ఆగమనం.....
ఎందుకో తెలుసా మనము ఎవరిమీదైతే...
ఎక్కువ కోపం చూపిస్తామో, వాళ్ళని ఎక్కువ ప్రేమిస్తామంట!! నువ్వు నన్ను,
ఎంతగా ప్రేమించకపోతే, ఇంతగా కోప్పడతావు..!!
ఐ లవ్ యు సిక్స్ ఫీట్ !!
ఐ లవ్ యు సో మచ్ సిక్స్ ఫీట్!!
ఐ లవ్ యు అంటూనే... మళ్ళీ సిక్స్ ఫీట్ ని అల్లుకుపోతుంది.
అరుస్తున్న, కోప్పడుతున్న, తిడుతున్న, అసహ్యించుకుంటున్న, చంపేస్తాను అని బెదిరిస్తున్న,
తన నుంచి దూరంగా తోస్తున్న, అసలు ఎన్ని విధాలుగా చెప్పాలని ప్రయత్నించిన... వాటన్నిటిని పక్కకు తోసేసి అదే సంతోషంతో, అదే నవ్వుతో, అంతే ప్రేమతో... ప్రతిసారి సిక్స్ ఫీట్... సిక్స్ ఫీట్ అంటూ.. తనని చేరిపోతున్న పొట్టి దాన్ని అసలు ఏమనాలో? ఎలా ఆపాలో? అర్థం కావడం లేదు మన హీరోకి.
అసలు ఆపాల!! వద్ద!!
అనే కన్ఫ్యూషన్ ఫుల్ గా ఉంది.
ప్రేమ..!! ప్రేమించమని అడగడం తప్ప
ఇంకేమైనా మాట్లాడుతుందా??
అసలు ఇంక దేని గురించి అయినా... పట్టించుకుంటుందా?? ఏది మాట్లాడినా...
అక్కడికే తీసుకొచ్చి ప్రేమకే ముడిపెట్టి...
ఆ విధంగానే ఆలోచిస్తుంది!!
అసలు దీని మైండ్ సెట్ ఏంటి??
వామ్మో... దీని గురించి ఆలోచిస్తుంటే
నా బుర్ర కచ్చితంగా బ్రింజాల్ ఫ్రై అయిపోతుంది!!
ముందు దీన్ని నా బాడీ మీద నుంచి...
నా బుర్రలో నుంచి తీసి పక్కన పెట్టాలి!!
లేదంటే, నా చెల్లి పెళ్లికి నేనే వెర్రి పువ్వు లాగా మారిపోతాను!! పెళ్లి అయ్యేంతవరకు దీనిని...
వీలైనంత దూరంగా పెట్టాలి!!
అనుకున్నదే తడువుగా తన గుండెల మీద...
బెడ్ లేకుండానే, బజ్జున్న పొట్టి దాన్ని...
అమాంతం పక్కకు లాగేస్తాడు.
ఏంటి సిక్స్ ఫీట్ అలా లాగేసావు..??
కాసేపు నీ కౌగిలిలో ఉండనివ్వచ్చు కదా??
ఎంత బాగుందో తెలుసా..??
నీ గుండె చప్పుడు నాకు వినపడుతూ ఉంటే!!
కాసేపు ఉంటా సిక్స్ ఫీట్!!
అని చిన్న పిల్లల మారం చేస్తూ...
అని మల్లి దగ్గరికి రాబోతుంది!!
పిచ్చా నీకేమన్నా ఎన్నిసార్లు చెప్పాలి??
ఎక్కడున్నామో తెలుస్తుందా??
ఏంటి కౌగిలా?? పిచ్చ పొట్టి... పిచ్చి...
నువ్వు నన్ను పట్టుకుంటే కౌగిలి అనరు!!
ఇద్దరు కలిసి ఒకరిని ఒకరు పట్టుకుంటే!!
దానిని కౌగిలి అంటారు!?
పిచ్చ మొహం దాన!!
అవును కదా! భలే గుర్తుచేసావు సిక్స్ ఫీట్!!
ఇప్పుడు నువ్వు నన్ను పట్టుకో...
నేను నిన్ను పట్టుకుంటాను...
ఇద్దరం కలిసి కౌగిలించుకుందాము!!
ఇక్కడ కాకపోతే, లోపలికి వెళ్దాము!!
ఓకేనా సిక్స్ ఫీట్..!!
ఒసేయ్ పొట్టి దాన.. మూసెయ్ నోరు, మూసెయ్!! ఇంకొక్కసారి హగ్గు, హార్ట్, లవ్వు, కిస్సు అన్నావో చంపేస్తా!! అసలు ముందు ఈ విషయం చెప్పు??
నీకు సంబంధం లేని పెళ్లికి, ఎందుకు వచ్చావే??
అదేంటి సిక్స్ ఫీట్..!!
ఇందాక నీకు చెప్పాను కదా!!
మళ్లీ అడుగుతున్నావు!!
రావడం అయితే ఊరికే వచ్చాను!! కానీ,
వచ్చాక తెలిసింది. నువ్వు నా కోసమే...
వెయిట్ చేస్తున్నావు అని!!
తినాలి అని తీసుకున్న దానిని కూడా...
వాటిని అక్కడే వదిలేసి, నీ దగ్గరికి వచ్చేసాను!!
నేను చెప్పానా నువ్వే నాకోసం వస్తావని!!
చూసావా ఎలా వచ్చావో??
అని అందంగా అర్థం లేని మాటలతో...
మెలికలు కలుపుతూ, బాడీ మొత్తం తెగ తిప్పేస్తుంది!!
సిక్స్ ఫీట్ కి టెంపర్ పెరిగిపోయింది!!
పొట్టి దాన్ని, దాని తిప్పుడిని చిరాగ్గా చూస్తున్నాడు!!
ఒసేయ్ పొట్టి మెంటల్..!!
అసలు నువ్వు ఏమనుకుంటున్నావే??
మా పెళ్లికి వచ్చి నన్ను విసిగిస్తున్నావు??
మళ్లీ నేనే నీకోసం వచ్చాను అంటున్నావు??
డౌటే లేదే, నీ బ్రెయిన్ దొబ్బింది?!
లేదా.. దాన్లో చిప్పు మాడిపోయింది!!
సిక్స్ ఫీట్ మా పెళ్లి అనేటప్పటికీ...
పొట్టిది, కొంచెం టెన్స్ అవుతూ...
డౌట్ గా చూస్తుంది!!
6 ఫీట్ మా పెళ్లి అంటున్నావు ఏంటి??
అక్కడ బ్యానర్ మీద నీ ఫోటో లేదు??
కొంపదీసి ఆ అమ్మాయి నీ గర్ల్ ఫ్రెండ్ ఆ??
పెళ్లి నుంచి లేపు కెళ్ళిపోయి...
పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావా..??
అని, వరుస పెట్టి పిచ్చిపిచ్చిగా...
అడగడం మొదలు పెట్టింది!!
ఒక్క దెబ్బకి మన హీరోకి బిపి రైస్ అయింది!!
ఏ ఆపు... ఆపు... అంటూ,
పొట్టి దాన్ని నెత్తిమీద, ఒక్క మొట్టికాయ వేస్తాడు!!
మా పెళ్లి అన్నాను గాని నా పెళ్లి అన్నానా??
మెంటల్ దాన, నువ్వు ని తింగరి వాగుడు??
ఇది మా పెళ్లి!! పెళ్లి కూతురు నా చెల్లి!!
అర్థమైందా?? లేదా ఇంకోసారి చెప్పాలా??
ఆ పిచ్చ బుర్రకి, ఏది తిన్నగా ఎక్కదు కదా!!
సిక్స్ ఫీట్ కి అంత కోపం వచ్చినా సరే,
పెళ్లి తనకి కాదు చెల్లికి, అని చెప్పేసరికి...
1000 క్యాండిల్స్ ఒక్క చోటే వెలుగుతున్నట్టు...
పొట్టి దాని మొఖం వెలిగిపోతుంది.
పొట్టి దాని వేషాలు చూస్తూ...
చిరాగ్గా సిక్స్ ఫీట్ అక్కడి నుంచి, వెళ్లడానికి...
రెండు అడుగులు వేస్తాడు.
అంతే టక్కునా పొట్టిది వెళ్లి...
సిక్స్ ఫీట్ ముందు నిలబడి...
రెండు చేతులు అడ్డంగా చాపేస్తుంది.
ఏంటే ఇది??
