Featured Books
  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 8

                     మనసిచ్చి చూడు - 08మీరు టెన్షన్ పడాల్సిన అవస...

  • అరె ఏమైందీ? - 22

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 8

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • రామాపురం హై స్కూల్ రోడ్

    నా పేరు విజయ్ మా గ్రామం పేరు రామాపురం. నేను టెన్త్ క్లాస్ వర...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

లక్ష్య' సాధనలో అవరోధాలను అధిగమిద్దాం ఇలా!

ప్రతి ఒక్కరికీ తాము అనుకున్న లక్ష్యాలను సాధించాలనే తపన ఉంటుంది. కానీ వారిలో కొందరు మాత్రమే లక్ష్యం వైపు పయనించి విజయం సాధిస్తారు. ప్రపంచంలోని ప్రతి మనిషికీ తాను అనుకున్న లక్ష్యాలను సాధించాలనే తపన ఉంటుంది. కానీ వారిలో కొంత మంది మాత్రమే తాము అనుకున్న లక్ష్యం వైపు నిష్టగా పయనించి చివరకు విజయం సాధిస్తారు. కొందరైతే దీనికి కారణం లక్ష్య సాధనలో ఎదురయ్యే అవరోధాలకు భయపడి కనీసం.. చేయాల్సిన పనచికూడా చేయరు. లక్ష్యం గురించి ఆలోచించేవారు అవరోధాల దాటుకుంటూ...లక్ష్య సాధనకు అనువైన మార్గం గురించి శోధించాలి. అప్పుడే విజయం సాధ్యమవుతుంది. 

అంత సులువేం కాదు...

లక్ష్యసాధన అనేది అంత సులువైనదేమీ కాదు.. ఎన్నో అవరోధాలను అధిగమించాల్సి ఉంటుంది. అనుకూల వాతావరణం లేకపోవడం, ప్రతికూల పరిస్థితులే లక్ష్య సాధనకు ప్రాథమిక అవరోధాలుగా ఉంటాయి. ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైన లొంగిపోకూడదు.. కుంగిపోకూడదు. ఆత్మవిశ్వాసంతో అవరోధాలపై ఆధిపత్యం సాధించగలిగితే విజయం తథ్యం. విజయం కోసం పట్టు వదలని విక్రమార్కుడిలా ముందుకు సాగాలి. లక్ష్య సాధనలో ఎదురయ్యే అవరోధాలను సాదరంగా ఆహ్వానించాలి. ప్రతికూల పరిస్థితులు లేదా అవరోధాలు ఎదురవుతాయన్న భయం ఏమాత్రం ఉండకూడదు. వాటికి ఎదుర్కొనడానికి శక్తి మేరకు ప్రయత్నించాలి. తద్వారా అవరోధాలపై విజయం సాధించడం మరింత సులభతరం అవుతుంది.

ఒక అవరోధం తొలగి పోగానే పొంగిపోకూడదు.. మరిన్ని అవరోధాలు లక్ష్యసాధనకు ఇబ్బంది పెట్టడానికి సిద్ధంగా ఉంటాయని గ్రహించాలి. వాటిని కూడా సానుకూల ధోరణితోనే అధిగమించగలగాలి. అప్పుడే విజయం సొంతమవుతుంది. ఒక్కో అవరోధాన్ని సమర్థనీయంగా అధిగమించుకుంటూ పోతే విజయం నల్లేరు మీద నడకే అవుతుందనడంలో సందేహం లేదు. 

అవకాశమనేది ఎప్పుడూ ఒకరిని పొగిడితేనో, ఒకరికి భజన చేస్తేనో, లేపోతే వాళ్ల ఫోటో పెట్టుకొని వాళ్లకి భక్తుడిగా మారితేనో రావు. అవకాశమనేది నిన్ను నువ్వు నిరూపించుకుంటే, నీ అంతర్గతాన్ని ప్రపంచానికి పరిచయం చేయగలిగితే, నువ్వెంటో నువ్వు చూపించుకోగల్గితే వస్తుంది.. 

జీవితంలో విజయం పొందాలంటే లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి.. లక్ష్యం ప్రాముఖ్యత ఏమిటో తెలుసా..

జీవితంలో భారీ లక్ష్యంతో ముందుకు సాగడం ఎల్లప్పుడూ సరైన నిర్ణయమే  అయినప్పటికీ, ఇది సాధ్యం కాకపోతే.. మీరు చిన్న లక్ష్యాలను నిర్దేశించుకోవడం ద్వారా మీ గమ్యాన్ని చేరుకోవచ్చు. 

