ఆగమనం.....
అవును రా!!
ఆ పొట్టిదే, ఈ పొట్టిది!!
పిచ్చ పొట్టిది!!
పిచ్చి పొట్టి వాగుడు కాయ!!
అది, దాని డబ్బా వాగుడు!!
అసలు, ఈ పొట్టిది ఇక్కడ ఏం చేస్తుంది??
అంటే పొట్టిది పెళ్లిలోకి వచ్చేసింది, అన్నమాట!! కానీ, ఎందుకు వచ్చింది?? ఏమో చూద్దాం..!!
డార్క్ నావి బ్లూ లెహంగాలో, ఉన్న పొట్టి దాన్ని, సైడ్ నుంచి ... చూస్తున్నారు క్యూట్ గా స్వీట్ గా బబ్లీగా ఉంది.
మన హీరోకి, అది ఏ రకమైన ఫీలింగ్ తెలియడం లేదు కానీ, ఇంకేటు చూపు తిప్పకుండా పొట్టిదాన్నే చూస్తున్నాడు.
చేతిలో ప్లేట్ పట్టుకొని, ఒక మిడిల్ ఏజ్ ఆవిడతో మన పొట్టిది, నవ్వుతూ మాట్లాడేస్తుంది.
అలా నవ్వుతూ మాట్లాడుతున్న పొట్టి దాన్ని, చూడడం కష్టంగా అనిపించి...మన హీరో వెనక్కి తిరిగి పోయాడు.
ఒరేయ్ అమ్మాయి బాగుందిరా!! నువ్వు ఏమనుకుంటునావు? నా డౌట్ ఇంక నువ్వు క్లియర్ చేయలేదు! బావ ఉదయం నుంచి నన్ను, అవాయిడ్ చేస్తూనే ఉన్నావు!! ఇప్పుడైనా క్లారిటీ వస్తే బాగుంటుంది రా!!
స్నేహితుడి మాటలకి ముఖం చిన్న బుచ్చుకొని.. ఆలోచనలో పడ్డాడు!! తెరల మాటున తాకి తాకినట్టుగా మనసుని తాకుతున్న భావాన్ని బయటకు తీయడానికి ప్రయత్నిస్తున్నాడు.
ఉదయం నుంచి పొట్టి దాని ఆలోచనలతో, సతమతమవుతున్న బుర్రని!! బుద్ధిగా పెళ్లి పనుల్లో నిమగ్నం చేసి... నిలకడగా ఉంచడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు! క్షణం గ్యాప్ ఇచ్చిన, పొట్టిది చేసిన వీరంగం అంతా కళ్ళ ముందు కనిపిస్తుంది. ఆలోచనలను డైవర్ట్ చేయడానికే అంతలా అవస్థ పడితే, ఇప్పుడు నేరుగా పొట్టిదే ఎదురుగా వచ్చి నిలబడింది!!
క్లారిటీ సంగతి ఏమో కానీ, ఏదో తెలియని ఫీలింగ్ బాగా మైండ్ ని డిస్టర్బ్ చేస్తుంది. "చూడగానే చంపేద్దాం" అన్నంత కోపంగా ఉన్నవాడు! ఇప్పుడు చూడడానికే ఇబ్బంది పడుతూ, పక్కకు తిరిగి పోయాడు.
బావ ఏంటి రా? మాట్లాడకుండా ఇలా సైలెంట్ గా ఉన్నావు! మాకు చెప్పకపోయినా ఓకే!! కానీ, నీకంటూ ఒక క్లారిటీ ఉండాలి రా! అంటూ సలహా ఇస్తూ సముదాయిస్తున్నాడు.
తెలియడం లేదు రా!!
దాని ఆలోచన రాకూడదని...
మైండ్ ని చాలా డైవర్ట్ చేస్తున్నాను!!
దానిమీద చాలా కోపంగా ఉంది!!
కానీ చూపించాలనిపించడం లేదు..!!
ఏదో తెలియని ఫీలింగ్...
కానీ అది ఎందుకు అర్థం కావడం లేదు!!
తను అందరిలా కనిపించడం లేదు!!
అలాగని అందరికన్నా...
ఎక్కువుగా కూడా, అనిపించడం లేదు!!
అర్థం కావడం లేదు రా..!!
నీ బాధ నాకు అర్థమైంది మామ!!
దీనికి, సొల్యూషన్ నేను చెబుతాను!!
అంటూ.. బక్కోడు, దొరికిపోతాడు!!
ఏరా బక్కోడ అవసరమా నీకు!!
అసలే, వాడు మూడ్ ఆఫ్ లో ఉన్నాడు!!
ఏదో ఒకటి వాగి తన్నులు తినకు!!
మూసుకొని కూర్చో బె..!!
అని సలహా ఇస్తున్నాడు, పక్కోడు!!