గోడ కట్టేద్దాం అనుకుంటున్నావా??
అంటూ, కోపంగా చూస్తున్నాడు!!
అది కాదు సిక్స్ ఫీట్..!!
అప్పుడే వెళ్లడం ఎందుకు??
ఇంకా టైం ఉంది కదా!!
జీలకర్ర, బెల్లం పెట్టే టైంకి వెలుదువు గాని!!
ఇక్కడ నాతో కాసేపు ఉండొచ్చు కదా!!
సిక్స్ ఫీట్ ని, కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తుంది.
పొట్టి దాన! తప్పుకో ముందు..!!
ఇది నా చెల్లి పెళ్లి..!!
నేను అక్కడే ఉండాలి..!!
నేను నీకు లా టైం పాస్ కి రాలేదు!!
ఓసి లో వచ్చి మేకలాగా మెయాలనుకున్నావు!!
నీకు కావలసినంత, మెక్కు!!
నన్ను విసిగించకు, తప్పుకో.!!
అంటూ... చాపిన చేతిని, పట్టుకుని పక్కకి లాగేస్తాడు!!
అవునులే సిక్స్ ఫీట్..!!
యువ్ ఆర్ రైట్ సిక్స్ ఫీట్..!!
యువ్ ఆర్ ఆల్వేస్ రైట్ సిక్స్ ఫీట్..!!
ఐ లవ్ యువ్ సిక్స్ ఫీట్!!
నిజంగానే, నువ్వు చెప్పినట్టే...
అక్కడ ఫుడ్ ఐటమ్స్ అన్ని...
చాలా టెంప్టింగ్ గా ఉన్నాయి!!
నేను వెళ్లి ఫుల్లుగా కుమ్మేస్తాను!!
నువ్వు వెళ్లి హ్యాపీగా నీ చెల్లికి...
బెస్ట్ బ్రదర్ లా పెళ్లి జరిపించుకో.. సిక్స్ ఫీట్!!
నువ్వు పెళ్లికి వెళ్ళు!!
నేను వెళ్లి తింటాను!!
అని, పొట్టిది చెప్పేసరికి...
ఎందుకో, మన హీరోకి అసలు నచ్చలేదు!!
వెంటనే తల పక్కకు తిప్పేసుకుంటాడు!!
క్షణమాగి, చిరాగ్గా పొట్టి దాన్ని చూస్తున్నాడు!!
అవునులే పొట్టి..!!
మెక్కడానికి, వచ్చిన దానివి!!
మిగతా వాటితో నీకేం పని ఉంది!!
నువ్వు వెళ్లి బాగా మెక్కు!!
ఐటమ్స్ బాగా టెంప్టింగ్ గా ఉన్నాయి!!
అంటూ... అక్కడ నుంచి వెళ్ళిపోతాడు!!
ఎందుకో పొట్టిది తన వైపు నుంచి...
ఆలోచించలేదన్న ఫీలింగ్ వచ్చేసింది!!
తన ఇంటి పెళ్లికి పొట్టిది అసలు ఇంపార్టెన్స్...
ఇవ్వలేదు, అన్న ఆలోచన అసలు నచ్చలేదు!!
ఇంకా వెనక్కి తిరిగి కూడా చూడకుండా....
తిన్నగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
పొట్టిది వెళ్ళిపోతున్న సిక్స్ ఫీట్ ని...
అక్కడే నిలబడి నవ్వుతూ చూస్తుంది.
అంతకుముందు తను మాట్లాడిన...
నడి వయసు ఆవిడ దగ్గరికి వెళ్లి...
కొన్ని నిమిషాలు ఆవిడతో, వాళ్ళ పాపతో గడిపి...
అక్కడి నుంచి నేరుగా, కళ్యాణ మండపానికి వెళుతుంది!!
@@@@@@@@@
తదుపరి భాగం... మీ కోసం, వెయిట్ చేస్తూ ఉంది.
హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ మీ!!
డోంట్ ఇగ్నోర్!!
లేటెస్ట్ అప్డేట్స్ కోసం నన్ను అనుసరించండి!!
5 స్టార్ రేటింగ్, మీ కామెంట్, మీ కాంప్లిమెంట్!!
మళ్లీ కలుద్దాం.
థాంక్యూ.
వర్ణ.