Featured Books
  • పాణిగ్రహణం - 1

    ఈ కథ పూర్తిగా కల్పితం..కళ్యాణ మండపం...ఈ సిటీ లోనే పెద్ద పెద్...

  • తనువున ప్రాణమై.... - 14

    ఆగమనం.....మన హీరో పిట్ట కథలాగా చెప్పిన పొట్టి దాని ప్రేమ కథ...

  • ప్రేమలేఖ..? - 2

    తన ప్రమేయం లేకుండానే సన్నగా వణికి పోతుంది లీలా.తలుచుకుని బ్ర...

  • అంతం కాదు - 6

    అద్భుతమైన మలుపు!ఎపిసోడ్ 12: అంతర్ధానం – ఒక లోకానికి అంతం, మర...

  • థ జాంబి ఎంపరర్ - 4

    పారిపోతుంది.ద జాంబి ఎంపరర్ (The Zombie Emperor)రాంబాబు జ్ఞాప...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

తనువున ప్రాణమై.... - 14

ఆగమనం.....


మన హీరో పిట్ట కథలాగా చెప్పిన పొట్టి దాని ప్రేమ కథ విన్న ఫ్రెండ్స్ ఇద్దరు నోర్లు వెళ్లబెట్టి, గుడ్లు బయటపెట్టి...
సిమ్ కార్డు పీకేసిన సెల్ ఫోన్స్ లాగా దర్శనమిస్తున్నారు!

విన్న వాళ్ళ పరిస్థితే అలా ఉంటే!!
ఫేస్ చేసిన మన హీరో పరిస్థితి, 
ఈ మాత్రం ఉండొచ్చు!!

ఫ్రెండ్స్ ఇద్దరి పరిస్థితి చూసి... మన హీరో... ఇద్దరికీ చెరోక, డిప్ప కాయ ఇచ్చాడు!!

ఇద్దరు తేరుకొని, మన హీరోని ఏగదిగా చూస్తున్నారు!!

ఒరే బావ నువ్వు చెప్పింది వింటుంటే.. చిన్న సైజు రొమాంటిక్ మూవీ, విత్ యాంగ్రీ బర్డ్ లా ఉంది!!

ఏంట్రా నీకు అంత వెటకారంగా ఉందా, నా కోపం చూస్తుంటే.!!

లేదు బావ!! వెటకారం కాదు, ఆ పిల్ల చేసిన దానికి, నీకు కోపం రావడం కరెక్టే!! నేను 100% నీకు సపోర్ట్ చేస్తున్న!! కాని అలా కాదురా, అసలు ఆడపిల్లలు ఇంత అడ్వాన్స్ ఎప్పుడైపోయారు??  పబ్లిక్ ప్లేస్, లిప్ కిస్, అలా మీదకి ఎక్కేసి.... వామ్మో, వామ్మో వింటుంటే నాకే ఎలాగో ఉంది!! నువ్వు ఈ మాత్రం ఉండటం తప్పు లేదురా!!

అవును కదా!! తప్పు లేదు కదా!! ఆ పొట్టి దాన్ని నేను చంపేయొచ్చు కదా!! అసలు, అది కానీ నా చేతికి దొరికిందంటే.....ఆ పొట్టి దాన్ని తిరగేసి.. తప్పి... తప్పి.. తప్పి అని నాలుగు పీకే వాడిని!! దొంగ మొఖంది, పొట్టి మోహంది, పొట్టి వాగుడుకాయి!! 

అసలు అది వాగుతుందిరా... ఒక్క మాటకి, ఒక్క మాటకి రా...వంద చెప్తుంది!! లెక్క పెట్టి చెప్పొచ్చు 100... 100... వాగుతుంది!! అది నాకు కనబడాలి చచ్చిందె, నా చేతిలో!! అచ్చు యాగ్రీబర్డ్ లా పిచ్చ ఆంగ్రితో... పొట్టి దాన్ని ఏదో ఒకటి చేసేయాలని ఫిక్స్ అయిపోయాడు.

ఒరేయ్ మామ నాకెందుకో... వేరేలా అనిపిస్తుంది రా!! అంటూ, బక్కోడు ఏదో తెలుసుకున్న వాడిలా మధ్యలో దూరిపోయాడు.

బక్కోడి ఎక్స్ప్రెషన్ కి... ముఖం చిట్లించి మన హీరో వాడిని చిరాగ్గా చూస్తున్నాడు.

