Featured Books
  • పాణిగ్రహణం - 6

    భార్గవి ఆలోచిస్తూ ఉంటుంది. మాకు అలాంటి నమ్మకాలు లేవు అంటే......

  • తనువున ప్రాణమై.... - 20

    ఆగమనం.....అదేమీ పట్టనట్టు పొట్టి పాప మాత్రం...తన సిక్స్ ఫీట్...

  • అంతం కాదు - 12

    7: అగ్నిపర్వతం పుట్టిన రోజు (The Birth of the Volcano)ఘటోత్క...

  • ప్రేమలేఖ..? - 8

    ముగింపు...తల్లి అడిగినట్టు లోపలికి తీసుకొచ్చి లీల గదిలో వదిల...

  • పాణిగ్రహణం - 5

    విక్రమ్ డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్లి రెడీ అయ్యి కిందికి వస్తాడ...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

తనువున ప్రాణమై.... - 20

ఆగమనం.....

అదేమీ పట్టనట్టు పొట్టి పాప మాత్రం...
తన సిక్స్ ఫీట్ కి సైట్ కొట్టుకుంటుంది.

సిక్స్ ఫీట్ ఈ శర్వానీలో నువ్వు ఎంత బాగున్నావో తెలుసా!! అసలు నిన్ను ఇలా చూస్తుంటే... వదలకుండా ఒక గంట పాటు కంటిన్యూస్గా ముద్దు పెట్టుకోవాలని ఉంది!! ఇంకా చెప్పాలంటే అర్జెంటుగా మన దగ్గర ఉన్న సేఫ్టీ వాడేయ్యాలని ఉంది సిక్స్ ఫీట్!! వాడేద్దామా..??
అని క్యూట్ గా మెలికలు తిరిగిపోతూ సిగ్గుపడుతుంది.!!

పడిపోయిన ఫ్రెండ్ ని, పారిపోతున్న ఫ్రెండ్ ని, ఇద్దరిని చూస్తూ పరధ్యానంలో ఉన్న సిక్స్ ఫీట్,.. పొట్టి దాని మాటలతో మన లోకంలోకి వచ్చాడు.

భుజాలు ఎగరేస్తూ, ఒక వెర్రి నవ్వు నవ్వుతూ... 
పొట్టి దాన్ని పిచ్చి చూపులు చూస్తున్నాడు.

అసలు ఏం మనిషివే నువ్వు!! 
ఒకడేమో, తట్టుకోలేక పడిపోయాడు!! 
ఇంకొకడేమో, దండం పెట్టి పారిపోయాడు!!
అయినా నీ పనికి ఎక్కడ బ్రేక్ పడలేదు!!
హ్యాపీగా నాతో, ఆడేసుకుంటున్నావు!!
మనలో మన మాట నిజం చెప్పవే!! 
ఏ హాస్పిటల్ నుంచి పారిపోయి వచ్చావు!! 
నేను ఎవ్వరికీ చెప్పను! జస్ట్ నీకు పిచ్చి... 
ఉందో లేదో కన్ఫామ్ చేసుకోవడానికి!? 
నిన్ను తిరిగి హాస్పిటల్ కి కూడా పంపను!! 
నిజం చెప్పు..??

అరుపులకి - అదరక, బెదరక... 
కోపానికి - కొంచమైనా తడబడక... 
తన గెలుపు కోసం సిక్స్ ఫీట్ ని... 
సాధించుకునే లక్ష్యంతో శరవేగంగా... 
దూసుకుపోతూ, మన హీరోకి ముచ్చెమటలు... 
పట్టిస్తున్న పొట్టి దాన్ని అరిచి, తిట్టి లాభం లేదని... 
అర్థమై అడుగు దిగి అర్ధించుకుంటున్నాడు!!

హీరో అంత దీనంగా అడిగినా కూడా... 
హీరో పరిస్థితి ఇది అని వివరించిన కూడా... 
ఇక్కడ మన పోట్టిది, ఏం చేసిందో చూశారా?? నవ్వుకుంటూ, వచ్చి హీరోని కౌగిలించుకుంది,!!

నీకు నేనంటే ఎంత ఇష్టం సిక్స్ ఫీట్..!! 
నువ్వు నా గురించి టెన్షన్ పడకు సిక్స్ ఫీట్!! 
ఐ యాం పర్ఫెక్ట్ లి ఆల్ రైట్ సిక్స్ ఫీట్!! 
నాకు ఏ హాస్పిటల్ అవసరం లేదు సిక్స్ ఫీట్!! 
ఐ లవ్ యు సిక్స్ ఫీట్!! 
ఐ లవ్ యు సో మచ్ సిక్స్ ఫీట్!!
మన పొట్టిది, బ్రేకులు లేని బుల్డోజర్ ల... తొక్కుకుపోతుంది!!

