Read I Dedicate to my Father Story by Yamini in Telugu Moral Stories | మాతృభారతి

Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

నాన్న

నాన్న ఉంటే ఒక ధైర్యం, ఒక అండ, ఒక ఆదరణ.. నాన్న ఒక మేరువు.గంభీరమైన వ్యక్తిత్వానికి చిరునామా నాన్న. నాన్నంటే నా ప్రాణం.నిరాడంబరత, నిస్వార్ధము‌ కలిగి నిర్మలమైన ప్రేమాప్యాయతలను చూపిన నాన్న నా మీదే కాక నా బిడ్డలమీద కూడా అంతే ప్రేమాప్యాయతలను చూపిన మా నాన్న. మధ్య తరగతి సంసార సామ్రాజ్యాన్ని సమర్ధవంతంగా నడిపిన మహరాజు మా నాన్న. నన్ను తన గుండెలమీద ఉంచుకుని మురిపెంగా ఆడిస్తూ, భుజాలమీదకి ఎక్కించుకుని ఆడించిన బంగారు తండ్రి మానాన్న. జీవన సమరంలో కష్షనష్టాలన్నీ తనే ధైర్యంగా ఎదుర్కొని ఏనాడూ వేటికీ భయపడని మహయోధుడు మా నాన్న. అందరూ తనవాళ్లే అనుకుని అందరి సుఖసంతోషాలను కోరుకునే ప్రేమమూర్తి, అల్పసంతోషి మానాన్న. కడదాకా తనకోసం, తన సుఖసంతోషాలకోసం ఏనాడూ ఆలోచించక జీవితమంతా కన్నబిడ్డలకోసం పరితపించిన మానాన్న. ఎవరినుంచీ ఇసుమంతైనా ఏమీ ఆశించని నిస్వార్థుడైన మహా మనీషి మానాన్న. తనకున్నదాంట్లో చేతిన ఎముక లేకుండా అందరికీ దానధర్మాలు చేసిన అపర దానకర్ణుడు మా నాన్న. నన్ను ప్రేమగా పెంచి నాకు విద్యాబుద్ధులు, సంస్కారం నేర్పిన మా నాన్న నాకు కనిపించే, కనిపెంచిన ప్రత్యక్ష దైవము. కడదాకా ఎన్నో, ఎన్నెన్నో కష్షాలను, మానసిక, శారీరక బాధలను అనుభవించిన నాన్నను తలుచుకుంటుంటే నాకు కన్నీరు ఆగదు. నా జీవితంలో అసలు నాన్నను తలుచుకోని క్షణమంటూ లేదు. "నాన్నా! ఎక్కడున్నావు ? ఎలా ఉన్నావు?" నన్ను "బిందమ్మ" అని ప్రేమగా పిలిచే నీ పిలుపేది? కడదాకా నిన్ను ప్రేమగా చూసుకుని నీకు ఎంతో సేవ చేయాలనుకున్నాను. కానీ ఏమీ చేయలేని నిస్సహాయురాలిని. ఇప్పుడెంత వగచినా ఏం ప్రయోజనం ?మరు జన్మలో కూడా నీ బిడ్డగా పుట్టి నిన్ను కంటికి రెప్పలా చూసుకోవాలని నాకోరిక.
కన్నీళ్లతో నీ బిందమ్మ.

నాన్న జ్ఞాపకాలు
తన గుండెల మీద చిందులు వేసెను నా చిన్ని పాదాలు, తన భుజాల మీద ఎక్కి విహరించెను నా బాల్యపు మధుర క్షణాలు, తన చిటికెన వేలు పట్టుకుని కదిలెను నా కాలి అడుగులు, తను నడిచిన గొప్ప మార్గంను అనుకరించెను నా పాదముద్రలు, తన సారథ్యంలో గెలుపు వైపు మొదలయ్యెను నా జీవితపు నడకలు, తనతోనే నడక, నడవడిక... తనతోనే గమనం, గమ్యం.. తనతోనే లాభం, లక్ష్యం.. తనతోనే మార్గం, మార్గదర్శకం.. తనతోనే వినయం, విజయం !!
నాన్న కనిపించే దైవం అమ్మ ఐతే కనిపించని ఆ దైవం మా నాన్న బిడ్డకు జన్మను ఇచ్చేది అమ్మ ఐతే ఆ బిడ్డను పెంచి పోషించేది నాన్న. నేను తీసుకునే నిర్ణయం మంచో చెడో తెలుపుతూ ముందుకు నడుపుతున్నది మా నాన్న ఇలాంటి నాన్నకు కూతురు కావడం నా అదృష్టం. ప్రేమతో నీ కూతురు...

