Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

తల్లిదండ్రులను గౌరవించాలి

ఒక గ్రామంలో, ఒక వృద్ధుడు తన కొడుకు మరియు కోడలుతో కలిసి ఉంటున్నాడు. కుటుంబం చాలా సంతోషంగా ఉండేది. ఎప్పుడు ఎటువంటి సమస్య ఉండేది కాదు. ఒకప్పుడు చాలా యవ్వనం తో ఉండేవాడు, ఇప్పుడు ముసలివాడు అవ్వడం వల్ల ఏ పని చేయలేకపోయేవాడు. కుంటుతూ కర్ర చేతిలో ఉంటూనే నడిచేవాడు. ముఖం అంత ముడుతలతో నిండి పోయింది , ఏదో ఒకవిధంగా తన జీవితాన్ని గడుపుతున్నాడు. ఇంట్లో ఒక మంచి విషయం ఏమిటంటే, సాయంత్రం భోజనం తినేటప్పుడు, కుటుంబం మొత్తం కలిసి టేబుల్ వద్ద తినేది. ఒక రోజు సాయంత్రం, అందరు భోజనం తినడానికి కూర్చున్నప్పుడు. కొడుకు ఆఫీసు నుండి వచ్చాడు, అతను చాలా ఆకలితో ఉన్నాడు, కాబట్టి త్వరగా తినడానికి కూర్చున్నాడు మరియు కోడలు మరియు అతని కుమారులలో ఒకరు కూడా కలిసి తినడం ప్రారంభించారు. వృధుడు చేతితో ప్లేట్ పైకి తీయబోతుంటే ,పళ్లెం చేయి నుంచి జారీ పళ్ళెంలో ఉన్న పప్పు ప్లేట్ నుంచి టేబుల్ మీద పడింది. కోడలు,కొడుకు ఇద్దరు తన వైపు కొంచం అసహ్యంగా చూస్తూ మళ్ళీ తినడం ప్రారంభించారు.
వృద్ధ తండ్రి తన వనికే చేతులతో తినడం వల్ల , ఆహారం కొన్నిసార్లు బట్టలపై మరియు కొన్నిసార్లు నేలమీద పడేది.

కోడలు చిరాకించుకుంటూ అన్నది – ఓ రామ,ఎంత అసహ్యం గా తింటున్నావో చూడు.నీ ప్లేట్ ని ఎక్కడైనా మూలకు పెడతాను అన్నది ,కొడుకు కూడా సరే అని తల ఊపాడు . కొడుకు కూడా భార్యతో అంగీకరిస్తున్నట్లుగా తల ఊపాడు.ఇవన్నీ మనవడు అమాయకంగా చూస్తున్నాడు. మరుసటి రోజు, తన ప్లేట్ టేబుల్ నుండి తీసివేసి ఒక మూలలో ఉంచారు. ఇదంతా చూసిన తర్వాత కూడా తన కళ్ళుతో చూసి కూడా ఏమీ చెప్పలేదు. వృద్ధ తండ్రి యథావిధిగా ఆహారం తినడం మొదలుపెట్టాడు, ఆహారం కొన్నిసార్లు ఇక్కడ మరియు అక్కడ పడిపోతుంది. చిన్న పిల్లవాడు తన ఆహారాన్ని వదిలి మాటిమాటికీ తన తాత వైపు చూస్తున్నాడు. తల్లి అడిగింది కొడుకును ఏమి జరిగింది ,భోజనం చెయ్యకుండా తాత వైపు ఎందుకు చూస్తున్నావు అని. పిల్లవాడు చాలా అమాయకత్వంతో చెప్పాడు - అమ్మా , నేను వృద్ధులతో ఎలా వ్యవహరించాలో నేర్చుకుంటున్నాను, నేను పెద్దయ్యాక మరియు మీరు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు, నేను మీకు అదే విధంగా భోజనం పెడతాను అన్నాడు. బాబు నోటి నుండి ఇది విన్న కొడుకు మరియు కోడలు ఇద్దరూ వణికిపోయారు, బహుశా అమాయకత్వంతో వాళ్ళఇద్దరికీ చాలా పాఠం చెప్పడంతో, కొడుకు చెప్పిన విషయం వారి మనస్సులో కూర్చుంది. కొడుకు లేచి గబగబా వెళ్లి తండ్రి ప్లేటుని పట్టుకొని టేబుల్ మీద తినడానికి తిరిగి కుర్చోపెట్టాడు , కోడలు కుడా వెళ్లి ఒక గ్లాసు నీరు తెచ్చి ఇచ్చింది మామయ్యకి. కాబట్టి మిత్రులారా, తల్లిదండ్రులు ఈ ప్రపంచంలో అతిపెద్ద పూజ్యులు , మీరు సమాజంలో ఏదైనా గౌరవం సంపాదించవచ్చు లేదా ఎంత సంపదను సేకరించవచ్చు, కాని తల్లిదండ్రుల కంటే ఎక్కువ సంపద ఈ ప్రపంచంలో ఏది లేదు. నిస్వార్థంగా తల్లిదండ్రులకు ఎల్లప్పుడూ సేవ చేయండి మరియు గౌరవించండి, మనం ఏవిధంగా చేస్తే ఆవిధంగానే పొందుతాము.

