Read The Last Delivery by Yamini in Telugu Moral Stories | మాతృభారతి

Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

లాస్ట్ డెలివరీ

ఒక ధనవంతుల జంట తమ ఇంట్లో కొత్త సంవత్సర వేడుకలు జరుపుకుంటున్నారు. అందుకోసం వారు మార్కెట్లో షాపింగ్ కి  వెళ్లారు, అక్కడ ప్రతిదీ అధిక ధర. వారు తమ స్థాయిని అందరికి చూపించాలనే కారణంతో ఎక్కువ ధర ఉన్న కూడా.., ఆ వస్తువులనే కొనాలని నిశ్చయించుకున్నారు. 

వారికి కావాల్సిన వస్తువులన్నీ  కొనుగోలు చేసిన తర్వాత, వారు ఒక కూలీని పిలిచి ఆ వస్తువులన్నిటిని  తీసుకువెళ్లి తమ ఇంటి వద్ద చేరవేయాలని చెప్పారు.. సామాను డెలివరీ చేయడానికి వచ్చిన వ్యక్తి  చాలా ముసలివాడు. చాలా ఆనారోగ్యంగా ఉన్నాడు, అతని బట్టలు కూడా చిరిగిపోయాయి, అతను తన రోజువారీ అవసరాలు కూడా తీర్చుకోలేనివాడిలా ఉన్నాడు.

ఆ దంపతులు  తమ వస్తువులను వారి ఇంటికి  చేరావేయడానికి ఎంత ఛార్జ్? అవుతుందని అడిగారు. ఆ ముసలి వ్యక్తి వాళ్ల  అడ్రస్ చూసి చాలా  దూరం ఉన్న కారణంగా వారిని 200 రూపాయలు ఇవ్వమని  అడిగాడు. ఆ దంపతులు ఆ ముసలి వ్యక్తితో వాదించి  150 రూపాయలు  ఇస్తామని ఒప్పించారు. ఆ ముసలి వ్యక్తి అన్నం తిని అప్పటికే రెండు రోజులవుతుంది. 150 రూపాయలు తక్కువ అయినప్పటికినీ ఎంతో  కొంత డబ్బు వస్తుందని  ఒకరోజు తినడానికి సరిపోతుందని ఆలోచించి  ఒప్పుకున్నాడు.

వారు కొన్న సామాను అంతా  ఆ రిక్షాలో పెట్టి,  తమ కారులో వాళ్లు  ఇంటికి బయల్దేరారు. మార్గమధ్యలో ఆ ముసలి వ్యక్తి నుండి 50 రూపాయలు సేవ్ చేసుకున్నామని సంతోషంగా మాట్లాడుకున్నారు ఆ దంపతులిద్దరూ.  వారు తమ ఇంటికి చేరుకున్నారు మరియు ఇంకో గంట గడిచిపోయింది, రెండు గంటలు గడిచాయి, కానీ ఆ ముసలి వ్యక్తి  ఇప్పటికీ వారి వస్తువులను ఇంటికి చేర్చలేదు.

భార్య, తన భర్తపై కోపం తెచ్చుకోవడం ప్రారంభించింది, “అలాంటి వ్యక్తిని ఇంకా నమ్మవద్దని నేను ఎప్పుడూ చెబుతాను, మీరు నా మాట వినరు. అలాంటి వ్యక్తి రోజుకు 1 సారి తిండికి కూడా సంపాదించలేని వ్యక్తి,  పార్టీ కోసం మనము  కొనుగోలు చేసిన ప్రతి ఖరీదైన వస్తువుని  మీరు అతనికి అప్పగించారు.  ఇంటికి డెలివరీ చేయడానికి బదులు, అతను అన్నింటిని తీసుకుని పారిపోయి ఉంటాడని  నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను అని గట్టిగా భర్త పైకి అరిచింది.

మనము వెంటనే షాపింగ్ చేసిన ప్లేస్ కి వెళ్లి   ఎంక్వయిరీ చేసి ఏ విషయం తెలియకపోతే , అతనిపై ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్ కి  వెళ్లాలి అని నిర్ణయించుకున్నారు”.

