Featured Books
  • వైశాలి - 1

    వైశాలి అందమైన యువతి.  ఆమె ఎంత అందంగా ఉంటుందంటే ముందు ముందు న...

  • ఔను నిజం నువ్వంటే నాకిష్టం

    తెనాలి రైల్వే స్టేషన్‍       అర్ధరాత్రికి ఇంకా అయిదు నిమిషాల...

  • ఆగంతకుడు

    క్యాప్ ని ముఖంపైకి లాక్కుని చీకటిగా ఉన్న భవంతివైపు నడచాడతను....

  • అచ్చిరాని అతితెలివి

    తనను ఎవరైనా చూస్తున్నారేమోనని పరిసరాలను జాగ్రత్తగా కనిపెడుతూ...

  • ఇంటిదొంగలు

    ఎగ్జిక్యూటివ్ ఏడుకొండలు, గన్ మేన్ గఫూర్, వ్యాన్ డ్రైవర్ జోసె...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

తనువున ప్రాణమై.... - 8

ఆగమనం.....

ఓకే ఓకే సిక్స్ ఫీట్...!!
డోంట్ షౌట్, అస్సలు టచ్ చేయను..!!
ఇక్కడ అందరూ ఉన్నారు సిక్స్ ఫీట్..!!
అటు వెళదాం రా, అంటూ చేయి పట్టుకుని...
ట్రైల్ రూమ్ వైపుకి లాక్కుపోతుంది.

మన హీరో, పొట్టి దాని చేతిని విసిరి కొట్టేస్తాడు..!!
పొట్టి దాన్ని ఫాలో అయ్యి వెళతాడు..!!

ట్రైల్ రూమ్, ఆ షోరూమ్ లో ఒక కార్నర్ లో ఉంది.
మార్నింగ్ టైం కావడం, కస్టమర్స్ ఎక్కువగా లేకపోవడం వలన, ట్రైన్ రూమ్ సైడ్ ఎవ్వరూ లేరు.

ముందు వెళుతున్న పొట్టి దాన్ని.. ఫాలో అవుతూ, మన హీరో రెండు అడుగుల దూరంలో నడుస్తున్నాడు.

వెనకనుంచి ఆ పొట్టి వాగుడు కాయని, చాలా సీరియస్ గా చూస్తూ... డ్రెస్సింగ్ సెన్స్ ని బట్టి, ఒక ఐడియా కు వస్తున్నాడు.

పొట్టిగా, దాని తగినట్టు సరిపడా స్ట్రక్చర్ తో, ముద్దుగా చాలా క్యూట్ గా ఉంది. కానీ భరించలేనంత వాగుడు ఉంది. రెగ్యులర్ డార్క్ యాష్ కలర్ జీన్స్, దానికి తగినట్టు షార్ట్ లెన్త్ సీ గ్రీన్ టీ షర్ట్ లో ఉంది.

వేసుకున్న డ్రెస్ కి, మ్యాచింగ్ యాక్సెసరీస్ లిస్ట్ అన్ని చెప్పుకుంటూ పోతే, చేంతాడంత లేదు కానీ... సింపుల్ గా నీట్ గా ఉంది.

అమ్మాయిగారు ముందు నడుస్తుంటే, బ్యాక్ వెరీ హాట్ గా హిప్ హిప్ హుర్రే!! అనే అంత బాగుంది. హెయిర్ మొత్తం టై చేసేసి, బ్యాడ్ పెట్టేసింది. ఎగురుకుంటూ నడుస్తున్న పొట్టిదాని ఊపుకి... ఆ పోనిటైల్ అటు, ఇటు... ఎటుపడితే అటు ఎగురుతుంది.

ఆ పిలకని చూడగానే మన హీరోకి, లైట్ స్మైల్ వచ్చింది.
మేడం గారు తన హైట్ కవర్ చేసుకోవడానికి హీల్స్ వేయకుండా, ఫ్లాట్ బెల్ట్ శాండిల్స్ వేసుకుంది. బెల్ట్ శాండిల్స్ కాకపోతే పొట్టి దాని హడావిడి కి, ఎగురుడికి అవి ఎప్పుడో జారిపోయేవి.

