Featured Books
  • పాణిగ్రహణం - 5

    విక్రమ్ డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్లి రెడీ అయ్యి కిందికి వస్తాడ...

  • మన్నించు - 8

    ప్రేమలో నిజాలు, అబద్ధాలు ఉండవు.. నిన్ను బాధపెట్టకూడదు అనే అబ...

  • తనువున ప్రాణమై.... - 19

    ఆ గమనం.....కానీ పొట్టిది గట్టిది కదా!! పొట్టి దాని కంట్లో పడ...

  • ప్రేమలేఖ..? - 7

    తిరిగి కొట్టడం వాళ్ళ నోర్లు ముయించడం క్షణం పని ఆనంద్ కి. ప్ర...

  • అంతం కాదు - 11

    కొద్దిసేపటికే విశ్వ అక్కడున్నాడు. జాన్ తన చేతిలో ఉన్న ఆయుధాల...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

తనువున ప్రాణమై.... - 19

ఆ గమనం.....


కానీ పొట్టిది గట్టిది కదా!! 
పొట్టి దాని కంట్లో పడిపోయింది!!
వెంటనే, ఆ ప్యాకెట్ చేతిలోకి తీసుకుంది!!

అది చూసిన మన హీరో, అండ్ ఫ్రెండ్స్ ముగ్గురు!! కంగారుపడుతూ ఒకరి ముఖాలు... 
ఒకరు చూసుకుంటూ నిలబడిపోయారు!!

ఎంత అల్లరి చేసినా..!! 
ఎంత విసిగిస్తున్న.... 
ప్రేమ, ప్రేమ అంటూ వెంటపడుతున్న... 
ముందు ఒక ఆడపిల్ల కథ... 
ఈ విధంగా ఒక కాడోంమ్ ప్యాకెట్!! 
తన దగ్గర, చూసేసరికి... 
ఎలా రియాక్ట్ అవుతుందో?? 
అసలు తన గురించి ఏమనుకుంటుందో?? 
అనే ఆలోచనతో... మన హీరో టెన్షన్ పడుతున్నాడు!!

మిగతా ఇద్దరి పరిస్థితి కూడా... 
ఇంచుమించు అలాగే ఉంది!! 
టెన్షన్ తో బిగుసుకుపోయి... 
ఏమనుకుంటుందో, అని చూస్తున్నారు!!

పొట్టిది ఆ ప్యాకెట్ హీరోకి చూపిస్తూ...
ఇది నీ ఫ్రెండ్స్, ఇచ్చారు కదా సిక్స్ ఫీట్!!
మీరంతా, సేఫ్టీ గురించి డిస్కస్ చేస్తున్నారా!!
సేఫ్టీ చేతిలో పెట్టేంత, గొప్ప ఫ్రెండ్స్... వావ్!! 
ఈ సేఫ్టీ జాగ్రత్తగా, నా దగ్గర ఉంటుంది..!! 
దీని అవసరం మనకి ఉంది..!! 
నీ దగ్గర ఉంటే ఇలాగే పారేసుకుంటావు!!  
నేను జాగ్రత్తగా ఉంచుతాను సిక్స్ ఫీట్!! 
అంటూ, ఆ ప్యాకెట్ తన దగ్గర ఉన్న... 
హ్యాండ్ బ్యాగ్ లో పెట్టేస్తుంది.

మన హీరో ఒక్కసారిగా, నోరు వెళ్ళబెట్టి చూస్తున్నాడు!! పాపం హీరో అనుకున్న విధంగా కాకుండా.. 
మరోలా పొట్టిది రియాక్ట్ అయ్యేసరికి... 
మన హీరోకి గట్టిగా షాక్ కొట్టింది.

తలని గట్టిగా కొట్టిన బండరాయి దెబ్బకి పడిపోయినట్టు బక్కోడు ఒక్కసారిగా నేలమీద కుప్పకూలిపోతాడు!!
అప్పుడు దాకా, ఉక్క బట్టుకొని ఉన్నవాడు... తెరిసిన నోరు తెరిచినట్టే, తెరిచిన కళ్ళు తెరిచినట్టే వదిలేస్తూ నేల మీదకి, పడిపోయాడు.

ఒరేయ్... ఒరేయ్ బక్కోడా! ఏమైందిరా? ఏంటిరా.. అలా పడిపోయావు... ఒరేయ్ బావ ఏంట్రా వీడు ఒకసారి చూడరా?? అంటూ.. రెండవవాడు, కింద పడిపోయిన బక్కోడిని కుదిపేస్తూ... కంగారు పడిపోతున్నాడు.

మన హీరో తేరుకొని కిందపడిపోయిన బక్కోడిని చూసి చిరాగ్గా పొట్టి దాన్ని చూస్తూ... తల పట్టుకుంటాడు.

