Read The Seven Wonders by Yamini in Telugu Moral Stories | మాతృభారతి

Featured Books
  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 8

                     మనసిచ్చి చూడు - 08మీరు టెన్షన్ పడాల్సిన అవస...

  • అరె ఏమైందీ? - 22

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 8

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • రామాపురం హై స్కూల్ రోడ్

    నా పేరు విజయ్ మా గ్రామం పేరు రామాపురం. నేను టెన్త్ క్లాస్ వర...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

ఏడు అద్భుతాలు

ఒక చిన్న పల్లెటూరిలో దాదాపు 50 ఇళ్లు మాత్రమే ఉండేవి. అక్కడ ఉండే ప్రజలు వ్యవసాయం చేస్తూ జీవనం సాగించేవారు. వారి పిల్లలని అక్కడే ఉన్న ఒక ప్రభుత్వ పాఠశాలలో చదివించేవారు. కానీ.., ఆ స్కూల్ లో కేవలం నాల్గవ తరగతి వరకే ఉంది. అందరు అక్కడివరకే చేదువుకుని స్కూల్ మానేసేవారు. ఇక వారి తల్లి తండ్రులతో వెళ్లి వ్యవసాయం చేయడం మొదలు పెట్టేవారు. 

అక్కడే ఉండే రాజు- సునీత లకి ఒక్కగానొక్క కూతురు సహస్ర. తాను కూడా అందరిలాగే  నాల్గవ తరగతి వరకు చదువు కంప్లీట్ చేసి, ఆ తరువాతి  చదువు కోసం టౌన్ కి వెళ్తానని సునీతకి చెప్పింది.  అది విన్న వారిద్దరు,  టౌన్ కి వెళ్లి చదవడం అంటే చాలా  కష్టం మనకు అంత స్థోమత లేదని బుజ్జగించారు. కానీ, సహస్ర మాత్రం పట్టు వదలలేదు. ఇక చేసేది ఏమిలేక కూతురు కోసం దాచిపెట్టిన డబ్బుని తీసి టౌన్ లో ఉన్న పేరొందిన స్కూల్ లో అడ్మిషన్ తీసుకున్నారు. మరుసటి రోజు నుండి స్కూల్ ప్రారంభం. సహస్ర చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తుంది. మరుసటి రోజు పొద్దున్నే లేచి స్కూల్ కి వెళ్లడానికి అన్ని సర్దుకుని కూర్చింది.

రాజు- సునీతలు వచ్చి కూతురిలోని ఉత్సుకతని చూసి  ” సహస్ర పెద్దయ్యాక ఏమవుతావు తల్లి..”? అని అడిగారు. అప్పుడు సహస్ర  నాన్న..! నేను ఏమవుతానో? నాకు తెలియదు.  కానీ.., ఎలాగైనా మన ఊరిలో స్కూల్ పెట్టించేలా చేయాలి అనేది నా  కోరిక ..! ఎందుకంటే నా  స్నేహితులు చాలా  మంది చదువుకోవాలని అనుకుంటున్నారు.  కానీ, ఎవరికీ టౌన్ కి వెళ్లే స్థోమత లేక చదువు ఆపేస్తున్నారు అని చెప్పింది. కేవలం ఐదవ తరగతి చదువుతున్న సహస్రకి ఇంత ఆలోచన ఉందా ..! అని రాజు-సునీతలు చాలా సంతోషపడ్డారు. సహస్ర ఆలోచన విధానం  చాలా  భిన్నంగా, తెలివిగా ఉందని మురిసిపోయారు. 

అంతలోనే స్కూల్ బస్సు వచ్చింది. స్కూల్ కి వెళ్లాక, సహస్రకి తాను ఏ రూమ్ లోకి వెళ్లాలో అర్ధం కాలేదు. అక్కడే ఉన్న కొంత మంది పిల్లలని అడిగింది. కానీ, సహస్ర వేషాధారణ చూసి… తాను పల్లెటూరి నుండి వచ్చిందని ఆమెకి ఏమి తెలియదని అందరు హేళన చేసారు. ఎలాగోలా సహస్ర తన క్లాస్ రూమ్ తెలుసుకుని వెళ్లింది. టీచర్ సహస్రని క్లాస్ లో పరిచయం చేసింది. తాను ఈ రోజు నుండి ఇక్కడే చదువుకుంటుంది.  తాను మిస్ అయినా క్లాస్సేస్  మరియు నోట్స్ ఇచ్చి సహాయం చేయాలనీ చెప్పింది.