అరేయ్ బావ నువ్వు ఆగు!!
ఒరేయ్ మామ నువ్వు విను!!
నేను చెప్పేది నీకు కరెక్ట్ గా వర్క్ అవుట్ అవుతుంది!! ఒకవేళ,కాకపోతే అప్పుడు చెప్పు ఒప్పుకుంటా!!
నన్ను, నాలెడ్జ్ ని, జడ్జ్ చేయొద్దు!!
నాకు వీటిలో మస్తు నాలెడ్జ్ ఉంది..!!
అంటూ.. తనకు తానే గోల్డ్ మెడల్ గ్రాడ్యుయేట్
లాగా బిల్డప్ ఇస్తున్నాడు!!
మన హీరో... బక్కోడి బలుపు కి, ముఖం చిట్లించి చూస్తున్నాడు.
ఎక్కువ తక్కువ వాగేవనుకో... ఈరోజు అయిపోతావు!! అసలే దానివలన.. నాకు చాలా చిరాగ్గా ఉంది!
పెళ్లికి వచ్చింది, వచ్చినట్టు వెళ్ళిపోతుంది!!
నువ్వు మధ్యలో దూరకుండా మూసుకొని ఉండు!!
అని బక్కోడికి, సీరియస్ గా వార్నింగ్ ఇచ్చాడు.
మామ అలా అనకు!!
కావాలంటే, వాటిని అడుగు!!
వాడి మరదలు కోసం ఎన్ని సలహాలు ఇచ్చానో!!
100% వర్కౌట్ అవుతుంది!!
ఇన్ కేస్ అవ్వలేదే, అనుకో...
అప్పుడు నువ్వే ఏది చెప్తే అది చేస్తా!!
లైఫ్ లో మళ్ళీ నీకు ఏ విషయంలోనూ, సలహా ఇవ్వను!! అమ్మాయిలు విషయంలో, నాకు మస్తు నాలెడ్జ్ ఉంది రా!! నమ్మరా మామ నన్ను!! ప్లీజ్ మామ నమ్మరా!!
బక్కోడు వదలకుండా సతాయిస్తూ... బ్రతిమిలాడుతున్నాడు!!
ఒరేయ్ బక్కోడ, మధ్యలో నా విషయం ఎత్తాకు!!
నువ్వు చెప్పాలనుకుంటున్నావు చెప్పు!!
వాడు వింటే వింటాడు, లేదంటే లేదు!!
మధ్యలో నన్ను లాగకు!! అని, వేలు చూపిస్తు మరి విసుక్కుంటున్నాడు!!
సరే రా నువ్వు నోరు ముయ్!!
ఒరే మామ, నువ్వు వినరా!!
నీకు యూస్ అవుతుంది..!!
ఉమ్.. సరే చెప్పు!!
సింపుల్ మామ ఏమీ లేదు!!
ఆ అమ్మాయి ఎలాగో, స్పీడ్ కదా!!
అందుకని, ఒక నైట్ అవుట్ చెయ్యి!!
మేటర్ క్లియర్..!!
అది ఒక నైట్ లవ్ ఆ..!!
లేదంటే లైఫ్ లాంగ్ లవ్వ..!!
అనేది నీకు క్లారిటీ వచ్చేస్తుంది..!!
ఇష్టమైతే కంటిన్యూ..!!
లేకపోతే, వన్ నైట్ స్టాండ్ క్లియర్..!!
ఈరోజు ఈ బక్కోడికి, దండ పడిపోతుంది!!
కన్ఫామ్!! అనుకుంటూనే, మన హీరోని
గట్టిగా పట్టుకొని, ఆపడానికి ప్రయత్నిస్తున్నాడు.
మన హీరో ఇంత మంచి సలహా ఇచ్చినందుకు...
కోపంగా చంపేసేటట్టు చూస్తూ...
బక్కోడిని తన్నడానికి ఎగురుతున్నాడు.
పట్టుకున్న ఫ్రెండ్ చేతుల్ని లాగేస్తున్నాడు!!
ఏంటి మామ అంతలా ఫైర్ అవుతున్నావు!! నేను చెప్పిన సలహా 100% వర్క్ అవుట్ అవుతుంది!!
బాగుంటుంది రా!! ఇంతమంది ఫాలో అయ్యారో తెలుసా!! అని, ఇంకా రెచ్చగొడుతున్నాడు.
ఒరేయ్ ఎదవా, బక్క సన్నాసి!!
నీ బెర్ బాడీ కి, వాడు గట్టిగా తంతే పోతావురా!!
ఎన్నిసార్లు చెప్పాలి రా!!
నీకు, ఈ వాగుడు మానమని!!
అంటూ, బక్కోడిని అరుస్తూ...
మనోడిని కంట్రోల్ చేస్తున్నాడు!!
నువ్వు వదలరా ముందు నన్ను!!
