Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

స్ఫూర్తిదాయకం స్టోరీస్

జీవితంలో ఎప్పుడైనా ఒక గొప్ప పని సాధించాలని నిర్ణయించుకున్నప్పుడు అలాంటి సమయంలో మనకు తోడుగా ఎవరు నిలబడరు. ఎవరూ మన పై దృష్టి పెట్టరు. మీరు సక్సెస్ అయిన తర్వాత మీరు విజయ బాటలో పయనిస్తున్న అప్పుడు వారు అందరూ నీతో నడుస్తారు. ఒక బలహీనమైన వ్యక్తి వెంటనే మీకు చెప్పగలడు పని ఎందుకు చేయకూడదు అనేది. ఒక బుద్ధి కలవాడు ఒక పనిని ఎలా చేయాలో ఆలోచిస్తూ ఉంటాడు. దానిలో విజయం సాధించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అందుకే జీవితంలో ఎప్పుడూ బలహీనుడు లాగా ఉండకు. బుద్ధిమంతుడిలా తయారవడానికి ప్రయత్నించు పెద్ద పెద్ద మాటలు చెప్పడం కాదు పెద్ద పెద్ద పనులు చేసి విజయం సాధిస్తూ ఉండు. ఎందుకంటే ఈ ప్రపంచం వినబడే దానికంటే కనిపించే దానికే ప్రాముఖ్యత ఇస్తుంది నీ జీవితంలో నీతో మంచి వ్యవహారంతో ఎవరైతే మెలుగుతారో వారికి మీరు కృతజ్ఞతలు చెప్పండి. ఎవరైనా మీ గురించి చెడుగా మాట్లాడితే వారిని ఇలా ఆలోచించి క్షమించి వదిలేయండి. మానసిక రోగుల అంతా హాస్పటల్ లో మాత్రమే కనిపించరు. బయటి ప్రపంచంలో కూడా కనిపిస్తారని అనుకోండి. కొంతమంది జనం నీ యొక్క మానసిక బలాన్ని ధైర్యాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తారు. కానీ ఒక్క విషయం గుర్తు పెట్టుకో నీ యొక్క మానసిక బలాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేయగలరు కానీ మిమ్మల్ని ఓడించలేరు. ఎందుకంటే ఓటమిని మీ అంతట మీరు అంగీకరించని అంతవరకు ఎవరు మిమ్మల్ని ఓడించలేరు. జీవితంలో ఎప్పుడైనా మాట ఇచ్చేటప్పుడు, వ్రాసేటప్పుడు, అడుగు ముందుకు వేసేటప్పుడు, ఆలోచించి చేయాలి. అమ్మ పాడిన జోల పాట మనందరికీ గుర్తుంది కానీ అమ్మ అని పిలిచే అంత సమయం మాత్రం మన జీవితాల్లో లేకుండా పోయింది. ఆధునిక కాలంలో అన్ని సంబంధాలను మనం చంపేస్తూ వస్తున్నాం వాటిని పూడ్చడం మాత్రమే మిగిలి ఉంది. మన వారితో మాట్లాడే సమయమే మన జీవితంలో లేదు ఇక పరాయి వారితో ఏం మాట్లాడగలం. మనకు సరైన నిద్ర పోవడానికి సమయం లేదు సరైన స్నేహాన్ని కొనసాగించడానికి సమయం లేదు బంధుత్వాన్ని కొనసాగించడానికి సమయం లేదు గుండె నిండా చాలా బాధలు కూడా ఉన్నాయి ఆయన సరే మనసారా ఏడవడానికి కూడా సమయం లేదు. నిజంగా డబ్బు సంపాదించాలంటే అలసి పోయే సమయం కూడా లేనంతగా పరిగెత్తాలి. జీవితంలో మనం కనే కలలను సాకారం చేసుకోవడానికి మన దగ్గర సమయం లేనప్పుడు ఇతరుల కనే కలలను మనం అర్థం చేసుకోవడానికి మన దగ్గర సమయం ఎక్కడ ఉంటుంది. నీ జీవితంలో ఇలాంటి కొంతమంది వ్యక్తులు నీకు తప్పక ఎదురవుతారు. నీ కంటే తెలివైన వారు, మీ కంటే బలమైన వారు, మీకంటే విజయవంతమైన వారు, నీ కంటే ప్రభావశాలి అయినవారు, మీరు వారందరూ గొప్పవారని భావించినప్పుడు దీనికి అర్థం మీరు అవన్నీ సాధించలేరని కాదు. మీరు వారితో గెలవ లేరని కాదు నీపై మీరు నమ్మకంతో అహర్నిశలు శ్రమిస్తే మీరు తప్పక వారిలాగా విజయం పొందగలరు. ఒకానొక రోజు మీరు గొప్ప స్థానంలో ఉంటారు. అందుకే నీకంటూ ఒక కొత్త దారి ని వెతకండి దాని గురించి ఆలోచించండి ఆ దారిని రహదారిగా మార్చే లాగా నీ జీవిత లక్ష్యాన్ని ఎంచుకోండి .ఇలా చేసే సమయంలో మనసులో మరే ఇతర ఆలోచనలు రానివ్వకండి. ఈ ప్రపంచంలో అసంభవం అంటూ ఏదీ లేదు మనం ఆ దిశగా అడుగులు వేయగలిగితే.

