్వు కూడా ఫిక్స్ అయిపో. నా గుండెకి నువ్వు కావాలంట. దానికి నిన్ను ఇచ్చేసాను. యు ఆర్ మైన్ బేబీ. మై లవ్లీ.... హాట్, సిక్స్ ఫీట్.
యువ్ ఆర్ మైన్..... మై సిక్స్ ఫీట్!!

అద్దంలో, అతని మీద నుంచి చూపు... తన మీదకి షిఫ్ట్ అయింది.

వావ్ నువ్వు సూపర్ ఎహే!! ఎంత బాగా చెప్పావు, ఎంత బాగా చెప్పావు! యువర్ సో బ్రిలియంట్! అందుకే నువ్వు నాకు భలే నచ్చేస్తున్నావు.

ఏదైనా గొప్ప పని చేస్తే, తల మీద చెయ్యి వేసి... మెచ్చుకుంటాము కదా! అలాగే తన తలని తానే మెచ్చుకుంటూ, తన బ్రెయిన్ తెలివితేటలకి, వేళ్ళతో దానిని ముద్దు పెట్టుకుంటుంది.

అలా ముద్దు పెట్టుకుంటు, అద్దంలో తనని తాను ఒక్క సెకండ్ సూటిగా చూస్తూ... నువ్వు సూపరే!! అయినా సరే ఐ హేట్ యు! వినబడుతుందా..?? ఐ... హేట్... యు. నేను ఏది మర్చిపోలేదు! అంటూ... తన తల మీద చిన్నగా ఒక్కటి వేస్తుంది.

అద్దం ముందు నుంచొని... తనని తానే తిట్టుకుంటూ, తనని తానే మెచ్చుకుంటూ, తనలో తానే మాట్లాడుకుంటూ, తనలో తానే నవ్వుకుంటూ, అద్దంలో కనిపిస్తున్న ఆ సిక్స్ ఫీట్ కి, సైట్ కొడుతూ... సహస్ర అభినయం చేస్తున్న ఆమెను, సేల్స్ గర్ల్ చిత్రాతి విచిత్రంగా చూస్తుంది.

చూసి చూసి ఇక ఉండబట్టలేక అడిగేస్తుంది.

మేడం, ఆర్ యు ఆల్ రైట్..??

వినె, లోకంలో ఎక్కడుంది. తన లోకంలో తను అద్దంలోని ఆ సిక్స్ ఫీట్ కి సైట్ కొట్టుకుంటుంది.

మేడం మిమ్మల్నే; మీరు బానే ఉన్నారు కదా? అంటూ.. సేల్స్ గర్ల్ ఈసారి భుజం మీద చేయి వేసి పిలుస్తుంది.

ఆమె తన సంతోషాన్నంతా కళ్ళల్లోనే నింపేసి అందంగా కళ్ళతోనే సైగ చేసి, అద్దం వైపు చూపిస్తుంది. అద్దంలో తను సైట్ కొడుతున్న, ఆ సిక్స్ ఫీట్ అందగాడిని సేల్స్ గర్ల్ కి చూపిస్తుంది.

హో...ఆ సార్ ని, చూస్తున్నారా? నన్ను కంగారు పెట్టేసారు కదా మేడం!! ఎందుకో, ఏమిటో అర్థం కాక కొంచెం కంగారుపడ్డాను.

ఐ యాం సో సారీ రా..!! వాడిని చూడగానే, ఐ లాస్ట్ మై సెల్ఫ్. ఇంకేమీ కనిపించడం లేదు. టేక్ దిస్. అంటూ.. తన చేతిలోని లెహంగాని, సేల్స్ గర్ల్ కి ఇచ్చేస్తుంది.

బాగున్నాడు కదా! సూపర్ ఉన్నాడు కదా! చెప్పు, చెప్పు అంటూ.. సేల్స్ గర్ల్స్ చేతిని పట్టి ఊపేస్తుంది.

ఉ...చాలా బాగున్నారు మేడం..!! అని చెబుతూ... సేల్స్ గర్ల్ కూడా అద్దంలో కనిపిస్తున్న, ఆ సిక్స్ స్వీట్ ని చూస్తుంది.

బాగున్నాడు, హి ఇస్ మై సిక్స్ ఫీట్!! మై హాట్ హాట్ సిక్స్ ఫీట్! వాడు నా వాడు..!! తనలో తాను మురిసిపోతూ, అనుమానంగా సేల్స్ గర్ల్ వైపు చూస్తుంది.

నువ్వు గాని నా వాడికి సైట్ కొడుతున్నావా..?? డౌట్ గా అడుగుతుంది.

ఆహా... లేదు మేడం. అటువంటిది, ఏమీ లేదు!! మేడం మీరు ఇంత కష్టపడి, ఇలా అద్దంలో చూసుకోకపోతే, ఆయన మీ వెనకే ఉన్నారు. ఫ్లోర్ ఇన్చార్జి తో మాట్లాడుతున్నారు. అటు తిరిగి చూడొచ్చు కదా..?? ఇంకా బాగా కనబడతారు, మేడం.!!

యువర్ సో స్వీట్!! ఐ లైక్ యు.!! నాకోసం నువ్వు ఆలోచిస్తున్నావు. ఐ లైక్ యు సో మచ్..!! అని చాలా క్యూట్ గా ముఖం పెట్టి, సేల్స్ గాల్ ని మెస్మరైస్ చేసేస్తుంది.

