Featured Books
  • నిరుపమ - 1

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • ధర్మ -వీర - 5

    వీర ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తాడు, చూసి "వీడా, వీడికి ఎ...

  • అరె ఏమైందీ? - 14

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • మనసిచ్చి చూడు - 3

                                           మనసిచ్చి చూడు...3డీప్...

  • అరె ఏమైందీ? - 13

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

ప్రేమ వివాహం లేదా నిశ్చయ వివాహం

ప్రేమ పెళ్లి కంటే.. పెద్దలు కుదిర్చిన పెళ్లి ఎక్కువ కాలం నిలబడటానికి కారణం ఏంటి.. దీని వెనుక రహస్యం ఇదే.. నువ్వు ఏ పెళ్లి చేసుకుంటున్నావ్ .. లేదా ఏ పెళ్లి చేసుకున్నావు(Love Marriage Or Arrange Marriage).. ప్రశ్నలు మనం వింటూ ఉంటాం. ఓ యువతి, యువకుడు పరిచయం చేసుకొని.. దానిని స్నేహంగా మలుచుకొని.. ప్రేమగా వారి ప్రయాణం సాగిస్తారు. ఇలా వారి ప్రేమ వ్యవహారం పెళ్లి దాకా తీసుకెళ్లి.. ప్రేమ పెళ్లి చేసుకుంటారు.ఇలా ఇద్దరి మధ్య ప్రేమ వరకు చెప్పుకోడానికి చాలా జంటలే కనిపిస్తాయి.. కానీ పెళ్లి దాకా వెళ్లే జంటలు చాలా తక్కువగా ఉంటాయి. ప్రేమించుకోవడానికి రెండు మనస్సులు చాలు కానీ.. పెళ్లి చేసుకోవడానికి మాత్రం రెండు కుటుంబాలు కావాలి అనే డైలాగ్ గుర్తుందిగా.. సరిగ్గా అలానే ఇక్కడ కూడా.. ప్రేమ వరకు ఓకే గానీ తర్వాత పెళ్లి దాకా వెళ్లే జంటలు తక్కువగా ఉంటాయి. మరి ప్రేమ పెళ్లి కంటే.. పెద్దలు కుదిర్చిన పెళ్లి ఎక్కువ కాలం నిలవడానికి గల కారణం ఏమిటి..?

మతం, కులం పట్టింపులు..
కొంతమందికి క్యాస్ట్ ఫీలింగ్, మతం లాంటి పట్టింపులు ఉంటాయి. అంతేకాకుండా.. పెద్దలు ఎదిరించి పెళ్లి చేసుకునే అంత ధైర్యం కొన్ని జంటలకు ఉండదు. ఇదంతా ఇలా ఉండగా.. ప్రేమ పెళ్లిళ్లు చాలాకాలం నిలవలేకపోతున్నాయని.. పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు మాత్రమే ఎక్కువ కాలం నిలుస్తున్నాయని గత కొన్ని రోజుల నుంచి చాలామంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్య విడాకులు తీసుకుంటున్న జంటలు కూడా..దాదాపు ప్రేమించి పెళ్లి చేసుకున్నా వాళ్లే ఉంటున్నారు. ఇంత జరుగుతున్నా.. పెద్దలు కుదిర్చిన పెళ్లి కంటే.. ప్రేమ పెళ్లంటేనే ఆసక్తి చూపుతున్నారు. అంతేకాదు ‘ఈ కాలంలో ఎవరైనా అరెంజ్ మ్యారేజ్ చేసుకుంటారా..’ అని ప్రశ్నిస్తూ ఉంటారు. అదేదో పెద్ద అనరాని మాట.. వినకూడని పదం అన్నట్లు వ్యవహరిస్తున్నారు. పెద్దలు కుదర్చిన పెళ్లిళ్లలో ముక్కు, మొహం తెలియని వారిని ఎలా పెళ్లి చేసుకుంటారని.. వారితో జీవితాంతం ఆనందంగా ఎలా గడుపుతారని, అందుకే తమకు తెలిసిన వ్యక్తులను ప్రేమించడం..వారిని పెళ్లాడటం మంచిదని మరీ చెబుతున్నారు.

ఇవే ఉదాహరణలు..
తమ ప్రమేయం లేకుండా తల్లిదండ్రుల ఇష్టానికి తగ్గట్టు పెళ్లి చేసుకోవడానికి చాలా మంది ఇష్టపడట్లేదు. కొంతమంది యువత పెద్దలను ఎదిరించి మరీ పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఇది ప్రస్తుతం జరుగుతున్న తంతు. కానీ ఆ బంధానికి మధ్యలోనే గుడ్ బై చెప్పేస్తున్నారు. ఇటీవల జరిగే ఆ ఘటనలు దీనికి ఉదాహరణగా నిలుస్తున్నాయి. లవ్ మ్యారేజ్ చేసుకున్నా.. అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నా..ఆ జంట మధ్య సాన్నిహాత్యం, అర్థం చేసుకునేతత్వం..వారిద్దరి మధ్య ఉండే అనురాగమే ఆ బంధాన్ని.. జీవితాంతం సుఖంగా ఉండేలా చేస్తాయి. మన భాగస్వామిని ఎంచుకోవడం ముఖ్యంగా కాదు.. దాని తర్వాత ఆ బంధం ఎలా బలంగా ఉంటుందనేది ముఖ్యం. ప్రేమ పెళ్లితో చూసుకుంటే.. పెద్దలు కుదిర్చిన వివాహం ఎక్కువ కాలం ఉండటానికి గల కారణం ఏంటంటే.. వాటిలో ఉండే ప్రయోజనాలు ఏంటి.. ఇటువంటి ఆసక్తికరమైన విషయాలను ఇక్కడ తెలుసుకుందాం..

