Featured Books
  • వైశాలి - 1

    వైశాలి అందమైన యువతి.  ఆమె ఎంత అందంగా ఉంటుందంటే ముందు ముందు న...

  • ఔను నిజం నువ్వంటే నాకిష్టం

    తెనాలి రైల్వే స్టేషన్‍       అర్ధరాత్రికి ఇంకా అయిదు నిమిషాల...

  • ఆగంతకుడు

    క్యాప్ ని ముఖంపైకి లాక్కుని చీకటిగా ఉన్న భవంతివైపు నడచాడతను....

  • అచ్చిరాని అతితెలివి

    తనను ఎవరైనా చూస్తున్నారేమోనని పరిసరాలను జాగ్రత్తగా కనిపెడుతూ...

  • ఇంటిదొంగలు

    ఎగ్జిక్యూటివ్ ఏడుకొండలు, గన్ మేన్ గఫూర్, వ్యాన్ డ్రైవర్ జోసె...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

తనువున ప్రాణమై.... - 1

హాయ్ ఫ్రెండ్స్!

ప్రోమో అంటూ.. మీ టైం అసలు వేస్ట్ చేయకుండా,
ఒక చిన్నమాట!!

లవ్ ఎట్ ఫస్ట్ సైట్.

చాలా చోట్ల వినే ఉంటాం.

అటువంటి ఒక సందర్భంలో కలిసిన, ఇద్దరి మధ్య ప్రయాణం ఎలా ముగుస్తుందో, తెలియజేయడమే ఈ కథ.

దీనిలో... అలా కలిసిన, ఆ ఇద్దరి మధ్య ఎక్కువ కథ నడుస్తుంది.

మిగిలిన పాత్రలు, సందర్భానుసారంగా వచ్చిపోతూ ఉంటాయి.

ఒక అమ్మాయి ఇలా ఉంటే, ఎలా ఉంటుంది? అన్న చిన్న ఆలోచనకి, నా కథలోని కథానాయిక కి రూపాన్ని ఇస్తున్నాను.

ప్రేమ,అల్లరి, హాస్యం, ఫ్రస్టేషన్, సస్పెన్స్... మద్య సాగే వాళ్ల ప్రయాణం! ప్రాణం కన్నా ఎక్కువైనా, ప్రేమతో ముడి పడుతుందా?

తనువున ప్రాణం ఏ చోట ఉన్నది అంటే? అది మన గుండెల్లో ఉన్నది అంటాము. మరి ప్రేమ ఎక్కడ పుడుతుంది? అది కూడా మన గుండెల్లోనే! మరి మన మనసు ఎక్కడ ఉంది? అది కూడా మన గుండెల్లోనేనా...

తనువున ఉన్న మనసులో జనించిన ఆ ప్రేమ, ఆ గుండెల్లోనే కొలువుంటుంది కదా!! తనువుకి ప్రాణమైన గుండెల్లో నిలిచి ఉన్న ప్రేమ, అది కావాలనుకున్న తన ప్రేమకై పరితపిస్తూ తన ప్రేమని చేరాలనుకుంటుంది.

తనువున ప్రాణమై నిలవాలి అనుకున్న ఆ ప్రేమ చివరికి ఏమవుతున్నది? అనేది నాతోపాటు పయనిస్తూ తెలుసుకోండి.....




చిన్న ట్విస్ట్, మీకోసం....

ట్విస్ట్@1
లవ్ ఎట్ ఫస్ట్ సైట్!!
నా ప్రేమ నిజమైనది!!
ఒక్క నిమిషం టైం ఇస్తే...
అది నీకు అర్థమయ్యేలా చెబుతాను!!

ట్విస్ట్@2
ఒసేయ్ పొట్టి దాన!!
నిన్ను ఈరోజు చంపేస్తాను!!
ఆగవే... ఆగు!!
అని వెంట పరిగెడుతున్నాడు...

ట్విస్ట్@3
సేఫ్టీ గురించి డిస్కస్ చేస్తున్నారా!!
సేఫ్టీ చేతిలో పెట్టేంత, గొప్ప ఫ్రెండ్.. వావ్!!
ఈ సేఫ్టీ నా దగ్గర జాగ్రత్తగా ఉంటుంది!!
మనకి దీని అవసరం ఉంది!!

ట్విస్ట్@4
నేను నిన్ను ప్రేమిస్తున్నాను!!
నా ప్రాణం కన్నా, ఎక్కువగా ప్రేమిస్తున్నాను!!
నా ప్రేమ ఎప్పుడూ నీతోనే ఉంటుంది!!
అలాగే నా ప్రాణం కూడా నీకోసమే ఉంటుంది!!

