Featured Books
  • మనసిచ్చి చూడు - 13

                   మనసిచ్చి చూడు....13అసలు ఎవరు రా నువ్వు కళ్యాణ...

  • మనసిచ్చి చూడు - 12

    మనసిచ్చి చూడు.....12అసలు ముందు ఎవరో చెప్పు మధు అన్నాడు గట్టి...

  • ఆశ్రయం

    ఆశ్రయం." ఎలాగైనా కుంభమేళాకు వెళ్లి వద్దాం అండి. మన బంధువులంద...

  • వసంతకేళి –హోళి!

    వసంత ఋతువు ఆగమనం మనుషులలో ఉత్సాహమే కాదు ప్రకృతిలో సరికొత్త స...

  • క్షమించు (ప్రేమ కథ)

    "నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా?" ఎనిమిది సంవత్సరాల కిందట...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

మనసిచ్చి చూడు - 13

               మనసిచ్చి చూడు....13


అసలు ఎవరు రా నువ్వు కళ్యాణ్ అని చాలా కోపంగా అన్నాడు.

చిన్నప్పటి నుంచి బంగారంల పెరిగిన నా మరదలి జీవితాన్ని నాశనం చేశావు,నిన్ను అంత తేలిగ్గా వదలను అనుకున్నాడు.

అలా రోజులు గడుస్తున్నా కొద్ది గౌతమ్ మధు జీవితాన్ని గురించి ఆలోచించడం సమీరాకి అసలు నచ్చడం లేదు.

ఈలోపు సమీరాని తీసుకొని ఒకసారి బయటకు వెళ్లాడు గౌతమ్.

నేను అత్తయ్య అమెరికా వెళుతున్నాము,అత్తయ్యను అక్కడ వదిలిపెట్టి వారం తరువాత నేను వస్తాను అన్నాడు.

ఇప్పుడు ఎందుకు అండీ సడన్గా అంది అనుమానంగా.

ఎందుకు అంటే ఏమీ చెప్పాలి సమీరా వెళ్లాల్సి సమయం వచ్చింది అన్నాడు.

ఇప్పుడు నేను ఉన్న పరిస్థితి తెలిసి కూడా వెళ్లాలనుకుంటున్నానురా అంది.

ఒక్క వారం త్వరగా వచ్చేస్తాను అన్నాడు.

సరే అండీ మీ ఇష్టం అంది.

అసలు విషయం నీకు చెప్తే నువ్వు అసలు తట్టుకోలేవు సమీరా అనుకున్నాడు.

వాళ్ల అత్తయ్యకు చెప్పి ఒప్పించాడు.

ముందు రాను అన్న తరువాత ఒప్పుకుంది.

ఇంట్లో అందరికీ అనుమానం వచ్చింది ఉన్నట్లు ఉండి ఇప్పుడు అమెరికా ఎందుకు అని.

రెండు రోజుల్లో వాళ్ల ప్రయాణం అనగా అప్పుడు సమీరా ఫోన్ వచ్చింది కళ్యాణ్ నుంచి.

ఎలా ఉన్నావు సమీరా అన్నాడు.

చాలా బాగున్నాను బావ నువ్వు ఎలా ఉన్నావు అంది.

పర్లేదు బాగానే ఉన్నాను అన్నాడు.

బావ నీకు పెళ్ళి అయింది అని విన్నాను నిజమా.....అంది.

అవును సమీరా అయింది అన్నాడు.

మరి మీ వైఫ్ తీసుకొని ఒంటికి రా బావ అంది.

తప్పకుండా వీలు చూసుకుని వస్తాను అన్నాడు.

సరే బావ ఉంటాను అని ఫోన్ పెట్టేసింది.

         *****************


కళ్యాణ్  కాల్ చేసిన విషయం గౌతమ్ కి చెప్పింది.

గౌతమ్ అంతా విని ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు అంటా,ఒక్కసారి ఇంటికి రమ్మని చెప్పు మీ అత్త ఫ్యామిలీని అన్నాడు.

సరే అండీ అంది.

గౌతమ్ కి ఇప్పటికీ ఇప్పుడు ఆ కళ్యాణ్ చెంప పగలకొట్టలని ఉంది చాలా కంట్రోల్ చేసుకున్నాడు కోపాన్ని.

మీతో కొంచెం మాట్లాడాలి అండీ అంది.

దేని గురించి సమీరా అన్నాడు అసహనంగా.

మీతో పాటు నేను కూడా వస్తాను అమెరికా అంది.

నీకు ఏమైనా మెంటల్ హ....నువ్వు ఈ పరిస్థితుల్లో ఉండి అంత దూరం ప్రయాణం చేయకూడదు అన్నాడు.

నాకు మీతో రావాలి అనిపిస్తుంది అంది అమాయకంగా.

చూడు సమీరా నీ బాధ ఏంటో నాకు అర్థం అయింది,ముందు నువ్వు నన్ను మధుని తప్పుగా చూడడం మానుకో.చాలా చాలా తప్పుగా ఆలోచిస్తున్నావు.మధు ఉన్న పరిస్థితి నీకు అర్థం కావడం లేదు అన్నాడు.

మీకు భార్య కంటే తనే ఎక్కువ అయిందా అన్నాడు.

అవును సమీరా మధు నాకు ఎక్కువే,నీకంటే నాకు తనే ఎక్కువ అన్నాడు.