పర్లేదు ఈ షాట్ చాటర్ బాక్స్ నీట్ గానే ఉంది. దాని హైట్ కవర్ చేయకుండా ఫ్లాట్స్ వేసుకొని, తన హైట్ కి రెస్పెక్ట్ ఇస్తుంది. పోయి, పోయి నాకు తగులుతుంది. దీనిని అర్జెంటుగా వదిలించుకుని వెళ్ళిపోవాలి..... మన ఆరడుగుల హీరో, 5.1"పొట్టి దానిమీద ఒక క్లారిటీ కి వచ్చేసి, ఇన్నర్ వేసుకుంటున్నాడు.

ట్రయల్ రూమ్ ఎంట్రన్స్ పక్కనే, మన హీరోకి ముందు నుంచుంది పొట్టిది. హ్యాండ్ బ్యాగ్ తీసి పక్కన పడేసింది. హెయిర్ టై చేసి పెట్టిన బ్యాండ్ తీసి చేతికి పెట్టుకుంది. హెయిర్ అంతా సరి చేసుకుంటూ 6 ఫీట్ ని అలాగే చూస్తుంది.

ఒత్తుగా ఉన్న జుట్టు ముఖం చుట్టూత పరుచుకున్న, పొట్టి దానిలాగే దాని చుట్టూ కూడా పొట్టిగా భుజాల వరకు మాత్రమే ఉంది.

ఏంటి షో చేయడానికి తీసుకొచ్చావా..!!
చెప్పాలి అనుకున్నది త్వరగా చెప్పు..!!
నీకు ఎగ్జాక్ట్ గా, వన్ మినిట్ మాత్రమే టైం..!!

వేలు చూపిస్తూ మరి, సీరియస్ గా చెప్తున్నాడు మన హీరో.

మన హీరో నుంచి... వన్ ఫీట్ డిస్టెన్స్ లో నిలబడి, మేడ అంతా పైకి ఎత్తి చూస్తుంది... మన పొట్టిది.

ఓకే సిక్స్ ఫీట్!! చెప్పడానికేగ తీసుకొచ్చాను..!!
నా ప్రేమంత నీకు అర్థమయ్యేలా చెప్పేస్తాను..!!
నాకు, నీ మీద ఎంత ప్రేమ ఉందో, మొత్తం చెప్పేస్తాను..!!

ఈ సొల్లు చెప్పడానికేనా తీసుకొచ్చావు..!!
ఆల్రెడీ టెన్ సెకండ్స్ ఓవర్..!!
నీ ఇష్టం, ఎటు గొట్ట చావు..!!
బట్, యువ్ హావ్ ఓన్లీ వన్ మినిట్... దట్స్ ఇట్..!!

ఓకే సిక్స్ ఫీట్, నో ప్రాబ్లెమ్..!!
నాకు మిగిలిన 50 సెకండ్స్ చాలు!!
I LOVE YOU SIX FEET!!
చాలా కాన్ఫిడెంట్గా చెబుతుంది!!

మన హీరో పొట్టి దాన్ని చిరాగ్గా చూస్తూ, ఏదో మాట్లాడడానికి నోరు తెరవబోతున్నాడు......

చిన్నపిల్లలు జంప్ చేసి పైకెక్కినట్టు... ఒక్కసారిగా మన హీరో మీదకి ఎక్కేసింది. రెండు కాళ్లతో అతని నడుముని గట్టిగా చుట్టేసుకుంది. అలాగే పొట్టి దాని రెండు చేతులతో అతని మెడ చుట్టూ గట్టిగా పట్టేసుకుంది.

ఆరడుగుల అందగాడైన మన హీరోని.. అల్లెసుకుంటున్న ఈ క్రమంలోనే, ఏదో చెప్పడానికి నోరు తెరవబోతున్న అతని పెదవులను, తన పెదవులతో మూసేసింది.

ఎప్పుడైనా, ఎక్కడైనా, జనరల్ గా అబ్బాయిలు ముద్దు పెడితె... ఫస్ట్ కిస్ కి అమ్మాయిలు బిగుసుకు పోతారు!
ఇక్కడేమో అంత ఆపోజిట్ లో జరుగుతుంది కదా, అందుకే రియాక్షన్ కూడా ఆపోజిట్ లోనే ఉంది.

ఇక్కడ మన హీరో ఎలా ఉన్నాడంటే... డెకరేషన్ కి డ్రెస్ వేసి నిలబెట్టిన డాల్ లాగా ఉన్నాడు.

పొట్టి దానికి తన హీరో పెదవులు టచ్ అవ్వగానే, బాడీ అంత కరెంట్ షాక్ కొట్టి, ఒక్కసారి షేక్ అయింది.

