Featured Books
  • వైశాలి - 1

    వైశాలి అందమైన యువతి.  ఆమె ఎంత అందంగా ఉంటుందంటే ముందు ముందు న...

  • ఔను నిజం నువ్వంటే నాకిష్టం

    తెనాలి రైల్వే స్టేషన్‍       అర్ధరాత్రికి ఇంకా అయిదు నిమిషాల...

  • ఆగంతకుడు

    క్యాప్ ని ముఖంపైకి లాక్కుని చీకటిగా ఉన్న భవంతివైపు నడచాడతను....

  • అచ్చిరాని అతితెలివి

    తనను ఎవరైనా చూస్తున్నారేమోనని పరిసరాలను జాగ్రత్తగా కనిపెడుతూ...

  • ఇంటిదొంగలు

    ఎగ్జిక్యూటివ్ ఏడుకొండలు, గన్ మేన్ గఫూర్, వ్యాన్ డ్రైవర్ జోసె...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

తనువున ప్రాణమై.... - 2

ఆగమనం....

కళ్ళు చిన్నవి చేసి తన అక్కని చూస్తూ... నీకు ఏ పని లేదా అక్క? నామీద నిఘ వేస్తున్నావు. అని రుస రుసలాడుతున్నాడు.

ఇంత హడావిడిలో, నీ మీద నేను నిఘా వేయడం. నా తమ్ముడు మీద నిఘా వేయవలసిన అవసరం లేదు గాని, దా.. దా.. వెళ్దాం అర్జెంట్. అని చేయి పట్టుకొని లాక్కెళ్ళిపోతుంది.

అక్క ఎక్కడికో చెప్పకుండా, ఎక్కడికి తీసుకెళ్తున్నావు. చిన్నపిల్లాడి ని చేసి, నాతో ఆడేసుకుంటున్నావు. ముందు చెప్పు అక్క!! అని విసుక్కుంటూ, చెయ్యి వదిలించుకుంటాడు.

అబ్బా ఏంట్రా నీ గొడవ! బట్టల షాపుకి వెళ్తున్నాం. పద, పద కార్ తియ్యి!!

బట్టల షాప్ అనేటప్పటికి, కొంచెం ఆశ్చర్యంగా చూస్తున్నాడు అక్కని.

బట్టల షాప్ కా! ఇప్పుడా! ఎందుకక్కా?

బట్టల షాప్ కి ఎందుకు వెళ్తారు రా?? బట్టలు తెచ్చుకోవడానికి! నిలబడి టైం వేస్ట్ చేయకు, మళ్లీ తొందరగా వచ్చేయాలి రా!! అంటూ, మళ్లీ గుంజుకెళ్ళిపోతుంది.

బట్టల షాప్ కి, బట్టల కోసం కాకుండా; బంగారం కోసం వెళతారా అక్క? బట్టల షాప్ కి, ఎందుకు అని కాదు! ఈ టైంలో ఏంటి... అని అడుగుతున్నాను.

ఈమధ్య బట్టల షాపుల్లో, బంగారం కూడా అమ్ముతున్నారు రా!! మనం షాప్ లోనే లేదు! అలా తమ్ముడికి చెబుతూనే, గబగబా కారు వైపుకు నడుస్తుంది.

జోకులు వేయడం ఆపక్క!! ఇప్పుడు అంత అర్జెంటు ఏంటి..??

నిలబడే అన్ని చెప్పాలా? ముందు స్టార్ట్ చెయ్, తీరిగ్గా కూర్చుని మాట్లాడుతాను. అంటూ.. కార్ డోర్, ఓపెన్ చేసి ఎక్కేస్తుంది.

ఉఫ్... ఒక నిట్టూర్పు విడుస్తాడు.

అసలు మీ ఆడవాళ్లు ఉన్నారు చూడు... ఎంత షాపింగ్ చేసినా, ఇంకా షాపింగ్ అంటూ ఏడిపించేస్తారు. అసలు ఏం కొంటారు అక్క, అంతంతసేపు? కార్ డోర్ క్లోజ్ చేస్తూ... వాళ్ళ అక్క వైపు, విసుగ్గా చూస్తున్నాడు.

