He is alive... - 3 books and stories free download online pdf in Telugu

తనువున ప్రాణమై.... - 3

ఆగమనం.....

అద్భుతంగా అజంతా శిల్పాన్ని పోలిన అందంతో, ప్రపంచమంతా వెతికిన దొరకనంత సౌందర్యరాశి అని అయితే చెప్పలేము కానీ, మన పక్కింటి అమ్మాయిల అనిపిస్తూ, అబ్బాయిలు పడి పడి చూసేంత అందమైన ఆడపిల్ల అని మాత్రం చెప్పొచ్చు.

తన సెలెక్ట్ చేసుకున్న లెహంగాలను, అద్దం ముందు నిలబడి తనకి ఎలా ఉన్నాయా? అని.... తనకేసి పట్టుకొని అటు, ఇటు కదులుతూ చెక్ చేసుకుంటుంది.

మీకు ఈ కలర్, చాలా బాగా నప్పింది మేడం.

తనకి కితాబు నిచ్చిన సేల్స్ గర్ల్ ని చూసి అందంగా నవ్వుతుంది.

ఇది నాకు, బాగా సెట్ అయిందా..??

ఎస్ మ్యామ్, చాలా బాగుంది..!!

ఉమ్మ.... పెదవులు రౌండ్ గా ముడిచి, అద్దంలో తనకు తానే ఒక ఫ్లైయింగ్ కిస్ ఇచ్చుకుంటుంది.

ఆ అమ్మాయి ఆనందం చూసి, సేల్స్ గర్ల్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ లెహంగా ఆమె తీసేసుకుంటుంది; అన్న కాన్ఫిడెంట్ తో.

అవును మిస్, ఇది బాగుంది. మరి అది..?? అంటూ, అంతకు ముందు చెక్ చేసుకుని, పక్కన పెట్టేసిన మరో లెహంగా వైపుకి చూపిస్తుంది.

ఆ అమ్మాయి ప్రశ్నకి... బ్రైట్ గా వెలిగిపోతున్న సేల్స్ గర్ల్ ముఖం, లైట్ గా డిమ్ అయింది.

"చెరగని చిరునవ్వు, సేల్స్ గర్ల్స్ సొంతం" కదా అదే నవ్వు మైంటైన్ చేస్తూ "ఆ డ్రస్ కూడా, మీకు బాగుంటుంది మేడం." అంటూ.. తన ఇబ్బందిని కనబడనివ్వకుండా చెబుతుంది.

ఆ అమ్మాయి మొఖం, ముందు కన్నా ఇప్పుడు ఇంకాస్త, బ్రైట్ గా వెలిగిపోతుంది.

మరి ఈ డ్రెస్..!! అంటూ.. తన సెలెక్ట్ చేసి తెచ్చిన వాటిలో నుంచి, ఇంకా చెక్ వేయకుండా, ఉంచిన లేహంగా వైపు చూపిస్తుంది.

ఈసారి సేల్స్ గర్ల్ ముఖం, మాత్రం నిజంగా బెడ్ లైట్ మాదిరి తయారవుతుంది.

మేడం అది మీరు ఇంకా టెస్ట్ చెయ్యలేదు కదా!! చేశాక ఎలా ఉందో, చూసి చెబుతాను.

ఈసారి సేల్స్ గర్ల్ ముఖంలో కనిపిస్తున్న ఫీలింగ్స్ కి, ఆ అమ్మాయి మాత్రం కిలకిల నవ్వేస్తుంది.

ఆమె నవ్వు చూసి, సేల్స్ గర్ల్... బెడ్ లైట్ ఫేస్ లోని ఫీజులు కూడా పూర్తిగా మాడిపోతాయి.

మిస్, టేక్ ఇట్ ఈజీ! లాఫింగ్ ఈజ్ మై హాబీ!

ఇప్పుడు, సుత్తి లేకుండా సూటిగా చెప్పు! ఈ మూడిట్లో ఏ డ్రెస్ నాకు బాగుంటుంది.

సేల్స్ గర్ల్.... కొంచెం అనీజీగా ఫీల్ అవుతుంది.

ఇట్స్ ఓకే, బి ఫ్రెండ్లీ! బయటికి చెప్పు...! అంటూ, ఫ్రెండ్లీగా మూవ్ అవుతుంది.

నవ్వుతున్న ఆమె మొఖం, ఆమె ఫ్రెండ్లీ బిహేవియర్... రెండింటికి సేల్స్ గర్ల్ నార్మల్ అయ్యి, చిన్నగా నవ్వేస్తుంది.

దానితో కొన్ని నిమిషాలు వాళ్ళిద్దరి మధ్య లెహంగాలా గురించి, చర్చలు సాగిపోతూ ఉన్నాయి.

మేడం ఇఫ్ యు డోంట్ మైండ్! మీకు ఒక విషయం చెప్పొచ్చా.!!

హెయ్... చెప్పు, అడిగి మరి చెప్పాలా? కమాన్ యార్..!!

మేడం, మీ ఫెయిర్నెస్ కి, ఏ కలర్ డ్రెస్ అయినా చాలా బాగుంటుంది.

హా... హా... ఎస్, ఐ నో...! థాంక్యూ డియర్..!!
నెక్స్ట్ ఏంటి అబ్బా! చెప్పు…. చెప్పు.... చెప్పు.... అంటూ సేల్స్ గర్ల్ బుగ్గ పట్టుకుని లాగేసి, నెక్స్ట్ డ్రెస్ ట్రైల్ వేస్తుంది.