నాన్న....అంటే......
ఉద్యోగం అంటూ ఉదయాన్నే లేచివేళ్ళే “నాన్న” ఇంటిపట్టున ఉండలేడు... కంటినిండా నిద్రపోలేడు ఇంటినే కాదు, అందర్నీ ఒంటిస్తంభంలా మోస్తున్న “నాన్న” ఎప్పుడూ ఒంటరివాడే... సంపాదనంతా కుటుంబానికే వెచ్చించి, మిగిలినది దాచి పిల్లల్ని మెరుగుపట్టడం కోసం, పదును పెట్టడం కోసం ఆంక్షల్నీ... శిక్షల్నీ రచించి, తాను శత్రువై, ఇంట, బయటా నిరంతర పోరాటం చేసే నిస్వార్ధ యోధుడు “నాన్న” "ఎవరక్కడ" ? అని అధికారం చెలాయించే నాన్నే గనక ఒక్కక్షణం మనసు మార్చుకొని నా సంపాదన నా ఇష్టం అనుకుంటే "ఎవరెక్కడ" ?
“అమ్మ” కొవ్వొతై - కరిగిపోతూ వెలుగునిస్తుంది.
"నాన్న" అగ్గిపుల్ల - ఆ వెలుగుకు నాంది.

*నాన్న ఎందుకో వెనుక బడ్డాడు*
*అమ్మ* తొమ్మిది నెలలు మోస్తే..
*నాన్న* పాతికేళ్ళు...రెండూ సమానమే అయినా *నాన్నెందుకో వెనకబడ్డాడు
*ఇంట్లో *జీతం* తీసుకోకుండా *అమ్మ..*
తన *జీతం* అంతా ఇంటికే ఖర్చు పెడుతూ *నాన్న..*
ఇద్దరి *శ్రమ* సమానమే అయినా..
అమ్మకంటే *నాన్నెందుకో వెనకబడ్డాడు..*
ఏది కావాలంటే అది *వండి* పెడుతూ *అమ్మ*..
ఏది కావాలంటే అది *కొని*పెడుతూ *నాన్న*..
ఇద్దరి *ప్రేమా సమానమే* అయినా..
అమ్మకొచ్చిన *పేరు* ముందు

నాన్నా!!! నువ్వు కోపంగా మాట్లాడుతుంటే ప్రశాంతతే తెలియదనుకున్నా., కళ్ళెర్రజేస్తుంటే కాఠిన్య హృదయమనుకున్నా.. మౌనంగా నువ్వుంటే మాటలే నీకిష్టంలేదనుకున్నా.. ఆజ్ఞలు వేస్తుంటే బానిసగా బాధ పడ్డా..నాన్నా!!! నాకిప్పుడే తెలుస్తోంది,, వీటన్నిటి వెనుక మూల సూత్రం ఒకటుందని... అదే మా పైన అమిత ప్రేమని, మా బాగుకోసం, భవితకోసం ఆరాటం అని..అమ్మ ఎంత తిట్టినా నవ్వోస్తుంది. కానీ నాన్న కొద్దిగా మందలించినా ఏడుపోస్తుంది.కూతురు గుండెల్లో నాన్నకెప్పుడూ ప్రథమ స్థానం నాన్నకు కూతురే ప్రపంచం....."కూతురులును అమితంగా ప్రేమించే నాన్నలకు సెల్యూట్‌
నాన్నకు ప్రేమతో

గుండెలపై ఆడించి, గోరు ముద్దలు తినిపించి, అలకలు భరించి అల్లారు ముద్దుగా లాలించి, చిన్ని చిన్ని పాదాలకు నడుకలు నేర్పించి, ముచ్చటైన ఆశలకు ధైర్యంగా నిలిచి, జీవితంలో వెలుగును పరిచయం చేసిన అమ్మ నమ్మకం నాన్న... సృష్టిలో స్వార్ధం తెలియని, మొట్ట మొదటి ప్రేమ పంచగల, నిలువెత్తు సాక్ష్యం నాన్న.. చిరునవ్వుకు స్వచ్ఛమైన స్నేహం నాన్న అభిమానం. గెలిపించే బాటకు చేరువ చేసే బంధం నాన్న...పసిప్రాయంలో నీ తప్పటడుగులకు ఆనందించే వాడు నాన్న.. జీవితంలో నీ తప్పుబాటలను సరిచేసి నడిపేవాడు నాన్న... నీ ఆనందానికై గుర్రపు బొమ్మయే వాడు నాన్న.... నీ సుఖానికై మరబొమ్మయే వాడు నాన్న... నీకు కన్నీరు రాకూడదని తను కన్నీరు మింగుతూ కుటుంబాన్ని నడిపించేవాడు నాన్న... నీ గెలుపును ప్రపంచ గెలుపుగా భావించేవాడు నాన్న..అన్నింటి కంటే ముఖ్యంగా నీవు ఓడిన నీ మీద నమ్మకం ఉంచేవాడు నాన్న.....!