ట్విస్ట్ @5
తనువున ప్రాణమై నీకోసమే ఉన్నాను!!
నీకోసం నేనుండే అంతా, నువ్వు ప్రేమించావు!!
ఈ తనువు, ఈ ప్రేమ, ఈ ప్రాణం, అన్ని నీకోసమే!!
నిన్ను ఇంతలా... ప్రేమించేలా, నువ్వే చేసావు!!
I LOVE YOU 💕💕💕💕💕


డియర్, ఫ్రెండ్స్ అండ్ రీడర్స్
పయనం మొదలుపెడదాం...
నా తోడుగా మీరు కూడా.....
మీ ప్రేమ, ఆదరణలతో....
మీ అమూల్యమైన, అభిప్రాయాలతో...
వెంట, పయనిస్తారని ఆశిస్తూ...



ఇక కధ లోకి వెళ్దాం........


...శ్రీ...

పచ్చటి తోరణాలతో...
పూబంతి మాలలతో...
పరిగెత్తే పిల్లలతో...
బంధుమిత్రుల హడావిడితో...
అల్లరిగా సాగుతున్న, ఆటపాటలతో...
కాలం తెలియకుండా ఉండే కబుర్లు, కాలక్షేపాలతో...



ఆ ఇంట ఏ మూల చూసినా సంతోషం. బంధువులతో నిండుగా కళకళలాడుతుంది. గలగల వినిపిస్తున్న నువ్వులతో! వాటి మధ్య చిన్న చిన్న చిరాకులు, పరాకులతో! కొత్త చీరలు, కొత్త నగలంటూన్న పాత చింతకాయ కబుర్లతో, ఎటు చూసినా అంతా హడావిడిగా కనిపిస్తుంది.



ఒకపక్క పెద్ద ముత్తయిదులు... పసుపు, గంధం, ముత్యాలు చేర్చి, తలంబ్రాల బియ్యం కలుపుతుంటే! మరొకపక్క ఆ ఇంటి రెండో ఆడపిల్ల అయినా కొత్త పెళ్లికూతురు చుట్టూతా చేరిన ఆ వయసు ఈడు పిల్లల అల్లర్లు, సరదాల కబుర్లు, చిలిపి ఆట పట్టింపులు!



తలంబ్రాలు కలుపుతున్న పెద్ద ముత్తైదువులు చుట్టూతా గమనిస్తూ.. సరదాగా వారిలో వారు కూని రాగాలు తీస్తున్నారు....


అమ్మలాలో, తీపి బొమ్మలాలో....
ముద్దుల గుమ్మాలలో...

అల్లరి చేసే ఈడు పిల్లలాలో...
ఆకాశాన్నంటే, ఇంటి సంబరాల్లో...

ముద్ద బంతి, చామంతి తోరణాలో...
విరిసేను మా ముంగిట సంతోషాలలో....

పసుపు, చందనాల తలంబ్రాలలో....
మెరిసేను అక్షింతల ముత్యాలతో.....
మెరిసి మురిసేను ముత్యాలతో.....


జీవితంలో ఒకే ఒక్కసారి వచ్చే పెళ్లి పండగ! అదే ఆ ఇంట అందరిలో నింపుతుంది, సంతోషాల సంబరాలు.

ఆ ఇంటి పెద్ద కూతురు అంతా సర్దేసి, ఓదానికోసం ఇల్లంతా వెతికేస్తుంది. ఎంతకీ కావలసింది కనిపించకపోయేసరికి... కళ్ళు మూసుకుని ఒక్క నిమిషం దాని గురించి ఆలోచిస్తూ, అలా నిలబడింది.

అబ్బ.. చా! మర్చిపోయినట్టున్నారు. అందుకే ఎంత వెతికినా కనబడటం లేదు. అని అనుకుంటూ, గబ గబా తల్లి దగ్గరికి పరిగెత్తింది.

ఇక్కడ ఆవిడ మాత్రం ఖాళీగా ఉందా? ఆవిడ పనిలో ఆవిడ బిజీగా ఉంది.

కంగారు కు వస్తున్న కూతురిని చూస్తూనే, ఆవిడ మాట్లాడుతున్న వాళ్ళని వదిలేసి! కూతురికి ఎదురు వెళ్తుంది.

ఏంటి, ఏమయింది? ఎందుకు అంత కంగారు పడుతున్నావు? అన్ని సర్దడం పూర్తయిందా? మండపనికి పంపించేద్దాము! అని కూతురిని వివరం అడుగుతుంది.

