ఆగమనం.....
లేదురా, ఈగో గురించి కాదు!!
ఆ అమ్మాయి గురించి కూడా కాదు!!
నీ గురించే రా!!
ఒకవేళ నువ్వు కూడా ఆ అమ్మాయిని... ఇష్టపడుతున్నావా!!
అదేరా, ప్రేమించడం మొదలు పెట్టావా??
అతని మనసులో అనిపించినది, బయట పెట్టాడు.
మెట్లు దిగుతున్న వాడు, అలాగే నిలబడిపోయాడు!!
అనాలోచితంగా అడిగాడో, ఆలోచించి అడిగాడో!!
అడిగిన మాటలకు మాత్రం ఒక్క క్షణం...
మన హీరో ఆలోచన ఆగిపోయింది!!
వెంటనే అలర్ట్ అయ్యి, ఏమి మాట్లాడకుండా...
కిందకు దిగిపోతున్నాడు!!
ఏంటి రా, నిన్ను అడుగుతుంటే...
అలా వెళ్ళిపోతున్నావు??
నీకేమనిపిస్తుందో చెప్పు??
అని వెంట దిగుతున్నాడు.
దాని గురించి వదిలేయరా!!
ఇంక మాట్లాడకు!!
అని విసుక్కుంటూ, వెళ్తున్నాడు!!
వదిలేయమంటే, అర్థం కాలేదు!!
నీ ఆలోచన ఏంటో, చెప్తేనే కదరా తెలిసేది!!
అంటూ, ముందుకు వచ్చి నిలబడ్డాడు!!
వదిలేయమంటే, వదిలేయ్యమనే!!
ఇప్పుడు అది అవసరం లేని విషయం!!
మనకు చాలా పనులు ఉన్నాయి!!
ముందు మండపానికి వెళ్లాలి, పద వెళదాం!!
అంటూ, ఆ మ్యాటర్ అక్కడితో కట్ చేసి...
ఫ్రెండ్ ని తీసుకొని వెళ్ళిపోతాడు.
మండపనికి వెళ్లడం, అక్కడ పనులు చూసుకోవడం, తిరిగి ఇంటికి రావడం, ఇంట్లోని హడావిడితో... అంత బిజీ బిజీగా గడిపేస్తున్నాడు.
పచ్చటి తోరణాలతో, కళకళలాడుతున్నా, పెళ్లికూతురు ఇంట నిండుగా ఉన్న బంధువులతో, స్నేహితులతో ఒక్క క్షణం ఖాళీగా ఉండకుండా... పెళ్లికూతురు అన్నగా అన్ని బాధ్యతలు చూసుకుంటున్నాడు! అంత హడావిడిగా ఉన్నా కూడా పొట్టిది చేసిన ఘనకార్యం, దాని హడావిడి అంతా ప్రతిక్షణం ఏదో ఒక రూపంలో గుర్తుకొస్తూనే ఉంది.
సాయంత్రం నాలుగు దాటుతుండగా... బంధువులందరితో కలిసి, కుటుంబంతో పాటుగా.... కళ్యాణ మండపానికి చేరుతాడు!!
మన హీరో కుటుంబం గురించి ఒక్క క్షణం చూద్దామా ఇక్కడ...
అమ్మ నాన్న, ఒక అక్క, ఒక చెల్లి, మన హీరో అక్కకి చెల్లికి మధ్యలో వాడు. యూఎస్ లో, బిజినెస్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ కంప్లీట్ చేసుకుని వచ్చాడు. యూఎస్ లో సెటిల్ అవడం ఇష్టం లేదు! మాతృదేశం మీద, కుటుంబం మీద, ప్రేమ ఎక్కువ, అబ్బాయి గారికి.