అసలు నేను ఉన్న సిచువేషన్, ఏంటి??
వాడు వాగే వాగుడు ఏంటి??
అంటూ, మన హీరో ఫైర్ అవుతున్నాడు!!
ఒరేయ్ బావ ఒక్క మాట రా!!
వాడు అన్న మీనింగ్ వేరేలే కానీ...
ఒక్క మాట మాత్రం నిజం రా!!
నువ్వు తనతో టైం స్పెండ్ చేస్తే...
ముందు నీకు ఒక క్లారిటీ వస్తుంది రా!!
ఆగరా, ఈ ప్రాబ్లం కి ఓ సొల్యూషన్ దొరుకుతుంది!!
అంటూ, మన హీరోని కామ్ డౌన్ చేస్తాడు!!
ఆలోచనలో పడి, నెమ్మదిగా తల వెనక్కి తిప్పి చూస్తాడు!!
పొట్టిది, ఒక పాపని ఎత్తుకొని, అంత ముందు మాట్లాడుతున్న ఆవిడ దగ్గర ఉంది.
చూసావా మామ!! నేను చెప్పింది ఇప్పుడు నీకు కూడా నచ్చింది కదా!! ఇది 100% వర్క్ అవుట్ అవుతుంది, మామ నాకు తెలుసు!! అంటూ... వేసుకున్న శార్వాణి కాలర్ ఎగరేస్తూ, బక్కోడు ఎగిరెగిరి పడుతున్నాడు!!
ఏంటి రా మళ్లీ చెప్పు, హండ్రెడ్ పర్సెంటా!!
అని సీరియస్ గా ఒక లుక్ ఇస్తాడు!!
అంటే, నీ వైపు నుంచి 10% మామ!!
నీ మేడం వైపు నుంచి 100% మామ, కన్ఫర్మ్!!
ఒరేయ్ నీకు ఎన్ని పడిన, బుద్ధి రాదు రా!!
నిన్ను తన్నడం కాదురా, వాడు పొద్దున అన్నట్టు...
నీ నోటికి ప్లాస్టర్ వేసేసి, గదిలో కట్టి పడేయాల్సింది!!
ఎదవ..!! అని, రెండో వాడు తిడుతున్నాడు!!
అహే... నువ్వు ఆపరా!!
ఒరే మామ, అమ్మాయిల విషయంలో...
నేను ఎప్పుడు కరెక్టే!!
వాళ్ళకి ఏం కావాలో...
నాకు బాగా తెలుసు!!
నువ్వు లేట్ చేయకుండా...
ఈరోజే మొదలుపెట్టు.
అందుకు నీకు కావాలి!!
నేను ఇచ్చే ఈ రక్ష..!!
అంటూ.. శార్వాణి పాకెట్ లో నుంచి తీసిన..
ముడ్స్ ప్యాకెట్, మన హీరో చేతిలో పెడతాడు.
మూడ్స్ చూసిన రెండోవ వాడు...
తన నోటి మీద రెండు చేతులు పెట్టేసుకుంటాడు...
"ఒరేయ్ ఏంటి రా ఇది" అంటూ.
మన హీరో బక్కోడిని, నవ్వుతూ చూస్తున్నాడు!!
భలే చెప్పావు రా, బక్కోడ!
నాకు ఇప్పుడు ఇదే కావాలి!!
దా నాన్న, ఇంత మంచి రక్ష కవచం ఇచ్చినందుకు...
నిన్ను మెచ్చుకోకుండా అస్సలు ఉండలేను!!
రా...రా...!! దారా నా బక్క బంగారం!!
అంటూ.. బక్కోడిని దగ్గరికి తీసుకుంటాడు.
నమ్మేసి తెగ ఆనంద పడిపోతూ బక్కోడు మన హీరోని, కౌగిలించుకోవడానికి... దగ్గరికి వెళతాడు!!
అంతే..!! అందడం ఆలస్యం!!
జుట్టు పట్టుకొని వంగదీసి...
కింద కాలితో, పైన చేతులతో...
దబి, దబి దభిమంటూ పీకేస్తున్నాడు!!
బక్కోడు, ఆ పీకుడికి అరిచేస్తున్నాడు!!
హాయ్ 6 ఫీట్...!!
బ్రహ్మాండంగా అరుస్తున్న... బక్కోడి అరుపుల మధ్య అందంగా వినిపిస్తున్న పిలుపు..!!
ఇంకెవరిది, మన పొట్టి దానిదే!!
@@@@@@@@@
తదుపరి భాగం... మీ కోసం, వెయిట్ చేస్తూ ఉంది.
హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ మీ!!
డోంట్ ఇగ్నోర్!!
5 స్టార్ రేటింగ్, మీ కామెంట్, మీ కాంప్లిమెంట్!!
మళ్లీ కలుద్దాం.
థాంక్యూ.
వర్ణ.