నిన్ను ఎడిపించడం నాకు సరదా రా!! పెళ్లి అన్నాక, సవలక్ష ఉంటాయి. చెబుతాను కానీ, ముందు కార్ స్టార్ట్ చెయ్యి రా!

కార్ రోడ్డు ఎక్కేసరికి, తమ్ముడికి విషయం ఏమిటని వివరిస్తుంది.

అక్క, రాత్రికి పెళ్లి! నువ్వు చెల్లి దగ్గరే ఉండాలి. కానీ ఇప్పుడు హడావిడి హడావిడిగా బయటకు వస్తున్నాం. ప్రతిసారి ఇలా పరిగెత్తడం అంటే, కష్టమైపోతుంది. అమ్మకి కాదు కానీ, అత్తకి ఒకసారి ఫోన్ చెయ్! అన్ని చెక్ చేసుకొని ఇంకేమన్నా అవసరం అవుతాయేమో కనుక్కో!

ఇదిగో అక్క చెబుతున్నాను! మళ్ళీ, నువ్వు ఇలా తిరిగావంటే ఊరుకోను. వాళ్ళందరికీ బాగా ఆటగా ఉంది. నిన్నొక్కదాన్నే తిప్పడం, ఫోన్ చేసి కనుక్కో., అని తన అక్క మీద చిర్రు బుర్రు లాడుతున్నాడు.

తమ్ముడి చిరాకు కి నవ్వుకుంటూ, ఆమె ఫోన్ చేస్తుంది.

ఎందుకురా నీకు అంత చిరాకు?? మనింటి పెళ్లి మనమే కదా చూసుకోవాలి. దీనికి, చిరాకు పడితే ఎలా రా? అంటూ.. తమ్ముడి బుగ్గలు లాగి, వదులుతుంది.

అక్క చిరాకు అనకు! నాకేమి చిరాకు లేదు, కోపంగా ఉంది. అన్నిటికి ఒక్కదానివే తిరుగుతున్నావు. అయినా ఆరోజే చూసుకోవచ్చు కదా! ఇప్పుడు హడావిడిగా మళ్లీ నువ్వే పరిగెత్తుతున్నావు. అలాంటప్పుడు... నాకు ఇలా కాకుండా, ఇంకా ఎలా ఉంటుంది.

తమ్ముడు..!! అలా అనకురా. ఎందుకు, అంత కోపం నీకు? ఆరోజు నాదే తప్పు, నేనే సరిగా....

ఆపు అక్క..!! తనదే తప్పు అనేసరికి నచ్చక, ఆ మాట పూర్తి కాకముందే, అడ్డు పడిపోతాడు.

ఆరోజు నీతో పాటు చాలామంది ఉన్నారక్క! అన్ని నీ నెత్తి మీద వేసుకోకు. నాకు నచ్చదని తెలిసి కూడ, నువ్వు ఇలా మాట్లాడితే, నాకు కోపం వస్తుంది. తర్వాత నీ ఇష్టం!! అంటూ... చిన్నపాటి కోపంతో అక్కని కసురుకుంటాడు.

హలో..!!

అవతల ఫోన్ లిఫ్ట్ చేశారు..!!

ఇంకా ఆపరా బాబు! నువ్వు నీ కోపం. అని విసుక్కుంటూ, తమ్ముడు నెత్తిమీద ఒక్కటి వేస్తుంది.

హలో అత్త..!! అంటూ, మాట్లాడటం మొదలు పెట్టింది.

ఆ తల్లి నేనే..!! ఏంటే ఆ అరుపులు? పక్కన వాడేనా అలా అరుస్తుంది.

హా ..!! అత్త వాడే. వాడు కాస్త చిరాకులో ఉన్నాడులే, గాని... ముందు నేను చెప్పేది విను అత్త.

సరే తల్లి, చెప్పమ్మా..!!

అత్త బట్టల షాప్ కనీ, బయటకు వచ్చాము. ఒకసారి అందరూ మాట్లాడుకొని ఇంకేమన్నా అవసరం అవుతాయేమో... కనుక్కొని చెప్పత్త!! వచ్చేటప్పుడు తీసుకొస్తాను.