అక్కకు పెళ్లయింది!! వచ్చిన బావ బంగారం!! వాళ్ళిద్దరికీ ఒక పాప!! ఇప్పుడు చెల్లికి పెళ్లి, రాబోతున్న బావ కూడా బంగారమే కావచ్చు...!! అక్క, చెల్లివి ఇద్దరివి అరేంజ్డ్ మ్యారేజస్!! ఇక మన హీరో సంగతి తెలియదు!! చూడాలి మరి ఎటువైపుకి పయనిస్తాడో.....
మండపానికి వచ్చిన దగ్గరనుంచి..
ఆ ఇంటి మగ బిడ్డగా అన్ని చూసుకుంటూ!!
అక్కకి తమ్ముడుగా అందుబాటులో ఉంటూ!!
పాత బావకి, పాత బామ్మర్ది గా పరాచకాలు ఆడుతూ... రాబోతున్న బావగారికి, కాబోతున్న బావమరిదిగా...
రాచా మర్యాదలు చేస్తున్నాడు!!
ఏరా తమ్ముడు, మీ బావని చూసావా??
ఎటు పోయారో, ఈ మనిషి...
కరెక్ట్ టైం కి, మిస్ అయిపోతాడు!!
అంటూ, గదిలోకి వస్తున్న తమ్ముడిని...
కంగారుగా అడుగుతుంది!!
అక్క ఇప్పుడు బావతో ఏం పని ఉంది??
చెల్లిని రెడీ చేయడం అయిపోయిందా??
అని అడుగుతూ, చెల్లి దగ్గరికి వచ్చి చూసుకుంటున్నాడు!!
అన్నయ్య, అక్కకి బావతో ఏ పని లేదు!!
బావ దగ్గరున్న పాపతోనే పని!!
పాపకి బట్టలు మార్చాలి.
అమ్మకి చెప్పి పంపించాము!!
ఇంతవరకు అడ్రస్ లేరు!!
ఒకసారి నువ్వు చూడు అన్నయ్య!!
అక్క చాలా కంగారు పడుతుంది!!
అక్క పాప సంగతి నేను చూసుకుంటాను!!
ముందు నువ్వు రెడీ అవ్వు!!
మళ్ళీ పంతులుగారు పీటల మీదకి రమ్మంటారు!!
అప్పుడు నీకు, ఇబ్బంది అయిపోతుంది!!
చెల్లి పక్కనే నువ్వు ఉండాలి కదా!!
అంటూ, అక్కకి సర్ది చెబుతున్నాడు!!
ఆ సంగతి నాకు తెలుసు కానీ...
ఇక్కడ నీకైతే ఏ పని లేదు!!
నీ చెల్లి, నా చెల్లి ఈ పెళ్లికూతురు సంగతి...
మేమంతా చూసుకుంటాము కాని...
నువ్వు తిన్నగా వెళ్లి ఫస్ట్ అత్త వాళ్ళని పంపు!!
అమ్మ అత్త వాళ్ళు ఇప్పుడే వస్తాము..
అని వెళ్లారు, ఇంతవరకు రాలేదు!!
తరువాత,మీ బావ ఎక్కడున్నా వెతికి...
పాపని మీ బావని ముందు అర్జెంటుగా పంపు!!
సరేనా...!! పో... పో... నా చిట్టి తమ్ముడు!!
అంటూ... వెక్కిరిస్తూ, నవ్వేస్తుంది!!
అక్క అంటున్న మాటలకి చెల్లి తో సహా... అక్కడ ఉన్న ఆడంగులు, అందరూ కలిసి నవ్వేస్తున్నారు!!
అక్కతోపాటు నవ్వుతున్న మిగతా అందరిని, చూసుకుంటూ... చెల్లి దగ్గరికి వెళ్ళాడు!!
నిలబెట్టి, అంత చెక్ చేసుకుంటున్నాడు!!
ఏంటన్నయ్య బాగున్నానా? బాగోలేదా?
అక్క చాలా కష్టపడి రెడీ చేసింది!!
మీ బావ పడిపోతాడంటావా?? చెప్పు!!
