Read Father And Son A Kite by Yamini in Telugu Moral Stories | మాతృభారతి

Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

తండ్రీకొడుకులు

తండ్రీకొడుకులు
తండ్రీ కొడుకులు మేడపైకి ఎక్కి గాలిపటం ఎగరేస్తున్నారు. గాలిపటాన్ని ఎలా ఎగరేయాలో తండ్రి పిల్లవాడికి నేర్పిస్తున్నాడు. గాలిపటం బాగా ఎత్తుకు వెళ్లాక, దారాన్ని కొడుకు చేతికి అందించాడు తండ్రి. కొడుకు ముఖం సంతోషంతో వెలిగిపోయింది. ఆ వెలుగులో తండ్రి మనసు ఉప్పాంగిపోయింది. కొంతసేపు దారాన్ని చేత్తో పట్టుకున్నాక కొడుకు తండ్రిని అడిగాడు. "నాన్నా దారంతో పట్టి ఉంచితేనే గాలిపటం అంత ఎత్తుకి ఎగిరిందే! దారాన్ని తెంపేస్తే ఇంకా ఎత్తుకుఎగిరిపోతుంది కదా" అన్నాడు. తండ్రి నవ్వాడు. "దారాన్ని తెంపేద్దామా మరి?" అని అడిగాడు. "తెంపేద్దాం నాన్నా" అన్నాడు కొడుకు ఎంతో ఉత్సాహంగా.ఇద్దరూ కలిసి దారాన్ని తెంపెసారు."టప్' మని దారం తెగిపోగానే గాలిపటం ఇంకా పైకి ఎగిరిపోయింది. అంతలోనే 'దారి తప్పి అటూ ఇటూ కొట్టుకుంటూ కిందికి పడిపోవడం మొదలుపెట్టింది! చివరికి ఎవరి మేడ మీదనో కులిపోయింది. "ఇలా జరిగింది ఏంటి నాన్నా" అన్నాడు కొడుకు విచారంగా, దారం తెంపేస్తే గాలిపటం ఇంకా ఇంకా పైకి పోతుందనుకుంటే, కిందికొచ్చి పడిపోవడం ఆపిల్లాడికి నిరుత్సాహం కలిగించింది. తండ్రివైపు బిక్కమొహం వేసుకుని చూశాడు. కొడుకును దగ్గరికి తీసుకున్నాడు తండ్రి. "గాలిపటానికి దారం ఉండేది. దానిని ఎగిరిపోనీయకుండా పట్టి ఉంచేందుకు కాదు. గాలి ఎక్కువైనా తక్కువైనా గాలిపటం తట్టుకుని నిలబడి, ఇంకా ఇంకా పైపైకి ఎగిరెలా చేసేందుకే" అని చెప్పాడు. మరో గాలిపటానికి దారం కట్టి ఎగరేసి కొడుకు చేతికి దారం అందించాడు.
జీవితంలో కూడా మనకు కొన్నిసార్లు అనిపిస్తుంటుంది. కుటుంబం అనే బంధం లేకపోయి ఉంటే మనం ఇంకా ఏదో సాధించి ఉండేవాళ్లం అని నిజానికి కుటుంబం అందించిన ప్రేమ, సేవ, సౌకర్యాల వల్లనే మనం ఈ మాత్రమైనా నిలబడి ఉన్నామని గ్రహించాలి. కుటుంబం మనల్ని పట్టుకుని లేదు. పట్టుకుని ఉందనుకుని వదిలించుకునే ప్రయత్నం చేస్తే మనమే పట్టుతప్పిపోతాం. తెగిపోయిన గాలిపటంలా గింగిరాలు తిరుగుతూ ఎక్కడో పడిపోతాం.