ఒసేయ్.. ఈ విషయం నేను కనుక్కొని చెబుతాను గాని, మీ పెద్ద మామయ్య వాళ్ళు, వస్తున్నామని ఇందాక ఫోన్ చేశారు! నీకు చెప్పమని అమ్మకి చెప్పాను! ఎలాగో నువ్వు చేసావుగా, అందుకే చెప్పేస్తున్నాను... వాళ్ళకి కావలసిన పెట్టుబడి బట్టలు అవి తీసుకో. సరేనా...!!

ఆ సరే అత్త తీసుకుంటాను! ఇంకేమన్నా అవసరమేమో, కనుక్కొని చెప్పత్త!!

హా.. సరే, నేను కనుక్కొని ఫోన్ చేస్తాను. మీరు మాత్రం జాగ్రత్తగా, త్వరగా వచ్చేయండి. సరేనా..!

ఆ.. సరే అత్త ఉంటాను!! అంటూ... ఫోన్ పెట్టేస్తుంది.

ఫోన్ పెట్టేసి, తమ్ముడు ముఖం చూసేసరికి, కాస్త చిరాకుగా చూస్తుంటాడు. దానితో, నవ్వుకుంటూ విషయం తమ్ముడు చెబుతుంది.

అక్క తమ్ముళ్లు ఇద్దరు, బట్టల షాపులో నేరుగా ముందు జెంట్స్ సెక్షన్ కి వెళ్లి మగవారి బట్టలన్నీ తీసేసుకుంటారు. అవి ప్యాక్ చేపించి, లేడీస్ సెక్షన్ కి వెళతారు.

మార్నింగ్ టైం కావడంతో షాప్ అంతా రష్ లేదు. అక్కడ ఒకళ్ళు, అక్కడ ఒకళ్ళు, మాత్రమే ఉన్నారు. తమకు కావలసిన చూసి తీసుకుంటున్నారు.

ఆ ఫ్లోర్ లోనే, మిర్రర్ ముందు నిలబడి ఉంది ఒక అమ్మాయి. అయిదు అడుగుల ఒక్క అంగుళం ఎత్తు.
గుండ్రటి మొఖం! చక్కగా తీర్చిదిద్దినట్టు ఉన్న రూపం.
తెల్లటి మేని చాయతో, ఆకట్టుకునే విధంగా ఉన్న ముఖ వర్చస్సు.

నవ్వుకి నాజూకుగా వికసిస్తున్న పెదాలు. ఆ చిన్ని నవ్వుకె, చోట్టతో మురిపించే బుగ్గలు. సంతోషమంతా ఆ కళ్ళల్లోనే ఉందా అన్నట్టు, ఆ కళ్ళు వెలుగు లీనుతున్నాయి. ఆ వెలుగుల కింద తలుక్కుమంటున్న, తెల్ల రంగు రాయి ముక్కుపుడక.

అద్భుతంగా అజంతా శిల్పాన్ని పోలిన అందంతో, ప్రపంచమంతా వెతికిన దొరకనంత సౌందర్యరాశి అని అయితే చెప్పలేము కానీ, మన పక్కింటి అమ్మాయిల అనిపిస్తూ, అబ్బాయిలు పడి పడి చూసేంత అందమైన ఆడపిల్ల అని మాత్రం చెప్పొచ్చు.

తన సెలెక్ట్ చేసుకున్న లెహంగాలను, అద్దం ముందు నిలబడి తనకి ఎలా ఉన్నాయా? అని.... తనకేసి పట్టుకొని అటు ఇటు కదులుతూ చెక్ చేసుకుంటుంది.

@@@@@@@@@

నాతోపాటు పయనిస్తూ, మీ ఆదరణ అందిస్తారని ఆశిస్తున్నాను.

మీ సమీక్షలు, రేటింగ్స్ నాకు మరింత ఉత్సాహాన్ని అందిస్తాయి.

మీరిచ్చే ఒక్క సమీక్ష లేదా రేటింగ్ మా ఆలోచన విధానాన్ని మార్చవచ్చు!

ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ మీ.

థాంక్యూ సో మచ్.
వర్ణ.