అవునులే పెళ్లం వద్దు మరదలు ముద్దు కదా అంది.

ఏ నోరు మూయి,నోటికి ఎంత వస్తే అంత వాగకు తరువాత చాలా బాధ పడాల్సి వస్తుంది అన్నాడు.

నేను ఎందుకు బాధ పడతాను ,మీ వల్ల బాధ పడింది చాలదా అంది.

నీ ఇష్టం సమీరా ఊరికే ఎక్కువగా ఆలోచించి మనసు పాడుచేసుకోకు ఆరోగ్యానికి మంచిది కాదు అన్నాడు.

సలహా ఇచ్చినందుకు థాంక్యూ అంది.

నీ వెటకారం ఆపి పద భోజనం చేద్దాం అన్నాడు.

నాకు ఆకలిగా లేదు మీరు వెళ్ళి తినండి అంది.

అవసరం లేదు అని బెడ్ లైట్ ఆఫ్ చేసి పడుకున్నాడు.

ఇలా ఆకలితో పడుకోకూడదు అంది.

సలహా ఇచ్చినందుకు థాంక్యూ పడుకో ఇంక విసిగించకుండా అన్నాడు.

హాల్లోకి వెళ్ళి భోజనం తీసుకొని వచ్చింది సమీరా.

లేవండి ఆకలిగా ఉంది అంది.

కాసేపు అలిగినా తరువాత ఇద్దరు కలిసి తీనేసి పడుకున్నారు.

            ***************

ఉదయం త్వరగా నిద్ర లేచి రెడీ అయి జగదీష్కి కాల్  చేసి ఒక ప్లేస్ దగ్గరకు రమ్మని చెప్పి లొకేషన్ పంపించాడు.

సమీరాకి బై చెప్పి ఇంటి నుంచి హడావిడిగా బయలుదేరాడు.

అప్పటికే జగదీష్ కూడా అక్కడ ఉన్నాడు.

ఏమైంది రా ఇంత తెల్లవారుతో రమ్మనావు అడిగాడు.

ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి రా నీకు ఇది నీకు మధ్య తప్ప ఎవరికీ తెలియకూడదు అన్నాడు.

అంత ముఖ్యమైన విషయం ఏంటి రా చెప్పు అన్నాడు
జగదీష్కి గౌతమ్ జరిగిన విషయం అంత చెప్పాడు.

పాపం రా మధు చాలా ఇబ్బందులు పడుతుంది అన్నాడు.

వాడిని అసలు వదలకూడదు రా అన్నాడు జగదీష్.

వదిలే ప్రసక్తే లేదు రా.
రెండు రోజుల్లో నేను అత్తయ్య మధు దగ్గరకు వెళుతున్నాము నువ్వు ఇక్కడ ఇంట్లో వాళ్ళని జాగ్రత్తగా చూసుకో రా.

నువ్వు మళ్లీ చెప్పాలా రా,నేను జాగ్రత్తగా  చూసుకుంటాను మధుని ఇక్కడికి తీసుకొని వచ్చేరా.

తను ఇక్కడ ఉండడానికి ఇష్ట పడడం లేదు రా.విషయం అందరికీ తెలిస్తే వింతగా చూస్తారని.

సరే రా తను జాగ్రత్త అన్నాడు.

సరే పద ఆఫీసుకి వెళ్ళి పెండింగ్ వర్క్ ఏదైనా ఉంటే కంప్లీట్ చేస్తాను.

ఆఫీసులో పని ముగించుకొని ఇంటికి వెళ్లాడు గౌతమ్.

సమీరా వాళ్ల అమ్మ నాన్న వచ్చి ఉన్నారు.

చిన్న నవ్వు నవ్వి వాళ్ళని పలకరించి గదిలోకి వెళ్ళాడు.

సమీరా రెండు రోజుల్లో నా ప్రయాణం నువ్వు జాగ్రత్తగా ఉండు అన్నాడు.

సరే అంది.

నేను మళ్ళీ వచ్చే వరకు మీ అమ్మ వాళ్ళు ఇక్కడే ఉండమని చెప్పు.

మీరే చెప్పండి నేను చెప్తే బాగోదు అంది.
సరే తిన్నవా అన్నాడు.
లేదు ఇంకా మీకోసం ఎదురు చూస్తున్నాను అంది.
ఎదురు చూడడం ఎందుకు నువ్వు తినేసి ప్రశాంతంగా పడుకోవచ్చుగా.

పర్లేదు పదండి అందరూ వెయిటింగ్ అక్కడ భోజనానికి.

అందరూ కలిసి భోజనం చేశారు,హ్యాపీగా ఉన్నారు ఆరోజు.

మధ్యలో కళ్యాణ్ గురించి టాపిక్ వచ్చింది.

ఎవరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అని.

పిడికిలి బిగించాడు ఎవరో అమ్మాయి కాదు ఈ ఇంటి ఆడపిల్లె అనుకున్నాడు మనసులో.

కళ్యాణ్ టాపిక్ వచ్చిన ప్రతిసారి గౌతమ్లో వచ్చే మార్పును సమీరా గమనిస్తునే ఉంది.
విషయం ఏంటో మాత్రం తనకి అర్థం కావడం లేదు. 

ఎలాగైనా కనుక్కోవాలని ఒక ప్లాన్ వేసింది......?????

ఇంకా ఉంది 

                💐 ధన్యవాదాలు 💐 

                    అంకిత మోహన్ 
.