విద్యాపరంగా అత్యంత తెలివైన యువకుడు ఒక పెద్ద కంపెనీలో మేనేజర్ పదవికి దరఖాస్తు చేయడానికి వెళ్లాడు. అతను మొదటి ఇంటర్వ్యూలో ఉత్తీర్ణత సాధించాడు, హెచ్ ఆర్ చివరి ఇంటర్వ్యూ చేసాడు, చివరి నిర్ణయం తీసుకున్నాడు. సెకండరీ స్కూల్ నుండి పోస్ట్ గ్రాడ్యుయేట్ రీసెర్చ్ వరకు, అతను మంచి మార్కులు స్కోర్ చేయని సంవత్సరం ఎప్పుడూ కూడా లేదు. హెచ్ ఆర్ అతని ప్రొఫైల్ చూసి ఆశ్చర్యపోయాడు. ఆ యువకుడు ఎంతో తెలివైన వాడని అతనికి తప్పకుండ మేనేజర్ పదవికి సెలెక్ట్ చేయాలని నిర్ణయించుకున్నాడు.
కానీ, ఆ యువకుడితో పాటు మేనేజర్ పదవికి దరకాస్తు చేసుకున్న వారిలో చాలా మంది అనుభవం కలిగి ఉన్నారు. మళ్లీ ఒకసారి చివరి రౌండ్ లో సెలెక్ట్ అయిన వారందరిని ఇంకో రౌండ్ ఇంటర్వ్యూ చేయాలి అనుకున్నాడు. ఒక్కొక్కరిగా పిలవడం మొదలు పెట్టాడు. ఆ యువకుడి వంతు వచ్చింది. హెచ్ ఆర్ యువకుడితో., “మీరు స్కూల్లో ఏదైనా స్కాలర్షిప్లు పొందారా?” యువకుడు “నేను ఎలాంటి స్కాలర్షిప్ పొందలేదు” అని సమాధానం ఇచ్చాడు. “మీ స్కూల్ ఫీజు కట్టింది మీ నాన్నేనా?” అని హెచ్ ఆర్ అడిగాడు. ఆ యువకుడు, “నాకు ఏడాది వయసున్నప్పుడు మా నాన్న చనిపోయారు, మా అమ్మ, నా స్కూల్ ఫీజు కట్టింది” అని సమాధానమిచ్చాడు.
హెచ్ ఆర్ “మీ అమ్మ ఎక్కడ పని చేసింది?” అని అడిగాడు. యువకుడు సమాధానం చెప్పాడు, “మా అమ్మ బట్టలు శుభ్రం చేసేది. ఆ యువకుడిని తన చేయి చూపించాలని హెచ్ ఆర్ అడిగాడు. ఆ యువకుడి చేతులు చూసి ఆశ్చర్యపోవడం హెచ్ ఆర్ వంతు అయింది. అతని చేతులు ఎంతో మృదువుగా ఎలాంటిపని చేయకుండా చాలా సున్నితంగా ఉన్నాయి.హెచ్ ఆర్ మనసులో… (ఈ కాలంలో ఒక తల్లి ఎలాంటి ఆధారం లేకుండా కేవలం బట్టలు ఉతికి ఈ యువకుడిని ఇంత ఉన్నత చదువులు చదివించింది అంటే ఆమె ఎంత కష్టపడి పనిచేసిందో అర్ధమవుతుంది. ఆ తల్లి యొక్క ఉన్నతమైన మనసుకి మనసులోనే ధన్యవాదాలు తెలుపుకున్నారు ఆ హెచ్ ఆర్.) యువకుడిని ఆ హెచ్ ఆర్ ఇలా అడిగాడు, “మీ అమ్మ బట్టలు ఉతకడానికి మీరు ఎప్పుడైనా సహాయం చేసారా?”యువకుడు సమాధానమిచ్చాడు, “నేను ఎక్కువ పుస్తకాలు చదవాలని మా అమ్మ ఎప్పుడూ కోరుకునేది. తను చెప్పిన విదంగా నేను చదువుకు ఎక్కువ సమయం కేటాయించేవాడిని. నేను ఎప్పుడు కూడా బట్టలు ఉతకడంలో మా అమ్మకి సహాయం చేయలేదు. నేను ఎప్పుడు ప్రయత్నించినా, అమ్మ నాతో ఈ సమయాన్ని కూడా పుస్తకాలు చదివడంలో ఉపయోగించు, నువ్వు ఉన్నత స్థాయిలో ఉండడం నేను చూడాలి అనేది. హెచ్ ఆర్ మాట్లాడుతూ ”నాదొక చిన్న రిక్వెస్ట్ ఉంది. మీరు ఈరోజు ఇంటికి వెళ్లాక, బట్టలు ఉతికిన మీ అమ్మ చేతులని మీరే స్వయంగా శుభ్రపరచండి అని అన్నాడు. అది విన్న యువకుడు ముందుగా ఆశ్చర్యపోయినా తేరుకుని.., హెచ్ ఆర్ చెప్పాడంటే అందులో ఎదో ప్రశ్న దాగి ఉంటుంది అనుకుని ఇంటికి వెళ్లాడు. ఆ యువకుడు ఇంటికి చేరుకొని తన తల్లి కోసం ఎదురు చూస్తున్నాడు. అంతలోనే తన తల్లి బట్టల పని ముగించుకుని ఇంటికి వచ్చింది. యువకుడు తన తల్లి దగ్గరికి వెళ్లి తన చేతులను శుభ్రం చేస్తా అని, తల్లి చేతులు పట్టుకున్నాడు. ఆమె చేతులు ఏంతో గరుకుగా చేతి నిండా గాయాలతో ఎరుపెక్కి పోయాయి. అది చూసి ఆ యుకుడి కళ్లలో నీళ్లు తిరిగాయి. ఆమె చేతులు శుభ్రపరచి, ఇంట్లో ఉన్న మిగతా బట్టలని తానె స్వయంగా ఉతికి తన తల్లికి అన్నామా తినిపించాడు. కళ్లలో నీళ్లు తుడుచుకుని, తన తల్లి చేతులని జాగ్రత్తగా శుభ్రం చేసాడు. తనను చదివించడానికి తన తల్లి ఎంత కష్టపడిందో ఆ యువకుడికి అర్థమైంది. ఇకపైన తన తల్లితో ఎలాంటి పని చేయనివ్వకుండా.. తానె కష్టపడి పని చేసి తల్లిని సంతోషంగా చూసుకోవాలి అనుకున్నాడు. మరునాడు.., ఇంటర్వ్యూలో ఆ యువకుడి కళ్లలో నీళ్లు గమనించిన హెహ్ ఆర్, ఏమి జరిగిందని ? మీ అనుభవాన్ని నాతొ పంచుకోవాలి అని అడిగాడు.
1. అభినందన అంటే ఏంటో..? ఎవరిని అభినందించాలి నాకు ఇపుడు అర్ధమవుతుంది. నేను ఇంత ఉన్నత చదువు చదివి మీ ముందు ఇలా చివరి ఇంటర్వ్యూ రౌండ్ లో ఉన్నానంటే దానికి కారణం నా తల్లి.
2. కలిసి పనిచేయడం మరియు నా తల్లికి సహాయం చేయడం ద్వారా, ఏదైనా చేయడం ఎంత కష్టమో, నేను ఇప్పుడు మాత్రమే గ్రహించాను.
3. కుటుంబ సంబంధాల ప్రాముఖ్యత మరియు విలువను నేను గుర్తించాను”.
అదంతా విన్న హెచ్ ఆర్.., నేను మేనేజర్ పోస్ట్ కి సెలెక్ట్ చేసే వ్యక్తి ,ఓక మేనేజర్ లాగే కాకుండా…,ఇతరుల పనితనాన్ని మెచ్చుకునే వ్యక్తిని, పనులు చేయడానికి ఇతరుల బాధలు తెలిసిన వ్యక్తిని మరియు జీవితంలో డబ్బును మాత్రమే లక్ష్యంగా పెట్టుకోని వ్యక్తిని నేను నియమించాలనుకుంటున్నాను. ఈ పోస్ట్ కి మీరు తగిన వారు. నేను మిమ్మల్ని సెలెక్ట్ చేస్తున్నాను అని ఆ యువకుడి చేతిలో జాయినింగ్ లెటర్ పెట్టాడు. తరువాత, ఆ యువకుడు చాలా కష్టపడి పనిచేశాడు మరియు అతని క్రింది అధికారులని గౌరవిస్తూ వారి నుండి తిరిగి గౌరవాన్ని పొందాడు.ప్రతి ఉద్యోగి శ్రద్ధగా మరియు కలిసి పనిచేసేలాగా మార్చేసాడు. అందుకారణంగా కంపెనీ పనితీరు అద్భుతంగా మెరుగుపడింది.
"నీతి | Moral : ఎవరైనా తమ ప్రియమైనవారు అందించిన సౌకర్యాన్ని, మీకోసం సంపాదించడానికి పడ్డ కష్టాన్ని అర్థం చేసుకుని వారిని తప్పకుండా అభినందించాలి."