ఆగమనం.....
సిక్స్ ఫీట్ నువ్వు చాలా బాగుంటావు!!
మండపం మీద లైటింగ్ లో ఇంకా బాగున్నావు!!
ఇప్పుడు నా కోసమే నా దగ్గరికి వచ్చావు...
చూడు చాలా చాలా బాగున్నావు!!
నాకు పిచ్చెక్కిచ్చేస్తున్నావు, సిక్స్ ఫీట్!!
మత్తుగా, మిరిమిట్లు గోలుపుతున్న కళ్ళతో, క్యూట్ గా మాట్లాడుతున్న పొట్టిదాని మాటలకి సిక్స్ ఫీట్ ఒక రకమైన ప్రౌడ్ ఫీలింగ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు!!
ఈ వాగుడే కాస్త తగ్గించు పొట్టి!!
అందరూ డిన్నర్ కి వెళ్తున్నారు...
నువ్వు కూడా వెళ్ళు! చాలా కష్టంగా నీ ఆకలిని,
ఆపుకొని పెళ్లి చూడడానికి వచ్చావు, కదా??
పొట్టిది, తినకుండా వదిలేసి వచ్చినందుకు...
అబ్బాయి గారికి హ్యాపీగానే ఉంది. కానీ....
తన ఫీలింగ్ ని, బయటపడనీయకుండా...
నార్మల్ గా మాట్లాడుతున్నాడు..!!
అయ్యో లేదు సిక్స్ ఫీట్!!
నాకు అసలు ఆకలి గాని లేదు!!
అది కాక నేను పెళ్లి చూడడానికి రాలేదు!!
అక్కడ నిన్ను ఉండమన్నాను!!
నువ్వు ఉండును అన్నావు!!
సరే, నువ్వు ఇక్కడ ఉన్నావు కదా!!
అందుకే, నేనే ఇక్కడికి వచ్చాను!!
నిన్ను చూడడానికే వచ్చాను సిక్స్ ఫీట్!!
నాకోసం నువ్వు అక్కడికి, ఇక్కడికి...
తిరిగి టెన్షన్ పడడం నాకు ఇష్టం లేదు సిక్స్ ఫీట్!!
నీకు కనిపిస్తూ ఉంటే నువ్వు బాగా...
నన్ను ప్రేమించుకుంటావు కదా!!
నీ తర్వాతే నాకు, ఇంకా ఏదైనా కూడా!!
అని ముద్దు ముద్దుగా కళ్ళు, చేతులు....
తిప్పుకుంటూ మరి చెబుతుంది.
ఒసే పొట్టి దాన..!!
నేను అన్న మాటకి నువ్వు తినకుండా...
వచ్చావని జాలిపడి, తినడానికి వెళ్ళమని.. చెబుతున్నాను!! నీకు చెప్పడం నాదే తప్పు!!
నువ్వు తిండి తినకపోయినా బతికేస్తావు!!
ఫుల్లుగా నన్ను తింటున్నావుగా!!
ఏం మనిషివే నువ్వు??
అసలు నేను చెప్పేది ఏంటి??
నీ వాగుడు ఏంటి??
అనవసరంగా వచ్చి కదిలించానని...
ఫీల్ అవుతున్నాడు. మన హీరో!!
అసలు మన పొట్టి దానికి...
అవేమీ పట్టడం లేదు!!
క్యూట్ గా హాట్ గా ఉన్న మన హీరోని...
వెంటనే కొరుక్కు తినేయాలని అనిపిస్తుంది!!
లోపల అనిపించింది ఏది?
ఆపుకునే అలవాటు మన పొట్టిదానికి...
అసలు లేనేలేదు! వెంటనే బయటికి కక్కేసింది!!
సిక్స్ ఫీట్ నువ్వు సూపర్ స్పీడ్!!
నా మనసులో ఉన్నది భలే చెప్పేసావు, 6 ఫీట్!!
నిజంగా తెలుసా నాకు ఇప్పుడు...
నిన్నే తినాలని అనిపిస్తుంది..!!
నువ్వు ఎంతా హాట్ హాట్ గా ఉన్నావు తెలుసా?? ఎంతమంది అమ్మాయిలు నిన్ను చూస్తున్నారో తెలుసా?? వాళ్ళందరికన్నా ముందు నేనే నిన్ను కొరుక్కు తినేస్తాను!!
