Read Family Ties by Yamini in Telugu Moral Stories | మాతృభారతి

Featured Books
  • ఔను నిజం నువ్వంటే నాకిష్టం

    తెనాలి రైల్వే స్టేషన్‍       అర్ధరాత్రికి ఇంకా అయిదు నిమిషాల...

  • ఆగంతకుడు

    క్యాప్ ని ముఖంపైకి లాక్కుని చీకటిగా ఉన్న భవంతివైపు నడచాడతను....

  • అచ్చిరాని అతితెలివి

    తనను ఎవరైనా చూస్తున్నారేమోనని పరిసరాలను జాగ్రత్తగా కనిపెడుతూ...

  • ఇంటిదొంగలు

    ఎగ్జిక్యూటివ్ ఏడుకొండలు, గన్ మేన్ గఫూర్, వ్యాన్ డ్రైవర్ జోసె...

  • కిల్లర్

    అర్థరాత్రి…ఆ డూప్లెక్స్ గెస్ట్ హౌస్ నిద్రలో జోగుతోంది. మెయిన...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

కుటుంబ బంధాలు

కుటుంబ బంధాలు
అమ్మ కురిపించే ప్రేమ అనంతమైనది మరియు అమృతతుల్యమైనది నాన్న చూపించే అనురాగం అమూల్యమైనది వెల కట్టలేనిది అన్న పంచే ఆప్యాయత మధురమైనది మాటలకందనిది తమ్ముడు పంచే వాత్సల్యం వివరించలేనిది వూహకు అందనిది చెల్లి పంచే మమత మరుపు రానిది మాసిపోనిది
అక్క పంచే అభిమానం ఎప్పుడు నీ వెంట వుండే నిండు దీవెనలు.
ఆకాశంలో మేఘాలాంటోళ్లు..‘‘మన జీవితంలో స్నేహితులు, ఇతరులు ఆకాశంలో మేఘలాంటోళ్లు.. వస్తుంటారు.. వెళ్తుంటారు..కానీ కుటుంబసభ్యులు ఆకాశం లాంటోళ్లు..ఎప్పుడూ మనతోనే ఉంటారు‘‘.
కుటుంబమే ఒక సిలబస్
నాన్నను చూసి నేర్చుకోవచ్చు కష్టపడకుండా ఏదీ రాదని అమ్మను చూసి నేర్చుకోవచ్చు ఓర్పు లేకుండా బ్రతకలేమని చెల్లిని చూసి నేర్చుకోవచ్చు ఇంట్లో ఒక కళ అమ్మాయి రూపంలో ఉందని తమ్ముడిని చూసి నేర్చుకోవచ్చు అల్లరి కూడా అందంగా ఉంటుందని
అన్న, అక్కను చూసి గర్వపడొచ్చు కష్టం నిన్ను పలకరించదని జీవితాన్ని చదివేముందు కుటుంబాన్ని చదవండి !! ప్రతి మనిషి జీవితం కుటుంబం తోనే మొదలవుతుంది, కుటుంబలో ఎన్ని కష్టాలు వచ్చిన అందరం కలిసే ఉంటాం, ప్రతి వ్యక్తికి కుటుంబమే సర్వస్వము, కుటుంబం లేని జీవితాన్ని ఉహించుకోలేము. కుటుంబం చెట్టుపై కొమ్మల లాంటిది, మనమందరం వేర్వేరు దిశల్లో పెరుగుతాము, అయినప్పటికీ మన మూలం ఒకటిగా ఉంటుంది. కుటుంబం అంటే: "జీవితం మొదలయ్యేది మరియు ప్రేమ అంతం కానిది."ఇంటికి కుటుంబం అనేది గుండె వంటిది." "ఈ రోజు మీ కుటుంబం గురించి ఆలోచించండి అలాగే ప్రతిరోజూ, మీ కుటుంబాన్ని మీరు ఎంతగా ప్రేమిస్తున్నారో మరియు అభినందిస్తున్నారో, దానిని నేటి బిజీ ప్రపంచానికి అనుమతించవద్దు.