ఒరేయ్ బక్కోడా, నీకు బాగా ఎక్కువైంది!!  
ఆ పిల్ల చేసిందానికి, మనోడికి ఈ మాత్రం కోపం రావచ్చు!! ఎగస్ట్రాలు చేసావే అనుకో... నిన్ను నేను ఇప్పుడే చంపేస్తా!! అని బక్కోడికి వార్నింగ్ ఇస్తున్నాడు, రెండవ వాడు!!

ఒరేయ్ నువ్వు ఎన్నైనా చెప్పు!! నాకనిపించింది, నేను చెబుతాను అంతే!! అని బక్కోడు మొదలుపెట్టాడు...

మామ ఏ మాటకి ఆ మాట.. ఆ అమ్మాయి ఇచ్చిన ఫ్రెంచ్ కిస్ సూపర్ మామ!! నువ్వు అయితే బాగా ఎంజాయ్ చేసావు, అది క్లియర్ గా తెలుస్తోంది!! కానీ, నీకు కోపం ముద్దు పెట్టినందుకు రాలేదు మామ!! 

ఆ అమ్మాయి నీకన్నా ముందు... నీకు ముద్దు పెట్టినందుకు వచ్చింది మామ!! ఇక్కడ, నీ ఈగో హర్ట్ అయింది!! అందుకే నీకు ఇంత కోపం!! అయినా ఎందుకు మామ, అంత కోపం? ఆడపిల్ల ఇష్టపడి దగ్గరకు వచ్చి ముద్దు పెడితే, ఎంజాయ్ చేయాలి మామ!! అని పిచ్చ రొమాంటిక్ ఫీల్ తో... నోటికి వచ్చింది వాగుతున్నాడు!!

తిక్క తిక్కగా ఉన్న మన యాంగ్రీ బర్డ్ ఊరుకుంటాడా?? 
చావగొట్టి, చెవులు ముయ్యడు??
లేచి నిలబడి బక్కోడిని, కోపంగా చూస్తూ... పిచ్చపిచ్చగా కాళ్లతో తంతున్నాడు!!

ఏంట్రా వెధవ నీకు నా ఈగో కనిపిస్తుందా!! హ్యాపీగా ఎంజాయ్ చేయాలా!! ఆ పొట్టిది చేసిన చెత్త పని కనిపించడం లేదా?? అది వాగిన వాగుడు వినిపించలేదా?? ఎదవ, పనికిమాలిన వెధవ, చావా రా చావు...!! అంటూ, పిచ్చిపిచ్చిగా కొడుతున్నాడు!!

ఒరేయ్... ఒరేయ్... బావా!! ఆగరా.. ఆగరా బాబు!!
అంటూ.. ఇంకొకడు గట్టిగా పట్టేసుకుని మన హీరోని వెనక్కి లాగేస్తున్నాడు.

ఒరేయ్ బక్క వెధవ, పోరా... ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు!! నీకు ఎన్నిసార్లు చెప్పినా ఆ నోరు కంట్రోల్లో ఉండదు!! వాడి చేతిలో... తన్నులు తిని చస్తావ్!! అని మన హీరోని పట్టుకునే, బక్కోడి మీద అరిచేస్తున్నాడు.

మన బక్కోడు ఏమన్నా తక్కువ తిన్నాడా? కొట్టాడన్న ఆలోచన కూడా లేకుండా... నేను చెప్పింది కరెక్ట్!! నేను కరెక్ట్ గానే చెప్పాను!! నువ్వు అందుకే కోపంగా ఉన్నావు!! అని అరుస్తునే.... అక్కడినుంచి పారిపోతాడు.

పారిపోతున్న బక్కోడిని కోపంగా చూస్తూ... పట్టుకున్న వాడి చేతుల నుంచి విడిపించుకొని, డాబా పిట్టగోడ దగ్గరికి వెళ్లి నిలబడ్డాడు!!

ఒరే బావ సాయంత్రం పెళ్లి రా!! వాడి మాటలు పట్టించుకోకు!! అలాగే, ఆ అమ్మాయి విషయం గూడా వదిలేసేయ్!! ఫంక్షన్ హాల్ నుంచి ఫోన్ చేశారు రా!! మళ్లీ చేయమని చెప్పాను! ఆ డెకరేషన్ ఏదో మార్చమని చెప్పావంట కదా!! ఒకసారి వాళ్లతో మాట్లాడు!! అంటూ పక్కనే వచ్చి నిలబడతాడు!!

సరే రా నేను మాట్లాడుతాను!! లేదంటే ఒకసారి వెళదాము!! నన్ను కాసేపు వదిలేసేయ్!! అంటూ,అదే ఫీలింగ్ తో మాట్లాడుతున్నాడు!!