తల్లిదండ్రులను మరువవద్దు
అందరినీ మరిచిన నీ తల్లిదండ్రులను మరువద్దు! వాళ్లను మించి నీ మంచి కోరేవారు ఉండరని తెలుసుకో!!
కడుపు పండాలని కనిపించిన రాళ్ళకల్లా మొక్కుతారు నీ తల్లిదండ్రులు! నీవే రాయివై నీతల్లిదండ్రుల గుండెలు పిండి చేయకు!!
కొసరి కొసరి గోరు ముద్దలతో నిన్ను పెంచారువారు! నీకు అమృతమిచ్చిన వారిపైనే నీవు విషనాగువై కాటువేయవద్దు!!
లక్షలు, కోట్లు గడించినా ధీటేనా నీ తల్లి ఎద పాలకు? వజ్ర, వైడూర్యాలు, నగలు, నాణ్యాలు, సాటిరావు నీ తండ్రి అనురాగానికి!!
ముద్దు మురిపాలతో నీ కోర్కెలు తీర్చువారు! ఆ ప్రేమ మూర్తుల కోర్కెలు నెరవేర్చాలని మరువవద్దు!!
డబ్బు పోతే సంపాదించవచ్చు! తల్లిదండ్రులను మాత్రం మళ్ళ సంపాదించలేవు!!
తల్లిదండ్రుల ఋణం తీర్చుకోలేని వాడు పుట్టినా ఒక్కటే, గిట్టినా ఒక్కటే! అందుకే నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను మరువకు!!

అమ్మ-నాన్న
ఒక్కరోజు అమ్మలా పనిచేసి చూడు..సాయంకాలానికి ఇంటిపనితో నడుము పట్టెయ్యకపోతే ఒట్టు..ఒక్కరోజు నాన్నలా బ్రతికిచూడు..బాధ్యతలతో భుజాలు కృంగిపోకపోతే నన్నడుగు..నిన్ను పెంచడానికి తల్లిదండ్రులు పడ్డ కష్టాన్ని ఎన్నడూ తేలిక చెయ్యకు..
నడుములు వంగి, భుజాలు కృంగి వారికి తట్టుకొనే శక్తి ఉండదు..!

తల్లి మనస్సు సముద్రపు లోతంతా అందులోని ప్రేమకు కొలమానాలు లేవు ఆ మనస్సులో ప్రేమ, సంతోషం, బాధ, భయం మొదలైనటువంటి భావాలెన్నో ఇమిడి ఉంటాయి ఆమె మనస్సును అర్థం చేసుకున్క కొద్దీ ఆ లోతు మనకు అవగతమౌతుంది తండ్రి మనస్సు విశాలమైన సముద్రమంత ఎన్నో అనుభూతులు, ఆలోచనలు, బాధ్యతలకు నెలవు ఆ మనస్సులో ఒడిదుడుకులు సముద్రపు అలలు వంటివి ఆ మనస్సు యొక్క ప్రేమను అంచనా వేయాలి అనుకోవడం సముద్రము యొక్క ఆవలి తీరాన్ని కనుక్కోవడమంత కష్టం తల్లి, తండ్రి ఇద్దరి మనసులు కలిస్తే ఆ మహాసముద్రం కూడా వారి ప్రేమ ముందు చిన్నబోతుంది అటువంటి అపారమైన, అద్భుతమైన ప్రేమ తాలూకు తీపి అనుభవాలు పొందుతున్న మనము ఎంత అదృష్టవంతులమో! పిల్లల భవిష్యత్తు కోసం తమ సుఖ సంతోషాలను వదులుకుని, వారి భవిష్యత్తును అందంగా తీర్చిదిద్దే వారే తల్లిదండ్రులు. అలాంటి వారికి మనం ఏమి ఇచ్చినా వారి రుణం తీర్చుకోలేం. ఎన్ని తరాలు మారినా.. ఎన్ని కాలాలు మారినా.. మారని మాధుర్యం ఒకే ఒక్కటి. అదే తల్లిదండ్రుల ప్రేమ. మనం ఎంత ఎత్తుకు ఎదిగినా.. వారి మమకారం కూడా అంతే పెరుగుతుంది.ఈ లోకంలో మంచివాళ్లు.. చెడ్డవాళ్లు ఉంటారేమో గానీ.. ఎంత వెతికినా.. ప్రేమ లేని అమ్మ.. బాధ్యత లేని నాన్న ఉండరు. కనీ, పెంచిన మీ అమ్మ నాన్నలను ప్రేమగా చూడటం వదలి కనిపించని ఆ దేవుడి ప్రేమకై ప్రాకులాడటం అవివేకం.
Remember: If you love your parents God will loves you back automatically.