Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

సున్నుండలడబ్బా

 కిరణ్ అనే కుర్రవాడు కలపాడు అనబడే గ్రామంలో నివసిస్తూ ఉంటాడు. వాడంటే వాళ్ళ అమ్మకు అమితమైన ప్రేమ, వాడికి ఏమి కావాలో అవి కోరగానే తెచ్చి పెడుతూ ఉంటుంది. వాడి ఇంటర్మీడియట్ పరీక్షలు అవ్వగానే పై చదువులు నిమిత్తం పట్నం వెళ్లాల్సి వస్తుంది. వాళ్ళమ్మకు మాత్రం ఇకపై తనబిడ్డ దూరంగా ఉండబోతున్నాడనే విషయం గుర్తొచ్చినప్పుడల్లా గుండె తరుక్కుపోతూ ఉంటుంది. 

కానీ కిరణ్ తప్పనిసరిగా పై చదువుల నిమిత్తం పట్నం చేరుకోవాల్సి వస్తుంది. అలా కొన్ని రోజులు గడిచిపోయాయి. ఒకరోజు తన బిడ్డ బాగా గుర్తొచ్చి ఆ తల్లి తన కొడుకును చూసొద్దామని అనుకుంటుంది. దీనితో పాటు కిరణ్కి పది రోజులు కాలేజ్ కి సెలవివ్వడంతో ఆమె కిరణ్ దగ్గరకి వెళ్ళాలని నిశ్చయించుకుంటుంది. ఆమె వెళ్తూ వెళ్తూ కిరణ్ కి ఇష్టమైన సున్నుండలను తయారుచేసుకుని వెళుతుంది.

ఆమె అక్కడికి వెళ్లగానే నగర జీవితానికి అలవాటు పడిన తన కొడుకును మరియు తన కొడుకులో వచ్చిన మార్పును వాడి నడవడికలో గమనిస్తుంది. అలా.. నాలుగు రోజులు అక్కడే ఉండి వాడి బాగోగులు చూసుకుంటుంది. కానీ ఇంటిదగ్గర పని పడడంతో తిరిగి రావాలనుకుంటుంది . వస్తూ వస్తూ తన కొడుకుతో ఇలా అంటుంది. “నాన్న నేను ఇక్కడికి వచ్చి నాలుగు రోజులు అయింది కానీ నేను నీ కోసం తెచ్చినా సున్నుండలలో ఒక్క దాన్ని కూడా నువ్వు తిననేలేదు నీలో మార్పు గమనించాను, నన్ను మీ నాన్న నాలుగు రోజుల్లో తిరిగి రమ్మన్నాడు అందుకు ఇప్పుడు వెళ్తున్నాను. నేను వెళ్ళాకైనా నీకు నేను ప్రేమతో తెచ్చినా ఆ సున్నుండలను తింటావని అనుకుంటున్నాను అని చెప్పగానే, కిరణ్ అమ్మ నేను నువ్వు తెచ్చిన సున్నుండలను తప్పక తింటాను అని వాళ్ళ అమ్మ కు మాట ఇస్తాడు. 

అలా… ఐదు రోజులు గడిచిపోతాయి. ఇంతలో కిరణ్ కి ఇచ్చిన పది రోజుల సెలవులు అయిపోవడంతో తిరిగి కాలేజ్ కి వెళ్లాల్సి వస్తోంది. కాలేజీ కి రెడీ అయిన కిరణ్ వెళ్తూ వెళ్తూ తన చేతి వాచీ కోసం ఇల్లంతా ఎతుకుతాడు. కనిపించకపోవడంతో వాళ్ళమ్మ తీసుకెళ్ళిందేమోనని భ్రమ పడుతాడు. ఎందుకైనా మంచిది ఒక సారి అడిగితే బాగుంటుంది కదా అని వాళ్ళ అమ్మకు ఒక ఉత్తరం రాస్తాడు. 

అమ్మ…. నాకు తిరిగి కాలేజీ ప్రారంభించారు నేను కాలేజీకి వెళుతున్నాను కానీ నా చేతి వాచ్ నువ్వు వెళ్ళినప్పటి నుంచి కనిపించటంలేదు, అలాగని నువ్వు తీసుకెళ్లావని నేను అనట్లేదు, కానీ వాచ్ బాగుంది కదా.. నాన్నకు ఇస్తే బాగుంటుందని తీసుకొని వెల్లుండోచ్చు కదా అని అనుకుంటున్నాను. అది నా ఫ్రెండ్ నాకు చాలా ఇష్టపడి గిఫ్టుగా ఇచ్చాడు…. అని ఉత్తరం రాస్తాడు కిరణ్. 