ఎప్పుడూ ఆత్మవిశ్వాసంతో ఉండు
జీవితంలో సంపద అనేది వారసత్వం ద్వారా కూడా లభించవచ్చు. కానీ నీకంటూ గుర్తింపు మాత్రం నువ్వే ఏర్పరచుకోవలసి ఉంటుంది. అందుకే జీవితంలో పోరాడే జీవితం లో పోరాడే టప్పుడు మైదానాన్ని వదిలి ఎప్పుడు వెళ్లాలంటే వెళ్లాలి అంటే విజయం దక్కేనా అంత వరకు పోరాడిన తర్వాతే. విజయానికి మొదటి ఆధారం సరైన ఆలోచన నువ్వు కష్టపడుతూ అడుగు ముందుకు వేస్తూ ఉండు విజయం అనేది నీ వైపు అడుగులు వేస్తూ వస్తుంది. నీ దారి మార్చడానికి చాలామంది నీకు ఎదురవుతూ ఉంటారు. కానీ నీ సంకల్పమే చాలు నీ యొక్క లక్ష్యాన్ని చేరడానికి ఎప్పుడూ నీ యొక్క లక్ష్యాన్ని సంకల్పాన్ని గుర్తు చేసుకుంటూ ఉండాలి .విజయవంతమైన వ్యక్తుల మొహంలో మనం రెండు మాత్రమే గమనించవచ్చు 1 నిశ్శబ్దం రెండవది చిరునవ్వు. ఇతరులకు కఠినమైన జవాబు వీరు కూడా ఇవ్వగలరు కానీ నీ బురద పై రాయి వేయడం ఎందుకులే అని ఆలోచించి ఊరు కుంటారు. ఒక్కోసారి నిశ్శబ్దంగా ఉన్నంత మాత్రాన చేతకాని వాడు అని అనుకోరాదు. పరిస్థితులను అర్థం చేసుకున్నవాడే నిశ్శబ్దంగా ఉంటాడు. మనం ఏర్పరుచుకున్న లక్ష్యం మన సాహసం కంటే గొప్ప నైనది ఏమీ కాదు పోరాడకుండా ఉండేవాడు ఎప్పుడు ఓడిపోతాడు. అందుకే నీ పై నువ్వు ఎప్పుడూ నమ్మకంతో ఉండు ఇదే నీ బలంగా తయారవుతుంది. అలానే ఇతరులపై నమ్మకం పెట్టుకోవడం వలన అదే నీ బలహీనత అవుతుంది. ఒక్కసారి ఆలోచించండి చెట్టు కొమ్మపై వాలిన పక్షి బొమ్మలు గాలికి ఊగినంత మాత్రాన కంగారు పడిపోదు. ఎందుకంటే ఆ పక్షి కొమ్మపై కాదు తన రెక్కల పై నమ్మకంతో ఉంది కాబట్టి. నిజంగా నువ్వు జీవితంలో విజయం సాధించాలంటే నువ్వు చేసే పనిలో ఉండే కష్టాల గురించి నీ సంకల్పానికి చెప్పడానికి ప్రయత్నించకు. నీ పని లో ఉండే కష్టాలకు నీ యొక్క సంకల్పం గొప్పతనాన్ని చెప్పడానికి ప్రయత్నించండి. జనం నిన్ను అర్థం చేసుకోవడం లేదని ఎప్పుడూ చింతించకు ఎందుకంటే అది నీ సమస్య కాదు అర్థం చేసుకోలేక పోవడం అనేది వారి సమస్య. నువ్వు ఈదడం నేర్చుకుంటే సముద్రపు లోతును కూడా కొలవగలవు. విజయం పొందడానికి కొన్ని పనులను అలవాటు చేసుకోవాలి. అది ఏమిటంటే అపజయం పొందేవారు చేయడానికి ఇష్టపడని పనులు వాటిని మనం అలవాటుగా చేసుకోవాలి. జీవితం యొక్క చలాకీ ని అర్థం చేసుకోవాలంటే ప్రయాణంలో చెలరేగే దుమ్మును పూల జల్లు లాగా అనుకోవాలి. సమస్యల గురించి ఆలోచిస్తూ ఉంటే కారణాలు మాత్రమే వెతక గలవు. అదేవిధంగా సమాధానం గురించి మాత్రమే ఆలోచిస్తే కొత్త దారులు దొరుకుతాయి. నీకు ఉండే సమస్యల కంటే నువ్వు చాలా బలవంతుడివి అది నువ్వు అర్ధం చేసుకో.