అని, నవ్వుతూ కవ్విస్తుంది!!
ఆమె మాటలకి, చుట్టు ఉన్న ఫ్రెండ్స్ తో సహా...
అందరూ, మళ్లీ నవ్వేస్తున్నారు!!
బావ పెళ్లిచూపుల్లోనే పడిపోయాడు!!
ఆ సంగతి వదిలేద్దాం..!!
నువ్వు మాత్రం బంగారు బొమ్మలా, భలే ఉన్నావు!! అని ప్రేమగా చెల్లి, నుదురు మీద ముద్దు పెట్టుకున్నాడు!!
అక్క, దీనికి ఈ దిష్టి చుక్క కొంచెం పెద్దది పెట్టకూడదా?? నా దిష్టి తగిలేలా ఉంది..!!
అంటూ, ఇష్టంగా చెల్లిని చూసుకుంటున్నాడు!!
పెట్టొచ్చుగా, ఎందుకు పెట్టకూడదు?? అప్పుడు అది పెళ్లికూతురు బుగ్గన పెట్టే దిష్టి చుక్క అవ్వదు!!
నా కూతురు కాలికి పెట్టే, దిష్టి చుక్క అవుతుంది!!
పెట్టమంటావా మరి...???
నీకు బాగా ఎక్కువయింది..!!
నాకు తెలియక అడిగితే,
ఆటపట్టిస్తున్నావు కదా!!
నీకు తెలియనివి తెలుసుకుంటావని చాలా చెప్పానురా!! తొందరగా తెలుసుకో, పైకి వస్తావు!!
ఇప్పుడు నువ్వు వెళ్లి మీ బావని పైకి పంపు!!
నా కూతుర్ని రెడీ చేసుకోవాలి!!
వెళ్ళు పో!! అంటూ, హడావిడిగా బయటికి పంపుతుంది!!
బయటకు వచ్చి అక్క చెప్పినట్టు, బావని పంపేసి..
మేనత్త కోసం వెతుక్కుంటున్నాడు!!
అన్నయ్య.... అని పిలుస్తూ!!
మేనత్త అల్లుడు కనబడగానే...
పరిగెత్తుకుంటూ, దగ్గరికి వెళ్తాడు!!
ఏంట్రా, ఎందుకలా పరిగెడుతున్నావు!!
ఇంకెందుకు.. నా మేనత్త కోసం!! మీ అత్త కోసం!! ఎక్కడున్నారు?? అసలు, కనబడడం లేదు!!
నా అత్త, నా పెళ్ళాం, నీ ఫ్రెండ్స్, నీ మేనత్త... అందరూ పిల్లల్ని భోజనాలకి దగ్గరికి తీసుకువెళ్లారు!! వెళ్ళు పో!! అందరూ అక్కడే ఉన్నారు!! అని చెప్పేసి కుర్తా మీద పడిన సాంబార్ ని, టిష్యూ తో తుడుచుకుంటూ, వెళ్లిపోతాడు!!
అప్పుడే సాంబార్ తో అన్నయ్యకి, అభిషేకం అయిందన్నమాట!? అందుకే, మొఖం అలా కాలిపోతుంది!! అని, నవ్వుకుంటూ డైనింగ్ హాల్ వైపుకి వెళ్తాడు!!
కళ్యాణ మండపంలో, పైన పెళ్లికి...
కింద భోజనాలకి, ఏర్పాట్లు చేశారు!!
మండపానికి బయట మొత్తం... ఒకపక్క గార్డెన్, మరొకపక్క పార్కింగ్ ఏరియా!!
స్నాక్స్, స్టార్టర్స్, జ్యూస్ లు, కిల్లీలు, ఐస్ క్రీమ్స్, లాంటివన్నీ... గ్రాండ్ గా గార్డెన్ లో....
లోపల డిన్నర్ కి, అరేంజ్మెంట్స్ చేశారు!!