ఆ షాక్ కి జారి కింద పడిపోకుండా, సిక్స్ ఫీట్ నడుముని తన కాళ్లతో ఇంకా గట్టిగా బిగించేస్తుంది.

ఒక చేత్తో 6 ఫీట్ మెడ మీద రబ్ చేస్తూంది!!
మరొక చేతిని 6 ఫీట్ జుట్టులోనికి పోనిచ్చింది!!
జుట్టుని గట్టిగా పట్టేసుకొని, గాఢంగా కిస్ చేస్తుంది!!

అసలు ఇద్దరి మధ్యలో... ఇంచు కూడా గ్యాప్ లేకుండా, పూర్తిగా వాడిని అతుక్కుపోయింది!!

మన హీరోకి పొట్టి దాని స్పర్శ, వేస్తున్న వేషాలు అంతా తెలుస్తోంది గానీ... మైండ్ మొత్తం బ్లాంక్!!
కళ్ళు మూయడం కూడా మర్చిపోయాంత షాక్!!
జస్ట్ లైక్ ఏ కరెంట్ పోల్..!!
కిస్ చేస్తున్న పొట్టిది జారిపోకుండా, సపోర్ట్ కూడా లేదు..!!

పొట్టిది మాత్రం తనకున్న 50సెకండ్స్ పర్ఫెక్ట్ గా యూస్ చేసుకుంటుంది.

గ్యాప్ ఇస్తే షాక్ లో నుంచి బయటకు వచ్చి... ఎక్కడ తనని విసిరి కొట్టేస్తాడో, అన్న భయం!! అస్సలు అతని పెదాలు వదలడం లేదు.

సిక్స్ ఫీట్ కాస్త సపోర్ట్ చేస్తే ఆ నాలుగు పెదవుల మధ్య ఒక అధర యుద్ధమే జరిగేదేమో!! ప్చ్.. బ్యాడ్ లక్ అస్సల మూమెంట్ లేదు.
పొట్టిది దాని తిప్పలు అది పడుతూ... సిక్స్ ఫీట్ పెదవులతో స్ట్రాంగ్ గా ఫైట్ చేస్తుంది. తన ప్రేమ ఎంత స్ట్రాంగో, ఒక్క ముద్దులో అతనికి అర్థమయ్యేలా చెబుతుంది.

మన హీరో ఇప్పుడు స్టాట్యూ ఫోజ్ లో ఉన్నాడు. మరి ఎంత వరకు పొట్టి దాని ప్రేమ... అర్థమవుతుందో, వెయిట్ చేసి చూడాలి.

సిక్స్ ఫీట్ వైపు నుంచి ఎటువంటి రియాక్షన్ లేదు, జస్ట్ లైక్ దట్..!!

ఒక్క సెకండ్ బ్రేక్ ఇచ్చిన, ప్రపంచం తలకిందులు అయిపోతుంది, ఏమో... అన్నంత స్ట్రాంగ్ గా, మన పొట్టిది సిక్స్ ఫీట్ ని, సూపర్ హాట్ గా కిస్ చేస్తుంది.

ఏదో ఒక విధంగా, ఎటువంటి బ్రేక్ లేకుండా.. ఫస్ట్ కిస్ సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసేసింది.

అలాగే సిక్స్ ఫీట్ చంకలో ఉండి.. అప్పటివరకు కిస్ చేసి వదిలేసిన లిప్స్ మీద ఇంకో పెక్ ఇచ్చింది..!!

సూపర్ ఫీల్ తో... సిక్స్ ఫీట్ మోఖాన్ని చూస్తూ, నెమ్మదిగా నేల మీదకి దిగింది.

అదే రొమాంటిక్ ఫీల్ తో, షాక్ లో ఉన్న... సిక్స్ ఫీట్ ని హగ్ చేసుకుంది.


@@@@@@@@@


తదుపరి భాగం... మీకోసం, వెయిట్ చేస్తూ ఉంది.

నచ్చిన వారితోపాటు, చదువుతున్న ప్రతి ఒక్కరు మీ రేటింగ్స్, సమీక్షలను అందజేస్తే... మాకు మరింత ప్రోత్సాహకంగా ఉంటుంది.

మళ్లీ కలుద్దాం.
థాంక్యూ సో మచ్.
వర్ణ.