I LOVE YOU SIX FEET
I LOVE YOU SO MUCH SIX FEET
YOU LOOKING SO HOT AND SEXY
పిచ్చా ఎక్సైట్ మెంట్ తో చెప్పేస్తూ..
మన హీరోని పట్టుకుపోతుంది.
ఇంత వాగుడు వాగి మండపంలో అలా చేస్తుంటే, మన హీరో ఊరుకుంటాడా? నెత్తి మీద గట్టిగా ఒక్కటి వేసాడు!! మరి ఏం చేస్తాడు?? పొట్టి దాని చెంపలు అందవయ్యే, తన హైట్ కి, కంఫర్ట్ గా ఉన్న హెడ్ బాగా నచ్చేసింది!!
అబ్బా... సిక్స్ ఫీట్!!
నా హెడ్ మీద కొట్టుకు!!
దానికి, నాకు అస్సలు పడదు!!
అది ఎప్పుడు నన్ను హేట్ చేస్తుంది!!
నువ్వు కావాలంటే ఇంకెక్కడైనా కొట్టుకో!!
నా హెడ్ జోలికి అస్సలు వద్దు..!!
అని, బుంగమూతి పెట్టుకొని క్యూట్ గా...
సిక్స్ ఫీట్ ని రిక్వెస్ట్ చేస్తుంది!!
అవునే పిచ్చి పొట్టి దాన..!!
నువ్వు చెప్పింది చాలా కరెక్ట్!!
నీ లాంటి పొట్టి వాళ్లకి బుర్ర గట్టిదంటారు!!
కానీ నీకు అది అసలు వాడలనే లేదు!!
అందుకే దానికి నీకు అస్సలు సెట్ అవ్వడం లేదు!!
ఇంకోసారి ఇలా నీ బుర్రవాడని వాగుడు...
వాగావే అనుకో, బుర్ర మీద కొట్టడం కాదు...
దాన్ని పీకి పక్కన పెట్టేస్తాను!!
నీ గోల వదిలిపోతుంది!!
అని, పొట్టి దాని మీద ఫైర్ అవుతున్నాడు!!
మన పొట్టిది మాత్రం బుర్ర గురించి...
ఆలోచించడం పక్కన పడేసింది!!
చక్కగా చేతులు రెండు కలిపి వెనక్కి పెట్టేసింది!!
మూతి అంత ముద్దుగా ముడుచుకొని...
రెండు కళ్ళు సిక్స్ ఫీట్ మీద పడేసింది!!
చక్కగా బాడీని ఆ పక్కకి, ఈ పక్కకి తిప్పుకుంటూ...
మన హీరోని కోపాన్ని ఎంజాయ్ చేస్తుంది!!
ఏంటి రా బావ??
మళ్లీ ఇక్కడ దుకాణం పెట్టారా??
అనుకుంటూ, వచ్చాడు మన హీరో ఫ్రెండ్!!
మన వాడు కోపంగా చూస్తున్నాడు వాడిని.
అలా చూడకు రా బావ!!
అర్థం అయింది!!
మన బ్యాచ్ మొత్తం చాలా...
క్యూరియస్ గా చూస్తున్నారు!!
వదిన నిన్ను రమ్మని పిలుస్తుంది!!
అంటూ తను అన్న మాటని...
కవర్ చేసుకుంటున్నాడు!!
అన్నావుగా!! అయిపోయింది గా!!
మల్లి కవర్ చేసుకోవడం ఎందుకు??
అయినా, దీన్ని దుకాణం అంటారా??
దాన్ని వెళ్లి తినమంటే...
వెళ్లకుండా నన్ను తింటుంది!!
తన ప్రస్టేషన్ ఫ్రెండ్ మీద కూడా చూపించేస్తాడు!!
సరేలే బావ, నీ బాధ నాకు అర్థమైంది!!
నువ్వు వెళ్లు వదిన పిలుస్తుంది!!
తనని నేను డిన్నర్ కి తీసుకెళ్తాను!!
అని, సాఫ్ట్ గా సెట్ చేస్తాడు!!
సరి చూసుకో దాని సంగతి!!
అని, ఫ్రెండ్ కి చెప్పేసి...
మన హీరో వెళ్ళిపోతాడు!!
