Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

తనువున ప్రాణమై.... - 24

ఆగమనం.....

నా సిక్స్ ఫీట్ కి నాతో... 
బయటికి రావాలని ఉంది!! 
దీనిలో నా ఫోన్ నెంబర్ ఉంది!! 
నాకు ఫోన్ చేయమను!! 
నేను బయట వెయిట్ చేస్తాను!! 
అని, చెప్పేసి వెళ్ళిపోతుంది!!

పొట్టి దాని మాటలలోని సిన్సియారిటీ, చాలా క్లియర్ గా అర్థమైంది!! వెళుతున్న పొట్టి దాన్ని ఆశ్చర్యంగా చూస్తూ... అలాగే కొన్ని క్షణాలు నిలబడిపోయాడు!!

ఏంటిరా ఇది!!

నా పొట్టి చెల్లి... 
నీకు ఇమ్మని ఇచ్చిందిరా!! 
విత్ లవ్ ఫోల్డెడ్ టిష్యూ పేపర్!!
లవ్ లెటర్ బావ! టేక్ ఇట్!

పొట్టి చెల్లా...?? 
పిచ్చారా నీకు..??
ఈ పొట్టి చెల్లి ఎవరు??
ఈ లవ్ లెటర్ ఏంటి??

అబ్బ ఛా....!!
నువ్వు ఇన్నోసెంట్ రా!! 
నమ్మేసాను బావ!! 
నా పొట్టి చెల్లి...!! 
నీ పొట్టి లవ్వు రా!! 
బయటికి వెళుతున్నారు కదా!! 
దీనిలో ఫోన్ నెంబర్ ఉందంట!! 
ఫోన్ చేయమని చెప్పింది!! 
ఇందా.... పట్టుకో!!

ఫన్నీ గా నవ్వుతూ... టిష్యూ పేపర్, 
మన హీరో చేతిలో పెట్టేసాడు!!

తన చేతిలోనే టిష్యూ పేపర్ వైపు, ఆశ్చర్యంగా!! 
అది ఇచ్చిన వాడి వైపు, కోపంగా చూస్తున్నాడు!!

ఏంట్రా అలా చూస్తున్నావు??
ఇంకా దాయాలి, అనుకుంటున్నావా?? 
నువ్వు దాచిన దాగదు లే బావ!!
ఎంజాయ్ ద డేట్!!
ఐ విష్ యువ్, ఆల్ ది బెస్ట్ బావ!!
మన హీరోని హగ్ చేసుకుంటూ... 
విష్ చేసి, వదులుతాడు!!

ఏరా బావ, ఏమైంది రా నీకు?? 
ఆ బక్క వెధవ లా వాగుతున్నావు?? 
పిచ్చి పట్టిందా, నీకు ఏమన్నా?? 
లేదంటే ఆ పొట్టి దాని పిచ్చా అంటించుకున్నావా??
ఛా... అయినా నిన్ను కాదు లే బావ!! 
దాన్ని, ఆ పొట్టి దాన్ని అనాలి!!
ఇలా ఏదో ఒక పెంటా పెట్టందే, ఊరుకోదు!!

చిరాగ్గా, టిష్యూ పేపర్ ఓపెన్ చేస్తాడు!!
ఒక హార్ట్ సింబల్ డ్రా చేసి, దాని లోపల... 
పొట్టి దాని ఫోన్ నెంబర్ వేసి ఉంది.
అంతకుమించిన మెసేజ్, ఏమీ లేదు!!
ఫోన్ నెంబర్ చూసి, టిష్యూ పేపర్... 
నలిపేసి పక్కకు విసిరేసాడు!!
అసహనంగా తల ఉపుకుంటూ...
మండపం పైకి ఎక్కుతున్నాడు!!

ఏంటి రా బావ??
అలా పడేసావు??
నువ్వు ఇప్పుడు వెళ్లడం లేదా??

ఎక్కడికి రా వెళ్ళేది??
దానికి నిజంగా బుద్ధి లేదు!!

బావ ఆగు ఒక్క నిమిషం.....!!
చేయి పట్టుకొని, మండపం మీద... 
ఒక కార్నర్ కి, తీసుకువెళ్లిపోతాడు!!

బావ చిరాకు పడకు..!! 
నీకు తెలియదని, నాకు ఇప్పుడే అర్థమైంది!! 
కానీ ఒక్క మాట బావ!! 
తను చాలా సిన్సియర్గా ఉందిరా!!
తన కళ్ళల్లో నాకు ఆ కాన్ఫిడెంట్ కనిపించింది!! 
ఒక్క.... హైట్..... ప్రాబ్లం అవుతుందేమో గాని, 
రిమైనింగ్ అంత, పర్ఫెక్ట్ బావ!!