మారిన ట్రెండ్..
ఇప్పుడంటే ట్రెండ్ మారింది కానీ.. మన పూర్వ కాలంలో ఇలాంటి ప్రేమ, లవ్ లాంటికి అస్సలు ఉండేవి కావు. అటు అమ్మాయిలకు పెళ్లి చేయాలంటే.. ఇరుగు పొరుగు వాళ్లను కలిసి.. ఇలా పెళ్లి చేయాలని అనుకుంటున్నాం అంటూ చెప్పగానే.. సంబంధాలు ఇంటిదాకా వస్తుంటాయి. ఇలా పెద్దలు కుదిర్చిన వివాహాలు అప్పట్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఒక్క సంబంధం కుదిరింది అంటే పెద్దలు.. అటు ఏడు తరాలు..ఇటు ఏడు తరాలు చూసి..ఆలోచించి.. పెళ్లి చేస్తారు. ఇలా మన పూర్వీకులు పెళ్లి విషయంలో కొన్ని బలమైన పునాదులు ఏర్పాటు చేసి వెళ్లారు. దీంతో కొన్ని యుగాలు, తరాల వారు అదే ఆనవాయితీని, సంప్రదాయాలను కొనసాగిస్తున్నారు. ఇది పిత్రుస్వామ్య వ్యవస్థను ప్రోత్సహిస్తుందని కొందరు అభ్యర్థనలు చెబుతున్నప్పటికీ.. వివాహ సంప్రదాయాలు అలాగే కొనసాగుతున్నాయి. మన ఇష్టాలు, అభిరుచులకు అనుగుణంగా మన పార్ట్నర్ ను పెద్దలు అన్వేషిస్తుంటారు.

అన్నీ ఆలోచించే తల్లిదండ్రలు నిర్ణయం..
వారి తల్లిదండ్రుల నడవడిక.. మంచితనం లాంటివి చూస్తారు. తెలిసిన వ్యక్తులతో మరియు తెలియని వ్యక్తులతో చాలా విషయాలను ఆరా తీస్తారు. అన్నింటికంటే ముందు మనం వారితో హ్యాపీగా ఉంటామా లేదా అని మన కంటే ఎక్కువగా ఆలోచిస్తారు. ఇలా ఇరువురి కుటుంబసభ్యులు ఆచారాలు, కట్టుబాట్లు, సంప్రదాయ వ్యవహారాలకు దగ్గరగా ఉండేవారినే భాగస్వామిగా తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తారు. దీంతో ఆ భాగస్వామి అందరితో తొందరగా కలిసిపోతారు. ఏదైనా చిన్ని చిన్న సమస్యలు వచ్చినా సర్దుకుపయే గుణం ఉంటుంది. ఇలా పెద్దు కుదిర్చిన పెళ్లిలో ఆ జంట ఎంతో సహనంతోటి ఉంటారు. ఆమె లేదా అతడి గురించి తెలుసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు.

సమస్య పరిష్కారానికి పెద్దల ప్రమేయం..
ఇలా తెలుసుకునే క్రమంలో ఎదుటివారిపై ఎలాంటి అంచనాలను పెట్టుకోరు. ఎందుకంటే వీరికి పెళ్లికి ముందు ఒకరంటే ఒకరికి పెద్దగా పరిచయం ఉండదు. అందుకే వీరు తమ వ్యక్తిగత విషయాలను తెలుసుకునే పనిలో మునిగిపోతారు. దీంతో వీరికి బోర్ అనేదే కొట్టదు. అందుకే వీరిద్దరూ అంచనాలు పెంచుకోరు. కాబట్టి ప్రతి పెళ్లి తర్వాత ఆనందంగా గడిపేస్తారు. ఇలా ఈ జంటల్లో ఎక్కువ విషయాల్లో క్లారిటీ ఉంటుంది. దీంతో పెళ్లి తర్వాత వాదనలు, గొడవలు, మనస్పర్దలు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. పెద్దలు కుదిర్చిన పెళ్లిల్లో ముందుగానే రెండు కుటుంబాలకు సంబంధించిన వారి పుట్టుపూర్వత్తరాలను తెలుసకుంటారు. వారి ఎలాంటి వారు.. వారి ఆర్థిక పరిస్థితులు ఏంటి.. వారి జీవనోపాధి.. ప్రవర్తనతో పాటు ఇంకా చాలా విషయాలను ఆరా తీస్తారు. అందుకే పెళ్లి తర్వాత పెద్దగా సమస్యలు వచ్చే అవకాశం ఉండదు. ఒక వేళ చిన్న పాటి సమస్యలు ఏమైనా వచ్చాయంటే.. వాటిని పెద్దలు కల్పించుకొని.. సమస్యకు పరిష్కారం చూపుతారు. అందుకే పెద్దల పెళ్లిళ్లు ఎక్కువ కాలం నిలబడుతున్నాయి.