Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

అన్న చెల్లెలి అనుబంధం

ఒక ఊరిలోని ఒక కుటుంబంలో అమ్మ, అన్న మరియు  చెల్లి ఉండేవారు. వారు చాలా పేదవారు. నాన్న అనారోగ్యంతో మరణించడంతో కుటుంబ భాద్యత మొత్తం వాళ్ళ అమ్మ పైన పడింది. పిల్లలిద్దరూ చాలా  చిన్న వాళ్లు  అవడంతో వారు అమ్మకి సహాయం చేయలేకపోయారు. రోజు కూలి పనులకి వెళ్లి సంపాదించిన దానితో ఉన్నంతలో పిల్లలిద్దరినీ బాగా చూసుకుంటూ స్కూల్ లో కూడా జాయిన్ చేసింది. కొన్నాళ్ళకు  అమ్మ  ఆరోగ్యం  క్షీణించి  మరణించింది.

ఆ కుటుంబంలో ఇక పెద్దవారంటూ ఎవరు లేరు.. చిన్న వాళ్ళైనా అన్న చెల్లి మాత్రమే ఉన్నారు. అన్న ఎలాగైనా తన చెల్లిని బాగా చదివించాలని ఆశయంతో రోజు మొత్తం కూలి పనులు చేసి తన చెల్లిని మంచి  స్కూల్లో చేర్పించాడు మరియు తాను కూడా ఎదగాలనే ఆశతో రాత్రి బడికి వెళ్లి చదువుకోవడం మొదలు పెట్టాడు.

రోజంతా కూలి పని చేసుకోసుకోవడం, చెల్లికి కష్టం కలగకుండా చూసుకుంటూ రాత్రుల్లో బడికి వెళ్లి తాను చదువుకోవడం.  ఆ అన్న యొక్క దినచర్య. చెల్లి కూడా ఎంతో భాద్యతతో తన అన్న యొక్క కష్టాన్ని చూస్తూ చాలా  బాగా చదువుకుంటూ డాక్టర్ సీట్ సంపాదించింది . ఇక ఎలాగోలా అన్న కూడా మంచి మార్కులతో డిగ్రీ కంప్లీట్ చేసాడు. తన చెల్లి డాక్టర్ చదివి మంచి పేరున్న  హాస్పిటల్ లో ఉద్యోగం సంపాదించింది. అన్న కూడా ఒక చిన్న కంపెనీలో ఉంద్యోగం సంపాదించాడు.

ఇలా రోజులు సాగిపోతున్న తరుణంలో చెల్లికి మంచి సంబంధం వచ్చింది. తాను దాచుకున్న డబ్బుని అంతా  ఖర్చుపెట్టి చెల్లి పెళ్లిని చాలా ఘనంగా జరిపించాడు. వాళ్ల  చెల్లి చాలా డబ్బు ఉన్న ఇంటికి కోడలు అయినందుకు, చెల్లిని  బాగా చూసుకునే బావ దొరికినందుకు  అన్న చాలా  సంతోషపడ్డాడు.

పెళ్లి తర్వాత వచ్చిన మొదటి పండగకి చెల్లి ,బావ ఇద్దరు పుట్టింటికి వచ్చారు.. పెద్ద భవనంలో పుట్టి పెరిగిన బావకి మరియు ఇపుడిపుడే బాగా సెటిల్ అయినా తన చెల్లి, ఇంటిలో ఉన్న కొద్ది సదుపాయాలతో సర్దుకుపోవడం. అన్న గమనించాడు.

అన్న ఎలాగైనా వచ్చే సంవత్సరం వరకు కొత్త ఇంటిని తీసుకోవాలి అని ఆలోచనలో పడ్డాడు. ఒక కొత్త అపార్ట్మెంట్ లో మంచి ఫ్లాట్స్  ఉన్నాయని తెలిసి ఒక ఫ్లాట్ ని బుక్ చేసుకున్నాడు. తనకి వచ్చే నెలసరి ఆదాయంలో కొంత మొత్తాన్ని ప్రతి నెల EMI కట్టేల  సెట్ చేసుకున్నాడు..

కానీ, దురదృష్ట వశాత్తు కరోనా వ్యాది  వల్ల  చిన్న జాబ్స్ వాళ్ళు తమ ఉద్యోగాలను కోల్పోయారు. దానితో, ఆ అన్నకి కొత్త ఇల్లు లోన్ ఎలా కట్టాలో అర్ధం కాక తన చిన్న ఇంటిని తాకట్టు పెట్టి లోన్  తీసుకుందామని అనుకున్నాడు. ఈ విషయాలన్నీ తన చెల్లికి ఇప్పుడే  చెప్పడం ఎందుకు? అని  కొత్త ఇల్లు కొన్నాక అపుడు చెప్తా! అని అనుకున్నాడు.

