Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

ప్రేమంటే ఏంటో తెలీకుండానే పెళ్లి చేసుకున్నా..

ప్రేమంటే ఏంటో తెలీకుండానే పెళ్లి చేసుకున్నా.. కానీ తర్వాత ప్రేమలో లోతుగా మునిగిపోయా...!
పెళ్లి అయిన తర్వాత ప్రేమ ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
నేటి ఆధునిక కాలంలో చాలా మంది అబ్బాయిలు టీనేజీ వయసు నుండే వివాహం గురించి ఎన్నో కలలు కంటూ ఉంటారు. తనకు కాబోయే భాగస్వామి కోసల దేశపు రాజకుమారిలా ఉంటుందా? తనను పెళ్లి చేసుకుని జీవితాంతం సంతోషంగా చూసుకోవాలని ఆశపడుతుంటారు. 'జీవితం ఎప్పుడూ ఎలా ఉంటుందో.. ఎలాంటి మలుపులు తిరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. ముందుగా మనం ఏదైతే కోరుకుంటామో అది జరిగేలా చేస్తుంది. తర్వాత ఎంతో ఇష్టపడి ప్రేమించిన వ్యక్తులకు.. వారినే దక్కకుండా చేస్తుంది' అంటూ తన జీవితంలో జరిగిన అరుదైన సంఘటన గురించి చెప్పుకొచ్చాడు ఓ యువకుడు. అసలు నాకు ప్రేమంటే ఏంటో తెలియకుండానే పెళ్లి చేసుకున్నాను. అయితే పెళ్లి తర్వాత మాత్రం ప్రేమలో మునిగిపోయాను.
నల్లగా ఉంటాను..
మా ఇంట్లో నేను, మా అన్నయ్య ఇద్దరమే ఉండే వాళ్లం. మా అన్నయ్య చూసేందుకు అచ్చం మహేష్ బాబులా తెల్లగా అందంగా ఉంటాడు. నేను మాత్రం సునీల్ మాదిరిగా చాలా నల్లగా ఉంటాను. దీంతో నేను చిన్ననాటి నుండే చుట్టుపక్కల వారు
నన్ను ఎగతాళి చేసేవారు.
మనసు నొచ్చుకునేది..
‘ప్రతి ఒక్కరూ అలా చేస్తే ఎర్రగా అవుతావు.. ఇలా చేస్తే తెల్లగా మారతావు' అంటూ నా సహజమైన రంగు గురించి ఏవేవో చెప్పేవారు. వారి మాటలతో నా మనసు బాగా నొచ్చుకునేది. దీనికి తోడు మా అమ్మనాన్నలకు కూడా మా అన్నయ్య అంటేనే ప్రేమ. అలా అందరి చేత అవమానాలు ఎదుర్కొంటూనే బీటెక్ పూర్తి చేసి ఉద్యోగంలో
ఉద్యోగంలో చేరాను.
మంచి సంబంధం..
ఓ రోజు మా బంధువు మా అన్నయ్య కోసం ఒక మంచి సంబంధం తీసుకొచ్చాడు. వధువు సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. కట్నం, బంగారం వంటివి ఏమి లేకపోయినా పర్వాలేదని మాట్లాడుకున్నారు. వారం రోజుల తర్వాత వారు మళ్లీ వచ్చారు. అక్కడ ఏం జరుగుతుందో చూడాలనుకున్నాను. కానీ మా అమ్మ రావద్దంది. దీంతో నాకు మళ్లీ అవమానం ఎదురైందని భావించి, ఆఫీసుకి వెళ్లిపోయాను.
నెల రోజుల్లోనే పెళ్లి..
మా అన్నయ్యకు పెళ్లికూతురు కూడా బాగా నచ్చడంతో వారిద్దరి పెళ్లిని నెలరోజుల్లోనే చేసేయాలని నిర్ణయించుకున్నారు. అప్పటి నుండి మా అమ్మనాన్న హడావుడిగా పెళ్లికి అన్నీ సిద్ధం చేయడంలో మునిగిపోయారు. బంధువుల రాక కూడా ప్రారంభమైంది.
అప్పులు చేసి పెళ్లి పనులు.. మా నాన్న తన దగ్గర ఉన్న డబ్బుతో పాటు పెళ్లి చేసేందుకు కొంత డబ్బును అప్పు చేసి మరీ పెళ్లి పనులు మొదలెట్టారు. ఒకరోజు అందరం కలిసి షాపింగ్ చేసి కూర్చుని ఆనందంగా మాట్లాడుకుంటున్నాం. అంతలోనే అన్నయ్యకు కరోనా వచ్చింది. చూస్తుండగానే మా అందరికీ భయమేసింది. అప్పటికి పెళ్లికి ఇంకా కేవలం వారం రోజులు మాత్రమే గడువుంది.
గుండెలు పగిలేలా ఏడ్చాం..
తనకు రకరకాల పరీక్షలు చేసి ఐసోలేషన్ లో ఉంచారు. అయితే తనకు కరోనాతో ఇతర వ్యాధి ఉన్నట్లు డాక్టర్లు చెప్పడంతో అందరం గుండెలు పగిలేలా ఏడ్చాం. మరో రెండు మూడు రోజుల్లో అన్నయ్యకు డిశ్చార్జ్ చేశారు.
అంతా సంతోషంగా..
అన్నయ్య ఇంటికి రాగానే.. పెళ్లి కూతురు వారికి ఫోన్ చేసి.. వాళ్లను పిలిపించి వారికి జరిగిందంతా చెప్పేశారు. అప్పుడు నేను ఆఫీస్ కి వెళ్లాను. సాయంత్రం నేను ఆఫీసు నుండి ఇంటికొచ్చేసరికి అంతా సంతోషంగా ఉన్నారు. నేను ఆ ట్విస్టును అస్సలు ఊహించలేదు. ఆ సంతోషానికి కారణం అన్నయ్య చెప్పేశాడు.