అంతలోనే టీచర్ ” పిల్లలు ఈ రోజు అందరికి సర్ప్రైజ్ టెస్ట్ పెడతాను అని చెప్పి స్టార్ట్ చేసింది. ప్రపంచంలో ఉన్న ఏడు అద్భుతాలు రాయండి. వెంటనే అందరు బుక్ ఓపెన్ చేసి త్వరగా రాయడం స్టార్ట్ చేసారు.  ఎందుకంటే..? రెండు రోజుల ముందే టీచర్ ఏడు అద్భుతాలు గురించి చెప్పారు. సహస్ర మాత్రం ఆలోచిస్తూ కూర్చుంది. తనని చూసి అందరు నవ్వుకున్నారు. టీచర్ సహస్ర దగ్గరికి వచ్చి, నీకు తెలియకపోతే టెస్ట్ రాయొద్దు అని చెప్పింది . కానీ…, సహస్ర నాకు తెలుసు టీచర్ అద్భుతాలు చాలా ఉన్నాయి కదా  అందులో వేటిని రాయాలి అని ఆలోచిస్తున్న అంది. అది విన్న టీచర్ మరియు స్టూడెంట్స్ ఆశ్చర్యపోయారు. 

టెస్ట్ రాసి అందరూ బుక్స్ టీచర్ కి ఇచ్చేసారు. పిల్లలు అందరు “గ్రేట్ వాల్ ఆఫ్ చైనా, కొలోస్సియం, స్టోన్‌హెడ్జ్, గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గిజా, లీనింగ్ టవర్ ఆఫ్ పిసా, తాజ్‌మహల్, హాంగింగ్ గార్డెన్స్ ఆఫ్ బాబిలోన్ ” అని కరెక్ట్ సమాధానం రాసారు. అది చూసిన  టీచర్ పిల్లలు బాగా గుర్తుపెట్టుకున్నారని సంతోషపడింది. చివరగా టీచర్ సహస్ర ఆన్సర్స్ చదివింది ” ప్రపంచంలోని ఏడు అద్భుతాలు – చూడగలగడం, వినగలగడం, అనుభూతి చెందడం, నవ్వడం, ఆలోచించడం, దయగా ఉండటం, ప్రేమించడం” . అది విన్న  క్లాస్ మొత్తం నిశ్శబ్దంగా మారింది టీచర్ కూడా ఆశ్చర్యపోయారు. 

సహస్ర ముందు రోజుల్లో జరిగిన క్లాస్సేస్  విననందున తనకి నిజానికి  ఏడు అద్భుతాలు గురించి తెలియదు. తానూ టెస్ట్  రాయకుండా కూడా ఉండొచ్చు.  కానీ.., బాగా ఆలోచించి  తాను అనుకుంటున్న అద్భుతాలు రాసింది.  అవేంటో కాదు,   దేవుడు మనిషికి ఇచ్చిన గొప్ప వరాలు. ఇవే ,అసలైన ఏడు అద్భుతాలు అని  చెప్పిన సహస్ర సమాధానానికి, తెలివికి  మరియు ఆలోచనా విధానానికి, టీచర్ సహస్రని మెచ్చుకుని పిల్లలందరితో  గట్టిగ చప్పట్లు కొట్టించింది.

"నీతి | Moral : “అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి దేవుడు మనిషికి ఇచ్చిన గొప్ప వరాలు ఈ ఏడు అద్భుతాలు. అయినా కూడా మనిషి తరచూ ఎదో ఒక దాని గురించి ఆలోచిస్తూ , ఎదో లేదని వెతుకుతూ బాధపడుతుంటాడు. మనకున్న అద్భుతమైన సాధనాలను ( బాగా  వినడం, తెలివిగా ఆలోచించడం) ఉపయోగించండి. మీరు  ఖచ్చితంగా విజయం సాధిస్తారు.”"

"లక్ష్యాన్ని గుర్తించడమే విజయానికి మొదటిమెట్టు.. సాధించడానికి అసాధ్యం కాని లక్ష్యాలెపుడూ మనసును అశాంతికి గురిచేయవు"!!