ఇల్లు ఎంత పెద్దదిగా ఉండటం అనేది కాదు; కుటుంబంలో ప్రేమ ఉండటం చాలా ముఖ్యమైనది. "అందరినీ వదిలేసి దూరంగా ఉండటం కాదు జీవితమంటే... కష్టమైన, సుఖమైనా కుటుంబంతో కలిసి ఉండటమే జీవితం."కుటుంబం".రెక్కలొచ్చాయి కదా అని ఆకాశమంత నాదే అనుకోకూడదు రెక్కలు అలిసాక దిగాల్సింది నేల మీదనే చేరాల్సింది సొంత గూటికే సంతోషమైన దుఃఖమైనా పంచుకోవాల్సింది తన కుటుంబంతోనే అని మరచిపోరాదు. బాధ్యతలకు చెల్లుచీటీ రాసేసినప్పుడు..! మాటలు తూటాలై మనసును పేల్చేస్తాయి, గుసగుసలు గునపాలై గుండెల్ని పిండేస్తాయి!!
తాతయ్య, నానమ్మ, అన్నయ్య, అక్కయ్య, తమ్ముడు, చెల్లెలు, వదిన, మరిది, బావ, మరదలు, పెద్దనాన్న, పెద్దమ్మ, బాబాయ్, పిన్ని మన కుటుంబం, మన ఇల్లు, కలిసున్నప్పుడు అంతా అంతులేని ఆనందమే!!
నేను - నావాళ్లు, మేము మావాళ్లు, నాది మాది..సమాజంలో గౌరవమున్న ఉద్యోగం చేయగానే సరిపోదు. నిన్ను నమ్ముకుని ఉన్న నీ కుటుంబాన్ని సంతోషపెడితేనే నిజమైన గౌరవం లభిస్తుంది.
అమ్మ, నాన్న నీకు మార్గదర్శకులుగా ఉండగా సోదరుడు, సోదరి నీకు స్నేహితులై తోడుండగా ఈ జగత్తులో నీకు సాధ్యం కానిదేది? ఆకులలో వుండే పచ్చదనం అనుబంధాలలో వుంటే తియ్యదనం
మొక్క వేరులో వుండే దృఢత్వం కుటుంబంలో వుంటే పరిమళత్వం కుసుమంలో వుండే కోమలత్వం మనుషుల్లో వుంటే ఇల్లే ఓ నందనవనం..ఒక చిన్న చీడపురుగు చాలు... పంటను మొత్తం నాశనం చేయడానికి...అలాగే ఒక చెడుబుద్ధికల ఒక్క వ్యక్తి చాలు గొప్ప కుటుంబం విడిపోవడానికి, కుటుంబం చాలా గొప్పది ఎన్ని కష్టనష్టాలు వచ్చినా సర్దుకుపోగల మనస్తత్వతం ఉంటే..!ఆ కుటుంబం నందనవనమే...
నా కుటుంబమే నా ప్రపంచం ఈ ప్రపంచమే నా కుటుంబం లక్మణన్నా మీరు చెప్పింది నాటి మాట నేను రాస్తున్నది నేటి మాట....నా స్వార్థమే నా ప్రపంచం నా ప్రపంచమే నా స్వార్థం. - నేను అంబుధిలోని నీటిని కొలవగలమేమో వాయుగమనాన్ని లెక్కించగలమేమో కానీ కుటుంబసభ్యుల ప్రేమానురాగాలకు కొలమానాలు లేవు. నా జీవితం ఓ రంగుల పూల వనం. మకుటం లేని మహారాజు నా "తండ్రి"... స్వార్థం స్వల్పంగా కూడా లేని నా "తల్లి"... వెన్నంటే తోడుగా ఉండే నా "తోబుట్టువులు"... మంచిని బోధించే నా "మిత్రులు"... ఉత్తమమైన నడవడికను నేర్పి, ఉన్నతమైన స్థానంలో నిలబెడుతున్న నా "ఉపాధ్యాయులు"... ఇలా నా జీవితాన్ని అందంగా, రూపుదిద్దుతున్నా ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలు... ఏది నా జీవితం, అందమైన హరివిల్లు... మనం బావున్నప్పుడు అందరూ బ్రహ్మాండంగా మాట్లాడతారు, అదే బాధల్లో ఉంటే మాట్లాడటమే దండగ అనుకుంటారు. ఇష్టం గా ఉంటే కాకమ్మ కబుర్లు చెప్తారు, కష్టం