వరుడిగా చూసేందుకు..
పెళ్లి క్యాన్సిల్ కాలేదని.. అయితే తనకు బదులుగా నా పెళ్లి జరుగుతుందని చెప్పాడు. మా అన్నయ్య ఆఖరి కోరిక ‘నా పెళ్లి చూడటం అని.. నన్ను వరుడిగా చూసి తను సంతోషంగా మరణించేందుకు సిద్ధంగా ఉన్నా'నని చెప్పాడు. వాళ్ల తల్లిదండ్రులు కూడా నా పెళ్లికి ఒప్పుకోవడంతో మా ఇంట్లో అందరూ ఆనందించారు.
నాకే నమ్మకం కలగలేదు..
అంతే వెంటవెంటనే పెళ్లి పనులు వేగం పుంజుకున్నాయి. నాకు పెళ్లి కుదిరిందంటే నాకే నమ్మకం కలగలేదు. అలా అనుకోకుండా నా పెళ్లి జరిగిపోయింది. అప్పుడు నాకు కూడా బాగా బాధగా అనిపించింది. అప్పుడే నాకు అనిపించింది దేవుడు ఒక్కోసారి మన జీవితాలతో ఆటలాడుకుంటాడు అని.
ఎవరికైనా కష్టమే..
తను ప్రేమించిన వ్యక్తిని తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేయడం ఏ మగాడికైనా కష్టంగానే అనిపిస్తుంది. అప్పటి వరకు నేను నా భర్యను కేవలం ఒకట్రెండు సార్లు మాత్రమే చూశాను. అది కూడా సరిగ్గా చూడలేదు. తను కూడా నన్ను చూడలేదనుకుంటా.
పెళ్లి వేడుకలు పూర్తయ్యాక..
పెళ్లి వేడుకలు పూర్తయ్యాక నేను, మా అమ్మనాన్న, అన్నయ్య, నా భార్య మాత్రమే మిగిలాం. అందరూ ఎవరి ఇంటికి వారు వెళ్లిపోయారు.
ఇక అసలైన ఘట్టం శోభనానికి సమయం వచ్చేసింది. నేను పడకగదిలోకి వెళ్లాను. తన ముఖంలో నిద్ర మత్తును చూసి భయమేసింది. అయితే నేను లోపలికి వెళ్లిన తర్వాత తను నా దగ్గరికి వచ్చి మాట్లాడిన మాటలు.. తన పట్ల నాకు ఎంతో గౌరవాన్ని పెంచాయి.
దగ్గరగా చూశాను..
తనని అప్పుడే నేను మొదటిసారిగా దగ్గరిగా చూశాను. తను చాలా అందంగా ఉంది. ‘నేను మాత్రం అందంగా లేననే ఫీలింగు'తో తన ముందు తల దించుకుని నిలబడిపోయాను. మనం ముందు స్నేహితులుగా..
అప్పుడు తను ఇలా చెప్పింది. ‘భయపడకు మనిద్దరికీ అసలు ఒకరి గురించి మరొకరికి ఏమీ తెలియదు. మన పెళ్లి అంతా హడావుడిగా జరిగిపోయింది. అందుకే మనం ముందు స్నేహితులుగా మారదాం. ఆ తర్వాత ఇద్దరి మధ్య ప్రేమ పుట్టాక.. ఆలుమగల్లా కలసి జీవిద్దాం. దీని వల్ల మనిద్దరికీ ఏ ఇబ్బంది ఉండదు అని తను చెబుతుంటే అది కలా?నిజమా అస్సలేమీ అర్థం కాలేదు. నన్ను ప్రేమించే వారు కూడా ఉంటారా' అని నేను అస్సలు ఊహించలేదు.
ప్రేమించే భాగస్వామి..
అలా అనుకోకుండా నాకు ప్రేమించే భాగస్వామి దొరికింది. నా జీవితంలో కొన్నాళ్లు తనతో స్నేహితుడిలా కలిసిపోయాను. కొన్ని నెలల పాటు మేమిద్దరం ఒకరినొకరు ప్రేమించుకున్నాక.. ఇద్దరం బాగా దగ్గరయ్యాం. అప్పుడే నాకు అర్థమైంది ప్రేమ అనేది కేవలం.. పెళ్లికి ముందే ఉండాలని రూలేం లేదు. పెళ్లి జరిగిన తర్వాత కూడా ప్రేమించుకోవచ్చు అని. అందుకు నా జీవితమే ఉదాహరణ కావడం నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది.
"ఈ సృష్టిలో చివరి వరకు తోడుండే బంధం కేవలం బార్యభర్తల బంధం ఒక్కటే "
ప్రతి భర్త తన భార్యను.. మరో తల్లి రూపంగా భావిస్తే.. ప్రతి భార్య తన భర్తను.. మొదటి బిడ్డగా పరిగణిస్తుంది.. ఇదే మధురమైన బంధం.. ఇప్పటికి..ఎప్పటికీ....
ప్రతి అమ్మాయికి చదువుకున్న...
భర్త రావటం సహజం...కానీ తన మనసును చదివిన...
భర్త రావటం ఆ అమ్మాయి అదృష్టం...అమ్మ మనకు జన్మనిస్తుంది, భార్య ఆజన్మాంతం ప్రేమిస్తుంది, అమ్మ లేకుండా మనకు జన్మలేదు, భార్య లేకుండా జన్మకు అర్థం లేదు, అమ్మ భారం కాకూడదు, భార్య బానిస కాకూడదు.