మీరు జీవితంలో ఎంతవరకు విజయం సాధిస్తారు అనేది మీ లక్ష్యం మీద ఆధారపడి ఉంటుంది. మీరు సరైన లక్ష్యాన్ని ఎంచుకుని, దాని వైపు నిరంతరం కదులుతూ ఉంటే, ఖచ్చితంగా మీరు మీ గమ్యాన్ని సమయానికి చేరుకుంటారు. అయితే మీరు మీ లక్ష్యం నుండి వేరొక మార్గంలో నడుస్తున్నట్లయితే, అపుడు విజయాన్ని సాధించడం కష్టం. మనం జీవితంలో ఏదైనా లక్ష్యాన్ని నిర్దేశించుకున్న వెంటనే, మనకు జీవితం దిశ, లక్ష్యం రెండూ లభిస్తాయి. అయితే అది లేకుండా మన జీవితం అర్థరహితంగా కనిపిస్తుంది. ఇప్పుడు మన లక్ష్యం చిన్నదా పెద్దదా అనే ప్రశ్న తలెత్తుతోంది. జీవితంలో భారీ లక్ష్యంతో ముందుకు సాగడం ఎల్లప్పుడూ సరైన నిర్ణయమే  అయినప్పటికీ, ఇది సాధ్యం కాకపోతే.. మీరు చిన్న లక్ష్యాలను నిర్దేశించుకోవడం ద్వారా మీ గమ్యాన్ని చేరుకోవచ్చు. పెద్దలు,  మహానుభావులు చెప్పిన విలువైన మాటలను జీవితంలో లక్ష్యం ప్రాముఖ్యతను అర్థం చేసుకుందాం. 

1. లేవండి, మేల్కొనండి..  మీ లక్ష్యాన్ని సాధించే వరకు ఆగకండి.

2. లక్ష్యం లేని జీవితం చిరునామా లేని కవరు లాంటిది.. అది ఎక్కడికీ చేరదు.

3. జీవితంలో ఏదైనా లక్ష్యాన్ని నిర్దేశించడం ద్వారా, ఒక వ్యక్తి తన ప్రాధాన్యతలను సులభంగా గుర్తించగలడు. దీని సహాయంతో, అతను విజయాల బాటలో సంచరించకుండా తన గమ్యాన్ని సులభంగా సాధించగలడు.

4. లక్ష్యాలను నిర్దేశించుకున్న వ్యక్తులు, వారు ఇతర వ్యక్తుల కంటే త్వరగా, సులభంగా తమకు కావలసిన విజయాన్ని సాధిస్తారు.

5. మీరు జీవితంలో ఏదైనా సాధించాలనుకుంటే, దాని కోసం మాత్రమే ఆలోచించవద్దు. దానిని పొందడం కోసం వేచి ఉండకండి, ఎందుకంటే నిరంతర ప్రయత్నం ద్వారా లక్ష్యాన్ని చేరుకుంటారు.

6. ఇది నువ్వు మారాల్సిన time... ఇది నువ్వు, కష్టపడే time.... ఇది నువ్వు, గెలవవలసిన time... ఇది నీ TIME...

7. మీకంటూ ఒక లక్ష్యం పెట్టుకుని పనిచేయండి. లేకపోతే..! వేరేవాళ్ళ లక్ష్యం కోసం పనిచేయాల్సి వస్తుంది. సూర్యుడి కంటే ముందు ఎవరు నిద్ర లేస్తారో..! వారే విజయం సాధిస్తారు. ప్రపంచం గురించి పట్టించుకోకండి. మీరు ఏం చేసినా.. చేయకపోయినా  విమర్శించడమే వారి పని..."

8. లక్ష్యం కోసం అలుపెరగక  శ్రమిస్తుంటే నేడు కాకపోయినా రేపైనా విజయం సాధ్యమవుతుంది. కనిపించని వాటిని కనిపించేలా మార్చడంలో లక్ష్యాలను నిర్దేశించడం మొదటి అడుగు. నీ GOALని వదిలి పెట్టొద్దు నీ చేతిలో Time ఉన్నప్పుడే తాడోపేడో తేల్చుకో ...

9. జీవితం అనేది గమ్యం కాదు.. గమనం మాత్రమే...  ఎన్నిసార్లు ఓడినా గెలవడానికి అవకాశం ఉంటుంది... గమ్యం అనంతం... గమనం అనేకం..NEVER GIVE UP

జీవితాన్ని గెలవాలన్న కసి ఉన్నవాడు..! ఎలాంటి పరిస్థుతులనైనా తట్టుకుని నిలబడతాడు. “పట్టుదల అనే సారవంతమైన భూమిలోనే విజయం అనే మొక్క మొలుస్తుంది..."BE PATIENCE

జీవితంలో ఓడిపోయే వ్యక్తులు ఇద్దరు. ఒకరు ఎవరిమాట వినకుండా ఓడిపోతారు. ఒకరు అందరి మాటలు వింటూ ఓడిపోతారు. ఎవరి మాటలు విన్నా చివరకు ఆలోచన నీదైనప్పుడే నీ జీవితానికి విజయం. TRUST YOURSELF 

పోరాడాలనుకుంటే నీతో నువ్వు పోరాడు గెలవాలనుకుంటే ముందు నీపై నువు గెలువు ... నిన్ను నువు గెలిస్తే ప్రపంచాన్ని గెలిచినట్టే...నీ goal గురించి strong fix , నీ ఆయుధం తీసుకో, యుద్ధం మొదలుపెట్టు, గెలిచే వరకు వదిలిపెట్టకు... మీరు విజయం సాధించ గలరు అని తెలుసుకోవాల్సిన మొదటి వ్యక్తి తెలుసా??అది మీరే !!! మీ ఆత్మవిశ్వాసమే మీ మొదటి విజయం... గుర్తుంచుకోండి!!!