ఆ గమనం.....
అంతే..!! అందడం ఆలస్యం!!
జుట్టు పట్టుకొని వంగదీసి...
కింద కాలితో, పైన చేతులతో...
దబి, దబి దభిమంటూ పీకేస్తున్నాడు!!
బక్కోడు, ఆ పీకుడికి అరిచేస్తున్నాడు!!
హాయ్ 6 ఫీట్...!!
బ్రహ్మాండంగా అరుస్తున్న... బక్కోడి అరుపుల మధ్య అందంగా వినిపిస్తున్న, పిలుపు..!!
ఇంకెవరిది, మన పొట్టి దానిదే!!
మన హీరో గారికి, ఆ గొంతు సుపరిచితమే!!
కసిగా కొట్టేవాడు ఆగిపోయి, కనీసం తలతిప్పి పొట్టి దాని మొహం కూడా చూడకుండా... "వచ్చేసింది, ఈ పిచ్చ పొట్టిది! దీనికి నాకు ఏదో ఏడేడు జన్మల ఫెవికాల్ బంధమన్నట్టు, ఇంకా వదిలిపెట్టదు!! ఛా... అని, చిరాగ్గా వెళ్లు జుట్టులోకి పోనిచ్చి తలపట్టేసుకుంటాడు!!
మిగతా ఇద్దరు అవసరం లేని నవ్వు మొహం మీద పూసుకొని... "హాయ్" అంటూ... చేతులు ఊపుతారు.
హాయ్....!! మీరు భలే ఆడుకుంటున్నారే?? మీరు, నా సిక్స్ ఫీట్ కి డియర్ ఫ్రెండ్స్?? లేదా దూరం ఫ్రెండ్స్?? అని మొదలుపెట్టింది.
ఫస్ట్ డైలాగ్ కే, ఇద్దరు తెల్ల మొహాలు వేసుకొని, పొట్టి దాన్ని చూస్తున్నారు.
హాయ్.. సిక్స్ ఫీట్!! నన్ను చూడవా??
నన్ను చూడలేనంత, బెంగ పెట్టుకున్నావా??
నామీద నీకు చాలా ప్రేమ ఉంది 6 ఫీట్!!
హలో, నేను ఇక్కడే ఉన్నాను సిక్స్ ఫీట్!!
నీ పక్కనే ఉన్న, నువ్వు ఫీల్ అవ్వకు సిక్స్ ఫీట్!!
నీకు, కష్టంగా ఉంది అని, నేనే వచ్చేసా సిక్స్ ఫీట్!!
నువ్వు ఏమి ఫీల్ అవ్వకు సిక్స్ ఫీట్!!
నేనే నీ ముందుకు వస్తాను అనుకుంటూ...
మధ్యలో ఉన్న 'గ్రాస్ లైన్' ని.. దాటుకొని...
ఇటు వైపుకు వచ్చి... తన సిక్స్ ఫీట్ ముందు నిలబడింది.
మిగతా ఇద్దరి తెల్ల మొహాలు కాస్త...
పొట్టి దాని, ప్రేమ మాటలకి...
పిచ్చ మొహాలుగా, మారిపోయాయి!!
ఎదురుగా వచ్చి నిలబడిన పొట్టి దానిని... వదలకుండా వెంటపడుతున్న, ఒక బేతాళుడు ని చూసినట్టు చూస్తున్నాడు!!
వచ్చేసావా, ఇంకా రాలేదు ఏంటా అనుకుంటున్నా??
ఏం పాపం చేశానే, ఇలా తగులుకున్నావు!!
పిశాచి లాగా నా వెంట పడి, పీక్కు తింటున్నావు!!
వదిలిపెట్టవా నన్ను!! అని దీనంగా మాట్లాడుతున్నాడు!!
నేను అప్పుడే వదిలేశాను సిక్స్ ఫీట్!!
కానీ నువ్వే నన్ను తగులుకున్నావు!!
చూసావా సిక్స్ ఫీట్!!
నేను చెప్పినట్టే జరిగింది!!
నేను చెప్పానా! నువ్వే నాకోసం వస్తావని!!
అయినా నేను పిశాచిని కాదు సిక్స్ ఫీట్!!
నేను నీ ప్రియమైన ప్రియురాలిని!!
నేను నిన్ను పీక్కు తినను సిక్స్ ఫీట్!!
నేను నిన్ను ప్రేమిస్తున్నాను సిక్స్ ఫీట్!!
కావాలంటే, నువ్వే నన్ను తినేసెయ్యి!!
ఐ యామ్ ఆల్వేస్ రెడీ సిక్స్ ఫీట్!!