అత్త కోసం డైనింగ్ హాల్ మొత్తం వెతికేస్తాడు!!
అక్కడ కనబడక పోవడంతో గార్డెన్ లోకి, వస్తాడు!!
బ్యాచ్ మొత్తం ఒకే చోట కూర్చుని స్టాటర్స్...
అన్ని వెరైటీస్, షేర్ చేసుకొని తింటున్నారు!!
అత్త మీరంతా ఇక్కడ ఉన్నారా!!
మీకోసం, లోపల వెతుకుతున్నాను!!
అంటూ, ఫ్రెండ్స్ వైపు ఒక సీరియస్ లుక్ ఇస్తాడు!!
ఏరా, మాకోసం ఒక నాలుగు అడుగులు తిరగలేవా?? ఏంటి, దీనికే అలా ఫీల్ అవుతున్నావు!!
ఊరుకో అత్త నాలుగు అడుగులు కాకపోతే,
40 అడుగులు తిరుగుతాను!!
నీకోసం కాకపోతే, ఇంకెవరి కోసం తిరుగుతాను!!
ముందు పదండి వెళ్దాం!! అక్క పిలుస్తుంది!!
అయినా, చెల్లి దగ్గర ఉండకుండా...
ఈ పిల్ల మూకాని, వేసుకొని ఇక్కడ,
ఎందుకు సెటిల్ అయ్యారు??
ఏంట్రా నువ్వు, పిల్లల సరదా పడితే...
అందర్నీ తీసుకొచ్చాం!!
నీకు మరి ఈమధ్య కోపం పెరుగుతుంది రా!!
ఆ ముక్కు మీదే, ఉంటుంది!!
నీకు ఇప్పుడు కావాల్సింది, అమ్మే కదా!!
అమ్మని తీసుకువెళ్ళు!!
మేమంతా, ఒక రౌండ్ కంప్లీట్ చేసుకుని వస్తాం!!
అని తల్లికి వెళ్లమని చెప్పేసి, చక్కగా పిల్లలతో పాటు తింటుంది... మన హీరో మేనత్త కూతురు!!
ఏంటి, ఒక రౌండ్ కంప్లీట్ చేసి వస్తారా!!
పెళ్లి అయ్యేవరకు ఇటు పక్కకి, ఎవరైనా వచ్చారో కాళ్లు విరిగిపోతాయి!! ఒక్క ఐస్ క్రీమ్ కూడా మీకు ఇవ్వను!! అని అందరిని బెదిరించేస్తూ... మొత్తాన్ని, హడావిడిగా లేపేస్తున్నాడు!!
తల్లి వెళ్దాం పదవే!! పెళ్లి అయ్యాక వచ్చి తీరిగ్గా తిందురు గాని!! పదండి, పదండి... అంటూ, అతని మేనత్త, కూడా సపోర్ట్ చేస్తుంది!!
మన హీరో గోల పడలేక, హీరో ఫ్రెండ్స్ తప్ప మిగిలిన మొత్తం... అక్కడ నుంచి బయలుదేరారు!!
@@@@@@@@@
తదుపరి భాగం... నీ కోసం, వెయిట్ చేస్తూ ఉంది.
రేటింగ్ ఇచ్చే ప్రతి ఒక్కరికి థాంక్స్ చెప్పాలని ఉంది!!
ఒక్క సింగిల్ వర్డ్ సమీక్ష ఇవ్వండి!!
ఒక సమీక్ష ద్వారా...
మీకు థాంక్స్ చెప్పే అవకాశం నాకు ఇవ్వండి!!
నీ రేటింగ్, సమిక్ష, స్టిక్కర్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను.
నేనే కదా అని ఇవ్వకుండా వదిలేయకు!
నీకు కూడా విలువ ఉంది ఇక్కడ!
నీవు కూడా నాకు, అమూల్యమే!
మళ్లీ కలుద్దాం.
థాంక్యూ.
వర్ణ.