ఇద్దరూ షాపింగ్ చేసిన ప్లేస్ కి  బయలుదేరారు. షాపింగ్ మాల్ నుండి వారికి  దగ్గరగా  వస్తున్న  మరో కూలీని  చూశారు. వాళ్లు ఆ ముసలి వ్యక్తి గురించి ఆ కూలీని అడిగాలి అని,  కారు పక్కనే ఆపి ఆ కూలి దగ్గరికి వెళ్లారు.  ఆ కూలి రిక్షా లోచూస్తే…,  తమ వస్తువులను బండిలో తీసుకెళ్తున్నట్లు గమనించారు! కోపంతో భార్య అతనిని అడిగింది, “ఆ పాత దొంగ ఎక్కడ ఉన్నాడు? ఇవి  మా వస్తువులు .  మీ ఇద్దరు  మా వస్తువులను దొంగిలించి అమ్మబోతున్నారనిపిస్తోంది అని గట్టిగా అడిగింది.

ఆ మాటలు విన్నటువంటి కూలి …, “మేడమ్, దయచేసి శాంతించండి. ఆ పేద వృద్ధుడు గత నెల నుండి అనారోగ్యంతో ఉన్నాడు. ఒక్కపూట భోజనం చేసేందుకు కూడా సరిపోయేది అతనికి లేదు. అతను మీ వస్తువులను తీస్కొని మీ ఇంటికి బయల్దేరాడు. కానీ…,రెండు రోజుల నుండి అన్నం తినని కారణంగా రిక్షా తొక్కడానికి కూడా అతనికి శక్తి లేదు. అయినా కూడా ఎలాగైనా మీ వస్తువులని మీ ఇంటికి చేరవేయాలని అనుకున్నాడు. కానీ ..,ఆకలితో మరియు అనారోగ్యంతో ఉన్నఅతనికి , ఈ మధ్యాహ్నపు వేడిలో మరింత ముందుకు వెళ్లడానికి తనకున్న శక్తి సరిపోలేదు. 

మార్గ మధ్యలో రిక్షా నుండి కింద పడిపోయాడు. అది గమనించిన నేను దగ్గరికి వెళ్లేసరికి నా చేతిలో మీ ఇంటి అడ్రస్ చిట్టి మరియు మీరు ఇచ్చిన 150 రూపాయలు నాకు ఇచ్చి మీ ఇంటికి ఎలాగైనా ఈ వస్తువులని చేరవేయాలని ప్రాధేయపడ్డాడు.. నాకు తెలిసి అతని చివరి మాటలు ఏమిటంటే, “నేను ఈ డెలివరీ కోసం అడ్వాన్స్ తీసుకున్నాను, మీరు దీన్ని తీసుకోండి మరియు దయచేసి ఈ వస్తువులని  ఈ చిరునామాకు డెలివరీ చేయండి”.

“మేడమ్, అతను ఆకలితో ఉన్నాడు, అతను పేదవాడు, కానీ అతను నిజాయితీపరుడు. నేను మీ ఇంటికే బయల్దేరాను మీ వస్తువులని తీసుకుని, ఆ ముసలి వ్యక్తి యొక్క  వృద్ధుని చివరి డెలివరీ ని పూర్తి చేసే క్రమంలో…. అని  చెప్పాడు. అది విన్న భర్త కళ్లలో నీళ్లు తిరిగాయి, భార్య చాలా సిగ్గుపడింది, ఆ కూలి కళ్లల్లోకి చూసే ధైర్యం ఆమెకు లేదు.

"నీతి | Moral : నిజాయితీకి తరగతి లేదు. వారి ఆర్థిక మరియు సామాజిక స్థితితో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరినీ గౌరవించండి. అర్హులైన వారికి మనం చేయూతనివ్వడం ఎల్లప్పుడూ మంచి పని."

*World Way and Wisdom* In the slavery of the Arishdvargas, we don't see, read, listen, talk, appreciate, follow, practice Good. We won't (don't) come out of illusions.

*లోకం తీరు మరియు జ్ఞానం* అరిషడ్వర్గాల బానిసత్వం లో, మంచి చూడం, చదవం, వినం, పలకం, మెచ్చం, అనుసరించం, ఆచరించం. భ్రమలనుంచి బయటకు (రాము) రాలేము.