ఒక్క మాటకి ... ఆన్ చేసి ఉంచిన కెమెరా ముందు...
నాన్ స్టాప్ గా వాగుతున్న యాంకర్ లాగా.....
వాగేస్తున్న, పొట్టి దాని వాగుడికి.....
హుస్.... దేవుడా!!
వచ్చింది, తగులుకుంది, ఇంకా వదలదు, దీని నుంచి నువ్వే నన్ను కాపాడు స్వామి!! అందరి ముందు నా పరువు పోకుండా నువ్వే చూడు స్వామి!! అంటూ... మన సిక్స్ ఫీట్, పైకి చూస్తూ, దేవుడికి అప్లికేషన్ పెట్టుకుంటున్నాడు!!
సిక్స్ ఫీట్, నీకు దేవుడు కనిపిస్తున్నాడా!!
ఎగ్జాక్ట్ గా సిక్స్ ఫీట్ ఎలా నుంచున్నాడో, అలాగే నుంచొని ఆకాశం వైపు చూస్తూ అడుగుతుంది, మన పొట్టిది!!
చిన్నపిల్లల చేతుల్లోని బెలూన్ పగిలిపోతే ఒక్కసారిగా జడుసుకొని, బిక్క మొహాలతో పిల్లలు ఎలా నిలబడతారో... అలా మన హీరో ఫ్రెండ్స్ ఇద్దరు అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితుల్లో విగ్రహాల్ల నిలబడ్డారు.
దేవుడు కాదే..!! నాకు ఏకంగా స్వర్గమే కనిపిస్తుంది.
నిన్ను పంపించన..??
అమ్మో 6 ఫీట్ స్వర్గానికా...??
అప్పుడేనా..?? వద్దు వద్దు సిక్స్ ఫీట్!!
నువ్వు నన్ను ప్రేమించాలి..!!
నేను నిన్ను ప్రేమించాలి..!!
మనం మన ప్రేమను, పంచుకోవాలి!!
మన ప్రేమలో, మనం మునిగి తేలాలి!!
అప్పుడు!! ఇవన్నీ అయిన తర్వాత...
అప్పుడు వెళ్దాం...!!
అప్పుడు, మనిద్దరం కలిసే వెళ్దాం!!
అయినా నువ్వు పక్కన ఉండగా....
నాకు స్వర్గంలో ఉన్నట్టే ఉంటుంది సిక్స్ ఫీట్!!
నీకు తెలుసు కదా సిక్స్ ఫీట్!!
అంటూ.. దుప్పట్ట అంచులను వేళ్ళతో ముడి వేస్తూ...
కాలి బొటనవేలతో, నేల మీద రాస్తూ....
బాడీ అంతా అష్టవంకరలు తిప్పుతూ...
సిగ్గుతో మెలికలు తిరుగుతూ, మాట్లాడుతుంది.
మన ఇంటి పెళ్లి కదా!! అని, మేనేజ్ చేయడానికి ప్రయత్నిస్తున్న... మన హీరో గారి కోపం నషాలానికి ఎక్కుతుంది!!
పొట్టి దాని వేషాలు, మెలికలు తిరగడాలు, మెలితిప్పడాలు, కవ్విస్తూ.... పొట్టిది వాగే వాగుడు!! అంతా కలిపి, మన సిక్స్ ఫీట్ శివాలెత్తుతాడు!!
ఒసేయ్ పిచ్చిదానా..!!
ఏం వాగుతున్నావే నువ్వు!!
బతకనీవ్వవా, నన్ను??
నేను పక్కనుంటే స్వర్గంలో ఉన్నట్టు, ఉంటుందా??
నువ్వు పక్కన ఉండి, నాకు నరకం చూపిస్తున్నవే!!
నువ్వు, నీ చెత్తవాగుడు..!! ఆ...ఆ...ఆ...!!
అని అరిచేస్తూ... పొట్టి దాని మీద పడిపోతున్నాడు!!
ఒక్క మాట, ఒక్క మాటకి చంపేస్తున్నావు కదే!!
పిచ్చే నీకు..!! నీకు నిజంగా పిచ్చి ఉందే కన్ఫామ్!!
ఏ పిచ్చి హాస్పిటల్ నుంచి పారిపోయి వచ్చావే..??
చెప్పవే, తీసుకెళ్లి అక్కడ పడేస్తాను!!!
నాకు ఈ గోల వదిలిపోయిద్ది.
నరకం... డైరెక్ట్గా నరకం... చూపిస్తున్నవ్ నాకు!!
పిచ్చపిచ్చగా అరిచేస్తూ ఫుల్ గా ప్రస్టేట్ అవుతున్నాడు!!