వేరేవారి ద్వారా  ఈ విషయం చెల్లికి తెలిసింది. చెల్లి చాలా కోపంతో తన అన్న దగ్గరికి వచ్చి నాకు ఎందుకు చెప్పలేదు?. ఈ ఇంటిపైన నాకు హక్కు ఉంది అన్నిటిలో  నాకు సమాన భాగం కావలి.  నువ్వు  నాకు చెప్పకుండా అమ్మ నాన్నలు ఇచ్చిన ఈ ఇంటిని తాకట్టు పెట్టడం తప్పు అని తిట్టి వెళ్ళిపోయింది..

అపుడు అన్న తన చెల్లి చెప్పింది కరెక్ట్ అని . ఎందుకంటే ?! తల్లి తండ్రుల ఆస్తిలో నాతో పాటు తనకు సమాన హక్కు ఉంది.  తన ఆస్తిని కూడా తాకట్టు పెట్టడం సరికాదని భావించి, ఇంటి డాక్యుమెంట్స్ ని వెనక్కి తీసుకున్నాడు. ఇంటిలోని సగ భాగాన్ని తన చెల్లెలి పేరు మీద రాయించి డాక్యుమెంట్స్ ని రెడీగా  పెట్టాడు.

అంతలోనే వినాయకచవితి రానే వచ్చింది ఎప్పటిలాగే అన్న, తన చెల్లి మరియు బావని పండగకి  ఇంటికి ఆహ్వానించాడు. వాళ్లిద్దరూ ఎంతో సంతోషంగా అన్న ఇంటికి వచ్చి పండగని పూర్తి చేసుకుని వాకిట్లో కూర్చున్నారు. అంతటిలో అన్న తన చెల్లి హక్కు అయిన సగభాగం ఇంటి పేపర్స్ ని తీసుకొచ్చి చెల్లికి ఇచ్చాడు.

అది  తీసుకున్న చెల్లి వెంటనే పేపర్స్ ని చించేసి తన అన్నని పట్టుకుని ఏడుస్తూ ఇలా అంది.” అన్న నువ్వు  నీ చిన్నప్పటి నుండి ఎంతో కష్టపడుతూ నన్ను మంచి స్కూల్ లో చదివించి, నువ్వు మాత్రం  రాత్రి బడిలో చదువుకున్నావు . డిగ్రీ తోనే  చదువు ఆపేసి చిన్న కంపెనీ లో జాబ్ చేస్తూ,  నన్ను తాహతుకు మించి ఉన్న చదువైన డాక్టర్ చదివించి మంచి ఇంటికి కోడలిని చేసావు.. ఇప్పటికి కూడా మేము పండగలకి పుట్టింటికి వచ్చినపుడు,  మేము సౌకర్యంగా ఉండటానికి కొత్త ఇల్లు తీసుకుందాం అనుకున్నావు.

అంతలోనే నీ  జాబ్ పోయింది.  ఆ విషయం నాతో చెప్పలేవు.  ఇంటిని తాకట్టు పెట్టె పరిస్థితి వచ్చిన నాతో చెప్పలేవు?. నేను వచ్చి గొడవ పడింది నా హక్కు గురించే.  కానీ,  అది ఇంటిలో సగ భాగం హక్కు  కోసం కాదు.  నీ  కష్ట సుఖాలలో హక్కు కోసం...తోడబుట్టిన నేను నీ  కష్ట సుఖాలని పంచుకోలేనా ?! నాకు చాలా బాధ వేసింది.  సంతోషాన్ని  నాకు చూపించి కష్టమైనా దారిలో నువ్వు నడుస్తున్నావు. నేనున్నాను కదా! అన్నయ్య అంటూ బాధపడింది.

అనుకున్న ప్రకారం చెల్లి మరియు బావ కలిసి, అన్న కొనాలి అనుకున్న కొత్త ఇంటిని కొనిచ్చారు మరియు బావకి తెలిసిన మంచి కంపెనీలో జాబ్ ఇప్పించారు మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసి,  అన్నయ్యకి అన్ని విధాలుగా మంచి దారి చూపించారు. అప్పటి నుండి  అందరు సంతోషంగా ఉన్నారు.

"నీతి | Moral : అన్న చెల్లెలి బంధం అంటే కేవలం ఆస్తులలో సమన హక్కులు కాదు. కష్ట సుఖాలని పంచుకోవడంలో సమాన హక్కు. ఒకరి కష్టాలలో ఒకరికొకరు  తోడు ఉండటం . ఆనంద సమయాలని కలిసి ఆస్వాదించడం. ఇదే అన్న చెల్లెలి అనుబంధం."