మీకు కొంచెం, హడావిడి ఎక్కువే మేడం.

హీ...హీ...హీ.... ఇదా నువ్వు చెప్పాలనుకున్నది! ఇదైతే నాకు ఎప్పుడో తెలుసు! థాంక్యూ, నువ్వు ఇప్పుడు తెలుసుకోని చెప్పినందుకు.

సేల్స్ గర్ల్ నవ్వుకుంటూ, తన చేతిలో నీ డ్రెస్ పక్కన పెట్టేసి ఆమెకు, మళ్ళీ వచ్చి హెల్ప్ చేస్తుంది.

నేను చెప్పాలనుకున్నది, అది కాదు మేడం.

అది కాదా, అయితే ఏంటో చెప్పు...???

మీరు కొంచెం ఫాస్ట్ మేడం. నేను చెప్పాలనుకునే లోపే, మీరే ఏదో అనుకుంటున్నారు.

హో... డియర్! నేను ఫాస్ట్ కాదు, నువ్వే స్లో! నువ్వు ఇంకా నన్ను మేడమ్, లానే ట్రీట్ చేస్తున్నావు. కమాన్ యార్... ఫ్రెండ్ లా, ఉండమని చెప్పానా! నవ్ సి థిస్... ఎలా ఉంది. హెయ్... నిజం చెప్పు.

నెక్స్ట్ డ్రెస్, దగ్గరగా పెట్టుకుని చూసుకుంటూ... అందంగా నవ్వుతూ, కళ్ళు ఎగరెస్తూ అడుగుతుంది.

ఈ కలర్ కూడా మీకు బాగుంది. ఐ యాం సారీ, టు సే థిస్. ఇది మీకు, సూట్ అవ్వలేదు... మేడం.

సూట్ అవ్వలేదా...?? థాంక్యూ డార్లింగ్. అంటూ... ఇష్టంగా నవ్వుతూ, సేల్స్ గర్ల్ బుగ్గ లాగేస్తుంది.

మేడం, మీరు భలేవారు మేడం!! బాగోలేదన్న, హ్యాపీగా బుగ్గ లాగేస్తున్నారు. కానీ, మీరు ఎందుకు మేడం? ఇటువంటి డిజైన్స్, చూస్ చేసుకుంటున్నారు. కలర్ బాగుంటుంది కానీ, ఈ డిజైన్స్ మీకు అంతగా, సెట్ కావడం లేదు మేడం.

ఆ అమ్మాయి, అన్ని లేహంగాలు కూడా, పెద్ద పెద్ద డిజైన్స్ ఉన్నవి సెలెక్ట్ చేసుకుంది. కలర్స్ అయితే సూపర్ గా సెట్ అవుతున్నాయి. కానీ, తను హైట్ తక్కువ ఉండడం వల్ల డిజైన్స్ ఎబ్బెట్టు (ఆడ్) గా కనబడుతున్నాయి.

యా... ఐ నో! నీకు, ఒక విషయం చెప్పనా! నాకు ఇలా పెద్ద పెద్ద డిజైన్స్ అన్న; పెద్దగా ఉండేవి అన్న; భలే ఇష్టం! షార్ట్ గా ఉండే వాళ్ళన్న, షార్ట్ పీరియడ్ అన్న, నాకు అస్సలు నచ్చదు. నాకు అన్ని, ఇలాగే ఆపోజిట్ లో నచ్చుతాయి.

సేల్స్ గర్ల్, కొంచెం క్రేజీగా చూస్తుంది. ఆ అమ్మాయిని...

మిర్రర్ నుంచి రెండు అడుగులు వెనక్కి వెళ్లి, ఆ లెహంగాలో, తను ఎలా ఉంటానా; అని ఊహించుకుంటూ అద్దంలో చూస్తూ ఉంది.

తనని తాను, అద్దంలో చూసుకుంటున్న ఆమె కళ్ళు, సడన్ గా... ఆమెను కాకుండా, అద్దంలో కనిపిస్తున్న మరొక ప్రతిబింబం మీద ఆగిపోయాయి.

ఆమె చూపు ఆ ప్రతిబింబాన్ని, కట్టి పడేస్తున్నాయి. అలా నోరు వెళ్ళబెట్టి మరి మైమరిచిపోయి చూస్తుంది. అది నీదే! అని చెబుతున్నట్టు... క్షణాలలో ఆమె గుండె, వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది.

ఆమె అసలు, కనురెప్ప వేయడం లేదు. ఆమె చూపు ఎటు తిప్పడం లేదు. అయస్కాంతం లా ఆమె హార్ట్ బీట్, ఆమె చూపులు... ఆ ప్రతిబింబానికి, అతుక్కుపోయాయి.

W...O...W..,.. ఆమె గుండె, ఆమెకు చెబుతుంది.

ఆమె తన గుండె మీద, చేయి పెట్టుకుంది.

ఎస్ యు ఆర్ రైట్.

హి ఇస్ వావ్.....వ్

ఏమి, ఉన్నావురా..???

@@@@@@@@@

నాతోపాటు పయనిస్తూ, మీ ఆదరణ అందిస్తారని ఆశిస్తున్నాను.

నచ్చిన వారితోపాటు, చదువుతున్న ప్రతి ఒక్కరు మీ రేటింగ్స్, సమీక్షలను అందజేస్తే... మాకు మరింత ప్రోత్సాహకంగా బాగుంటుంది.
మళ్లీ కలుద్దాం.

థాంక్యూ సో మచ్.
వర్ణ.


షేర్ చేయబడినవి

NEW REALESED