మన హీరో పొట్టిది హాగ్ చేసుకోగానే... 
కళ్ళు మూసేసుకున్నాడు..!! 
అంత చెప్పినా అర్థం చేసుకోలేదన్న ఫీలింగో!! 
లేకపోతే పొట్టిదాని హగ్ లో ఉన్న ఫీలింగో!! 
ఏది మ్యాజిక్ లా మారిందో గానీ..?? 
మన హీరో మాత్రం ప్రస్తుతానికి.... 
సమ్ థింగ్.... సమ్ థింగ్..... ఫీలింగ్!!

పొట్టి దాని వాగుడు పూర్తి అయింది..!!
మన హీరోకి సమ్ థింగ్ పోయి, సెన్స్ తెలుస్తుంది!!
తనని చుట్టేసుకున్న, పొట్టి దాన్ని పక్కకు లాగేసాడు!!
చుట్టూ వాతావరణం అంతా, ఒకసారి గమనించాడు!!
వాళ్ళిద్దరిని ఎవరైనా, గమనిస్తున్నారేమోనని!!

ఏమయింది సిక్స్ ఫీట్?? 
ఎవరి కోసం చూస్తున్నావు?? 
మీ ఫ్రెండ్స్ కి నన్ను ఇంట్రడ్యూస్ చేయాలా?? 
ఎవరినైనా పిలవాలా? 
పోనీ మనమే వెళదామా?? 
అని క్యూట్ గా, క్వశ్చన్ చేస్తుంది!!

ఒసేయ్ పిచ్చి పొట్టి, నోరు ముయ్?!
నీ వాగుడితో నా పరువు తీయకు!! 
ఇప్పటికి చేసిన చాలు!! 
ఇంకా ఆపేయ్!! అసలు ...
ఇక్కడ ఏం చేస్తున్నావ్ నువ్వు? 
ఎందుకు వచ్చావు ఇక్కడికి హా..!!

పెళ్లికి వచ్చాను సిక్స్ ఫీట్!! 
పెళ్లికి వచ్చిన వారిని ఎవరైనా... 
ఎందుకు వచ్చావు?? 
అని అడుగుతారా, సిక్స్ ఫీట్??

ఆహా పెళ్లికి వచ్చావా..!! 
ఎవరి తరుపున వచ్చావు..?? 
మీ అమ్మ బాబు, నీతో పాటు రాలేదా?? 
వచ్చినా కూడా, కనిపించిన వాళ్ళని... 
కాల్చుకు తినమని, నిన్ను వదిలిపడెసారా!!

ఏంటి సిక్స్ ఫీట్..!! 
కనిపించిన వాళ్ళందరూ నాకెందుకు..?? 
నాకు ఇంకెవరు నచ్చరు సిక్స్ ఫీట్..!! 
నాకు ఈ లైఫ్ కి, నువ్వు చాలు సిక్స్ ఫీట్..!! 
నికు ఇంకొక విషయం చెప్పనా...
నువ్వు అస్సలు నమ్మవు 6 ఫీట్..!!
నేను ఈ పెళ్లికి వచ్చింది, నీ తరుపునె సిక్స్ ఫీట్!!

నాకు ఇంకెవరు నచ్చరు!! 
ఈ లైఫ్ కి నువ్వు చాలు!! 
అని పొట్టిది వాగుతున్న వాగుడులోని... 
ఆ మాటలా సీరియస్ నెస్, మన హీరోకి అర్థమవుతుంది.

ఏయ్ పొట్టి నా తరఫున ఏంటి..?? 
నా విషయంలోనే అనుకున్న..!! 
నువ్వు ఎం విషయంలోనూ ఆ బుర్ర వాడవా!! 
నిన్ను అడిగేది అబ్బాయి తరఫున, 
అమ్మాయి తరఫున అని!! 
ఎవరి తరపునో, చెబితే... 
తీసుకెళ్లి వాళ్ళ దగ్గర పడేస్తాను!! 
నీ గోల తట్టుకోలేను! నా పరువు తీసేస్తున్నావు..!! 
లేదనుకో, ఏ గదిలోనో, పెట్టి లాక్ చేసేస్తాను..!! 
పెళ్లి అయ్యే వరకు ఓపెన్ చెయ్యను!! 
ఒక్క దెబ్బకి, చచ్చి ఊరుకుంటావు!!
చెప్పు ఎవరి తరపున వచ్చావు..??
సీరియస్ గా చూస్తున్నాడు, సిక్స్ ఫీట్!!