దాని హైట్ గురించి మాట్లాడకు!! 
అది దాని హైట్ కి, చాలా రెస్పెక్ట్ ఇస్తుంది!! 
ఈ మాట కాస్త సీరియస్ గా చెబుతాడు!!

నేను కూడా, దానికి ఆ రెస్పెక్ట్ ఇస్తున్నాను!!
ఈ మాట కాస్త సాఫ్ట్ గా చెబుతున్నాడు!!

ఇప్పుడు ఇంకాస్త బెటర్ గా అర్థమైంది లే బావ!! 
మేము కూడా ఆ హైట్ కి, రెస్పెక్ట్ ఇస్తున్నాము!! 
అయితే, మా చెల్లి అని ఫిక్స్ అవ్వచ్చు అన్నమాట!!
కన్నింగ్ స్మైల్ తో, టిస్ చేయడం మొదలుపెట్టాడు.

ఇదిగో ఇదే!! ఇది అవసరం లేదు!! 
నేను రెస్పెక్ట్ గురించి మాట్లాడుతున్నాను!! 
నువ్వు రిలేషన్ కలపకు!!

సర్లే బావ తర్వాత ఆలోచిస్తాను!! 
కానీ, ఒక రిక్వెస్ట్ 6 ఫీట్ గారు...
ఈ పెళ్లిలో తమరి బావమరిది డ్యూటీ అయ్యాక... 
మా చెల్లి తో డేట్ స్టార్ట్ చేయండి!! 
ప్లీజ్ సిక్స్ ఫీట్ గారు, 
మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాము!!
మా చెల్లి మీకోసం వెయిట్ చేస్తుంది!!
డేట్ స్టార్ట్ చేస్తున్నారా? సిక్స్ ఫీట్ గారు!!

నవ్వుతూ, తన పొట్టి చెల్లికి అన్నగా మారిపోయి... 
మన సిక్స్ ఫీట్ అందగాడిని, ఆట పట్టిస్తున్నాడు!

నీకు బాగా ఎక్కువైంది రా!! 
నాటకాలు మొదలు పెట్టావు!!
ఫ్రెండ్ ని, సీరియస్ గా చూస్తూ... 
మళ్ళీ, వధూవరుల వైపు వస్తున్నాడు!!

సరే ఆట కాదురా..!! 
సీరియస్ గా అడుగుతున్నాను!! 
అంతగా, రిక్వెస్ట్ చేశాను కదా!! 
కాస్త,పట్టించుకోరా బావ!!

కాస్త కాదురా, అంత పట్టించుకుంటా!! 
రిక్వెస్ట్ చేసావు కదా, పక్కన పెట్టు! 
తరువాత తీరిగ్గా పరిశీలిస్తాను!! 
ముందు ఇక్కడ నా చెల్లి పెళ్లి!! 
తరువాతే మిగతా అన్ని, మూసుకొని పదా!!

ఓయ్, పొట్టి చెల్లి!! 
నువ్వు గట్టి చెల్లివి రా!! 
పట్టేసావు నా బావని!! 
అస్సలు వదలకు...!!
తన చెల్లిని మెచ్చుకుంటూ... 
తన లోపలే, అనుకుంటూ... 
మన హీరోని, ఫాలో అవుతున్నాడు!!