అన్ని సర్దడం అయిపోయింది అమ్మ. సర్దినంతవరకు అన్ని మండపానికి పంపించేసే వస్తున్నాను.

కానీ, పెట్టుబడి బట్టలలో టవల్స్ కనిపించడం లేదమ్మా! నీకు తెలిసి నువ్వు ఎక్కడైనా పెట్టావా! అమ్మ ఒకసారి గుర్తు తెచ్చుకొని చెప్పు, నేనైతే అంత వెతికాను కానీ ఎక్కడ కనబడలేదు! లేదంటే, కొనేసి షాప్ లో ఏమైనా వదిలేసి వచ్చామా! ఒకసారి ఆలోచించి చెప్పమ్మా! అది ఒక్కటే కనబడటం లేదు.

రకరకాల ఆలోచనలతో, అంత వెతికి విసిగిపోయిన ఆమె, అన్నీ ప్రశ్నలను, ఒకేసారి కలిపి మాల గుచ్చి తల్లిని అడుగుతుంది.

అవన్నీ నువ్వే చూసుకుంటున్నావు, కదమ్మా! నేనైతే ఎక్కడ చూడలేదు. నీకు కనిపించడం లేదంటే, కచ్చితంగా ఇంటికి వచ్చి ఉండవు. ఆరోజు బట్టలకి ఎవరెవరు వెళ్లారో ? ఒకసారి అందరిని కనుక్కో! అప్పుడు వదిలేసామొ, తెచ్చాము తెలుస్తుంది.

ఏంటమ్మా, ఏమైంది? అమ్మ కూతుర్లు, ఇద్దరు అంత కంగారు పడుతున్నారు. దెని గురించి? అవతల అల్లుడుగారు నీ గురించి వెతుకుతున్నారమ్మా! ముందు వెళ్లి ఆ సంగతి ఏంటో చూడు.

అబ్బా ఏంటండీ మీరు! ఇక్కడ పైపంచెలు కనబడడం లేదని మేమిద్దరం కంగారు పడుతుంటే! అల్లుడుగారు అంటూ హడావిడి పెడతారు! అదేదో మీరు చూసుకోండి; ఇక్కడ మాకు చాలా పనులు ఉన్నాయి. అని విసుక్కుంటుంది... ఆయన ఇల్లాలు.

అమ్మ, నువ్వు కాసేపు ఉండు! అంటూ తల్లిని ఆపుతుంది.

నాన్న పెట్టుబడి బట్టలలో టవల్స్ కనిపించడం లేదు. బట్టలు షాపింగ్ మొత్తం నేనే చూసుకున్నాను! కానీ, టవల్స్ షోరూంలో వదిలేసి నట్టున్నాము. ఆరోజు హడావిడిలో చూసుకోలేదు, నాన్న వాటి గురించే ఆలోచిస్తున్నాను.

ఇప్పుడు ఏం చేద్దాం నాన్న? బ్రహ్మ ముడులుకని, పెళ్ళికొడుకు కోసం తీసుకున్న పట్టు పైపంచ కూడా, వాటిలోనే ఉంది. అర్జెంటుగా వెళ్లి అవన్నీ తీసుకురావాలి నాన్న.

దీనికోసం ఎందుకమ్మా అంత కంగారు. నువ్వు ఒక పని చెయ్యి, నేను షో రూమ్ కి ఫోన్ చేసి చెబుతాను. నువ్వు తమ్ముడిని తీసుకొని బయలుదేరు.

అక్కడ మీరు మర్చిపోతే, అవి తీసుకొని వచ్చేసేయండి. లేదంటే కొత్తవి కొని తీసుకొచ్చేయండి. సరేనా, ఊరికె ఇలా కంగారు పడకు, పద బయలుదేరు. అంటూ తండ్రి స్థిమిత పరుస్తాడు.

ఇదిగో నువ్వు, ఇంకా ఏ పని పెట్టుకోకుండా త్వరగా వచ్చేయి. మళ్ళీ చెల్లి దగ్గర ఉండి చూసుకోవాలి. అలాగే జాకెట్ ముక్కలు, ఇంకో పాతిక పట్టుకురా; సరేనా! తొందరగా వచ్చేయమ్మ. అంటూ తల్లి కూడా చెబుతుంది.