వస్తే కంటికి కూడా కనిపించరు. బంధాలు పైకి బలంగా ఉంటూనే, బలహీన పరిస్థితుల్లో భారంగా మారిపోతాయి. స్నేహితులు, సన్నిహితులు అందరూ చుట్టాలే, కానీ నష్టాల్లో, నలుగురూ ఒంటరిని చేసేవారే.. కఠినం అయినా, కష్టం అయినా నీకు తోడు ఉండేది.. ఇష్టమైనా, ఇబ్బంది అయినా వెన్నంటే నీడగా ఉండేది.. నీ రక్త సంబంధం అదే కుటుంబం. చితి వరకు అంతులేని అనుబంధాలు.కుటుంబం అంటే రక్తసంబంధం ఉన్న వాళ్ళే కాదు ఆపద సమయంలో మన చెయ్యి పట్టుకొని మన ముందు నడిచిన వాళ్ళందరూ మన కుటుంబమే
జాబ్ను ప్రేమించాలి..! కానీ కుటుంబాన్ని.!!! అంతకంటే ఎక్కువ ప్రేమించాలి, ఏదో ఒక్కరోజున జాబ్ మనకు దూరం కావచ్చు, కానీ మనం ఉన్నంతవరకుతోడుగా మన కుటుంబం ఉంటుంది.
Family The Most Important Thing On Earth...
Love Your Family, Respect it and Feel it..
"మనం పది మెట్లు ఎక్కితే.. మన పిల్లలు పదకొండో మెట్టు ఎక్కాలని ఆశించేవారే కుటుంబసభ్యులు".
"మన జీవితంలో స్నేహితులు, ఇతరులు ఆకాశంలో మేఘలాంటోళ్లు.. వస్తుంటారు.. వెళ్తుంటారు.. కానీ కుటుంబసభ్యులు ఆకాశం లాంటోళ్లు.. ఎప్పుడూ మనతోనే ఉంటారు".“మనం తప్పు చేస్తే తప్పని.. మంచి చేస్తే కరెక్టు అని చెప్పేవాళ్లు మంచివాళ్లు.. కానీ మనం ఏం చేసినా భరించేవాళ్లే కుటుంబసభ్యులు".ఏ కుటుంబమూ పర్ఫెక్ట్ గా ఉండదు తిట్టుకుంటాము, కొట్లాడుకుంటాము. కొన్ని సమయాల్లో ఒకరితో ఒకరు మాట్లాడటం కూడా మానేస్తాము, కాని చివరికి, కుటుంబం కుటుంబమే. కుటుంబంలో ప్రేమ ఎల్లప్పుడూ ఉంటుంది. "FAMILY" మీ తల్లి తండ్రులకు అత్యంత ఇష్టమయినది.. మీనుండి ఆశించే వాటిలో మొదటిది ఏమిటో తెలుసా... మీ నుండి వచ్చే ఒక ఫోన్ కాల్.... ? గరి ఈ రోజు ఫోన్ చేయడం మరచి పోకండి.. "నా కుటుంబం నా జీవితం నాకు ముఖ్యమైనవి మిగతావన్నీ రెండవ స్థానంలో ఉన్నాయి."
ఇండలోని బలం ఒకటి ప్రేమ; ఇంట్లోని సమస్య కూడా ప్రేమ."The strength in a family is love; even problems at home can be resolved through love." కుటుంబ సంబంధాలు నేర్పడాలంటే కొందరు నిరీక్షించారని చూస్తే ఎప్పుడూ బయటకు వెళ్ళిపోవరు. “Family relationship is that if you don’t value them, they will always be waiting outside.” మన కుటుంబ సంబంధాలు కష్టమైన కాలంలో మన అప్పట్లో రాత్రిన సుందరం ప్రదరిస్తాయి.“Our family relationships shine as a beautiful moon in the dark times of our lives.” మన క్షేమం కోరేవారు ఈ ప్రపంచంలో ఉన్నది ఒక్కరే, వారెవరో కాదు మన తల్లిదండ్రులు.