నేను చెప్పాను కదా సిక్స్ ఫీట్!! 
నువ్వు అస్సలు నమ్మవని!! 
కానీ, నేను నిజమే చెబుతున్నాను!! 
నాకు ఇక్కడ ఎవ్వరు తెలియదు!! 
అలా రోడ్డుమీద వెళుతూ ఉన్నానా..?? 
బాగుంది కదా అని ఇలా పెళ్లిలోకి వచ్చాను!! 
ఇక్కడికి వచ్చాక నిన్ను చూశాను..!! 
నిన్ను చూశాక.... 
నేను నీ తరుపునే కదా సిక్స్ ఫీట్ !!
సాఫ్ట్ గా నవ్వుతూ తన మాటని, కన్ఫామ్ చేస్తుంది!!

ఒసేయ్ పిచ్చిదానా ఏం వాగుతున్నావే నువ్వు!! 
అలా పోతూ.... ఇలా రావడం ఏంటే..?? 
అసలు నీకు బ్రెయిన్ ఉందా?? 
లేదా, ఎక్కడైనా జారీ పడిపోయిందా?? 
అసలు తెలియని పెళ్ళికి ఎలా వచ్చావే నువ్వు??

ఏమో సిక్స్ ఫీట్..!! 
అదంతా నాకు తెలియదు!! 
నువ్వు కాబట్టి, క్లియర్ గా, చెప్తాను!! 
నేను అలా పోతూ ఉన్నానా..... 
అమ్మాయి, అబ్బాయి’ ఫోటో నచ్చింది!! 
నచ్చింది కదా అని, నడుచుకుంటూ వచ్చేసాను!!
అంతే సింపుల్, అయిపోయింది..!!

పొట్టి దాని మాటలకి...
సిక్స్ ఫీట్ బుర్ర పని చేయడం లేదు!!
'అంతే సింపుల్' అంటూ...
సింపుల్ గా చెప్పేసింది కానీ, 
పొట్టిది తెలిసి చేస్తుందా?? 
తెలియక చేస్తుందో?? 
6 ఫీట్ కి తెలియడం లేదు!!

ఒసేయ్ పొట్టి దాన... 
నేను నిన్ను ఏమంటున్నానో... 
నీకు ఏమన్నా అర్థమవుతుందా?? 
నేను నిన్ను మెచ్చుకోవడం లేదే... 
తిడుతున్నానే, కోప్పడుతున్ననే... 
ఎన్ని మాటలు అన్నా అలా నవ్వుతూ... 
నోటికొచ్చింది వాగుతావు, ఏంటే..?? 
కొంచమన్నా అర్థం చేసుకోవే!!
ఫైనల్ గా రిక్వెస్ట్ చేస్తున్నాడు!!

అయ్యో సిక్స్ ఫీట్..!! 
నాకు తెలుసు నువ్వు నన్ను కోప్పడుతున్నావని, తిడుతున్నావని! కానీ నువ్వు ఒక్కటి సరిగ్గా... గమనించలేదు! నువ్వు తప్ప ఎవరు నన్ను... 
ఏమీ అనలేదు! తెలుసా నువ్వు అలా అంటుంటే...
నాకు చాలా బాగా నచ్చింది..!! 
నువ్వు ఎప్పుడు ఇలాగే ఉండు సిక్స్ ఫీట్!! 
ఎందుకో తెలుసా మనము ఎవరిమీదైతే... 
ఎక్కువ కోపం చూపిస్తామో, వాళ్ళని ఎక్కువ ప్రేమిస్తామంట!!  నువ్వు నన్ను, 
ఎంతగా ప్రేమించకపోతే, ఇంతగా కోప్పడతావు..!! 
ఐ లవ్ యు సిక్స్ ఫీట్ 
ఐ లవ్ యు సో మచ్ సిక్స్ ఫీట్ 

ఐ లవ్ యు అంటూనే... మళ్ళీ సిక్స్ ఫీట్ ని అల్లుకుపోతుంది.

@@@@@@@@@

తదుపరి భాగం... మీ కోసం, వెయిట్ చేస్తూ ఉంది.
హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ మీ!!

డోంట్ ఇగ్నోర్!!
5 స్టార్ రేటింగ్, మీ కామెంట్, మీ కాంప్లిమెంట్!!
మళ్లీ కలుద్దాం.
థాంక్యూ.
వర్ణ.