తండ్రీ కొడుకు
ఓ యువకుడైన తండ్రి తన చిట్టిబాబును వొళ్ళో కూర్చోపెట్టుకుని ఆడిస్తున్నాడు, ఇంతలో ఎక్కడినుండో ఓ కాకివచ్చి ఎదురింటి పెంకులపై వాలింది, బాబు తండ్రిని 'నాన్నా అదేమిటి? అని అడిగాడు తండ్రి అది 'కాకి' అని చెప్పాడు, కొడుకు తండ్రిని మళ్ళీ అడిగాడు, నాన్నా ' అదేమిటి? తండ్రి మళ్ళీ అడిగాడు నాన్నా, అది ఏమిటి? తండ్రి మళ్లీ చెప్పాడు -అది కాకి, కొడుకు పదేపదే అడగసాగాడు. అదేమిటి? అదేమిటి? అని. తండ్రి ఓపిగ్గా మళ్ళీమళ్ళీ అది కాకి అని బదులిస్తూ ఉండేవాడు. కొన్నేళ్ళు గడిచాయి. బాబు పెరిగి పెద్దవాడయ్యాడు. తండ్రేమో ముసలివాడయ్యాడు.ఓ రోజు తండ్రికి చాపమీద కూర్చున్నాడు. ఎవరో అతని కొడుకును చూడాలని వచ్చినట్లుంది. తండ్రి కొడుకును అడిగాడు- యెవరు బాబు వచ్చింది? కొడుకు వచ్చినతని పేరు చెప్పాడు. కొంతసేపటికి మరొకరు వచ్చారు. ఎవరు వచ్చారు? అని తండ్రి అడిగాడు. విసుగ్గా కొడుకు బదులిచ్చాడు, మీరు ఓచోట ఊరకే పడివుండకూడదూ? పని పాట లేదు కాని, యెవరు వచ్చారు? ఎవరు పోయారు? అంటూ దినమంతా వొకటే ఆరాలు తీస్తుంటారు? తండ్రి గట్టిగా నిట్టూర్చాడు. చేత్తో తలపట్టుకొన్నాడు.ఎంతో బాధతో మెల్లమెల్లగా కొడుకుతో ఇలా అన్నాడు- నేను నిన్ను ఓసారి అడిగితే ఇంతగా విరుచుకు పడుతున్నావే?ఇదేమిటి? ఇదేమిటి? అని నీవు వందలాదిసార్లు వేధించేవాడివే! నేను నిన్నెప్పుడైన కసురుకొన్నానా? నేను నీకు వోపిగ్గా బాబు అదికాకి అని చెప్పేవాడినిగా! తల్లితండ్రులను కసిరేవారు మంచివాళ్ళు కాదు సుమా!మిమ్మల్ని పెంచిపెద్ద చేయడంలో మీ అమ్మానాన్నలు ఎన్ని కష్టాలు పడ్డారో, మిమ్మల్ని ఎంతగా ప్రేమించారో, ఓసారి ఆలోచించండి.
నీతి: సహనానికి మించిన సంపద లేదు.
తండ్రి - కొడుకు
శ్రీపురంలో విశ్వనాథ్, కమలమ్మ దంపతులు ఉండేవారు. వీరి అబ్బాయి వివేక్, విశ్వనాథ్ తల్లిదండ్రులు... అంతా ఉండేది ఒకే ఇంట్లో,"
వివేక్ ఎక్కువగా తాత నాయనమ్మల దగ్గర ఉండేవాడు. వాళ్లు చెప్పే కథలు, పద్యాలు చక్కగా నేర్చుకునేవాడు. ముసలివాళ్లు రోజంతా ఖాళీగా ఉండటం చూసి కమలమ్మ విసుక్కునేది. వాళ్లకు సేవలు చేయలేక ఎప్పుడు పోతారో అని మనసులో తిట్టుకునేది.
ఒకరోజు భర్తతో 'మీ వాళ్లతో నాకు ప్రాణం విసిగిపోతోంది. మిగిలిన పనులన్నీ ఒక ఎత్తూ, వారి సేవలు ఒక ఎత్తుగా ఉంది' అని చెప్పింది కమలమ్మ
'ముసలి వాళ్లయిపోయారుగా, ఇంకెన్నేళ్లు బతికేది. అంత వరకూ కాస్త ఓపికగా ఉండు' అని భార్యని సముదాయించాడు విశ్వనాథ్.
అలా చెప్పి కొద్దిరోజులైనా గడవ లేదు... ఓ సాయంత్రం కమలమ్మ మళ్లీ పాత పాట మొదలు పెట్టింది. ఇక
ముసలివాళ్లని భరించడం తన కాదనీ ఏ వృద్ధాశ్రమంలోనో చేర్పించమనీ భర్తకు చెప్పింది. వల్ల
భార్య మాటలకు సరేనంటూ తలూపాడు విశ్వనాథ్. మర్నాడు ఉదయాన్నే వృద్ధాశ్రమం వివరాలు తెలుసుకునేందుకని సిద్ధమయ్యాడు. తండ్రితో పాటే తానూ వెళ్తానని మారాం చేశాడు వివేక్.
'నాతో వస్తానంటున్నావు. ఎక్కడికి వెళ్తున్నానో తెలుసా?' అని వివేకన్ను అడి గాడు విశ్వనాథ్.
'నాకు తెలీదు. అయినా వస్తాను' అన్నాడు వివేక్.
'తాతయ్య నాయనమ్మల్ని వృద్ధాశ్రమంలో చేర్చే పనిపై వెళ్తు న్నాను. వాటి వివరాలు కనుక్కోవాలి. అక్కడికి నువ్వెందుకు?' అని వారిం చాడు విశ్వనాథ్.
'నేను కూడా పెద్దయ్యాక అమ్మనూ నిన్నూ వృద్ధాశ్రమంలో చేర్చాలి కదా, ఆ వివరాలు నన్నూ తెలుసుకోనీ' అన్నాడు వివేక్.
ఆ మాటలకు విశ్వనాథు తల కొట్టేసినట్టయింది. కొడుకు ఈ మాట అన్నదాకా తాను ఎంత తప్పు చేస్తున్నదీ కమలమ్మకి తెలిసి రాలేదు.
కాసేపటికి తేరుకొని 'నేను ఏ వృద్ధాశ్రమం చూడ్డానికీ వెళ్లను. అమ్మా నాన్నా కడదాకా నాతోనే ఉంటారు' అంటూ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. విశ్వనాథ్. అప్పట్నుంచి కమలమ్మ, విశ్వనాథ్ ముసలివాళ్లని జాగ్రత్తగా చూసుకోవడం మొదలుపెట్టారు.