సరే అమ్మ! ఇంకేమైనా కావాలంటే, ఫోన్ చేసి చెప్పు! నాన్న మీరు షాప్ కి ఫోన్ చేయండి. అలాగే, మీ అల్లుడు గారికి కూడా చెప్పండి! నేను తమ్ముడిని తీసుకొని, వెంటనే బయలుదేరుతాను. అంటూ, ఆమె వేగంగా అక్కడి నుంచి కదులుతుంది.

ఇంటి బయట మెట్ల దగ్గర నిలబడి, ఎవరితోనో ఫోన్లో దేని గురించో, నవ్వుతూ డిస్కస్ చేస్తున్నాడు.

నవ్వుతూ మాట్లాడుతున్న, తమ్ముడు ని చూస్తూ.. ఆమె నిలబడిపోయింది.

మాటల మధ్యలో... తలతిప్పి చూసిన అతనికి, వాళ్ళ అక్క తనని, క్రీగంట అనుమానంగా చూస్తుండడంతో "మళ్లీ మాట్లాడతాను" అని చెప్పి ఫోన్ కట్ చేసేస్తాడు.

ఏంటక్కా అలా చూస్తున్నావు..??

ఎవరితో రా, అంత నవ్వుతూ మాట్లాడుతున్నావు..??

అక్క నువ్వు నీ అనుమానం. నా ఫ్రెండ్ అక్క..!!

విసుక్కుంటున్న తమ్ముడిని, నవ్వుతూ చూస్తుంది.

ఎం ఫ్రెండ్ రా, బాయ్ ఫ్రెండ్? గర్ల్ ఫ్రెండ్? ఆ... హా చెప్పరా!!

అబ్బా అక్క! బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్.. ఏంటక్కా?
ఫ్రెండ్ అంటే ఫ్రెండే! తను నా ఫ్రెండ్ అక్క!

'తను' అంటే అమ్మాయి..!! అంటే గర్ల్ ఫ్రెండ్! అంతే కదా?

అయ్యో, ఏంటక్కా నువ్వు? ఇలా తగులుకున్నావు! తను నా ఫ్రెండ్, అంతే! నాతో పాటు కలిసి చదువుకుంది.

అయితే...గర్ల్ ఫ్రెండ్, లవ్, ఎఫైర్స్... ఇలాంటివి ఏమీ, తనతో లేవన్నమాట?

అసహనంగా, తన రెండు చేతులు నడుము మీద పెట్టుకొని... అక్కని చూస్తున్నాడు.

ఆ చూపు ఏంటి, ఆ వేషాలేంటి? అడిగినదానికి చెప్పు ముందు! ఉన్నాయా..?? లేవా..??

తమ్ముడు ఫీలింగ్స్ చూస్తూ.. నెత్తి మీద ఒకటి వేసి, దబయించి అడిగేస్తుంది.

ఆహా... ఏంటి అక్క నువ్వు, నాకు అటువంటివి ఏమీ లేవు! అయినా, ఉంటే ముందు నీకే చెబుతాను సరేనా..!!

ఉమ్...సరే, నా తమ్ముడు మీద నాకు నమ్మకముందు లే; నమ్ముతున్నాను. అంటూ నవ్వేస్తుంది.

కళ్ళు చిన్నవి చేసి తన అక్కని చూస్తూ... నీకు ఏ పని లేదా అక్క? నామీద నిఘ వేస్తున్నావు. అని రుస రుసలాడుతున్నాడు.

ఇంత హడావిడిలో, నీ మీద నేను నిఘా వేయడం. నా తమ్ముడు మీద నిఘా వేయవలసిన అవసరం లేదు గాని, దా.. దా.. వెళ్దాం అర్జెంట్. అని చేయి పట్టుకొని లాక్కెళ్ళిపోతుంది.

@@@@@@@@@

తదుపరి భాగంలో, మన కథానాయక ఆగమనం.

నాతోపాటు పయనిస్తూ, మీ ఆదరణ అందిస్తారని ఆశిస్తున్నాను.

థాంక్యూ సో మచ్.
వర్ణ.




@@@@@@@@@@@@@@@@@@@@@@@




ప్రియ మిత్రులందరికీ విన్నపం.


చిన్నదో పెద్దదో ఒక సమీక్ష ఇవ్వండి. ప్రతి ఎపిసోడ్ మీద మీ అభిప్రాయాన్ని తెలియజేస్తూ.. రేటింగ్ ఇవ్వండి.

వరుసగా చదువుకుంటూ వెళ్ళిపోకుండా,
ప్రతి ఎపిసోడ్కి రేటింగ్ సమీక్షతో సపోర్ట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను.




థాంక్యూ.
మీ వర్ణ.