సిక్స్ ఫీట్ అరుపులకి, పోల్స్ లా నిలబడిన ఫ్రెండ్స్ ఇద్దరు గబగబా మన హీరోని పట్టుకొని.. వెనక్కి లాగుతున్నారు.
సిక్స్ ఫీట్ బాగుందా..!!
క్యూట్ గా, అందంగా నవ్వుతూ...
మన హీరోకి సైట్ కొట్టుకుంటూంది పొట్టిది.
అంత తిట్టిన, అంత అరిచిన, అసలు ఏం మాత్రం చలించని వండర్ ఉమెన్ లా కనిపిస్తున్న పొట్టి దాన్ని చూసి తుఫాను తాకిడికి రెపరెపలాడుతున్న సిగ్నల్ లైట్ మాదిరి తయారైంది వాల్ల పరిస్థితి!! వెలుగుతుంది! ఆరుతుంది! అదేంటో కానీ, సరిగ్గా అర్థమయి చావట్లేదు!!
ఏంటే బాగుండేది..!!
అంటూ, మళ్లీ మీద మీదకు వస్తున్నాడు!!
పొట్టి దాన్ని దెబ్బకి హీరోని ఆపడం మానేసి...
జీరో టైప్ నిలబడిపోయి...
చూస్తున్నారు, మిగతా ఇద్దరు.
అదే సిక్స్ ఫీట్..!!
నరకం కనిపిస్తుంది అన్నావు కదా!
అది ఎలా ఉందో అడుగుతున్నాను!!
ఇందాక స్వర్గం కనిపించింది, అన్నావు కదా!!
ఇప్పుడు చెప్పు??
నరకం బాగుందా!!
స్వర్గం బాగుందా!!
మన పొట్టిది అంతే, క్యూట్ గా...
నవ్వుతూ అడుగుతుంది.
మన హీరో కి నేరుగా, సాకెట్ లో వేలు పెట్టినట్టుంది!!
ఒళ్లంతా జర్రున షాక్ కొట్టినట్టు అయింది!!
ఏంటి పొట్టి? ఏమని అడిగావు??
నరకమా! స్వర్గమా!
బాగున్నాయా, అని నన్ను అడుగుతున్నావా??
నేను చెప్పడం ఎందుకు..??
నువ్వే నేరుగా చూద్దువు గాని దా..!!
నిన్ను నేను, పంపిస్తాను..!!
నువ్వు చూసి, నాకు చెబుదువు గాని!!
ఉదయం మిస్సయ్యావు కానీ...
ఇప్పుడు పైకి పార్సిల్ చేస్తా!!
దావే పొట్టి దాన..... అంటూ,
పొట్టి దాని, గొంతు పట్టేసుకున్నాడు!!
జీరోస్ లాగ నిలబడిన, ఫ్రెండ్స్ ఇద్దరు ఫాస్ట్ గా ముందుకొచ్చి, మన హీరోని వెనక్కి లాగి పట్టేసుకున్నారు!!
విడిపించుకోవడానికి మన హీరో ముందు, ముందుకి లాగుతున్నాడు!!
పొట్టిది మాత్రం చక్కగా నిలబడి...
నవ్వుతూ వాళ్ళ ముగ్గురిని చూస్తుంది.
మన హీరో వదలమంటు, ముందుకు లాగా!!
వద్దు ఆగమంటూ, ఫ్రెండ్స్ వెనక్కి లాగా!!
ఇలా వాళ్ల లాగుడు కుస్తీల మధ్య...
అంతకు ముందే బక్కోడు...
మన హీరో చేతిలో పెట్టిన...
మూడ్స్ ప్యాకెట్ కాస్త జారి కింద పడింది!!
వీళ్లేమో అది గమనించుకోలేదు!!
కానీ పొట్టిది గట్టిది కదా!!
పొట్టి దాని కంట్లో పడిపోయింది!!
వెంటనే, ఆ ప్యాకెట్ చేతిలోకి తీసుకుంది!!
అది చూసిన మన హీరో, అండ్ ఫ్రెండ్స్ ముగ్గురు!! కంగారుపడుతూ ఒకరి ముఖాలు...
ఒకరు చూసుకుంటూ నిలబడిపోయారు!!
@@@@@@@@@
తదుపరి భాగం... మీ కోసం, వెయిట్ చేస్తూ ఉంది.
హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ మీ!!
డోంట్ ఇగ్నోర్!!
5 స్టార్ రేటింగ్, మీ కామెంట్, మీ కాంప్లిమెంట్!!
మళ్లీ కలుద్దాం.
థాంక్యూ.
వర్ణ.