సేల్స్ గర్ల్, చిన్నగా నవ్వేస్తుంది.

డు యు నో వన్ థింగ్?? నువ్వు ఇటు రా, చూపిస్తా!! అంటూ సేల్స్ గర్ల్ చేయి పట్టుకొని దగ్గరగా లాగి పక్కనే నుంచో పెట్టుకుంటుంది.

లుక్ ఎట్ దేర్..!! అంటూ మిర్రర్ లోకి చూపిస్తుంది.

నేను అటు తిరిగి చూస్తే, నా సిక్స్ ఫీట్ ని మాత్రమే చూస్తాను!! అదే ఇటు తిరిగి చూస్తే, నా సిక్స్ ఫీట్ తో పాటుగా నన్ను కూడా చూస్తున్నాను!! చూడు, చూడు మేము ఇద్దరం, పక్కపక్కనే భలే ఉన్నాము కదా?? అనుకుంటూ.. తనకు తానే చాలా ఇంటెన్సిడ్ గా, ఫీల్ అవుతుంది.

ఆమె అంత సంతోష పడిపోతుంటే; సేల్స్ గర్ల్ కొంచెం విచిత్రంగా ఫీల్ అవుతుంది. ఒక మనిషిని చూడగానే, అంతలా నా వాడు!! నాకే సొంతం!! అన్న బలమైన ఫీలింగ్ ఆమె చూపిస్తుంటే!! అది సేల్స్ గర్ల్ కి ఎలాగో అనిపిస్తుంది.

మీరిద్దరూ ఇలా చూస్తుంటే, చాలా బాగున్నారు మేడం!! ఏమి అనుకోకపోతే, ఒకటి అడగొచ్చా?? సార్ మీకు ముందుగానే తెలుసా?? అంటూ సేల్స్ గర్ల్ తనలోని అనుమానాన్ని బయటపెడుతుంది.

హా తెలుసు!! ముందుగానే తెలుసు!! నీ కన్నా, ముందుగానే తెలుసు?!! నీకు ఈ అద్దంలో, చూపించక ముందే, నేను చూశానుగా; అప్పటినుంచి తెలుసు!! వాడిని చూడగానే, నా గుండెకి ఊపిరిగా మారిపోయాడు.
అర్జెంటుగా వాడిని, నా గుండెకి ఇచ్చేయాలి..!!

అందుకని అర్జెంటుగా వాడి దగ్గరికి వెళ్లి, నా ప్రేమ విషయం చెప్పేయాలి!! ఇప్పుడే, ఇప్పుడే చెప్పేయాలి!!

ఐ లవ్ హిమ్!!
I love you..!!
I love you six feet..!!
వస్తున్న, వస్తున్నాను ఉండు.....

సేల్స్ గర్ల్ పరిస్థితి భయంకరంగా ఉంది. ఫ్రీజ్ అయిపోయింది. ఏమీ అర్థం కాక అలాగే చూస్తుంది.

సేల్స్ గర్ల్ దగ్గరికి వచ్చి, ఆమె రెండు బుక్కులు లాగి, గట్టిగా ముద్దు పెట్టుకుంది.

ఐ యాం సారీ!! ఐ యాం సో.. సో.. సో.. సారీ!!
ఈ లెహంగా ఇప్పుడు తీసుకోలేను, మళ్ళీ వచ్చి తీసుకుంటాను. ఇవి నాకు సూట్ కాలేదని, నువ్వు బాగా ఫీల్ అయ్యావు కదా!! అందుకు థాంక్యూ.

ఇప్పుడు నేను అర్జెంటుగా వాడి దగ్గరికి వెళ్ళాలి.
నా లవ్ మేటర్ వాడికి చెప్పేయాలి.
నేను మళ్ళీ వచ్చి, ఈ లెహంగా తీసుకుంటాను.
ఇవి లేకపోయినా, ఇటువంటి డిజైన్స్ తీసుకుంటాను!!

అప్పుడు అవి నాకు, బాగా సూట్ అవుతాయి!!
నీ దగ్గరే తీసుకుంటాను, సరేనా..!!
ఇప్పుడు మాత్రం నేను వెళ్ళాలి!!
బాయ్... బాయ్..!! అంటూ... ఆ సేల్స్ రెండు బుగ్గలు మళ్ళీ ఒకసారి లాగేసి, అక్కడి నుంచి కదులుతుంది.

మై సిక్స్ ఫీట్...!!
వస్తున్న, నీకోసమే వస్తున్నా..!!
ఐ లవ్ యు రా..!!
ఐ లవ్ యు మై 6 ఫీట్..!!

@@@@@@@@@

నాతోపాటు పయనిస్తూ, మీ ఆదరణ అందిస్తారని ఆశిస్తున్నాను.

తదుపరి భాగంలో... కథానాయకుడు, కథానాయకిల ముఖ పరిచయాలు.

నచ్చిన వారితోపాటు, చదువుతున్న ప్రతి ఒక్కరు మీ రేటింగ్స్, సమీక్షలను అందజేస్తే... మాకు మరింత ప్రోత్సాహకంగా ఉంటుంది.
మళ్లీ కలుద్దాం.

థాంక్యూ సో మచ్.
వర్ణ.