ఉత్తరం చేరిన ఐదు రోజుల తర్వాత, తిరిగి వాళ్ళ అమ్మ కిరణ్ కు ఇలా ఉత్తరం రాస్తుంది….. బాబు నువ్వంటే నాకు చాలా ఇష్టం, నీకోసం నేను ఏదైనా చేస్తాను. నేను వస్తూ వస్తూ నీకోసం తెచ్చిన సున్నుండలు తినలేదని బాధపడుతుంటే నువ్వు నాకు తప్పక తింటానని మాట ఇచ్చావు “అది వాస్తవం”. నువ్వు నా ప్రేమ కి విలువిచ్చి నేను తెచ్చిన సున్నుండలు తిని ఉంటే ఇప్పుడు నాకు ఉత్తరంరాసే అవసరం వచ్చేది కాదు, ఎందుకంటే నీ ఫ్రెండు బహుమతిగా ఇచ్చిన వాచ్ని నేను సున్నుండలు తెచ్చిన డబ్బాలో పెట్టి ఉన్నాను కనుక. 

దీనిని చదివి, తను తప్పిన మాటను తలుచుకుని ఏమిచేయాలో తెలియక అమ్మ ప్రేమను మోసం చేశానని బాధపడి, అమ్మని క్షమాపణ కోరుతాడు.

నీతి: తల్లిదండ్రుల్ని తమ బిడ్డలు ఎంత నిర్లక్ష్యం చేసినా కూడా తండ్రులుకు వాళ్ల బిడ్డల మీద ప్రేమ ఏమాత్రం తగ్గదు.

ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి ఒక్క మనిషి తల్లిదండ్రుల నుండే వచ్చారు. అందుకే ప్రతి ఒక్కరికీ తల్లిదండ్రులకన్నా ముఖ్యమైన వారు ఎవ్వరూ ఉండరు. మనందరికీ జీవితాన్ని ఇచ్చి.. వారి జీవితాలను త్యాగం చేసి, మనల్ని ప్రేమించడమే వారి పని. అనునిత్యం మన గురించి ఆలోచిస్తూ.. మన భవిష్యత్తు గురించి ఆరాటపడే వారే తల్లిదండ్రులు. 

‘ఈ లోకంలో నువ్వు ద్వేషించినా కూడా నిన్ను ప్రేమించే వారు ఉన్నారంటే అది కేవలం తల్లిదండ్రులు మాత్రమే. తల్లిదండ్రులను ప్రేమించండి. 

పిల్లల భవిష్యత్తు కోసం తమ సుఖ సంతోషాలను వదులుకుని, వారి భవిష్యత్తును అందంగా తీర్చిదిద్దే వారే తల్లిదండ్రులు. అలాంటి వారికి మనం ఏమి ఇచ్చినా వారి రుణం తీర్చుకోలేం.

ఎన్ని తరాలు మారినా.. ఎన్ని కాలాలు మారినా.. మారని మాధుర్యం ఒకే ఒక్కటి. అదే తల్లిదండ్రుల ప్రేమ. మనం ఎంత ఎత్తుకు ఎదిగినా.. వారి మమకారం కూడా అంతే పెరుగుతుంది.

తల్లితండ్రుల ప్రేమ కంటే విలువైనది ప్రపంచలో ఏది లేదు. కన్న వాళ్లని కళ్ళల్లో పెట్టుకుని చూసుకోండి అంతే కానీ వాళ్లకి కన్నీళ్ళు పెట్టించి కాదు, కాలం ఉన్నప్పుడే కలసి ఉండండి కాలం దాటిపోయాక కలవరించినా కలుసుకోలేరు.

స్వార్ధంలేని, లాభం ఆశించని ప్రేమంటూ ఉంటే అది అమ్మానాన్నలదే . అమ్మ ప్రయాణానికి మార్గం. నాన్నను అర్థం చేసుకోవడమే ప్రయాణ పరమార్థం.

ఈ లోకంలో  నువ్వు ద్వేషించినా కూడా నిన్ను ప్రేమించే వాళ్ళు ఉన్నారు అంటే అది కేవలం తల్లితండ్రులు మాత్రమే..."

ఎవరికైనా ఉపకారం చెయ్యాలంటే ముందుగా తల్లికి చేయండి, ఎవరికైనా మర్యాద ఇవ్వాలంటే ముందుగా మీ తండ్రికి ఇవ్వండి, అందరికంటే గొప్పవారు మన తల్లిదండ్రులే... 'మీ ఇద్దరి పట్ల నాకు ప్రేమ, గౌరవం ఉంది. నా బాల్యాన్ని అద్భుతంగా మరియు నా జీవితాన్ని మరింత అద్భుతంగా చేసిన మీ ఇద్దరికి ధన్యవాదాలు'.