ఇప్పుడు ఇది అసలు, 
బయటికి ఎందుకు వెళ్ళింది? 
ఎవరికి చెప్పి వెళ్ళింది?? 
బయటికి అంటే, మండపం బయటకా?? 
లేదంటే, పూర్తిగా బయటికి వెళ్లిపోయిందా?? 
అయినా, దీనికి బుద్ధి, భయం రెండు లేవు!! 
పొట్టిదే గాని, దానికి మించిన బలుపు ఉంది!!
కనిపించని కొవ్వు, క్వింటాళ్లు క్వింటాళ్లు ఉంది!!
అసలు నాకు చెప్పకుండా ఎందుకు వెళ్ళింది??
ఒక్కటే వచ్చింది!! ఒకటే వెళ్ళిపోయింది!! 
అసలు ఎక్కడికి వెళ్ళింది..?? 
ఎవరు లేకుండా ఎందుకు వెళ్ళింది?? 
దీనికి నోరే కాదు, కాళ్లు కూడా కుదురుండవు..!!
ఇప్పుడు ఊరంతా, తిరగడానికి వెళ్లిందా?? 
పిచ్చ పొట్టిది, అసలు దీనికి భయం అనేది లేదు!! 
ఆడపిల్ల! నైట్ టైం! పైగా అందంగా కూడా ఉంటుంది!! 
ఏంటి రా..!! నువ్వు నీ వాగుడు..?? 
దానికి కాదు రా పిచ్చి!! నీకు!! నీకు పట్టింది..!! 
అది బాగా ఎక్కించి వదిలేసింది!!
అయినా, చెప్పి వెళ్లాలి కదా!! 
ప్రశాంతంగా ఒక్క నిమిషం ఉండనివ్వడం, లేదు!! 
ఏ ముహూర్తాన, కంటపడిందో, గానీ... 
కనిపించిన దగ్గరనుంచి కాల్చుకు తింటుంది!! 
నాకంటూ, ఒక్క నిమిషం కూడా లేకుండా చేసేసింది!!
ఆ...ఆ...ఆ... ఇప్పుడు కూడా దీని గురించే.... ఆలోచిస్తున్నాను చూడు.......
చెత్త పొట్టిది!! పిచ్చి పొట్టిది!! 
మెంటల్ ది!! షార్ట్ చాటర్ బాక్స్!!
కంటిన్యూస్గా పొట్టి దానిని తిట్టుకుంటూనో... తలుచుకుంటునో ఉన్నాడు!!

వేదమంత్రాల నడుమ... 
మంగళ వాయిద్యాల మధ్య...
మంగళసూత్రధారణ జరుగుతుంది!!
అందరూ పెళ్లి లోనే ఉన్నారు! మన హీరోతో సహా!!
వెళ్లేవాళ్లు వెళ్తున్నారు!! వచ్చేవాళ్ళు వస్తున్నారు!!
కొంతమంది కన్నుల పండుగగా, పెళ్లి చూస్తున్నారు!!
మరి కొంతమంది కబురులతో, కాలక్షేపం చేస్తున్నారు!!
కానీ, అందరూ... వారిలో, వారు ఉన్నారు!!

మరి, మన హీరో... మనిషి ఇక్కడే ఉన్నాడు!! 
కానీ, మనసు మరి ఎక్కడో ఉంది!! 
మనసు, పొట్టి దాని ఆలోచనలతో, నిండిపోయి ఉంది!!

మనిషి, చెల్లి పెళ్లి వేడుకలో ఉన్నాడే గాని...
మనసు, మాత్రం ఆ వేడుకలు భాగం కాలేక పోతుంది!!

ఏరా నాన్న... ఒరేయ్....

భుజం పట్టి కుదుపుతుండేసరికి, స్పృహలోకి వచ్చి 
తనని పిలుస్తున్న తల్లిని చూస్తున్నాడు.

అమ్మ ఏంటి...??
అయోమయం గా అడుగుతున్నాడు!!

ఏంటి నాన్న?? 
ఎక్కడ ఆలోచిస్తున్నావు?? 
అందరూ అక్షింతలు వేస్తున్నారు!! 
నువ్వు కూడా వెయ్యి నాన్న!!

తల్లి మాటకి, 
చేతిలోని అక్షింతలను చూసుకుంటూ...
జరుగుతున్న వేడుకని గమనించాడు!!

చెవులకు వినిపిస్తున్న గట్టి మేళం కానీ...
చుట్టూ జరుగుతున్న వేడుక కానీ...
అతని గమనించలేకపోయాడు!!
అంతగా తనని తాను మరిచిపోయి... 
పొట్టి దాని ఆలోచనలు మునిగిపోయాడు!!

పొట్టి దానిని మనసులో 100 తిట్టుకుంటూ... 
తన చెల్లి సంతోషంగా ఉండాలని కోరుకుంటూ...
ఎందుకో, ఏమిటో, తెలియని ఒక గందరగోళంతో... వధూవరుల మీద అక్షింతలు వేస్తాడు!!

@@@@@@@@@

తదుపరి భాగం... మీ కోసం, వెయిట్ చేస్తూ ఉంది.

హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ మీ!!
డోంట్ ఇగ్నోర్!!
లేటెస్ట్ అప్డేట్స్ కోసం నన్ను అనుసరించండి!!
5 స్టార్ రేటింగ్, మీ కామెంట్, మీ కాంప్లిమెంట్!!

మళ్లీ కలుద్దాం.
థాంక్యూ.
వర్ణ.