అయ్యో సిక్స్ ఫీట్, ఏమైంది మీ ఫ్రెండ్ కి?? 
సరిగా తినలేదా, అందుకే అలా పడిపోయాడా?? 
అని తనదైన శైలిలో వాగుతూ, బక్కోడి మీద జాలితో... దగ్గరికి రాబోతుంది... మన పొట్టిది!!

పొట్టి దాని చెయ్యి పట్టుకొని, పక్కకు లాగేసి కోపంగా చూస్తున్నాడు.

పొట్టిది మాత్రం కళ్ళు టప టప ఆర్పుతూ... అందంగా చూసుకుంటుంది. కోపంగా ఉన్న, తన సిక్స్ ఫీట్ ని!!

ఏంటే!! ఏంటే!! ఆ చూపు?? 
అసలు ఏం అనుకుంటున్నావే, నువ్వు!! చంపేద్దామనుకుంటున్నావా?? 
మమ్మల్ని బతకనియ్యవా??
పాపం మా బక్కోడే..!!
గట్టిగా కొడితే తట్టుకోలేడని... 
కొట్టడానికి కూడా భయపడతామే!! 
అటువంటిది, నువ్వు నీ మాటలతోనే... 
వాడిని చంపేద్దామనుకుంటున్నావా??
నువ్వు నీ పొట్టి మొఖం! నుంచో ఇక్కడే!!
కదిలావో, చెప్తా నీ సంగతి..!! అని, 
వేలు చూపిస్తూ... వార్నింగ్ ఇస్తాడు!!

ఒరే బావ ముందు వీడి సంగతి చూడరా!! 
వీడు అసలు కదలడం లేదు!! 
అంటూ.. బక్కోడి, చెంపల మీద.. 
లేపడానికి, చిన్నగా కొడుతున్నాడు.

వాడు ఏమైనా తాగి పడిపోయాడా?? 
నువ్వు లేపగానే, లేగవడానికి!! 
దాని పిచ్చి తట్టుకోలేక పడిపోయాడు!! 
పట్టుకుపోయి కొంచెం నీళ్లు కొట్టు వీడి మొఖాన!! 
లేచి కూర్చుంటాడు..!!
అని రెండో వాడికి చెబుతూ...
ఉసురుమనుకుంటూ బక్కోడిని...
చూస్తున్నాడు, మన హీరో!!


ఒరే బావ ఇప్పుడు.. ఇలా పడిపోయిన, 
వీడిని చూస్తుంటే, నీకు ఏమనిపిస్తుంది రా??

నీకేం అనిపిస్తుందో నాకు కూడా అదే అనిపిస్తుంది!! 
బక్క సన్నాసి అంతా తెలుసు అంటాడు!! 
పొట్టి దాని దెబ్బకి, తట్టుకోలేక పడిపోయాడు!!

అలా అనుకుంటూనే ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ... నెమ్మదిగా తలతిప్పి వాళ్ళని చాలా క్యూరియస్ గా చూస్తున్న, పొట్టి దాన్ని చూస్తారు.

రెండోవాడు తల పట్టుకొని మన హీరో వైపు 
భరించలేనంత కన్ఫ్యూషన్ లో చూస్తున్నాడు.


అసలు ఏంటిరా ఆ అమ్మాయి..??
మనం ఇక్కడ వీడి గురించి ఇంతలా టెన్షన్ పడుతున్నాము. అసలు ఏమీ లేనట్టు, అంత క్యూట్ గా నవ్వుతూ... నీకు సైట్ కొడుతుంది ఏంటి రా??



ఒరేయ్ పిచ్చ నీకు..?? 
దాని పిచ్చా నీకు ఏమన్నా అంటిందా? 
అది సైట్ కొడితే, నన్ను అడుగుతావేంటిరా?? 
ఉదయం నన్ను ఎంత టార్చర్ పెట్టిందో... 
నీకు ఇప్పుడున్న అర్థమైందా..?? 
అది ఇది తప్ప ఇంకే పని చేయదురా..!! 

వాగితే, ఆ వాగుడే వాగుతుంది..!! 
చేస్తే ఈ పని చేస్తుంది..!! 
సిక్స్ ఫీట్? సిక్స్ ఫీట్! 
అంటూ, దోబ్బుతుంది నన్ను!!

దాని గురించి అడగడం మానేసి... 
నువ్వు పదరా బాబు!! 
కదిలిస్తే మళ్ళీ తగులుకుంటది!!
ముందు వీడిని తీసుకొని వెళదాము!! 

అని, ఇద్దరు కలిసి బక్కోడిని పట్టుకొని...
చెరొక భుజం మీద చేతులు వేసుకొని...
పైకి లేపుతున్నారు!!