ఎలా ఉన్నా సిక్స్ ఫీట్ దగ్గర ఉన్నప్పుడు...
ఉన్న ఆనందం! అతను వెళ్ళిపోతుంటే...
సిక్స్ ఫీట్ తో పాటు, తీసుకువెళ్లిపోతున్నట్టు...
మన పొట్టి దాని మొఖం డల్ అయిపోయింది!!
అటుగా వెళుతున్న, జ్యూస్ సప్లయర్ ని చూసి దగ్గరికి రమ్మని పిలుస్తుంది! మన పొట్టిది.
వాడి జ్యూస్ ఇవ్వడానికి అనుకోని, జ్యూస్ గ్లాస్ లు ఉన్న ట్రే పొట్టి దాని ముందు పెడతాడు.
ఇప్పుడు జ్యూస్ ఏంటి??
డిన్నర్ కి వెళ్ళాలి కదా??
అని డౌట్ గా చూస్తున్నాడు...
మన హీరో ఫ్రెండ్!!
పొట్టిది ఏమీ పట్టించుకోకుండా...
ఒక పిచ్చి నవ్వు విసురుతుంది!!
జ్యూస్ గ్లాసులు పక్కన ఉన్న టిష్యూ పేపర్,
ఆ సప్లయర్ పాకెట్ లో ఉన్న పెన్,
అలాగే ఒక జ్యూస్ గ్లాస్ తీసుకుంటుంది.
గడగడ జ్యూస్ గొంతులో పోసేస్తుంది!!
తిరిగి ఎంపీ గ్లాస్ ట్రే లో పెట్టేస్తుంది!!
వెంటనే సప్లయర్ ని వెనక్కి తిప్పేస్తుంది!!
ఆ సప్లయర్ వీపు మీద టిష్యూ పేపర్ పెట్టేస్తుంది!!
ఆ టిష్యూ పేపర్లో ఫాస్ట్ గా ఏదో రాసేసింది!!
మన హీరో ఫ్రెండ్ ఏంటా?
అని, డౌట్ గా చూస్తున్నాడు!!
సప్లయర్ మాత్రం మన పొట్టిదని ఎఫెక్ట్ కి...
కొంచెం ఇబ్బంది పడుతున్న...
ఒక రకమైన ఆశ్చర్యంలో తేలుతున్నాడు!!
సప్లయర్ కి అందంగా నవ్వుతూ థాంక్స్ చెప్పింది!!
అతని పెన్ తిరిగి అతని పాకెట్లో పెట్టేసింది!!
ఆ సప్లయర్... ఇబ్బంది, ఆశ్చర్యం...
రెండు ఎగిరిపోయాయి!!
హ్యాపీగా నవ్వుతూ, వినయంగా...
ఇట్స్ ఓకే మామ్!!
అని, చెప్పేసి వెళ్ళిపోయాడు!!
పొట్టిది మాత్రం ఆ టిష్యూ పేపర్...
మడిచి మన హీరో, ఫ్రెండ్ చేతిలో పెట్టింది!!
ఏంటి ఇది..??
అని డౌట్ గా అడుగుతున్నాడు!!
నా సిక్స్ ఫీట్ కి నాతో...
బయటికి రావాలని ఉంది!!
దీనిలో నా ఫోన్ నెంబర్ ఉంది!!
నాకు ఫోన్ చేయమను!!
నేను బయట వెయిట్ చేస్తాను!!
అని, చెప్పేసి వెళ్ళిపోతుంది!!
పొట్టి దాని మాటలలోని సిన్సియారిటీ, చాలా క్లియర్ గా అర్థమైంది!! వెళుతున్న పొట్టి దాన్ని ఆశ్చర్యంగా చూస్తూ... అలాగే కొన్ని క్షణాలు నిలబడిపోయాడు!!
@@@@@@@@@
తదుపరి భాగం... మీ కోసం, వెయిట్ చేస్తూ ఉంది.
హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ మీ!!
డోంట్ ఇగ్నోర్!!
లేటెస్ట్ అప్డేట్స్ కోసం నన్ను అనుసరించండి!!
5 స్టార్ రేటింగ్, మీ కామెంట్, మీ కాంప్లిమెంట్!!
మళ్లీ కలుద్దాం.
థాంక్యూ.
వర్ణ.