ఒరేయ్, నువ్వు చాలా డిస్టబెన్స్ లో ఉన్నావు, నాకు తెలుస్తుంది!! అప్పుడప్పుడు ఇటువంటి జరుగుతాయి!!పట్టించుకుంటే ఎలా రా?? నువ్విలా మూడ్ ఆఫ్ లో ఉంటే, నా వల్ల కాదురా!! వదిలేయ్ రా బావ!!

ఎలా వదలమంటావు రా?? నిజంగానే, చాలా డిస్టబెన్స్ గా ఉంది!! ఆ పొట్టిది నన్ను, అంతలా డిస్టర్బ్ చేసింది!!
నీకు అది చెప్పినా, అర్థం కాదు!!

ఒరేయ్ నువ్వు అనవసరంగా ఎక్కువగా ఆలోచిస్తున్నావేమో... ఒకసారి ఆలోచించు!! ఒకవేళ ఆ పిల్ల ఆ టైపు అయితే, నువ్వు ఎందుకురా ఫీల్ అవ్వడం??
అంటూ, డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు.

ఆ టైపా..?? ఆ టైప్ అంటే..?? అనుమానంగా అడుగుతున్నాడు.

ఆ టైప్ అంటే... అదేరా, కాల్ గర్ల్స్!! డబ్బులు తీసుకుని....

రేయ్ ఆపరా..!! అని కోపంగా చూస్తున్నాడు!!

రేయ్ అలా చూడకు! ఒకవేళ అలా ఏమోనని, నిన్ను చెక్ చేసుకోమంటున్నాను! అంతే...!!

ఛా.. అలా కాదురా!! జెన్యూన్ రా!!
అది చేసిన పనికి, వేసిన వేషాలకి కోపం వచ్చింది!! దాని వాగుడితో ఇరిటేషన్ తెప్పించింది!! దాని మాటలు, తన ముఖంలో కనిపించిన ఆ ఫీలింగ్ అంతా జెన్యూన్ రా!! ఎటువంటి తేడా లేదు!!

పిచ్చ పొట్టిది!! 
చాలా కోపం తెప్పించింది!! 
కానీ, దాని కళ్ళు ఉన్నాయి చూడు. 
అవి భలే మాట్లాడతాయి రా!! 
చాలా ఇరిటేట్ చేసింది!! 
వదిలేయ్ రా, కాసేపటికి అదే సెట్ అవుతుంది!!

అతనికి, చాలా అసహనంగా అనిపిస్తుంది. ఎంత డైవర్ట్ చేద్దామన్న, పొట్టి దాని ఆలోచన వదలడం లేదు. ఒంటరిగా ఉండడం కన్నా, పనిలో పడితే అన్న... పొట్టి దాని ఆలోచన నుంచి బయటకు రాగలనేమో... అని అనిపిస్తుంది.

ఒరేయ్ కిందకి వెళ్దాం పదా!! ఆ డెకరేషన్ సంగతి ఏంటో, వెళ్లి చూద్దాం!! ఇలా ఉంటే అక్కకి బర్డెన్ అవుతుంది!! పదరా వెళదాం. అంటూ, ఫ్రెండ్ ని తీసుకుని కదిలాడు!!

బావ నాకు నీ మాటలు వింటుంటే, మరోలా అనిపిస్తుంది రా!! ఎందుకు నువ్వు...... అని సాగదీస్తూ... ఇంకోసారి ఆలోచించు. అని సలహా ఇస్తాడు!!

ఏం ఆలోచించాలి రా!! 
ఆ బక్కోడి లాగా నువ్వు కూడా, 
నాది ఈగో అనుకుంటున్నావా?? 
లేకపోతే, ఆ పొట్టిది అలా కాదు ఇంకేమన్నానా... 
అని ఆలోచించమంటున్నావా??

లేదురా, ఈగో గురించి కాదు!! 
ఆ అమ్మాయి గురించి కూడా కాదు!! 
నీ గురించే రా!! 
ఒకవేళ నువ్వు కూడా ఆ అమ్మాయిని... ఇష్టపడుతున్నావా!! 
అదేరా, ప్రేమించడం మొదలు పెట్టావా??
అతని మనసులో అనిపించినది, బయట పెట్టాడు.

@@@@@@@@@

తదుపరి భాగం... నీ కోసం, వెయిట్ చేస్తూ ఉంది.

నీ రేటింగ్, సమిక్ష, స్టిక్కర్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను.
నేనే కదా అని ఇవ్వకుండా వదిలేయకు!
నీకు కూడా విలువ ఉంది ఇక్కడ!
నీవు కూడా నాకు, అమూల్యమే!
మళ్లీ కలుద్దాం.
థాంక్యూ.
వర్ణ.