సిక్స్ ఫీట్, మనిద్దరి మధ్య అడ్డమని... 
వాళ్ళిద్దర్నీ పంపించేస్తున్నావా??
ఐ నో సిక్స్ ఫీట్..!!
యువ్ ఆర్ సో ఇంటెలిజెంట్ సిక్స్ ఫీట్!!

క్యూట్ గా నవ్వుతూ, తన రెండు చేతి వెళ్ళను
కలిపి అందంగా గడ్డం కింద పెట్టుకొని... 
పొట్టిది ఆశ్చర్యంతో 6 ఫీట్ ని అడుగుతుంది.



మన హీరో పొట్టి దాన్ని సీరియస్ గా చూస్తున్నాడు!!
రెండవ వాడు మాత్రం... పొట్టిదాని మాటలకి బుర్ర హీటెక్కిపోయి నోరెళ్లపెట్టేసాడు!!


ఏమ్మా మహా తల్లి!! అసలు ఇక్కడ మా పరిస్థితి ఏంటో? నీకు ఏమన్నా అర్థమవుతుందా?? మా బక్కోడు తోటకూర కాడ లాగా వేలాడుతుంటే, నీ మానానా నువ్వు ఏదో వాగేస్తున్నావు!! అసలు నీకు మమ్మల్ని చూస్తుంటే ఏమనిపిస్తుంది?? అంటూ రెండోవాడు దీనంగా మొహం పెట్టాడు.



ఎందుకు తెలియదు, నాకు సూపర్ గా తెలుసు!! 
మీరిద్దరూ అలా వెళ్ళిపోతారు!! 
మేమిద్దరం ఇలా లవ్ చేసుకుంటాము!! 
మా ఇద్దరి కోసం మీరిద్దరూ వెళ్ళిపోతున్నారు!! 
మా ఇద్దరికీ స్పేస్ ఇస్తున్నారు?! 
వావ్ మీరిద్దరూ సూపర్!! 
థాంక్యూ సో మచ్!!



టపీ టపీ మంటూ తలకొట్టేసుకుంటున్నాడు?! 
'తెలుసా' అని అడిగిన పాపానికి... 
పొట్టిది చెప్పిన సమాధానం విని!!

బావ నువ్వు గట్టోడివి రా!! నువ్వు తట్టుకోగలవు!! మాలాంటి అర్బకుల, వల్ల అసలు కాదు!! 
నువ్వే నీ పిల్ల సంగతి చూసుకో..!! 
నేను ఈ బక్కోడిని తీసుకు పోతాను!! 
నీకు, నీ లవ్ కి ఒక దండం రా బాబు!! 

అని, మన హీరో మీద నుంచి... 
బక్కోడి చెయ్యి లాగేసుకొని... 
పొట్టి దాన్ని పిచ్చికి భయపడి పోయి...
ఒక్కడే బక్కోడిని ఈడ్చుకుంటూ... 
అక్కడి నుంచి తీసుకు వెళ్ళిపోతున్నాడు!!




పొట్టి దాని పిచ్చికి కళ్ళు తెరుచుకున్న స్నేహితులు ఇద్దరు కాళ్లు ఈడ్చుకుంటూ వెళ్లిపోతుంటే రెండు చేతులు నడుము మీద పెట్టుకొని అసహనంగా వెళుతున్న వాళ్ళిద్దర్నీ బాధగా చూస్తున్నాడు మన హీరో..!!

అదేమీ పట్టనట్టు పొట్టి పాప మాత్రం...
తన సిక్స్ ఫీట్ కి సైట్ కొట్టుకుంటుంది.


సిక్స్ ఫీట్ ఈ శర్వానీలో నువ్వు ఎంత బాగున్నావో తెలుసా!! అసలు నిన్ను ఇలా చూస్తుంటే... వదలకుండా ఒక గంట పాటు కంటిన్యూస్గా ముద్దు పెట్టుకోవాలని ఉంది!! ఇంకా చెప్పాలంటే అర్జెంటుగా మన దగ్గర ఉన్న సేఫ్టీ వాడేయ్యాలని ఉంది సిక్స్ ఫీట్!! వాడేద్దామా..??
అని క్యూట్ గా మెలికలు తిరిగిపోతూ సిగ్గుపడుతుంది.!!

@@@@@@@@@

తదుపరి భాగం... మీ కోసం, వెయిట్ చేస్తూ ఉంది.
హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ మీ!!
డోంట్ ఇగ్నోర్!!
5 స్టార్ రేటింగ్, మీ కామెంట్, మీ కాంప్లిమెంట్!!
మళ్లీ కలుద్దాం.
థాంక్యూ.
వర్ణ.